సంపాదకీయం

‘ఎర్రని’ బాటలకు కారణం...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహదారులకు ఆకుపచ్చని అందాలను సంతరించి పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం శ్లాఘనీయం. గత ఏడాది సెప్టెంబర్‌లో హరిత మహాపథ విధానం-గ్రీన్‌వే పాలసీ-ఆవిష్కరించిన ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఆరువేల కిలోమీటర్ల ఆకుపచ్చని బాటలను ఏర్పాటు చేయనున్నట్టు కూడ ప్రకటించింది. జాతీయ మహా పథాలకు ఇరువైపులా చెట్లను నాటడం ఈ హరిత విధానంలో భాగం! జాతీయ వేగపథాల-ఎక్స్‌ప్రెస్ హైవేస్-నిర్మాణం అత్యంత ఆర్భాటంగా జరిగింది, మరింత ఆర్భాటంగా కొనసాగుతోంది. నిర్మాణం పూర్తయిన చోట పదేళ్లకు పైగా ఎక్స్‌ప్రెస్ హైవేలలో మహాశుల్క ద్వారాలు-టోల్‌గేట్స్ ఏర్పాటు చేసారు. ఈ ద్వారాలు సగటున వంద కిలోమీటర్లకు ఒకచోట అవతరించి ఉండడం ప్రభుత్వేతర భాగస్వామ్య విస్తృతికి నిలువెత్తు నిదర్శనం. ఈ శుల్క ద్వారాలవద్ద ప్రభుత్వేతర సంస్థలకు వాహన యజమానులు భారీగా ప్రయాణ సుంకాల-టోల్‌టాక్స్ చెల్లించడం ప్రపంచీకరణ సృష్టించిన వినూతన జీవనంలో భాగం. పన్నులు ప్రభుత్వానికి చెల్లించడం పాత పద్ధతి. ప్రభుత్వం వారు ఈ టోల్‌గేట్ల వద్ద ప్రభుత్వేతర సంస్థలకు సుంకాలు చెల్లించడం వినూతన పద్ధతి. రాష్ట్ర ప్రభుత్వాల రోడ్డు రవాణా సంస్థలకు చెందిన బస్సులనుండి ప్రభుత్వేతర సంస్థలవారు అతి భారీగా ప్రయాణ శుల్కం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం-పబ్లిక్ ప్రైవేట్ పార్డ్‌నర్‌షిప్-పిపిపి-ప్రభుత్వేతర సంస్థల సమాంతర పాలనగా మారిపోయిందనడానికి ఈ ఎక్స్‌ప్రెస్ హైవేలపై వెలసిన ప్రయాణ శుల్క మహా సింహద్వారా లు ప్రత్యక్ష సాక్ష్యాలు! ప్రభుత్వేతర వాణిజ్య ప్రస్థాన పథాల పక్కన ప్రభుత్వ భాగస్వామ్యం బిక్కుబిక్కుమంటూ నక్కి ఉండడం ప్రపంచీకరణ వల్ల మనకు ఒనకూడిన ప్రయోజనం. వాహనం యజమానులు సైతం ఏమాత్రం నొచ్చుకోకుండా నిర్దేశించిన సుంకాన్ని ప్రతి ద్వారం వద్ద ప్రభుత్వేతర సంస్థలకు చెల్లించి రసీదు పొందుతున్నారు. అందువల్ల ఈ క్షిప్ర పథాల-ఎక్స్‌ప్రెస్ హైవేస్- తోడుగా హరిత పథాలు ఏర్పడనున్నాయన్న ఆనందకరమైన వార్తల వెనుక ప్రభుత్వేతర సంస్థలు వసూలు చేయనున్న హరిత శుల్కం-గ్రీన్ టాక్స్-తొంగి చూస్తోంది. ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించిన ప్రభుత్వేతర సంస్థలు టోల్‌టాక్స్ దండుకుంటున్నట్టే మొక్కలను నాటి పెంచి పెద్దచేసే ప్రభుత్వేతర సంస్థలు కూడ గ్రీన్‌టాక్స్‌ను దండుకుంటాయేమో? ఈ సంగతిని మాత్రం ప్రభుత్వాలు ప్రచారం చేయడం లేదు! ఎక్స్‌ప్రెస్‌హైవేల నిర్మాణం కోసం దేశమంతటా ఇరుపక్కలా ఉండిన లక్షల కోట్ల చెట్లను కొట్టేశారు. ఇన్ని ఏళ్లు గడిచిన తరువాత మళ్లీ ఇరువైపులా లేదా మధ్యలో మొక్కలు నాటుతారట! ఈ మొక్కలు పెరిగి చెట్లుగా మారినప్పుడు హరిత పథాలు అవతరిస్తాయి... ఈలోగా యథావిధిగా రహదారులకు ఎర్రని అందాలు సంతరించి పెట్టడానికి భయంకర ప్రమాదాలు జరిగిపోతూనే ఉంటాయి. మన దేశపు ఈ రక్తపథాలు-రెడ్‌వేస్-ప్రపంచమంతటా పేరుమోసి ఉండడానికి కారణం నిరంతరం పెరుగుతున్న ప్రమాదాలు...
మరో నాలుగేళ్లలో రహదారి ప్రమాదాల సంఖ్యను ప్రస్తు తం జరుగుతున్న వాటికంటె సగానికి తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం వారి లక్ష్యం శ్లాఘనీయం...కానీ పూర్తిగా నిర్మూలించడానికి ఒక్క ప్రమాదం కూడ జరగని రీతిలో రహదారి వ్యవస్థను రూపొందించడానికి ఎందుకని కృషి జరగరాదు? వేగవంతమైన ప్రయాణ పథాలు, హరిత పథాలకు తోడు ప్రమాద రహిత పథాలు కూడ ఎందుకని వ్యవస్థీకృతం కారాదు? కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టు 2020వ సంవత్సరంనాటికి ప్రమాదాలు సగానికి తగ్గిపోయినప్పటికీ మన దేశంలో సగటున రోజునకు రెండు వందల మంది రహదారి ప్రమాదాల్లో మృత్యువునకు బలి కానున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో సగటున ప్రతిదినం నాలుగు వందల మంది రహదారి ప్రమాదాలకు బలైపోతున్నారన్నది గణాంక విశే్లషకులు చెబుతున్న మాట! 2014లో దేశంలో నాలుగు లక్షల ఎనబయి తొమ్మిది వేలమంది రహదారి బీభత్సానికి బలైపోగా, 2015లో ఈ ప్రమాద మరణాల సంఖ్య ఐదు లక్షలను దాటిపోయిందట! మిగిలిన దేశాలన్నింటికంటె మన దేశపు రహదారులు అత్యంత ప్రమాదకరమైనవన్న ప్రచారం కూడ మొదలైంది!
రహదారుల ప్రమాదాలను నిరోధించడానికి దుర్మరణాలను నివారించడానికి వలసిన చర్యలను వేగవంతం చేయాలని సర్వోన్నత న్యాయస్థాన నియుక్త అధ్యయన సంఘం వారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలను కోరడానికి ఇదంతా నేపథ్యం...ఇంత కాలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గైకొన్న చర్య ప్రభావం శూన్యమని కూడ ఈ అధ్యయన బృందం అభిప్రాయపడిందట! ప్రమాదాలు జరగడానికి ఒక నియమిత పద్ధతి కాని, ఊహించడానికి వీలైన కారణాలు కాని లేవు. అందువల్ల ఒక్క ప్రమాదం కూడ జరగకపోవడం ఒక్కరు కూడ బలికాకపోవడం ప్రభుత్వాల లక్ష్యం కావాలి. అలాంటి రహదారి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అంతేకాని ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలన్న లక్ష్యాలను నిర్ణయించడం ఏమిటి? ప్రమాదం అని అంటేనే ఊహించని, ఊహించలేని దుర్ఘటన... అలాంటప్పుడు ఈసంవత్సరం జరిగిన ప్రమాదాలలో కనీసం సగం నాలుగేళ్ల తరవాత కూడ జరుగుతాయని లక్ష్యాలు నిర్దేశించడానికి తార్కికమైన ప్రాతిపదిక ఏమిటి? రేపు కూడ, వచ్చే నెలలో కూడ దేశంలో ఒక్క ప్రమాదం జరగని రీతిలో వాహన చోదకులు జాగ్రత్తగా నడపాలన్నది తార్కికమైన లక్ష్యం! కానీ ప్రగతి పథకాలకు, పేదల సంఖ్యను తగ్గించడానికి వలెనే ప్రమాదాలు తగ్గించడానికి లక్ష్యాల నిర్ణయం ఏమిటి? రహదారుల దుస్థితి ఎలా ఉన్నా భవిష్యత్తులో ఒక్క ప్రమాదం కూడ జరగకపోవచ్చు!
అందువల్ల ప్రభుత్వాలు గతుకులు లేని రహదారులు ఎనే్నళ్లలో ఎన్ని కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయగలమన్న లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి. రహదారుల వెడల్పు పెరిగిన కొద్దీ, అద్దంలాగ నున్నగా ఏర్పడిన కొద్దీ బాధ్యతారహిత చోదకులు-డ్రైవర్లు-మరింత నిర్లక్ష్యంగా, మరింత దురుసుగా వాహనాలను నడుపుతున్నారు. ఇలాంటి నేరస్థులకు ప్రధానంగా మత్తెక్కి ఊగుతున్న తూగుతో వాహనాలను తోలుతున్న వారికి శిక్షలు పెంచడం ప్రమాద నిరోధానికి ఒక మార్గం. అవగాహన పెంపొందే సదస్సులను, ప్రచారాన్ని ముమ్మరం చేయడం మార్గం. జాతీయ మార్గాలపై అన్ని రకాల వేగనిరోధక నిర్మాణాల-స్పీడ్ బ్రేకర్స్-ను తొలగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల వివిధ విభాగాలను రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందట! అయితే ప్రధానంగా తొలగించవలసింది గతుకులు, గుంటలు, గోతులు! 2014లో ఈ గతుకులకు దాదాపు పదకొండు వేల మంది బలయ్యారట. వీరిలో స్పీడ్ బ్రేకర్లకు బలైన వారు కూడ ఉన్నారు. ప్రమాదాలకు మరో కారణం విదేశాలనుంచి దిగుమతి అవుతున్న వోల్వోవంటి బస్సులు. ఈ దిగుమతులను ఆపలేరా?