సంపాదకీయం

విదేశీయ ‘సేవ’లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశానికి తరలి వస్తున్న విదేశాల పెట్టుబడుల-్ఫరిన్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్-ఎఫ్‌డిఐ-లో అత్యధిక శాతం ‘సేవల రంగం’లో వినియోగమవుతున్నాయన్నది రెండు దశాబ్దుల అనుభవం. ఈ వాస్తవం 2015లో మరోసారి ధ్రువపడడం కొనసాగుతున్న వైపరీత్యం. 1994లో మనదేశంలో ప్రపంచీకరణకు అంకురార్పణ జరిగినప్పటి నుంచి ఈ వైపరీత్యం కొనసాగుతోంది. అందువల్ల విదేశీయ సంస్థలు తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను గుంజుకొని తమ దేశాలకు తరలించుకొని పోతున్నాయి. ప్రతి ఏటా విదేశీయ ప్రత్యక్ష నిధుల-ఎఫ్‌డిఐ- పేరుతో మనదేశంలోకి వస్తున్న పెట్టుబడులకంటే అదే కాల వ్యవధిలో మనదేశం నుండి విదేశీయ సంస్థలు లాభాల రూపంలో మూటకట్టుకొని పోతున్న నిధుల పరిమాణం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు ప్రచారం చేయని బహిరంర రహస్యం ఇది. ఇలా వస్తున్న పెట్టుబడులకంటె విదేశాలకు తరలిపోతున్న లాభాలు ఎక్కువగా ఉండడానికి కారణం సేవారంగంలో ఈ పెట్టుబడులు ఉపయోగపడడం. ఉత్పాదక రంగంలో ప్రత్యేకించి వౌలిక పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను పెట్టడం వల్ల నిర్మాణాలు జరిగి ఉత్పత్తులు జరిగేసరికి ఏళ్లు గడిచిపోతాయి. అందువల్ల విదేశీయ సంస్థలు వేచి ఉండాలి. సేవల రంగంలోను పంపిణీ రంగంలోను, ఆహార పరిశ్రమలోను పెట్టుబడులను పెట్టడం వల్ల అతి తక్కువ కాలంలో పెట్టుబడులను మించిన రీతిలో ఇబ్బడి ముబ్బడిగా లాభాలను గుంజుకోవచ్చు. అందువల్ల సేవల రంగంలో పెట్టుబడులను పెట్టడానికి విదేశీయులు నిరంతరం ఉవ్విళ్లూరుతున్నారు. సేవల రంగంలో జరిగిన ప్రగతి తాత్కాలికమైనది. కృత్రిమమైనది. వౌలిక పారిశ్రామిక రంగంలోను వ్యవసాయ రంగంలోను జరిగే ప్రగతి సహజమైనది. దీర్ఘకాలికమైనది. అందువల్లనే స్థూల జాతీయ ఉత్పత్తి- జిడిపి-లో వ్యవసాయ, వౌలిక పారిశ్రామిక రంగాలలోని ఆదాయ శాతం పెరగాలి. అలా పెరిగినప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధి! సేవల రంగంలో జరిగే ప్రగతి బలుపు కాదు, వాపు మాత్రమే. మునగచెట్టు పెరిగినట్టు పెరిగి గాలి పెద్దగా వీచిన వెంటనే కూలిపోతుంది. సేవల రంగంలోని ప్రగతి వివరాలను వెల్లడించకుండా మన ప్రభుత్వాలు లక్షలాది కోట్ల రూపాయల విదేశీయ నిధులు తరలి వస్తున్నాయని డప్పులు దబాదబా వాయించడం, వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థలోని ప్రధాన వైపరీత్యం.
గత ఏడాది మన దేశానికి వచ్చిన పెట్టుబడులలో దాదాపు అరవై శాతం అనుత్పాదక సేవల రంగంలో ఉపయోగపడ్డాయి. సాంకేతిక సమాచార రంగం, వ్యాపారం, వైద్యసేవలు, వినోద విహార యాత్రల రంగాలలో సేవలను విదేశీయులు అందించారు. అనవసరమైన తినుబండారాలను, ఐస్‌క్రీమ్‌లను, శీతల పానీయాలను, అలంకరణ సామగ్రిని మన వినియోగదారులకు అంటగట్టడం విదేశీయులు ప్రధానంగా చేస్తున్న ఉత్పత్తి, సేవ, పంపిణీ! నైజల్ కంపెనీ వంటి విదేశీయ సంస్థలు సేమ్యాను తయారు చేసి అన్ని వేల కోట్ల రూపాయలను దండుకున్నాయి. ఈ రంగంలో జరిగే ఉత్పత్తులను ‘‘్భరత్‌లో నిర్మించండి’’ అన్న యోజనలో భాగంగా చిత్రీకరించే ప్రయత్నం జగరడం మరో విచిత్రం. పెప్సీకోలా కోకోకొలా వంటి శీతల పానీయాలలో పురుగుల మందులు ఇతర రసాయనాలు కలుస్తున్నందువల్లనే అవి మన నాలుకకు రుచిని మన బుద్ధికి మత్తును కలిగిస్తున్నాయి. నెజెల్ వారి సేమ్యాలో మోనోసోడియం గ్లుటమేట్ అన్న విష రసాయనం ఉండటమే వాటి కృత్రిమమైన రుచులకు మూలకారణం. మేక్ ఇన్ ఇండియా అన్న పథకాన్ని ఇలా శీతల పానీయాలను, అనవసరమైన కొవ్వును మన పొట్టలలోకి చేర్చి క్రమంగా మనలను రోగాల పాలు చేస్తున్న తినుబండారాలను ఉత్పత్తి చేయడం కోసం విదేశీయ సంస్థలు దుర్వినియోగం చేశాయి. చేస్తున్నాయి. చిల్లర వ్యాపారంలోకి విదేశాల వారి పెట్టుబడులను తరలించడం బీమారంగంలోని విదేశీయ సంస్థల చొరబాటు, ఇలాంటివి ప్రపంచీకరణ వల్ల మనకు లభిస్తున్న సేవలు.
స్వదేశీయ ఆర్థిక వాణిజ్య వ్యవసాయ విద్యా సాంస్కృతిక పరిరక్షణ కోసం తపిస్తున్న వారు ఎంత అరచి గీ పెట్టినప్పటికీ బధిరాంథక పాలకులకు చీమ సైతం కుట్టినట్టు లేకపోవడం ప్రపంచీకరణ మాయాజాలం. విదేశాల పెట్టుబడులను ప్రధానంగా వౌలిక రంగాలలో ఉత్పత్తులను పెంచడానికి మాత్రమే స్వీకరిస్తామన్నది మన ప్రభుత్వం 1994లో ఆవిష్కరించిన అధికారిక విధానం. అప్పటి ఆర్థిక మంత్రి మన్‌మోహన్ సింగ్‌తో సహా ప్రపంచీకరణ సమర్థకులందరూ వేనోళ్ల వివరించిన విధానమిది. బొగ్గు, సిమెంటు, పెట్రోలు, ఉక్కు, విద్యుత్తు, ఎరువులు వంటివి వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులు. విదేశీయ సంస్థలు ఈ రంగాలలో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టాయి? పెరిగిన ఉత్పత్తి ఎంత? అన్న విషయమై ప్రభుత్వాలు అప్పటినుంచీ ఇప్పటి వరకూ సమాధానాలు చెప్పడం లేదు. విద్యారంగంలో విదేశీయులు చొరబడిపోయి భారతీయతా ధ్యాసలేని విద్యలను మన పిల్లలకు మప్పడానికి సైతం రంగం సిద్ధమైంది. విదేశీయ విద్యాలయాలు వచ్చేశాయి. ఆర్థికమంత్రిగా మన్‌మోహన్ సింగ్ మనదేశంలో ప్రపంచీకరణకు శ్రీకారం చుట్టాడు. ప్రధానమంత్రిగా మన్‌మోహన్ సింగ్ ప్రపంచీకరణ వ్యవస్థీకరించాడు. 2014 నాటికి వౌలిక పారిశ్రామిక రంగాలు మినహా అన్ని రంగాలలోను విదేశీయ నిధుల వల్ల ప్రగతి ప్రస్ఫుటించింది. అమెరికాతో, ఫ్రాన్స్‌తో, రష్యాతో ఇతర సంపన్న దేశాలతో కుదిరిన ఒప్పందాల వల్ల దేశంలో విద్యుదుత్పత్తి పెరగలేదు. పెట్రోలియం, ఎరువుల దిగుమతులు తగ్గలేదు. బొగ్గు ఉత్పత్తులను బహుళ జాతీయ సంస్థలు దుర్బుద్ధి పూర్వకంగా తగ్గించడం ప్రపంచీకరణ చరిత్ర. ఎఫ్‌డిఐ ప్రహసనం...
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇరవైనెలల్లో దాదాపు ఐదున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీయ నిధులు దేశానికి తరలివచ్చాయట. అంతకు పూర్వం ఇరవై నెలల్లో కేవలం మూడు లక్షల ఎనబయి ఐదు వేల కోట్ల రూపాయల విదేశీయ నిధులు లభించాయట. అందువల్ల నలబయి ఐదు శాతం ప్రగతిని కొత్త ప్రభుత్వం సాధించింది. కానీ సేవల రంగంలో సైతం ఈ మేరకు పెట్టుబడులు పెరిగాయి. నిజానికి వౌలిక పారిశ్రామిక రంగానికి పెట్టుబడులు వాస్తవమైన విలువల ఆధారంగా తగ్గుతున్నాయి. 1994 భాజపా ప్రపంచీకరణను వ్యతిరేకించింది. ఆ తరువాత సమర్థించింది. 2014 వరకు భాజపా చిల్లర వ్యాపారంలోకి విదేశీయుల చొరబాటును వ్యతిరేకించింది. ఇప్పుడు సమర్ధిస్తోంది. మన్‌మోహన్ ‘బాట’లో మోదీ నడవడం లేదా?