మెయన్ ఫీచర్

కాంగ్రెస్‌కు మోయలేని బ్యాగేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ గత వైఫల్యాలు ఇప్పటికీ వెన్నాడుతూ ముందుకు పోలేకుండా కుంగదీస్తుంటే ఆ పరిస్థితిని ఇంగ్లీషులో ‘బ్యాగేజీ’ అంటారని మనకు తెలుసు. ఆ వైఫల్యాలు వర్తమానంలో గుదిబండలుగా మారటమన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రయత్నించినా ముందుకు వెళ్లలేకపోవటానికి గల పలు కారణాల్లో అటువంటి బ్యాగేజీ ఒకటి. మామూలుగానైతే ఈ మాట టిడిపికి కూడా వర్తించాలి. కానీ ఆ ప్రస్తావన తీసుకురాకపోవడానకి గల కారణం ఆ రాష్ట్రంలో ఆ పార్టీ పని ఇక అయిపోయినట్లే. కనుక అసాధారణమైనదేదో జరిగితే తప్ప ఆ పార్టీ గురించి మాట్లాడుకోనక్కరలేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో తాము స్వయంగా అంచనా వేసిన దానికి మించి పరాజయం పాలైన ఆ పార్టీ నాయకులు, అక్కడినుంచి నెమ్మదిగా ముందుకు పోయేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కాని అది జరగకపోగా ఒక్కొక్క అడుగు వెనుకకు పోతున్నట్లు వారికే అర్థమవుతోంది. తమకు దిక్కుతోచని స్థితి ఏర్పడుతున్నది అందువల్లనే.
ఇందుకు పలు కారణాలున్నాయి. వాటి లో అంతగా చర్చకు రానిది ఆ పార్టీ వెనుకటి బ్యాగేజ్. ఉదాహరణకు ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతన్నది, మామూలుగా చూస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలుచుకోవాలి. అక్కడ ఇంతవరకు కాంగ్రెస్ పదకొండుసార్లు, కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) మూడుసార్లు గెలిచాయి. టిడిపికి ఎప్పుడూ అవకాశం రాలేదు. టిఆర్‌ఎస్ ఉనికి కూడా దాదాపు శూన్యం. బిజెపి పరిస్థితి కూడా అంతే. ఆ స్థానం ఖాళీ అయింది, కాంగ్రెస్ సభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి వల్ల. ఆయన కుటుంబానికి అక్కడ మంచి ఆధిపత్యం ఉన్నది. మంత్రిగా పనిచేసిన తనకు వ్యక్తిగతంగాను మంచిపేరే ఉందంటున్నారు. అటువంటి స్థితిలో, సానుభూతి కూడా తోడై ఆయన భార్య తేలికగా గెలవాలి. ఇది చాలదన్నట్టు, చిత్రమైన రీతిలో టిడిడి కూడా వీరికి మద్దతిస్తున్నందున గెలుపు నల్లేరుపై బండి నడక కావలసింది. కాని వీరెంతగా ప్రచారపు హోరెడ్తించినా గెలుపు అనుమానాస్పదంగానే తోస్తున్నది. టిఆర్‌ఎస్‌కే విజయావకావాలు కన్పిస్తున్నాయి. అందుకు కారణం అది అధికారపక్షం కావటమా? అభ్యర్థి ప్రస్తుతం మంత్రి కూడా అయిన తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగతంగా కాకలు తీరిన అనుభవజ్ఞుడు, ధనికుడు కావడమా? తన పక్షాన కొందరు మంత్రులతో సహా పలువురు సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు దాదాపు మూడు వారాలపాటు జిల్లాలో మకాం వేసి నిరంతరం ప్రచారం జరపడమా?
ఇవన్నీ ముఖ్యమైనవనడంలో సందేహం లేదు. కాని అవిమాత్రమే విజయానికి సరిపోగలవని చెప్పలేం. యథాతథంగానే భారతదేశపు ఓటర్ల విజ్ఞత, పరిణితి పెరుగుతున్నాయి. వారిదృష్టిలో అభ్యర్థులకు గల ఇటువంటి అర్హతలు, అనర్హతలు ఏమిటనే దానితో పాటు, తమకు గల గతకాలపు అనుభవాలు ఏమిటి, భవిష్యత్తు పరిస్థితి ఏమిటనే ఆలోచనలు ఓటర్లు బాగా చేస్తున్నారు. ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న మన ప్రజాస్వామ్యాన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఎంత అధ్వాన్నంగా మార్చుతున్నా, భవిష్యత్‌కు సంబంధించని అంశాలను నిలుపుతున్నది ఈవిధమైన ఓటర్ల పరిణితి ఒక్కటే. అటువంటి స్థితిలో పాలేరులో ఒక అదనపు అంశం ఓటర్లపై కీలకమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు కనిపిస్తున్నది. అది ఇంతవరకు మొత్తం పధ్నాలుగు పర్యాయాలు గెలిచిన పార్టీలు ప్రజలకోసం పనిచేసి ఉంటే పాలేరు ఇంత వెనుకబడి ఎందుకు ఉందన్న టిఆర్‌ఎస్ సూటి ప్రశ్న. పైన అన్నట్లు, ఆ పధ్నాలుగు సార్లలో కాంగ్రెస్ పదకొండు సార్లు గెలిచింది. కాని జరిగింది స్వల్పం. మరొక మాటలో చెప్పాలంటే చేసింది కొద్ది. మనం బ్యాగేజ్ అంటున్నది సరిగ్గా దీనినే.
టిఆర్‌ఎస్ లేవనెత్తుతున్న ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నుంచి సమాధానం లేదు. ప్రజలకు కావలసింది ఈ జవాబు. అది వారి జీవితాలతో ముడివడి ఉన్న విషయం. అదే ప్రశ్నను ఆధారం చేసుకుంటున్న టిఆర్‌ఎస్, దానిని తార్కికంగా ముందుకు తీసుకుపోతూ, కాంగ్రెస్ ఇంతవరకు చేయని అభివృద్ధిని ఇప్పుడు తాము చేసి చూపుతామంటున్నది. ఆ దిశలో, గత రెండేళ్లలో రాష్టస్థ్రాయిలో ఫలానా పనులు చేసామని, ఖమ్మం పట్టణంలో ఫలానావి చేసామని, రెండు ఎత్తిపోతల పథకాలు సహా జిల్లాలో ఇంకా ఫలానావి చేస్తున్నామని జాబితా చెబుతున్నది. ‘‘తకాలం ఏమీ జరగలే’’దంటున్న నేపథ్యంలో, అది కాంగ్రెస్‌కు బ్యాగేజీగా మారగా,‘‘్ఫలానావన్నీ చేస్తున్నాము, చేస్తా’’ మనే టిఆర్‌ఎస్ ప్రచారం సహజంగానే ఆదరణ పొందుతున్నది. ఇది ఆపార్టీకి వాస్తవంగానే విజయాన్ని తెచ్చిపెట్టేదీ లేనిదీ కొద్ది రోజులలోనే తేలుతుంది గాని, ప్రస్తుతానికి గుర్తించవలసింది కాంగ్రెస్ బ్యాగేజీ విషయం. అది ఊహాగానాలతో అవసరం లేకుండా కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం.
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన వివిధ ఎన్నికలు, ఉప ఎన్నికలలోని కొన్నింటిలో కూడా ఈ బ్యాగేజీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వాటిలో ప్రముఖంగా పేర్కొనదగ్గది, పాలేరు వంటి వర్గీకరణలోకి రాగలది, మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక. ఈ రెండింటి మధ్య కొన్ని పోలికలున్నాయి. నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్‌కు మొదటి నుంచి కంచుకోట. టిఆర్‌ఎస్ ఉనికి నామమాత్రం. మృతుని కుటుంబ సభ్యుడు అభ్యర్థి అయినందున సానుభూతి. టిఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకత వల్ల ఇతర ప్రతిపక్షాలు పాలేరులో వలె బహిరంగంగా కాకపోయినా చాటుగా కాంగ్రెస్‌కోసం పనిచేశాయి. అక్కడ ప్రచారంలోనూ సరిగ్గా ఈ అంశమే ఓటర్లపై కీల క ప్రభావాన్ని చూపింది. ఆ అంశం పేరు బ్యాగేజ్. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల వంటి పక్కన ఉంచుదాం. వాటిలోనూ టిఆర్‌స్‌కు లభించింది ఘనవిజయం. ఇతరులు చవిచూసింది ఘన పరాజయం అయినప్పటికీ, అక్కడ బ్యాగేజ్‌తో పాటు ఇతర అంశాలు కూడా పనిచేసాయి.
నారాయణ్‌ఖేడ్, పాలేరు వేరే వర్గీకరణలోకి వస్తాయి. అవి పూర్తి గ్రామీణం. వెనకబడినవి. కాంగ్రెస్‌కు దుర్భేద్య దుర్గాలు. టిఆర్‌ఎస్ గాలులు 2014లోనూ వీచనివి. అంతకుముందు పదిహేనేళ్ల తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్నవి. 1969- 70లోనూ ఉద్యమం జరగనివి. అటువంటివి సిట్టింగ్ సభ్యుల మృతి కారణంగా సానుభూతి మేఘాలను కప్పుకొని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ హైదరాబాద్ సహా మరెక్కడా ఏర్పడి లేవు. అయినప్పటికీ నారాయణ్‌ఖేడ్‌లో దిగ్విజయం సాధించిన టిఆర్‌ఎస్, ఇప్పుడు పాలేరులో అదేదిశగా వెడుతున్నట్టు కనిపిస్తున్నది. ఇటువంటి ఒక భిన్న వర్గీకరణలోకి వచ్చే రెండు నియోజకవర్గాలలో ఈ స్థితికి కారణమేంటనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు రావచ్చు. కాని వాటిలో గమనార్హమైనది కాంగ్రెస్ బ్యాగేజ్. ఒకవేళ ఈ బ్యాగేజ్ లేనట్లయితే రెండు చోట్ల అటు కాంగ్రెస్, ఇటు టిఆర్‌ఎస్ ప్రచార సరళిలో గణనీయమైన మార్పులుండేవి. తాము చేసింది చెప్పడం కాంగ్రెస్‌కు గొప్ప బాలన్నిచ్చేది. టిఆర్‌ఎస్‌కు తాము భవిష్యత్తులో చేయగలదేమిటో చెప్పేందుకు తప్ప, గతంలో ఏమీ చేయలేదంటూ కాంగ్రెస్‌ను నిలదీసే అవకాశం ఉండేది కాదు. అయినప్పటికీ టిఆర్‌ఎస్ గెలిచి ఉండేదేమో తెలియదు. కాని కాంగ్రెస్ బ్యాగేజ్ వల్ల లభించిన అదనపు సానుకూలత ఉండేది కాదు. ఆ కారంగా, ఒకవేళ గెలిచినా ఆధిక్యత తగ్గేదేమో.
ఈ తరహా విశే్లషణకు పాలేరు ఫలితం తర్వాత మరింత స్పష్టత రాగలదన్నది అట్లుంచితే, ఒక మాట మాత్రం ఇప్పుడే చెప్పుకోవాలి. ఈ బ్యాగేజ్ అన్నది కాంగ్రెస్‌ను బహుశా 2019 ఎన్నికల వరకు వెన్నాడి వేధిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత పాతబడుతుంది. కాంగ్రెస్ ఇన్ని దశాబ్దాలు పాలించి ఏం చేసిందనే ప్రశ్నకు ప్రజల ఆవెనుక విలువివ్వరు. ఇంకా చెప్పాలంటే, 2019 ఎన్నికల సమయానికే దాని ప్రాముఖ్యత గణనీయంగా తగ్గి, టిఆర్‌ఎస్ ప్రభుత్వం తాను పాలించిన ఐదేళ్లలో ఏమి చేసిందన్నది ముందుకు వస్తుంది. కాంగ్రెస్, టిడిపిలు పాలించిన అనేక దశాబ్దాలతో పోల్చినప్పుడు టిఆర్‌ఎస్ ఐదేళ్లు స్వల్పమే. కాని ప్రజలు కొన్ని విషయాలలో మరీ అంత ఉదారంగా ఆలోచించరు. ఒకటి- రెండు-మూడు-నాలుగేళ్లు కావచ్చు. అవు ను కూడా. కాని అయిదేళ్లు ముగిసిన వెనుక కాదు. అప్పటికి పరిస్థితులు, జీవితాలు చాలా గొప్పగా కాకున్నా చెప్పుకోదగినంత మారినట్లు, మారుతున్నట్లు తోచాలి. లేనిపక్షంలో బ్యాగేజ్ అన్నది వైఫల్యం అనే కొత్త పేరుతో టిఆర్‌ఎస్‌ను బాధిస్తుంది.
దీనంతటిలో కాంగ్రెస్‌కు కొన్ని పాఠాలున్నాయి. అన్నింటికన్నా ముందు వారు తమ కు ఒక బ్యాగేజీ ఉందనే మాటను అంగీకరించాలి. ఆ బ్యాగేజీలో ఏమేమి ఉన్నాయో నిజాయతీగా గుర్తించాలి. దానిపై టిఆర్‌ఎస్ నుంచి ప్రజలనుంచి ప్రశ్నలు ఎదురైతే వారికి ఏమి చెప్పాలో ఒక స్పష్టమైన అవగాహనకు రావాలి. ప్రజల ముందు నిజాలను ఒప్పుకొని ఇకముందు అటువంటి తప్పులు చేయబోమని, చెప్పి మెప్పించగలగాలి. ఇంతకన్నా బ్యాగేజీని వదిలించుకునేందుకు మార్గాంతరం లేదు. అట్లా కాక, ఎంతసేపూ ప్రభుత్వంపై, అధికారపక్షంపై గ్రామఫోను రికార్డు విమర్శలు, ఆరోపణల వల్ల ప్రజలను తమవైపు తిప్పుకోగలది ఏమీ ఉండదు. నిజమైన తప్పులను ఎత్తిచూపవద్దని కాదు. ఆపని చేస్తే ప్రజలు హర్షిస్తారు. కాని కాంగ్రెస్ చేస్తున్నది అది కానందువల్ల ఆ ఫలితం దక్కకపోగా, తమ బ్యాగేజ్ గురించి టిఆర్‌ఎస్ వేసే ప్రశ్నలు జవాబు చెప్పలేనివిగా తయారవుతున్నాయి. ప్రజల చేత కూడా నిజమే అనిపిస్తున్నాయి. ఈవిధంగా ఒకవైపు తమ అర్థంపర్థం లేదనిపించే విమర్శలు, మరొకవైపు ప్రజలకు కూడా నిజమనిపించే బ్యాగేజీ ప్రశ్నలు కలిసి టిఆర్‌ఎస్‌కు బాగా కలిసివస్తున్నాయి. ప్రభు త్వం మంచి పనులు చేస్తున్నట్లు భావించే వారి సంఖ్య ఎక్కువవుతుండడం కాంగ్రెస్ సమస్యలను పెంచుతున్నది.
ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా సరైన అవగాహనను పార్టీకి కల్పించి, వ్యూహరచన చేసి, ఐక్యతను సాధించి, ముందుకు పోగల నాయకత్వం ఇక్కడ లేక, అటువంటి మార్గదర్శకత్వాన్ని ఏఐసిసి సైతం చేయలేకుండా ఉన్నప్పుడు, బ్యాగేజ్‌ను తొలగించుకోవడమనే పని వారు చేయగలరా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)