మెయన్ ఫీచర్

‘దిగ్విజయ’ మతసహన పాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో గతంలో మొఘలాయి ‘పాలన’లో సర్వమత సమభావం వెల్లివిరిసిందని కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయసింగ్ ఇటీవల ఒక ముఖాముఖి సంభాషణలో చెప్పాడు. సభలలో ఇలాంటి అబద్ధాలను చెప్పే అవకాశాలు దిగ్విజయసింగ్ వంటి వారికి మృగ్యమయ్యాయి. అందువల్ల ‘ముఖాముఖి’- ఇంటర్వ్యూల ద్వారా ఆయన తన చారిత్రక ‘విజ్ఞానాన్ని’చాటుకుంటున్నాడు! మొఘలాయిలు మన దేశాన్ని ఐదువందల ఏళ్లు పాలించారన్నది ఆయనకు తెలిసిన చరిత్ర! మొఘల్ పాలకులు ‘హిందుత్వాన్ని’ పెంచి పోషించారన్నది ఆయన ఆవిష్కరించిన- చరిత్ర!! క్రీస్తుశకం 1526లో విదేశాలనుండి చొరబడిన ‘జహార్ ఉద్దీన్ మొహమ్మద్ బాబర్’తో మొఘలాయిల పెత్తనం ఆరంభమైంది. 1707లో ఔరంగజేబ్ అనే వాని ‘పాలన’ ముగిసిపోవడంతో దేశంపై ‘మొఘలాయి’ ప్రాబల్యం సమాప్తమైంది. రెండువందల ఏళ్లు కూడ జరగలేదు... ‘మొఘలాయిలు’ ఐదువందల ఏళ్లు పాలించినట్టు సింగ్ ‘కనిపెట్టాడు’! దేశ చరిత్రకు వ్యతిరేకమైన వాస్తవాలకు వ్యితిరేకమైన ప్రకటనలను చేయడం ద్వారా ప్రసిద్ధిని పొందినవారిలో ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయసింగ్ అగ్రగణ్యుడు! వాస్తవాలను వక్రీకరించడం సమయ సందర్భాలతో నిమిత్తం లేకుండా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమం! జనంతో పనిలేదు, ఉద్యమాలను చేయడం ఆయనకు తెలీదు. పార్టీ వేదికలనుండి ఆయన ప్రసంగించే అవకాశాలు కూడ పెద్దగా లేవు. అందువల్ల ‘వాళ్లనూ వీళ్ల’నూ పట్టుకొని ‘అప్పుడప్పుడు కిరాయి’ -స్పాన్సర్డ్- వేదికలను కల్పించుకొనడం ఆ వేదికలనుండి అబద్ధాలను ఆవిష్కరించడం ఆయనకు అలవాటైనట్టుంది! ఇలాంటి కిరాయి సభలలో ఈయన చేసే ప్రసంగాలకు ప్రచారం కల్పించే కిరాయి ప్రతినిధులు కూడ లేకపోలేదు! అది కూడ జరగనప్పుడు ఏదో ఒక ప్రముఖ పత్రికలోనో, దృశ్యమాధ్యమ ‘స్రవంతి’లోనో ఈయన ‘ప్రవచించే’ అబద్ధాలు ప్రచారవౌతున్నాయి. ఇలాంటి అబద్ధాలను దిగ్విజయసింగ్ మాత్రమేకాక మణిశంకర్ అయ్యర్ వంటి మరికొందరు రాజకీయవేత్తలు కూడ ‘కిరాయి’కార్యక్రమాల ద్వారా ఆవిష్కరిస్తున్నారు. ఇలాంటి ‘ముద్రిత’ ‘ప్రసారిత’ ప్రహసనాలను ఇంగ్లీషులో ‘‘ఇంటర్వ్యూ’’అని పేరుపెట్టి చెలామణి చేయిస్తున్నారు!! ఈమధ్య అలాంటి ఒక ‘ఇంటర్వ్యూ’లో దిగ్విజయసింగ్ ‘మొఘలాయి’ సర్వమత సమభావాన్ని ప్రదర్శించినట్టు ప్రకటించాడు!
క్రీస్తుశకం 1528లో బాబర్ అయోధ్యలోని రామజన్మభూమి దేవాలయాన్ని ధ్వంసం చేయించాడు. ఇది అతని ‘మత విధానానికి నిదర్శనం. బాబర్ కుమారుడై ‘హుమయూన్’ను షేర్‌షాఖాన్ ఓడించడంలో 1540వ 1556వ సంవత్సరాల మధ్య మొఘలాయిల పెత్తనం లేదు. అందువల్ల హుమయూన్‌కు హిందువులను ధ్వంసంచేసే అవకాశం చిక్కలేదు! హుమయూన్ కొడుకైన అక్బర్ హిందూ మహిళలను పెళ్లిచేసుకున్నాడు. వారి సంతానం ఇస్లాం మతస్థులుగా జీవించారు! అక్బర్ కాని అతని అనుచరులు కాని ఇస్లాం మతస్థుల మహిళలను హిందువులకిచ్చి పెళ్లిచేయించలేదు. ఇదీ అక్బర్ పాటించిన మత సమభావం! అక్బర్ కుమారుడైన ‘జహంగీర్’ శిక్కుల గురువైన అర్జున దేవుడిని క్రీస్తుశకం 1606లో చిత్రవధ చేసి చంపించాడు!! కశ్మీర్‌లో మతం మార్పిడులకు బలైపోకుండా తప్పించుకొని పారిపోయివచ్చిన ‘సనాతన ధర్మం’ప్రజలకు ఆశ్రయమివ్వడం అర్జున దేవుడి ‘నేరం’.... ఇదీ ‘జహంగీర్’ మత సహనం. జహంగీర్ కుమారుడు షాజహాన్ శిక్కుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేయడం చరిత్ర! దిగ్విజయసింగ్ దృష్టిలో ఇదంతా ‘హిందుత్వాన్ని’ ‘ఎదగనివ్వడం!’ షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు శిక్కుల మరో గురువైన తేజ్‌బహదూర్‌ను రాక్షసంగా హత్య చేయించాడు! ఇస్లాం మతాన్ని స్వీకరించవలసిందిగా తేజ్‌బహదూర్‌ను ఔరంగజేబు ఒత్తిడి చేశాడు! కానీ హిందుత్వ తిలకాన్ని, యజ్ఞోపవీతాన్ని రక్షించడానికి వ్రత దీక్షను పూనిన తేజ్‌బహదూర్ అందుకు నిరాకరించాడు! తేజ్‌బహదూర్ కుమారుడు శిక్కుల పదవ గురువు గురుగోవింద్‌సింగ్ తమ తండ్రిని గురించి
‘‘సాహసమ్మును చూపి
పౌరుషాగ్నిని రేపి
యజ్ఞోపవీతాన్ని
హిందుత్వ తిలకాన్ని
రక్షించినాడు ఆ నేత....
దైవభక్తుల కొరకు
ధర్మదీక్షను పూని
తలను అర్పించాడు కాని
జాతీయ పథము మాత్రము
తప్పలేదు...!’’
అని ప్రశంసించాడు! మొఘల్ సుల్తానుల పాలనలో కశ్మీర్‌లో హిందువులను ఊచకోత కోశారు! మతంమార్చారు.... ఈ రక్తపాతాన్ని మతం మార్పిడులను అడ్డుకొన్నందువల్లనే శిక్కు గురువులు మొఘలాయిల చిత్రహింసకు బలైపోయారు!! కాగా హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ధ్వంసంచేయడానికి మొఘలాయి పాలకులు ప్రయత్నించలేదని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయసింగ్ ఇప్పుడు మనకు ‘పాఠం’ చెబుతున్నాడు!!
మన దేశంలో అనాదిగా భూమిపై హక్కు దున్ని పండించిన వారిదే! భూమిపై ప్రభుత్వానికి హక్కు ఉండేది కాదు! రాజ్యాంగ వ్యవస్థ నిర్వహణను దేశరక్షణను సాగించిన పాలకులకు వాణిజ్యవేత్తలు వ్యవసాయదారులు పన్నులు చెల్లించారు! పండిన పంటలో ‘ఆరవ వంతు’ను అలా వ్యవసాయదారులు రాజునకు పన్ను చెల్లించారు. అంటే ఆరు బస్తాలు వ్యవసాయదారునికి లభించినట్టయితే ఒక ‘బస్తా’్ధన్యం దేశానికి పన్ను రూపంలో చెల్లించడం అనాది సంప్రదాయం! ‘వృత్తు’ల ద్వారా ప్రజలకు సేవలను అందించినవారికి ముందుగా ధాన్యం పంచిన తరువాత మిగిలిన ధాన్యంలో మాత్రమే రాజునకు ఆరింట ఒక వంతు పన్ను లభించేది. ఇదీ సనాతన వ్యవస్థ!
మొఘల్ పాలకులు ఈ పన్నును ‘మూడింట ఒక వంతున’కు పెంచడం చరిత్ర! అంటే ఆరు ‘బస్తాలు’ పండినట్టయితే రెండు ‘బస్తా’లు ప్రభుత్వానికి పన్నుగా చెల్లించే వ్యవస్థ ఏర్పడింది. ప్రజలను పాలకులు దోపిడీ చేయడానికి ఇదీ ప్రాతిపదిక! కశ్మీర్‌లో మొఘల్ ప్రతినిధులు మరింత ముందునకు వెళ్లి ‘‘ఆరుబస్తాలలో నాలుగు బస్తాలు’’ పన్నుగా గుంజుకున్నారు. ఇలా మూడింట రెండువంతుల పంటను పన్నుగా గుంజుకోవడాన్ని మొఘల్ పాలకులకంటే ముందు తుగ్లక్‌లు ఖిల్జీలు కూడ అమలు జరిపారు. ఇలా దోపిడీ చేయడానికి కారణం స్వజాతీయ హిందువుల పట్ల మమకారం లేని విదేశీయ జిహాదీ స్వభావం! అక్బర్ పరోక్షంగా ‘లవ్ జిహాద్’ పద్ధతిలో హిందువులను వ్యతిరేకించాడు! మిగిలిన మొఘలాయి పాలకులు ప్రత్యక్షంగా ‘జిహాద్’సాగించారు! క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దిలో పరిమిత ప్రాంతంలో స్వజాతీయ సాంస్కృతిక సామ్రాజ్యం పునరుద్ధరించిన ఛత్రపతి శివాజీ మళ్లీ ‘ఆరింట ఒక వంతు’ పంటను- షద్భాగం మాత్రమే పన్నుగా గ్రహించే వ్యవస్థను నెలకొల్పాడు!! ఈ చరిత్రను దిగ్విజయసింగ్ వంటివారు చింపివేయ యత్నిస్తున్నారు!! జనం పట్టించుకోరన్న ధీమా....!
వి.డి.మహాజన్ రచించిన ‘అడ్వాన్స్‌డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా’- ‘విస్తృత భారత చరిత్ర’ ఇప్పటికీ కళాశాలల విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పాఠ్యగ్రంథము! అందులోని మొఘలాయి ఔరంగజేబు హిందూ జాతీయతను మట్టుపెట్టడానికి చేసిన ‘‘కొన్ని’’ ప్రయత్నాల గురించి ఉన్న ‘‘కొన్ని’’ సంగతులు ఇవీ.... ఔరంగజేబు హిందూ ఆలయాలను ధ్వంసం చేయవలసిందిగా అధికారులను ఆదేశించాడు. ఇతని ‘పాలన’ ఆరంభ కాలంలో సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. తాను ‘రాజప్రతినిధి’గా ఉండిన సమయంలో గుజరాత్‌లో తాను ధ్వంసం చేసిన, మలినపరచిన ఆలయాలను హిందువులు మళ్లీ నిలబెట్టారు. అలాంటి ఆలయాలన్నింటినీ ధ్వంసం చేయాలని గుజరాత్ అధికారులకు ఔరంగజేబు క్రీస్తుశకం 1665 నవంబర్‌లో ఆదేశాలు పంపాడు. 1669లో ఒడిస్సా ‘గవర్నర్’కు ఔరంగజేబు ఇదే విధమైన ఆదేశాలు జారీచేశాడు. ఆ ‘గవర్నర్’ ఒడిస్సాలో పెద్దసంఖ్యలో ఆలయాలను కూల్చివేయించాడు..... పాతపడిన ఆలయాలను మరమ్మతులు చేయడానికి హిందువులకు అనుమతి లభించలేదు! 1666లో మధురలోని ‘ప్రతినిధి’ ప్రసిద్ధ ‘కేశవ’ ఆలయాన్ని పాక్షికంగా పడగొట్టాడు. ముల్తాన్, సింధు ప్రాంత ఆలయాలలో అధ్యయనం’- వేదాధ్యయనం- జరుగుతోందని ఔరంగజేబునకు వార్తలందాయి. ఇలా ఆలయాలలో బోధించిన నేరానికి అధ్యాపకులను శిక్షించాలని ఔరంగజేబు ఆదేశించాడు. 1669 ఆగస్టులో వారణాసిలోని విశ్వనాథ దేవాలయాన్ని పడగొట్టించాడు. మధురలోని ‘కేశవ’ దేవాలయాన్ని నేలమట్టం చేసి అక్కడ ‘మసీదు’ను నిర్మించాడు... ‘ఖాన్ ఇ జహాన్’ అనే వాడు ఢిల్లీ పరిసరాలలోని అనేక ఆలయాలను ధ్వంసంచేసి, కొల్లగొట్టిన బంగారాన్ని బండ్లమీద తరలించుకొని వెళ్లాడు.... ఉదయపూర్ రాజభవనం ముందున్న ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఉదయపూర్ ప్రాంతంలోనే 235 ఆలయాలు ధ్వంసమైపోయాయి. జయపూర్ రాజ్యంలోని దేవాలయాలను కూల్చివేయాలని కూడ ఔరంగజేబు ఆదేశించాడు.... గోలకొండ, బిజాపూర్ రాజ్యాలలో ఆలయాలను ధ్వంసంచేసి వాటి స్థానంలో మసీదులను నిర్మించారు! మహారాష్టల్రోని ఆలయాలను కూలగొట్టడానికై ఔరంగజేబు ఒక ప్రత్యేక అధికారిని నియమించాడు! ద్వారకలోని ఆలయాలలో పూజలు జరుగరాదని ఔరంగజేబు ఆదేశించాడు..... హరిద్వారంలోను, అయోధ్యలోను కూడ ఆలయాలను విధ్వంసం చేశారు!! హిందూ ధార్మిక సాంస్కృతిక ఉత్సవాలను జరుపరాదని నిర్ధారిస్తూ నిషేధాజ్ఞలు జారీఅయ్యాయి!’’ ఔరంగజేబు చేయించిన ఆలయ విధ్వంస కార్యక్రమాలలో ఇవి కొన్ని మాత్రమే!
‘‘ఈ భయంకర కృత్యాలలో అతి భయంకరమైనది 1679నుండి హిందువులపై జిజియా పన్ను విధించడం. ఇస్లామేతర మతస్థులందరూ జిజియా పన్ను చెల్లించవలసిందే!... హిందువులు స్వయంగా వెళ్లి అధికారులకు ఈ పన్ను చెల్లించాలి! అలా కార్యాలయాలకు వెళ్లిన హిందువులను నానావిధాలు వెక్కిరించి వేధించేవారు. ఇరవై నాలుగు ‘దీనారా’ల నుండి నలబయి ఎనిమిది ‘దీనారాల’వరకు ఈ ‘జిజియా’- జుట్టు పన్ను ప్రతి హిందువు చెల్లించేవారు. పన్ను చెల్లించలేక వేలాది మంది ఇస్లాం మతంలోకి మారిపోయారు!.... ఇస్లాంను స్వీకరించడం ద్వారా హిందువులు ‘జుట్టు పన్ను’ బెడదను తప్పించుకొనేవారు. కానీ ‘‘మొఘలాయి ప్రభువులు హిందువులను ఎదగనిచ్చారు’’అని దిగ్విజయసింగ్ కొత్త చరిత్రను దేశ వ్యతిరేక చరిత్రను ఇప్పుడు ఆవిష్కరించాడు!!
క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దిలో ఐరోపావారు వచ్చి పడడానికి ముందు ఐదువందల ఏళ్లు ‘‘పాలించిన’’ వారిలో మొఘలాయిలు, ఖిల్జీలు, తుగ్లక్‌లు వంటి వారున్నారు. వారందరు కూడ ఈ దేశంలో ‘‘సర్వమత సమభావాన్ని’’ వ్యవస్థీకరించినారన్నది దిగ్విజయసింగ్ ఉద్దేశం కాబోలు... ఖిల్జీలు, తుగ్లక్‌లు మొఘలులకు పూర్వం భయంకర ‘జిహాద్‌ను సాగించిన మతోన్మాదులు! జిహాద్ లక్ష్యం ఇతర మతాలను నిర్మించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠాపించడం! ప్రపంచమంతటా నడుస్తున్న శతాబ్దుల వైపరీత్యం ఇది! ఇటీవల ‘సత్యనారాయణ వ్రతాన్ని రహస్యంగా తమ ఇళ్లలో జరుపుకున్న భారతీయులను కువాయిత్ ప్రభుత్వం తమ దేశంనుండి వెళ్లగొట్టడం ‘జిహాదీ’ తత్త్వం!

-హెబ్బార్ నాగేశ్వరరావు