ఉత్తరాయణం

ఆంధ్రకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రపంచంలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నా రకరకాల పన్నులు వేసి వినియోగదారుడికి ఏమాత్రం తగ్గింపు లేకుండా ఖజానా నింపుకుంటున్నారు. ఆదాయ పన్ను పరిమితి ఐదు లక్షలకు పెంచుతాం. విదేశాల్లో భారతీయుల సొమ్ము వంద రోజుల్లో రప్పిస్తాం వంటి ప్రజారంజక హామీలతో గద్దెనెక్కిన ఎన్‌డిఏ ప్రభుత్వం పైన చెప్పిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా నాటి యు.పి.ఎ. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తానన్న ప్రత్యేక హోదా, నూతన రాజధాని నిర్మాణం వంటివి గాలికొదిలేసింది. మిత్రపక్షంగా చెప్పుకుంటూ హుదుద్ తుఫాన్‌కు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఆరువందల కోట్లు విదిల్చింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖ రైల్వే ప్రత్యేక జోన్ గురించి ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు ఎన్నిసార్లు అడిగినా చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగానే ఉంది. బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించనన్ని నిధులు ఆంధ్రకు ధారపోశామని బొంకడం ఆయనకే చెల్లింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గత పాలకులు మొండిచెయ్యి చూపితే ప్రస్తుత పాలకులు చెవిలో పువ్వు పెడుతున్నారు.

- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

అరాచక శక్తులను అణచివేయాలి

విశ్వవిద్యాలయాలు అంటే సనాతన భారతీయ సం స్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే దేవాలయాలు. సరస్వతీ, గాయత్రీ మాతలు సాక్షాత్తు కొలువుండి జ్ఞానాన్ని సముపార్జించే మహత్తర యజ్ఞాన్ని స్వయంగా వీక్షిస్తూ విద్యార్థులను ఆశీర్వదించి, గొప్ప వ్యక్తిత్వం, ఉన్నత ఆశయం, అత్యున్నత మానవతా విలువలతో వారిని సంపూర్ణంగా తీర్చిదిద్ది భారతదేశ ప్రగతికి ఊతం ఇచ్చే విధంగా అందించే పవిత్ర ఆలయాలు. సనాతన జ్ఞాన సముపార్జన, వ్యక్తిత్వ వికాసానికి ప్రతీకలుగా ప్రపంచ ఖ్యాతి పొందినవి భారతీయ విశ్వవిద్యాలయాలు. అటువంటివి ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల వేదికలుగా, రాజకీయ లబ్దికోసం, తమ రాజకీయ వారసులను తయారుచేసే కేంద్రాలుగా మారడం క్షమించరాని నేరం. తీవ్రవాదులు, దేశద్రోహులు, శత్రుత్వ దేశాలను సమర్థించే పోకడ ఈమధ్యకాలంలో ఇక్కడ ప్రబలడం క్షమించరాని నేరం. ప్రభుత్వం తక్షణం విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి, ప్రోక్షించి పవిత్రమొనర్చే దివ్యకార్యం చేపట్టాలి. అశాంతి, ఆందోళనలు రేకెత్తించే అరాచక శక్తులను నిర్ధాక్షిణ్యంగా తరిమివేయాలి. ప్రాంతీయ వైషమ్యాలు రేకెత్తించే కొం దరు కుహనా ప్రొఫెసర్లను తొలగించా లి.

- ఎం.కనకదుర్గ, తెనాలి

ఫార్మాసిటీతో ఇబ్బందులు

జనవాసాల మధ్య ఏర్పాటుచేసిన ఫార్మాసిటీ ప్రజలపాలిట శాపంగా మారింది. పరవాడ మండలంలోని ఫార్మాసిటీలోని పలు కెమికల్, ఫార్మా, గ్యాస్ కంపెనీలు నిబంధనలకు తిలోదకాలిచ్చి రసాయన వ్యర్థాలతో కూడిన సామగ్రి, పౌడర్లు, ద్రవ పదార్థాలను రోడ్డుపక్కనే పడేస్తున్నారు. ఫ్యాక్టరీలనుండి వచ్చే కలుషిత, రసాయన గ్యాస్‌లను యధేచ్ఛగా గాలిలోకి వదిలేస్తున్నారు. ఈ కంపెనీల దాష్టికం వలన భూగర్భ జలాలు కలుషితమై బోర్లు, నేలబావుల్లో నీరు పచ్చరంగులోనికి మారిపోయి వినియోగానికి పనికిరాకుండా పోయాయి. దట్టమైన పొగవలన ఈ ప్రాంతవాసులు అనేక ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. ప్రజల అవస్థల పట్ల ఎన్ని విజ్ఞప్తులు అందజేసినా, మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా ఏం ప్రయోజనం లేదు.

- సి.ప్రతాప్, శ్రీకాకుళం

జీతాలు ఇంతగా పెంచాలా?

ఎంఎల్‌ఏలకు, ఎంపీలకు జీతాలు రెండింతలు పెంచా రు. బాగా ధనవంతులైన వారే ఎన్నికలలో నిలబడి ప్రజాసేవ చేస్తున్నామని చెప్పి స్వయంసేవ చేసుకుంటూ ఉంటారని ప్రజలందరికీ తెలుసును. అటువంటప్పుడు వారికి జీతాలివ్వటమనేది హాస్యాస్పదంగా వున్నది. అవసరమైతే సమావేశాలప్పుడు భత్యాన్ని ఇవ్వవచ్చును. ఒకవైపు మధ్యతరగతి ప్రజలు చాలీచాలని ఆదాయంతో బ్రతుకుతున్నప్పుడు రాజకీయ పదవులున్న వారికి లక్షల్లో జీతాలివ్వటం ఎంతవరకు న్యాయం?

- డి.రామకృష్ణ, పొలమూరు