సంపాదకీయం

‘ఉగ్ర’నిజం నిగ్గుతేలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్‌లోని గోధ్రాలో 2002, ఫిబ్రవరి 7వ తేదీన రైలుపెట్టెను దగ్ధం చేసిన జిహాదీ ఉగ్రవాదుల్లో అతి భయంకరుడైన ఫరూక్ మొహమ్మద్ భానా పట్టుబడడం నేరపరిశోధనలో ‘‘గొప్ప ముందడుగు’’. నత్తలతో నడకలో పోటీ పడుతున్న మన నేర విచారణ, పరిశోధన సంస్థల తీరుతన్నులకు ఇది మరో ఉదాహరణ. గోద్రాలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకారులు ఆ రైలుపెట్టెను దగ్ధం చేసిన ఫలితంగా యాబయి తొమ్మిదిమంది రామభక్తి కరసేవకులు కాలి బూడిదైపోయారు. మహిళలు పిల్లలు కూడా సజీవదహనం కావడం దేశ విదేశాల్లో సంచలనం సృష్టించింది. దిగ్భ్రాంతిని కలిగించింది. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామజన్మభూమి నుంచి తిరిగి వస్తుండిన ఈ కరసేవకులను అలా బీభత్స విషాగ్ని జ్వాలలకు ఆహుతి చేయగలిగిన నరరూప రాక్షసుడు పదునాలుగేళ్ల పాటు తప్పించుకొని తిరిగాడు. గత ఏడు సంవత్సరాలుగా ఈ జిహాదీ హంతకుడు ముంబయిలోనే జీవించగలిగాడు హాయిగా..ప్రభుత్వ నిర్వాహకుల నిర్లక్ష్యానికి, నిఘా విభాగాలు నిద్దుర పోవడానికి, నేరస్థుల నిర్భయత్వానికి ఇంతకంటె హేయమైన నిదర్శనాలు బయట దొరకవు. పదునాలుగేళ్ల పాటు ఈ టెర్రరిస్టు దొరకలేదు. నేరస్థుల కదలికలను సకాలంలో పసికట్టలేకపోవడం ఒక్కటే కాదు, నేరస్థులను నిర్దోషులుగా నిర్దోషులను నేరస్థులుగా చిత్రీకరించడానికి సమాంతర పరిశోధక విన్యాసాలు జరిగిపోయాయి. హైదరాబాద్ లోని మక్కా మజీద్ పేలుళ్లు సంభవించిన తరువాత తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి. నేరస్థులెవరో ఇంతవరకు ఇతమిద్ధంగా తెలియలేదు. మాలేగావ్ పేలుళ్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో జరిపిన పేలుళ్లు- ఇలాంటి బీభత్స కృత్యాలను నిర్వహించింది పాకిస్తాన్ ప్రభుత్వపు దళారీలన్నది అధికాధిక ప్రజల విశ్వాసం..కానీ నిర్దోషులను నిందితులుగా పేర్కొన్నట్టు, ఇప్పుడు బయటపడుతోంది..
జిహాదీ ఉగ్రవాద చర్యల గురించి జరుగుతున్న పరిశోధనలు సుదీర్ఘ ప్రహసనాలుగా మారుతుండడానికి ప్రధాన కారణం ప్రభుత్వం రాజకీయ నిర్వాహకుల వ్యూహం..అధికార రాజకీయవేత్తలు అడుగడుగునా అడ్డుతగలడం వల్ల మాత్రమే, పరిశోధన దశాబ్దుల తరబడి ఇలా నత్తనడక నడుస్తోంది. ఉగ్రవాదులను మతాలకు కులాలకు భాషలకు ప్రాంతాలకు అంటగట్టరాదన్న నీతులను వల్లించడం రాజకీయ వేత్తల వ్యూహంలో భాగం. కానీ హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించడానికి తద్వారా జిహాదీలను హిందువులను ఒకేగాట కట్టడానికి అధికార రాజకీయ వేత్తలు ఏళ్ల తరబడి యత్నిస్తున్నారు. ఇలా లేని సమతుల్యాన్ని సాధించడం ద్వారా ఇస్లాం మతస్థుల వోట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి ఈ దేశంలో అనేక రాజకీయ పక్షాలు ఏళ్ల తరబడి కృషి చేస్తున్నాయి. కేంద్రంలో 2004వ 2014వ సంవత్సరాల మధ్య పదేళ్లు సాగిన కాంగ్రెస్ నాయకత్వంలో ఐక్య ప్రగతి కూటమి ఈ వైపరీత్యానికి పరాకాష్ఠ. టెర్రరిస్టులు ఏదో ఒక మతంలో పుడుతుంటారు. కానీ టెర్రరిస్టుల కలాపాలు ఆ మతంలోని అధికాధిక ప్రజలకు సంబంధం లేదు. ఇతర మతాల ప్రజల వలెనే టెర్రరిస్టులకు చెందిన మతం ప్రజలు కూడ ఈ టెర్రరిస్టులను వ్యతిరేకిస్తున్నారు. కానీ రాజకీయ వాదులకు మాత్రం ఈ విశ్వాసం లేదు. అందువల్లనే జిహాదీ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించినట్టయితే ఇస్లాం మతస్థులు బాధపడతారని తద్వారా ఇస్లాం మతస్థులు తమకు గంపగుత్తగా వోట్లు వేయబోరని అధికాధిక రాజకీయ వేత్తల భయం. అందువల్ల జిహదీ ఉగ్రవాదం సమస్య తీవ్రతను తగ్గించి చూపించడానికి 2014 వరకు సాగిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది.
ఇలా యత్నించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖను నిర్వహించిన శివరాజ్ పాటిల్, పళనియప్పన్ చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే వంటి వారు నిజానికి శాసన బద్ధులై జీవిస్తున్న అధికాధిక ఇస్లాం మతస్థులను అవమానించారు. వారి జాతీయతా నిష్ఠను అనుమానించారు. జిహాదీ బీభత్సకారులను కఠినంగా దండించడం వల్ల సామాన్య ఇస్లాం మతస్థులు నొచ్చుకోరు...ఇతర మతాల సామాన్య ప్రజల వలెనే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. కానీ నొచ్చుకుంటారని భ్రమించడం తదనుగుణంగా జిహాదీ నేరస్థులను అమాయకులుగా చిత్రీకరించడానికి యత్నించడం రాజకీయవేత్తలు ఇస్లాం మతస్థులకు కలిగించిన అవమానం. ఈ భ్రమల కారణంగానే గోద్రాలో రైలుపెట్టెకు నిప్పు పెట్టిన దుండగుడు ఫరూక్ మొహమ్మద్ భానా అనే వాడిని పసికట్టి పట్టుకొనడంలో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లు నిర్లక్ష్యం వహించింది. ఈ భ్రమల కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సకారిణి ఇష్రాత్ జహాన్‌ను అమాయకురాలిగా చిత్రీకరించేందుకు కుట్ర జరిగింది. హిందువులలో కూడ బీభత్స మతోన్మాద హంతకులున్నారని నిరూపించే కుట్ర జరిగింది. మాలేగావ్ బీభత్సకాండతోను, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుడు ఘటనలోను, అసీమానంద స్వామిని, ప్రజ్ఞాసాధ్విని ఇరికించేందుకు జరిగిన యత్నం ఈ చిందబరజాలంలో భాగమని ఇటీవల వెల్లడైన సాక్ష్యాధారాలు ధ్రువపరిచాయి. ఈ క్రమంలోనే మక్కామసీదు పేలుళ్ల ఘటనలో లోకేశ్ శర్మ, దేవేందర్ గుప్త వంటివారిని ఇరికించేశారేమో. అసీమానందస్వామికి సైతం మక్కామసీదు పేలుళ్లతో సంబంధం ఉన్నట్టు కొంతకాలం ప్రచారం జరిగింది. స్థానిక పోలీసులు జరిపిన దర్యాప్తులలో జరిగిన నిర్ధారణలు, సిబిఐ దర్యాప్తు ఫలితంగా మారిపోయాయి. సిబిఐ వారి దర్యాప్తు ఫలితాలను నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్‌ఐఏ-తిరస్కరిస్తోంది.
లోకేశ్ శర్మ, దేవేందర్ గుప్త వంటి వారు హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన పేలుళ్ళలో మాత్రమే కాదు, మాలేగావ్ పేలుళ్లలో కూడ నిందితులు. మాలేగావ్‌లో పేలుళ్లు జరిపించింది, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ముఠాలన్న విషయంపై ఇప్పుడు జాతీయ పరిశోధక మండలి దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగానే మాలేగావ్ పేలుళ్లలో కొంతవరకు నిందితులుగా చిత్రహింసలకు గురైన ప్రజ్ఞాసాధ్వి, లోకేశ్ శర్మ వంటి వారు నిర్దోషులని జాతీయ పరిశోధక మండలి-ఎన్‌ఐఏ-తేల్చింది. ముంబయి ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఐఏ దాఖలు చేసిన అభియోగపత్రం ఇందుకు సాక్ష్యం. అందువల్ల మక్కా మసీదు బీభత్స ఘటనలో కూడ లోకేశ్ శర్మ వంటి వారిని అన్యాయంగా ఇరికించారన్న అనుమానం కూడ కలగడం సహజం. గోద్రాలో రైలుపెట్టెను దుండగులు తగులబెట్టలేదని, ప్రమాద వశాత్తు అది దగ్ధమైందని నిరూపించడానికి విఫలయత్నం చేసిన చరిత్ర 2004వ సంవత్సరం నుండి పదేళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కూటమికి ఉంది. మక్కా మసీదు పేలుళ్లు జరిపించి జిహాదీ ఉగ్రవాదులన్నది మొదట జరిపిన ప్రచారం. లష్కర్ ఏ తయ్యబా, హుజి వంటి పాకిస్తానీ, బంగ్లాదేశీ ముఠాల వారు ఈ బీభత్సకాండ జరిపినట్టు అభియోగాలు నమోదయ్యాయి. కానీ ఈ అభియోగాలు న్యాయస్థానంలో ధ్రువపడలేదు. ఆ తరువాతనే మాలేగావ్ పేలుళ్ల నిందితులతో మక్కా మసీదు పేలుళ్లను ముడిపెట్టారు..