మెయన్ ఫీచర్

అడ్రస్ లేని అసహనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌దీప్ సర్దేశాయి లాగా కాకుండా, రాహుల్ కన్వాల్ అనే ‘ఇండియా టుడే’ ఆంగ్ల ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ కొంత నిజాయితీగా అభిప్రాయాల్ని చెపుతుంటాడు. ఇద్దరూ ‘ఇండియా టుడే’ ఛానల్‌లోనే పనిచేస్తున్నా, రాజ్‌దీప్ సర్దేశాయి హిందూ జాతీయవాదాన్ని విమర్శించేందుకే జర్నలిస్టు రంగంలో పనిచేస్తున్నట్టు మనకు స్పష్టవౌతున్నది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను అందమైన ఆంగ్ల భాషలో ఎగతాళి చేయడమంటే ఆయనకు ఇష్టం. నరేంద్రమోదీని విమర్శించడమంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ‘నేను బీఫ్ తినడానికి వెళుతున్నాను, గుడ్‌నైట్’అని కోట్లాది మంది హిందువుల మనోభావాలను తన ట్వీట్లతో గాయపరచడం ఆయన నైజం. బిహార్ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచేందుకు ఆయన చేయని ప్రయత్నంలేదు. ‘బీహార్‌లో నితీష్‌కు అందరూ భారీగా మద్దతిస్తున్నారు’అని సందేశమొచ్చేలాగున, మొదటిదశ పోలింగ్ నుండి నవంబర్ 8 ఫలితాలు వెలువడేవరకు తను పనిచేసే ఛానల్ ద్వారా కార్యక్రమాలు ప్రసారం చేసాడు. ఆయనకు హిందూ జాతీయవాదుల్లో మంచి అనేది మచ్చుకైనా కనిపించదు. కాంగ్రెస్ అవినీతిని, అవకాశవాద రాజకీయాల్ని, జాతి వ్యతిరేకులతో చేసే స్నేహాన్ని మాత్రం ఆయన పల్లెత్తు మాట అనడు. యుపిఎ అధికారంలో ఉండిన సమయంలో సోనియా, రాహుల్ ద్వారా ఈయన పొందిన అనేక ప్రయోజనాలు ఎవ్వరికీ తెలియనివేమి కావు.
మళ్ళీ రాహుల్ కన్వాల్ విషయానికొద్దాం. ఇటీవల కన్వాల్ ఇలా వ్రాసాడు. ‘‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత, ఆశ్చర్యకరంగా, ‘అసహనం’మీద పెద్ద హంగామా చేసిన మేధావులు, రచయితలందరూ వౌనంగా ఉండిపోయారు.’’ బిహార్‌లో ప్రజాభిప్రాయాన్ని మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ పక్షాలకు వ్యతిరేకంగా ప్రభావితం చేయడానికేనా ఈ రచయితల అసహన వ్యతిరేక ర్యాలీలు, సభలు? అని అర్థమొచ్చేలాగున కన్వాల్ వ్రాసాడు అని పాఠకులు అర్థం చేసుకోవచ్చు. రాహుల్ కన్వాల్ చెప్పింది అక్షరాలా నిజం కూడా.
మోదీ వచ్చాకే దేశం తగలబడిపోతోందని, సెక్యులర్ వ్యవస్థ కుప్పకూలి పోతోందని, భా.జ.పా. పెరిగితే భారతదేశం మిగలదని, ముస్లింలు, క్రైస్తవులు బతికి బట్టకట్టలేరని పెద్దఎత్తున విషప్రచారం చేయడమనేది ప్రత్యక్షంగా బిహార్ ఎన్నికలతో ముడిపెట్టబడిన అంశం. సాధారణ రాజకీయ పరిజ్ఞానమున్న ఏ పౌరుడికైనా ఇది తెలిసిపోతుంది. నరేంద్రమోదీ ప్రధాని కాకముందు దేశమంతా సుభిక్షంగా, సురక్షితంగా ఉండిందా? అప్పుడు నిద్రపోయిన మేధావులు మోదీ వచ్చాక మేల్కొనడం ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు, త్వరలో రాబోతున్న అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ శాసనసభ ఎన్నికలపుడు కూడా మళ్ళీ ఈ మేధావులు భా.జ.పా.కు జాతీయ వాదులకు వ్యతిరేకం గా మళ్ళీ ఏదో అంశాన్ని తెరమీదకు తప్పకతెస్తారు. గత కొన్ని నెలలుగా దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే, నరేంద్రమోదీని దించి ఎంతటి అసమర్ధుడినైనా ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే సిద్ధమైపోయిందనేది అర్థమ వుతుంది. తాను ప్రధానిని కావాలనే చిరకాల కోరికను కూడా రాహుల్‌గాంధీ పక్కకుపెట్టి మోదీని దించేయాలి అనే ఏకసూత్ర కార్యక్రమంతో ముందుకు వెళుతున్నాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక లాభాలు, అవార్డులు, నిధులు, అధికార పీఠాలు దక్కించుకున్న ఈ దేశంలోని మేధావి వర్గం, కాంగ్రెస్ ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతును ప్రకటించేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. భాజపాలోని అద్వానీ వర్గంయొక్క కదలికలు, జాతీయవాదానికి వ్యతిరేకమైన ఈ శక్తులకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోఉన్న కర్ణాటకలో మొన్న ప్రశాంత్ పూజారీని, నిన్న కుట్టప్పను మతోన్మాద శక్తులు హత్యచేస్తే, ఒక్క మేధావీ తన అవార్డును వాపసు ఇవ్వలేదు. పైగా ఒక మతిలేని మేధావి బెంగళూరు విమానాశ్రయానికి నరహంతకుడు టిప్పుసుల్తాన్ పేరుపెట్టాలంటాడు. నేటి అసహనంలో కాంగ్రెస్ మరికొన్ని కుహనా లౌకికవాద పార్టీల నేతల ప్రమేయం గురించి స్పష్టమైన ఆధారాలున్నా, మన మేధావివర్గం వాటి గురించి మాట్లాడదు. దాద్రీ గ్రామం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇపుడు అక్కడ అధికారంలో ఉన్నది సమాజ్‌వాదీ పార్టీ. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలో ఉంటాయి. వాటిని కాపాడాల్సినది ఢిల్లీలో ఉండే మోదీకాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, అధికార యంత్రాంగం. దానికి మోదీని మోదడం ఎందుకు?
అకస్మాత్తుగా తెరమీదకు తీసుకొచ్చిన అసహనపు’ప్రహసనం వెనుక పెద్ద కుట్ర దాగుందని మనం తెలుసుకోవాలి. అవార్డు వాపసు నాటకంలో ముందుగా అవార్డును వాపసు ఇచ్చింది ఉదయ్‌ప్రకాష్ అనే మేధావి. ఈయన ఎవరు? ఈయన సిపిఐ (్భరత కమ్యూనిస్టుపార్టీ)లో 16 సంవత్సరాలు ఫుల్‌టైం కార్యకర్తగా పనిచేసాడు. ఆసక్తికరమైన సమాచారమేమంటే గోరఖ్‌పూర్‌నుండి గెలుపొందిన భా.జ.పా. పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఒక కార్యక్రమంలో వేదిక పంచుకుని, సోదరుడి తరపున ఉదయ్‌ప్రకాష్ అవార్డు అందుకుంటే ఆయనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు మేధావులు దాడి చేసి, ఆయన్ను నానా తిట్లుతిడుతూ కరపత్రాలు పంచిపెట్టారు. ఎవరిది అసహనం?
మహరాష్టల్రో హేతువాది డా.నారాయణ్ ధబోల్కర్‌ను హత్యచేసారు. హత్య జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే. హంతకులను కాంగ్రెస్ పార్టీ అరెస్టు చేయలేదు. భా.జ.పా. మహారాష్టల్రో అధికారంలోకి వచ్చాక, హత్యలో అనుమానితులుగా భావిస్తున్న ‘సనాతన్ సంస్థ’ సభ్యులను అరెస్టుచేసింది. నేరస్థులను శిక్షించింది కాంగ్రెస్సా? భా.జ.పా.నా? భా.జ.పా.కు చెందిన ఒక్క పార్లమెంటు సభ్యుడు నోరుజారినా, దాన్ని కొండంతలుచేసి రోజుల తరబడి మీడియా మేధావులు పాచినోటితో ప్రచారం చేస్తారు. కానీ సాక్షాత్తూ ప్రధానమంత్రి పదవిలో ఉండి మన్మోహన్‌సింగ్ ‘దేశంలోని వనరుల మీద ప్రాథమిక హక్కు మైనారిటీ మతస్థులకే ఉందని’ అన్నపుడు మీడియా నోరెందుకు మూసుక్కూర్చుంది? మన్మోహన్‌సింగ్ చేసింది ఎంత వివాదాస్పద ప్రకటన! ఆనాడు ఒక్క మేధావి, ఒక్క రచయిత మాట్లాడలేదెందుకు?
2014లో సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం జరుగుతున్నపుడు ఏప్రిల్ నెల 8వ తేదీన మేధావులంతా కూడబలుక్కొని ‘‘మతోన్మాద, ఫాసిస్టు నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఓటువేయండని’’ ఓటర్లకు ప్రకటనలో సంతాలు చేసిమరీ విజ్ఞప్తిచేసారు. దీన్నిబట్టి తెలుస్తున్నదేమిటి? ఈ మతిమాలిన మేధావులకు అసలుచింత దేశం గురించి, సామాజిక శాంతి గురించికాదు, తమకు నచ్చని వాడు దేశ ప్రధాని కాకూడదు, జాతీయవాదం బలపడకూడదు, దేశ ప్రజల్లో సాంస్కృతిక చైతన్యం రాకూడదు. 21వ శతాబ్దంలో కూడా దేశం ఒక కుటుంబ పాలనలో నలిగిపోతూనే వుండాలి, వెనుకబడి పోతూనే వుండాలి.
ఆరెస్సెస్ ప్రవచించే హిందూ సాంస్కృతిక జాతీయ భావనలతో ఏకీభవించే భా.జ.పా. దేశంలో పది, పనె్నండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటాన్ని సహించలేకపోతున్న ఈ అహంకారపూరిత మేధావులది నిజమైన అసహనం. దేశ ప్రజల్లోకాదు. ఈ నకిలీ మేధావుల మనసులో వున్నదే అసహనం. దాద్రీలో ముస్లింని ఎవరో చంపితే, పరామర్శించేందుకు కేజ్రీవాల్ మొదలు రాహుల్‌గాంధీ వరకు ‘క్యూ’కట్టారు. కర్ణాటకలో హత్యచేయబడిన హిందూ సోదరుడిని చూసేందుకు, కుటుంబాన్ని ఓదార్చేందుకు ఒక్క రాజకీయ నాయకుడూ రాలేదే. ఎందుకు?
‘అసహనం’ పేరుతో జరుగుతున్న ఈ ‘కుట్రల నాటకాన్ని’ నడిపిస్తున్నది నాలుగు సంస్థలు. 1. ప్రోగ్రెసివ్ రైటర్స్ ఆర్గనైజేషన్ (ఇది సిపిఐ యొక్క అనుబంధ సంస్థ) 2. జనవాదీ లేఖక్ సంఘ్(ఇది సిపిఐ (ఎమ్)యొక్క అనుబంధ సంస్థ) 3. జనసంస్కృతీ మంచ్ (ఇది సిపిఐ (ఎమ్‌ఎల్) యొక్క అనుబంధ సంస్థ 4. సహమత్ (ఇది సఫ్దార్ హష్మీ మెమోరియల్ ట్రస్టుద్వారా నడపబడుతుంటుంది). వీళ్ళకు కమ్యూనిస్టులు, కుహనా లౌకికవాదులతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. విచిత్రమేమంటే సఫ్దార్ హష్మీ అనే కమ్యూనిస్టు, ‘జననాట్యమంచ్’అనే సంస్థను స్థాపించాడు. ఆయన్ను హత్యచేసింది కాంగ్రెస్‌వాళ్ళే. ఈనాడు రెచ్చిపోతున్న సెక్యులర్ గొంతులు ఆనాడు చచ్చిపోయాయా?
అశోక్ వాజ్‌పేయి అనే మరో మేధావి ఈ అసహనపు డ్రామాలో ప్రముఖ పాత్రధారి. ఈయన గురించిన సమాచారం చూడండి. 1984లో మధ్యప్రదేశ్, భోపాల్ గ్యాస్ లీక్ అయిన విషాదం మనకు తెలిసిందే. అది జరిగింది డిసెంబరు 3వ తేదీన. అదే రోజున ఈ అశోక్ వాజ్‌పేయి ‘అంతర్జాతీయ హిందీ కవితాసమ్మేళనం’ ఒకటి నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషాదం జరిగి వందలాది మంది మరణించారు కాబట్టి ‘సమ్మేళనాన్ని వాయిదావేసుకోండని’ అనేకమంది విజ్ఞప్తిచేస్తే అశోక్‌వాజ్‌పేయి ఇలా బదులిచ్చాడట. ‘చనిపోయిన వారితోపాటు రచయితలూ చనిపోవాల్సిన పనిలేదు.’’ ఎంత సహనం!

- పి.సతీష్