వీరాజీయం

జనాలకే లేవు, క్రికెట్‌కు ఎక్కడినుంచి నీళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదట ఈ వార్త విందాం. మహారాష్ట్ర అంతటా సుమారు మూడొంతులు దాకా క్షామ పరిస్థితులు ఏర్పడిపోయాయి. జనాల గొంతులెండిపోతున్నా యి. నేల మీద ‘బొరియలు’ ఏర్పడిపోతున్నాయి. అట్టి తఱి అక్కడ ‘‘సమ్మర్ క్రికెట్ మేళా’’ షురూ అయింది. జనాలు నీళ్లు లేక దాహంతో అరవడానికి కూడా ఓపిక లేకుండా ‘‘్ఛస్తూ’’వుంటే నువ్వేమో ఐ.పి.ఎల్. క్రికెట్ బిజినెస్ ‘‘షో’’కోసం లక్షాడెబ్భయి వేల లీటర్ల మంచినీళ్ళు తెచ్చి క్రికెట్ మైదానం మీద దిమ్మరిస్తావా? అంటూ ముంబాయి హైకోర్టు క్రికెట్ బోర్డుకి ముక్క చివాట్లు పెట్టింది. ఒక్కటికాదు రెండు కాదు. చాలా ‘జనహిత వాక్యా’లు పడ్డాయి. అసలీ క్రికెట్ ఆట లోగడ చలికాలంలోనే ఆడేవాళ్లు. చలి దేశాలలోనే ఎక్కువ ఆడేవాళ్లు. కాని రానురాను రొట్టెకి రెండువైపులా ‘‘తేనే’’ వున్నట్లు గ్రహించారు ఈ పోటీ క్రికెట్ సంబరాలకి కాసుల వర్షం కురుస్తూ వుండటంతో యూరోపియన్‌లకి కూడా మన ‘మండుటెండలు’ పండు వెనె్నల లాగా అనుభవించేస్తున్నారు. బొంబాయి, పూనా, నాగపూర్ రుూ మూడు సిటీలలోనే కీలకమైన ఐ.పి.యల్. టోర్నమెంట్ మ్యాచ్‌లు జరుగుతాయని క్రికెట్ లవర్స్‌కి కంఠోపాఠంగా తెల్సు. కాగా ఓ ఇరవై పోటీలు మహారాష్టల్రో జరగాల్సి వుండగా, శనివారం ఎలాగో కోర్టు ధర్మమా అని ముంబాయి వాంఖేడ్ స్టేటియం ఫ్లడ్‌లైట్ల క్రింద ఎండలో లెండి కత్తుల సాములాగా అయిందా? సంబరాలు మిన్నుముట్టాయా? లేదా? కాని కోర్టువారు మిగతా మ్యాచ్‌ల సంగతి ఏమి చెప్పలేదు. ‘‘రేపు అనగా మంగళవారంలోగా జనం త్రాగి తమ ప్రాణాలు కాపాడుకోవలసిన నీళ్లు క్రికెట్ మైదానానికి ఎలా యిస్తున్నావు? ఇరవైరెండు వేల లీటర్లే యిస్తున్నాం అంటున్నావ్? మొత్తం లక్షాడెబ్భయి వేల లీటర్ల‘‘త్రాగు’’ నీరు కావాలి. అంటున్నారే? అదెలా వస్తుంది? వగైరాలతో సమగ్రం ఒక నివేదికగా కొట్టు ‘‘దెన్, వుయ్ షెల్ సీ’’అనేసింది కోర్టు. కాటక కాలంలో క్రికెట్ వ్యాపారానికి ‘‘త్రాగునీరు’’అందించడం. ఘోరమైన నేరం అన్న కోర్టు మాటలకి- బోర్డు బాసులు నోట మాటలు రాక- క్రికెట్ పోటీలు మానలేక నలిగి ఛస్తున్నారు. ‘‘క్రికెట్ వెన్యూ (ఆడే ప్రదేశం) మార్చాలీ అంటే మాటలా? యాభై అరవై వేల మందికి చేసిన ఏర్పాట్లు ‘‘ఆటగాళ్లకి’’ ‘‘్ఫర్-్ఫర్‌కీ, సిక్సు-సిక్సుకీ’’ ఝాంఝనక్ ఝనక్ అంటూ హొయలు ఒలికించి దులిపేసే ‘‘్ఛర్‌గాళ్స్’’కి రక్షణ కావాలి- పెళ్లి ఏర్పాట్లన్నీ అయినాక ‘పీటలమీద పెళ్లి మరో వూరెళ్లి చేసుకో అన్నట్లుందీ’’అంటూ ఐ.పి.యల్. నిర్వాహకుల గోల. గోలేమిటి? రోదిస్తున్నారన్నా తప్పులేదు. ఆ, ‘‘పిటీషన్’’లేవో ముందే పడేస్తే బాగుండేది కదా, అంటున్నారు. ‘‘మ్రింగడానికి మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనే’’అన్నట్లు వున్న జలధారలన్నీ దారిమళ్లించి క్రికెట్ పిచ్‌ల మీద, మైదానం మీద, స్టేడియమ్స్‌లోను సప్లయి చేస్తే, మొదట గవర్న్‌మెంట్‌నీ ఆనక క్రికెట్ వ్యాపారస్థుల్ని శిక్షించాలి అంటున్న న్యాయస్థానాలు తెల్లారేపాటికి- ఏదో దయదలిచి మహారాష్ట్ర పోటీలను-ఆడుకోనిస్తే చాలు’’ అంటూ వెయ్యి దేముళ్లకి మొక్కుకుంటున్నారు ‘‘లీగ్’’ బాసులు.
లోపాయికారీగా వాళ్ల తంటాలు ఏవో వాళ్లుపడుతున్నారు’’ అంటారు కొందరు.
అయినా యిదేం పిచ్చిబాబూ. (ఐ మీన్ నిజం పిచ్చి క్రికెట్ ‘‘పిచ్’’కాదు) - రుూ టోర్నమెంట్‌లు లాలూచీ కుస్తీలకన్నా హీనంగా వున్నాయ్ అన్నది ఓ యిల్లాలు. కాని ఆమె అందరి ముందు టి.వి.తెర ముందు ‘‘కూల్ డ్రింకు బాటిల్స్’’తో సహా చతికిలబడుతుంది. అది వేరే సంగతి-
నీళ్ళెక్కడనుంచి వస్తాయ్? అన్నదానికి ‘‘వేస్టు వాటర్ రీసైక్లింగ్’’ చేస్తారుట! లాంటి జవాబులు చెపుతూన్నారు నిర్వాహకులు. కోర్టువారు రుూ ‘సాకు’ మీద గ్రీన్‌సిగ్నల్ యిస్తారేమో? అదొక్కటే మార్గం. కానవస్తోంది- అన్నాడో క్రికెట్ పండిట్.
ఆమాటకొస్తే కేవలం కొన్ని లక్షల లీటర్ల నీటికోసం క్రికెట్ ‘‘కార్నివాల్’’ ఆపేస్తే ‘‘మహా’’కాటకం తీరిపోతుందా? కోట్ల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. మీరు ‘‘గోల్ఫ్’’ క్లబ్‌లకి ఎన్ని నీళ్లు అయినా యిస్తారే! అలాంటిది లక్షలాది సారీ! కోట్లాది జనాలు పరవశులైపోయి వీక్షించే క్రికెట్‌ని మరో రాష్ట్రానికి మళ్లించడం భావ్యమా? అన్నదే అసలు వాదం. ‘‘ఎక్కడికి పోవడం?’’- లోగడ ఎన్నికలొస్తున్నాయి కనుక అంటూ మొత్తం గుడారం దక్షిణాఫ్రికాకి ఎత్తేయలేదా? కొన్ని మ్యాచ్‌లు దుబాయిలో ఆడలేదా? అంటే ముందుగా చెబితే స్వామీ! సహారా ఎడారికిపోయి అక్కడ పెట్టే వాళ్ళం.. మా దుకాణం. మా ‘యాడ్స్’, ప్లేయర్స్ కూడా ఎక్కడికైనా రెడీ... అంటున్నారు బోర్డువారు-
‘‘అసలు మన జనాల్ని అనాలండీ’’అంటున్నాడో టి.వీ. చర్చా నిపుణుడు. ఇదేం దేశాలమధ్య పోటీయా?? దీనికి ఓ ‘‘జాతీయత’’, ఓ ‘‘ప్రతిష్ఠ’’ ‘‘గుర్తింపూ’’ వున్నాయా? హెల్మెట్‌ల మీద భుజాల మీద, బ్యాట్‌ల మీద అన్నిచోట్ల ఐ.పి.ఎల్. ముద్రికలు, ‘‘చూపుడు బొమ్మలు’’, ‘‘లేబిల్స్’’మాత్రం ధరిస్తారు- ఓ, జాతి, నీతి, ఓ ప్రాంతానికో ‘‘టీము’‘’గా చెందటం లాంటివి లేవు. ‘‘కోహ్లీ’’ నాయకత్వంలో ‘‘క్రిస్‌గేల్’’ఆడతాడు. విరాట్‌తో కలసి- ఫోర్‌లు సిక్స్‌లు వర్షంలాగా కురిపిస్తాడన్న గేల్.
పాపం! ఆ అప్సరాంగనలు ‘‘ఝనక్ ఝనక్’’లు గెంతలేక ఛస్తూ వుంటే మనకి అదో వినోదం- జనాల కేరింతలు- కవ్వింతలతో ఫ్లడ్ లైట్స్‌నీ తాకే గోల చేస్తారు అదీ పద్ధతి. ఈ కాసుల వర్షానికి సీజన్ అక్కరలేదు. ఐతే ‘‘పవర్‌కట్‌లుండకూడదు’’ వాటర్ కంట్రోలుం’’డ కూడదు. సదుపాయాలన్నీ ఉండాలి. కాని ‘‘నానా గోత్రస్య’’ లాలూచీ పోటీలు యివి అనక తప్పదు. ఈసారి కాస్త లేటు అయినాయి. ఎందుకు? అంటే ట్వంటీ ట్వంటీ ప్రపంచ కప్ సాగిందిగా! బైదిబై! ఆ పోటీలకన్నా వీటికి తక్కువ నీళ్లే వాడుతాం అంటున్నారు- నిర్వాహకులు. అఫ్‌కోర్స్ మహారాష్ట్ర క్షామం ముందుగావస్తే పిటీషన్‌లు ముందుగానే వేసే వాళ్లం అంటారు ‘‘పిల్స్’’వేసిన మహానుభావులు.
మొత్తంమీద కొన్ని మ్యాచ్‌లైనా మొహాలీ పోక తప్పదు అనిపిస్తోంది. ‘‘హైదరాబాద్‌కి వద్దు బాబోయ్’’అంటున్నారు మనవాళ్ళు. కర్నాటకా వాళ్లు వున్న మ్యాచ్‌లే తీసుపొమ్మంటున్నారు. అక్కడా నీటి ఎద్దడి. ఐనా ‘‘రేసు గుర్రాల్ని’’కొనేసారు. టిక్కెట్లు అమ్మేశారు. పోటీలు సాగాల్సిందే.
చివరికి యిది కరువుకాలం క్రికెట్ అయిపోయిందా?-
క్రికెట్ ‘‘బోర్డు’’ రుూజ్ యిన్ ఫర్ మోర్ ట్రబుల్.