ఉత్తరాయణం

కుహనా స్నేహాలతో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి జీవితంలో స్నేహం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అది నేడు చాలావరకు కలుషితమైపోయింది. నాడు అవసరానికి అదుకునే వారు స్నేహితుడు, నేడు అవసరానికి వాడుకొని వదిలేసేవాడు స్నేహితుడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్వార్థంతో స్నేహం చేస్తున్నారే తప్ప నిజమైన స్నేహం కనుచూపుమేరలో కన్పించడం లేదన్నది అక్షరసత్యం. ముందు తీయగా మాట్లాడి ఆ తర్వాత అసలు రూపం చూపిస్తారు. చైన్ లింక్ బిజినెస్, టప్పర్‌వేర్ బిజనెస్ అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి ఉచ్చులోకి దింపి మనోవ్యధకు గురిచేస్తారు. అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త.
- కురువ శ్రీనివాసులు, సికిందరాబాద్
రాముని అడుగుజాడలే శరణ్యం
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, భక్తజన సంరక్షణార్థం ఈ భువిపై ఎత్తిన ఏడవ అవతారం శ్రీరామచంద్రుడు. మానవ జీవితంయొక్క ప్రాముఖ్యత, వైశిష్ట్యం, తన జీవిత ప్రయాణంలో అవలంబించాల్సిన ప్రమాణాలు, ధర్మాలు, చేయవల్సిన కర్మలను, తన చర్యల ద్వారా చేసి చూపించి ఈ మానవ సమాజానికి ఒకదారి, దిశానిర్దేశం చేసిన మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే సతి అని చాటిన రఘువంశ చక్రవర్తి మన రామయ్య. ఒక కొడుకుగా, భర్తగా, సోదరుడిగా, గురువుగా, స్నేహితుడిగా, ప్రజాసంక్షేమం పట్ల నిరంతరం కృషిచేసే చక్రవర్తిగా, అర్హులైన భక్తులను కేవలం రామనామ స్మరణ ద్వారా అనుగ్రహించి, మోక్షాన్ని ప్రసాదించే భగవంతునిగా ఆయన చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకం. శ్రీరామ ప్రభువు జీవితం ఒక అద్భుత సందేశం. యావత్ భారతీయత, సనాతన ధర్మం, సత్యసంధత వంటి సద్గుణాలు మూర్త్భీవించిన శ్రీరామచంద్రుని అడుగుజాడలలో నడవడం యావత్ మానవాళికి ఎంతో శ్రేష్టం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య
ముందుకు నడిపించే నాయకులు లేక పోవడం ఒక సమస్యగా చెప్పవచ్చు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసినా, ఆమె వల్లనే తెలంగాణ వచ్చిందని గట్టిగా ప్రచారం చేయగల నాయకులు లేకపోవడం కాంగ్రెస్‌కు శాపంగా మారిం ది. పటిష్టమైన నాయకత్వం లేకపోవడం వల్ల ప్రభుత్వం ఎప్పుడైనా తప్పటడుగులు వేసినప్పుడు గట్టిగా నిలదీసే నాయకత్వం కొరవడటం నిజంగా ప్రజాస్వామ్యానికి శాపం. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది.
- అయినం రఘురామారావు, ఖమ్మం

ఆక్రమణలో ఆలయ భూములు
సింహాచలం దేవస్థాన భూములను ఆక్రమించుకున్న వారిలో కొందరికి కోర్టు హుకుం జారీ చేస్తేకాని కదలిక రాలేదు. పంచగ్రామాల్లో కొందరు భూమిని ఆక్రమించుకొని ఉండవచ్చు. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా స్థలం ఉన్నా క్రయ విక్రయాలకు భయపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పంచగ్రామాల పరిస్థితిని తక్షణమే చక్కదిద్దాలి. దేవాలయ భూములు ఆక్రమణకు గురికావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయ.
-పట్టిసపు శేషగిరిరావు, వైజాగ్