సంపాదకీయం

‘చక్కెర’ పన్ను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కెర పదార్థాలను మితిమీరి మెక్కుతున్న వారికి చికిత్స చేయడానికై బ్రిటన్ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. వచ్చే ఏడాది నుంచి శీతల పానీయాలు-సాఫ్ట్ డ్రింక్స్- ఐస్‌క్రీములు, కొవ్వును పెంచుతున్న చాక్లెట్లు తదితర కృత్రిమ మధుర పదార్థాలపై చక్కెర పన్నును విధించాలని బ్రిటన్ ప్రభుత్వం వివరణ ఇచ్చిందట. చక్కెరను మితిమీరి మెక్కడం వల్లనే బుడుతలు, బుజ్జాయిలు లావెక్కిపోతున్నారన్నది అంతర్జాతీయంగా ధ్రువపడిన వాస్తవం. సంవత్సరం నిండిన చిన్న పిల్లలందరికీ శీతల పానీయాలపేర్లు, చాక్లెట్ల పేర్లు, ఐస్‌క్రీమ్‌లలోని వైవిధ్య నామాలు పరిచయమైపోతున్నాయి. ఈ పానీయాలను తాగడం వల్ల, ఐస్‌క్రీమ్‌ను చాక్లెట్లను నిరంతరం ఆరగించడం వల్ల చక్కెర శాతం మితిమీరిన రీతిలో వారినోళ్లద్వారా పొట్టలలోకి చేరిపోతోంది. ఫలితంగా చిన్నపిల్లలు మితిమీరి లావెక్కుతున్నారు. అందువల్ల శీతల పానీయాలపై చక్కెరపన్నును విధించాలన్న బ్రిటిష్ ప్రభుత్వం వారి నిర్ణయం అంతర్జాతీయంగా ప్రజల జీవన పద్ధతులను సరికొత్త చర్చ జరగడానికి నేపథ్యం. పెప్సీ శీతల ద్రవం ఉత్పత్తులను పెంచడానికి మనదేశంలో ఇతోధికంగా కృషి చేస్తున్న ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు పాఠం నేర్చుకోదగిన పరిణామం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద పెప్సీ శీతల పానీయ ఉత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీనగరం-శ్రీసిటీ-లో రెండేళ్ల క్రితం ప్రారంభమయినట్టు ప్రచారమైంది. అందువల్ల మనదేశంలోని వారే ఈ పెప్పీ పానీయాన్ని ఇంకా కోకోకోలా తదితర రసాయన మధుర ద్రవాలను ఎక్కువగా గ్రోలుతున్నారన్నది అంతర్జాతీయ వాణిజ్య నిర్ధారణ. ప్రపంచీకరణ మొదలైన తరువాత మనదేశం పెద్ద సంతగా మారిపోయింది. ఐరోపా, అమెరికా, చైనా,దక్షిణ కొరియా, జపాన్ వంటి చోట్ల నుండి వస్తున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఈ సంతలో చొరబడిపోయి తమ దేశాలలో అమ్ముడు పోని వస్తువులను ఇక్కడ భారీగా అమ్ముకొని సొమ్మును తమ దేశాలకు తరలించుకొని పోతున్నాయి. ఇలా అమ్ముడు పోతున్న విదేశాల సరకులో అతిప్రధానమైన విదేశీయ పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు...ఇంకా అనేక రకాల అనవసరమైన తినుబండారాలు! వీటిలోకి కృత్రిమమైన రసాయన మాధుర్యం-యాడెడ్ సుగర్- చిన్న పిల్లల నోళ్లకు మరింత రుచిగా ఉంటోంది. రుచి మరిగిన అమ్మమ్మలు, నాయనమ్మలు తాతయ్యలు తీరిక వేళల్లో ఈ పానీయాలను సేవిస్తున్నారు. పిల్లలకు అలవాటు చేయిస్తున్నారు. ఒకటవ ఏడు నిండిన పిల్లలలో ముప్పయి ఐదు శాతానికి పైగా లావెక్కి పోవడానికి శీతల పానీయాలు కారణం. అందువల్ల చక్కెర పన్ను విధించాలన్న బ్రిటన్ చర్య మన ప్రభుత్వాలకు సైతం అనుసరణీయం. కానీ మన ప్రభుత్వాలు పెట్టుబడులు రావన్న భయంతో విదేశీయ సంస్థలను నియంత్రించడానికి పూనుకోవడం లేదు.
పెప్సీ, కోకోకోలా వంటి పానీయాలలో మితిమీరిన చక్కెర చేరి ఉండడం బ్రిటన్ ప్రభుత్వానికి తెలిసినప్పుడు మనదేశంలోని ప్రభుత్వాలకు ఎందుకని తెలియడం లేదు? మన ప్రభుత్వాలకు ఈ ధ్యాస కూడా లేదు. చక్కెరను అధికాధికంగా పొట్టలలో చేర్చడం వల్ల పొట్టలు క్యాన్సర్ రోగపు పుట్టలుగా మారిపోతున్నాయని అనేకసార్లు అంతర్జాతీయ అధ్యయనంలో ధ్రువపడింది. ఆహారపు అలవాట్లను ఆధునిక కృత్రిమ నాగరిగత ఆవహించిపోవడం వల్ల మానవ జీవనం చిత్రవిచిత్ర వ్యాధులకు గురవుతోంది. జీవనశైలి మానవుల శారీరక బౌద్ధిక మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాక పరిసరాల సమతుల్య స్థితిని, ప్రకృతి హరిత పరిపుష్టిని కూడ ప్రభావితం చేస్తోంది. శీతల పానీయాలను ఐస్‌క్రీమ్‌లను సేవించే పద్ధతిని నియంత్రించాలని ఐరోపాలోని అనేక దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం ప్రతీక మాత్రమే. వంద మిల్లీలీటర్ల శీతల పానీయంలో ఐదుగ్రాముల వరకు మాత్రమే చక్కెర ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్దేశించిందట. అంటే లీటరు శీతల ద్రవంలో యాబయి గ్రాముల చక్కెర ఉండవచ్చునట. అంతకు మించిన పాళ్లలో శీతల పానీయాలలో చక్కెరను కలుపుతున్న సంస్థలపై చక్కెరపన్నును విధించాలని బ్రిటన్ నిర్ణయించింది. లీటర్ పానీయంలో ఎనబయి గ్రాములు, అంతకు మించి చక్కెరను చేర్చే సంస్థలపై మరింత ఎక్కువ శాతం పన్నును విధించాలని కూడ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వివిధ పానీయాల ఉత్పత్తి సంస్థలకు బ్రిటన్ ప్రభుత్వం తాకీదులను జారీ చేసిందట! రెండేళ్లలోగా చక్కెర నియమాలను అమలు జరిపి తీరాలన్నది ఈ తాకీదు...
బ్రిటిష్ ప్రభుత్వం విధించే ఆంక్షలు, నియంత్రణలు బ్రిటన్ వరకే పరిమితమన్నది పెప్సీ పానీయాన్ని ఉత్పత్తి చేస్తున్న బ్రిటన్ సంస్థ ధీమా. కోకోకోలావారు కూడ బ్రిటన్‌లో అమ్ముడయ్యే ఉత్పత్తులకు మాత్రమే చక్కెర నియమాలను పరిమితం చేయడానికి వ్యూహం రచిస్తోందట. పెప్సీ గత నాలుగేళ్లుగా బ్రిటన్‌లో అమ్ముడయే పానీయాలలో చక్కెర శాతాన్ని క్రమంగా తగ్గిస్తోందట. చిన్న పిల్లల్లో కొవ్వు పెరగడానికి శీతల పానీయాలు కారణం కాదని వాదిస్తున్న కోకోకోలా యాజమాన్యం, మరో వైపున పంచదారలేని-జీరో సుగర్- పానీయాన్ని ఉత్పత్తి చేయనున్నదట. ఇలా శర్కర రహిత పానీయం రుచిగా ఉండడానికి రసాయన మాధుర్యాలను వాడడం తప్పనిసరి. అయితే ఈ రసాయనాల సంగతిని పెప్సీ కాని, కోకోకోలా కాని బయటపెట్టడం లేదు. ఇది మొదటి వైపరీత్యం..బ్రిటన్ నియమాలు మనదేశంలో వర్తించవు కనుక పెప్సీ లోను కోకోకోలాను చక్కెరను మోతాదునకు మించి కలిపే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడ బ్రిటన్ తరహాలో చర్యలు తీసుకోవాలి. లేకుంటే మన పిల్లలు బరువును పెంచుతున్న చక్కెర పానీయాలు యధావిధిగా అమ్ముడుపోతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో గత ఏడాది అతిపెద్ద పెప్సీ ఉత్పత్తి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీ సిటీ వెళ్లారు. ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఇలా వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలకు, ఐదు నక్షత్రాల హోటళ్ల శంకుస్థాపనకు హాజరుకావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు దాపురించిన ప్రపంచీకరణ గ్రహణం. ఆర్భాటపు విదేశాల పెట్టుబడుల వల్ల జరుగుతున్న మహా ఉత్పత్తులు ఇవే...అక్కరలేని, రసాయన మాధుర్య పానీయాలు, సీసాల నీరు బంగాళాదుంపల చిప్స్, సేమ్యాలు, అప్పడాలు, మసాలాలు! ఉక్కు, సిమెంటు, విద్యుత్, పెట్రోలు, బొగ్గు, ఇంధన వాయువు వంటి వౌలిక ఉత్పత్తులు మాత్రమే పెరగడం లేదు. వానలో నానుతున్నప్పటికీ పెప్సీ తాగి తుమ్మడం ఆధునిక నాగరిగతా చిహ్నం. కొబ్బరి నీరు తాగి ఆరోగ్యంగా జీవించడం పాతబడిపోయింది.
శీతల పానీయాలలో క్రిమి సంహారక రసాయనాలు కలుపుతున్నారన్నది అందరికీ తెలిసిన విషయం. ఈ వైపరీత్యాన్ని నిరోధించడానికి కూడ మన ప్రభుత్వాలు యత్నించడం లేదు. వీతల పానీయాలలో పదార్దాలు ఏమేమి ఉన్నాయన్నది స్పష్టంగా తెలియాలని పదేళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారు ఆదేశించారు. అనేకసార్లు వివిధ న్యాయస్థానాలు శీతల పానీయాలలో జరుగుగుతున్న కల్తీ గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు..