సబ్ ఫీచర్

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల వారితో సమానంగా పరిగణిస్తూ రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ భావజాలానికి పూర్తిగా విరుద్ధం. హిందువులుగా వున్న షెడ్యూల్డ్ కులాల, ప్రజల హక్కులకు పూర్తిగా హాని కలిగించే చర్య ఇది.
శతాబ్దాలుగా షెడ్యూల్డ్ కులాల వారి పట్ల జరిగిన ఈ అన్యాయానికి పరిహారంగా వీరి ప్రగతి కొరకు మిగిలిన ప్రజలతో సమానంగా వీరు పోటీపడే స్థితి కలిగించేంతవరకు రిజర్వేషన్లు కల్పించాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. పరిపాలనలో భాగస్వామ్యం కోసం రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఫలితంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన అనేక మంది శాసనసభ్యులుగాను, పార్లమెంటు సభ్యులుగాను, మంత్రులుగా కూడా అయ్యారు. కొద్దిమంది ముఖ్యమంత్రులుగాను, కేంద్ర మంత్రులుగాను కూడా సేవలు అందించారు. షెడ్యూల్డ్ కులాల శాశ్వత ప్రగతికొరకు విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. తమ ప్రతిభ సామర్థ్యాల ద్వారా ఉప రాష్టప్రతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి అత్యున్నతమైన పదవులను కూడా షెడ్యూల్డ్ కులాలకు చెందిన మేధావులు అధిరోహించారు.
హిందూ సమాజంలోని కుల వ్యవస్థ, అంటరానితనం వల్లనే షెడ్యూల్డ్ కులాలవారు సామాజిక వివక్షకు అవమానాలకు గురిఅవుతున్నారని, వీరం తా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే అంటరానతనపు ముద్రపోతుందని, సామాజిక సమానత లభిస్తుందని ప్రచారం చేసి క్రైస్తవ మిషనరీలు షెడ్యూల్డ్ కులాల వారిని గత 200 సంవత్సరాలుగా మత మార్పిడి చేస్తున్నారు. విదేశాలనుండి వచ్చే కోట్లాది రూపాయలతో పాఠశాలలు, వైద్యాలయాలు ప్రారంభించారు. స్వతంత్ర భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాల రక్షణ పేరున మన ప్రభుత్వాలు క్రైస్తవులకు అనేక రాయితీలు, హక్కులు కల్పించాయి. మైనారిటీల కొరకు అనేక ఆర్థిక పథకాలను కూడా ప్రారంభించారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళిత క్రైస్తవులకు బి.సి. (సి) స్థానం కల్పించబడింది. వాస్తవంగా దళిత క్రైస్తవులు అన్న పదం రాజ్యాంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో మతం మారిన క్రైస్తవులుగా వున్నవారు అటు మైనారిటీలుగాను, ఇటు దళితులుగా రెండువైపుల లబ్దిపొందుతున్నారు. ఈ కారణం వల్ల దళిత హిందువులు తమ హక్కులను కోల్పోతున్నారు. దళిత క్రైస్తవులందరినీ దళితులకు ఇచ్చిన రిజర్వేషన్ల కోటాలో చేర్చాలని కోరడం దళితుల జీవితాలతో చెలగాటమాడటమే. మతం మారిన షెడ్యూల్డ్ కులాల వారికి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల హక్కులు వర్తించవని అనేక సందర్భాలలో మన ఉన్నత న్యాయస్థానాలు కూడా తీర్పును ఇచ్చాయి. 1985లో దళిత రిజర్వేషన్లకు చెందిన కేసులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భగవతి భారత రాజ్యాంగం హరిజనులను హిందూ మతంలో అంతర్భాగంగా గుర్తించిందని, క్రైస్తవులలో కులాలున్న విషయాన్ని రాజ్యాంగం గుర్తించబోదని తీర్పును ఇచ్చారు.
కొద్దిమంది రాజకీయ నాయకులు కేవలం తమ యొక్క ఓటు బ్యాంకు కోసం లేని వాటిని తెరమీదకు తీసికొని వచ్చి రాజ్యాంగానికి విరుద్ధంగా వాగ్దానం చేస్తుంటారు. గతంలో మతం పేరుమీద మన దేశం ఖండితం అయింది. ఇక రెండవ మతాన్ని చాపక్రింద నీరులా ప్రవేశపెట్టి దేశంలో ఇంకనూ అసమానతలు సృష్టించే ప్రయత్నం విదేశీ శక్తుల కుట్ర ద్వారా జరుగుతున్నది. దళితులు అన్న పదం ఎక్కడా వాడలేదు. దళతులు అన్న పదం కేవలం మత మార్పిడికోసమే వాడబడింది. మత మార్పిడి అనునది మన సాంస్కృతిక అఖండతను దెబ్బతీస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుద్దాం.

- గౌరుగారి గంగాధరరెడ్డి