సంపాదకీయం

బెడిసిన విద్రోహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అమ్మాయి నిజం చెప్పింది కాబట్టి కశ్మీర్ లోయలో విచ్ఛిన్న వహ్ని జ్వాలలు చల్లారుతున్నాయి. సైనిక దళాలను అప్రతిష్ఠ పాలు చేయడానికి జిహాదీలు చేసిన మరో ప్రయ త్నం బెడిసికొట్టింది. జిహాదీ బీభత్సకారుల బెదిరింపులకు హడలిపోయి ఆ బాలిక వౌనం వహించి ఉండినట్టయితే కశ్మీర్ లోయ ప్రాంతాన్ని గత ఐదారురోజులుగా ముంచెత్తుతున్న విచ్ఛిన్న కల్లోల కీలలు మరింతగా ఎగసిపడి వుండేవి! పాకిస్తాన్ తొత్తులు అమలు జరుపుతున్న విద్రోహ పథకం మరోసారి విఫలం కావడానికి సహాయపడిన ఆ పనె్నండవ తరగతి విద్యార్థిని అందువల్ల నిజంగా అభినందనీయురాలు. జమ్ము కశ్మీర్ వసంత రాజధాని శ్రీనగర్‌కు డెబ్బయి కిలోమీటర్ల దూరంలో వున్న హంద్వారాకు చెందిన ఈ యువతిని ఏప్రిల్ పనె్నండవ తేదీన ఒక సైనికుడు లైంగిక వేధింపులకు గురి చేసాడన్న అబద్ధపు ఆరోపణ కశ్మీర్ లోయను కార్చిచ్చులా వ్యాపించింది. అంతే...నాలుగు రోజులపాటు నిరసనల పేరుతో సైనిక దళాల అత్యాచారాలను వ్యతిరేకించడం పేరుతో భయంకర హింసాకాండ చెలరేగింది! ఒక సైనికుడు తప్పుచేస్తే మొత్తం సైనిక దళాలకు ఆ దుశ్చర్యను అంటగట్టి హింసాకాండను చెలరేపడం కశ్మీర్‌లోయలో దశాబ్దుల తరబడి జరిగిపోతున్న ప్రహసనం. సైనిక దళాలపై లైంగిక వేధింపుల, అత్యాచారాల ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. ఆరోపణ వచ్చిన ప్రతిసారీ ఆరోపణ ఋజువు అయినట్టుగానే నిర్ధారించడం పాకిస్తాన్ తొత్తులు అమ లు జరుపుతున్న విస్తృత షడ్యంత్రంలో భాగం. చివరికి ఆరోపణ అబద్ధమని స్పష్టంగా దర్యాప్తులో నిర్థారణ అవుతుంది. ఈ లోగా జిహాదీల వారిని సమర్ధిస్తు న్న ప్రచ్ఛన్న బీభత్సకారులైన స్థానిక రాజకీయ వాదులు జరిపించే హింసాకాండకు అంతువుండదు. ఈ దుస్తంత్రం గతం లో అనేకసార్లు పునరావృత్తమైం ది. ఇప్పుడు మళ్లీ పునరావృత్తమైంది. ఆరోపణ ప్రాతిపదికగా దర్యాప్తు జరుగకపోయినా సం బంధిత న్యాయస్థానంలో అభియోగం దాఖలు కాకపోయినా నిరసన ప్రదర్శనలు సభలు యాత్రలు జరపవచ్చు. కానీ ఆగమేఘాలమీద దర్యాప్తులు జరుపుతున్న సమయంలోనే హింసాకాండ జరుపడం ఎందుకు? ఎందుకంటే దర్యాప్తు పూర్తయినప్పుడు అబద్ధపు ఆరోపణలు ఋజువు కావు! అందువలన అప్పుడు హింసాకాండ జరుపడానికి సాకు దొరకదు. అందువల్ల ఆరోపించడం వెంటనే హింసాయుత నిరసన ప్రదర్శనలకు పూనుకొనడం జిహాదీల దశాబ్దుల వ్యూహం! ఇప్పుడు ఐదు రోజులపాటు విరుచుకునిపడిన హింసాదావాలన జ్వాల ఆ వి ద్యార్థిని నిజం చెప్పడంతో హఠాత్తుగా ఆగిపోయింది! ఆ విద్యార్థిని చెప్పిన నిజం సైనికులు తనను ఎలాంటి లైంగిక వేధింపులకు కాని, దౌర్జన్యానికి కాని గురి చేయలేదన్నది...!
ఈ ఆరోపణ గురించి ఆ విద్యార్థిని న్యాయస్థానంలో వా జ్ఞ్మూలం ఇవ్వాలని జమ్ము కశ్మీర్ హైకోర్టు ఆదేశించడంతో నిజ నిర్ధారణ జరిగింది. ఈలోగా సైనిక వ్యతిరేక హింసాకాండను అదుపు చేయడానికై అదనపు అనుబంధ సైనిక దళాలను లోయ ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. హింసాకాండను అరికట్టడం పోలీసులకు సాధ్యం కాలేదు. పోలీసులు అరికట్టడానికి ప్రయత్నించరు కూడ! ఎందుకంటె జమ్ము కశ్మీర్‌లోని పోలీసులలో అత్యధికులు దేశ వ్యతిరేకులు. ఈ సంగతిని 1990లోనే అప్పటి గవర్నర్ జగ్‌మోహన్ ధ్రువీకరించి ఉన్నాడు. 1990లో కశ్మీర్ లోయనుండి అల్పసంఖ్యాక హిందువులను వెళ్లగొట్టే కార్యక్రమాన్ని జిహాదీలు విజయవంతంగా పూర్తి చేసారు. హిందువులారా మీరు లోయ ప్రాంతంనుండి పారిపోండి, లేదా మీ ప్రాణాలు దక్కవు, పెళ్లికాని మీ ఆడపిల్లలను మాత్రం ఇక్కడనే వదిలి పెట్టిపోండి...వారికి మావద్ద భర్తలు సిద్ధంగా ఉన్నారు అన్న నినాదాలను జిహాదీలు 1989వ 1990వ సంవత్సరాలలో ప్రచారం చేసారు. లైంగిక బీభత్సకాండకు అది పాశవిక పరాకాష్ఠ. జమ్ము కశ్మీర్ పోలీసులు ఆ బీభత్సకాండను ఆపలేదు. ఇప్పుడు మాత్రం సైనికులు జరుపని లైంగిక బీభభ్సకాండను జరిగినట్టుగా చిత్రీకరించడానికి కశ్మీర్ పోలీసులు యత్నిస్తున్నారు. సైనిక దళాలను అప్రతిష్ఠపాలు చేయడం జిహాదీలు అమలు జరుపుతున్న కుట్రలో మొదటిదశ! సైనిక దళాలను లోయ ప్రాంతంనుంచి తరలించవలసిందిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి చేయడం రెండవ దశ! నిస్సైనిక మన కశ్మీర్‌ను దేశంనుంచి విడగొట్టడం మూడవ దశ!
అందువల్లనే ఏ చిన్న సాకు దొరికినప్పటికీ సైనిక దళాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరపడం హింసను ఆరంభించడం జిహాదీల ఆనవాయితీ అయిపోయింది. అదనంగా అనుబంధ సైనికులు కశ్మీర్ లోయకు తరలి వెళ్లవలసిన పరిస్థితిని జిహాదీలు ఇప్పుడు కల్పించారు. ఇలా సైనికులు కశ్మీర్ లోయకు వెళ్లడాన్ని నిరసిస్తూ హురియత్ జిహాదీ సంస్థకు చెందిన మెతక ముఠా నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఇస్లాం మతరా జ్య కూటమి-ఒఐసి-ప్రధాన కార్యదర్శి ఇమాద్ అమీన్ మదానీకి ఉత్తరం వ్రాశాడు. అంతర్గత వ్యవహారాన్ని ఇలా నిర్భయంగా అంతర్జాతీయం చేస్తున్న విచ్ఛిన్నకారులను కేంద్ర ప్రభుత్వం అదుపు చేయలేని దుస్థితి నెలకొని ఉంది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-జెఎన్‌యు-లో వామపక్ష విద్యార్థి సంస్థలవారు కశ్మీర్‌లో హంద్వారాలో నేరం చేసిన వారిని శిక్షించాలని గొప్ప ప్రదర్శనలు జరిపేశారు. సైనిక దళాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, జమ్ము కశ్మీర్‌లో అమలులో సైనికదళాల ప్రత్యేక ఆధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. సందు దొరికితే చాలు, సైనిక దళాలను అప్రతిష్ఠపాలు చేయాలన్నది మాత్రమే విచ్ఛిన్న శక్తు ల వ్యూహం...ఇదంతా హం ద్వారాకు చెందిన ఆ బాలిక నిజం చెప్పేలోగా జరిగిపోయిన విద్రోహకాండ! ఆ బాలిక నిజం చెప్పకుండా పోలీసులు నిరోధించడం, ఆమెను ఆమె తండ్రిని నిర్బంధించడం ఈ మొ త్తం వ్యవహారంలో అత్యంత విస్మయకరమైన పరిణామం! పోలీసులు నిందితులను నిర్బంధించాలి కాని బాధితులను నిర్బంధించడమేమిటి? తమ కుమార్తెను, భర్తను నిర్బంధంనుంచి విముక్తి చేయవలసిందిగా బాధితురాలి తల్లి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు ఆ బాలికను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరచక తప్పలేదు!
పనె్నండవ తేదీన ఇతర విద్యార్థినులతో కలిసి పాఠశాలనుంచి ఇంటికి వెడుతుండిన ఈ బాలిక మార్గమధ్యంలో ఒక చోట శౌచాలయంలోకి వెళ్లి తిరిగి బయటికి వచ్చింది. ఆమె బయటికి రాగానే ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేసి ఆమెను కొంతదూరం ఈడ్చుకుని పోయారు. దుండగులలో ఒకడు పాఠశాల గణ వేషం-స్కూల్ యూనిఫారమ్-వేసుకుని ఉన్నాడట! ఆ విద్యార్థిని పుస్తకాల సంచిని కూడ దుండగులు లాక్కొన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులు దుండుగులు పారిపోయిన వెంటనే ఆ విద్యార్థినిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి నిర్బంధించారట, ఆతరువాత ఆమె తండ్రిని కూడ నిర్బంధించారు. వారు నిర్బంధంలో ఉండగా సైనిక దళ వ్యతిరేక నిరసనలు రాజుకున్నాయి! 2009లో కశ్మీర్ లోయలోని షోపియా ప్రాంతంలో ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సైనికులు వారిని మానభంగం చేసి నీటిలో ముంచేసారని ప్రచారం చేశారు, కనీ వినీ ఎరుగని రీతిలో లోయలో భయంకర హింసాకాండను జరిపారు. ఆ మహిళలు అత్యాచారానికి గురి కాలేదని హత్యకు గురి కాలేదని ఆ తరువాత ధ్రువపడింది! ఇప్పటి ఘటన దానికి పునరావృత్తి...