సంపాదకీయం

ప్రాణం విలువలో తేడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవాస భారతీయులపై వివిధ విదేశాలలో నిరంతరం దాడులు జరగుతుండడం ప్రచారం కాని దశాబ్దుల వైపరీత్యం. మన ప్రభుత్వం ఈ దాడులను నిరోధించడానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇందుకు కారణం. భారతీయుల మానవాధికారాల ఉల్లంఘనను ఆయా విదేశాల ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయినా మన ప్రభుత్వ ప్రతినిధులు దౌత్యవేత్తలు సకాలంలో కలుగజేసుకోకపోవడం నిరోధించలేకపోవడం ప్రవాస భారతీయుల కడగండ్లు కొనసాగుతుండడానికి కారణం. ఇందుకు విరుద్ధంగా మనదేశంలో విదేశీయులపై ‘‘దాడులు జరిగినప్పుడల్లా’’ వారి ‘‘మానవాధికారాలకు విఘాతం కలిగినప్పుడల్లా’’ ఆయా దేశాలవారు మితిమీరిన ప్రతిక్రియకు పూనుకుంటూ ఉండటం నిరంతరం ఆవిష్కృతమవుతున్న దృశ్యాలు. మనదేశంలో ఒక విదేశీయునిపై దాడి జరిగిన వెంటనే ఆయా దేశాలలోని వందలాది భారతీయులపై దాడులు జరిగిపోతున్నాయి. విదేశాల ప్రభుత్వాలు, మనదేశంలోని ఆ దేశాల రాయబారులు అతిగా స్పందించడం భూనభోంతరాలు దద్దరిల్లేలాగా నిరసనలను నిగిడించడం దౌత్య సంప్రదాయమైపోయింది. సౌదీ అరేబియాలో ఒక భారతీయ మహిళను కొట్టి చంపినట్టు గత తొమ్మిదవ తేదీన బయటపడింది. మన ప్రభుత్వం గట్టిగా నిరసన తెలిపిన దాఖలాలు లేవు. కాంగో-జమయిర్-ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి చెందిన మసుండా కిటాడా అలివర్ అనే ఇరవైమూడేళ్ల యువకుడిని దక్షిణ ఢిల్లీలో దుండగులు కొట్టి చంపినట్టు ఇరవై మూడవ తేదీన వెల్లడైంది. ఈ హత్యకు నిరసనగా కాంగోలోను, ఇతర ఆఫ్రికా దేశాలలోను ప్రవాస భారతీయులపై భయంకరమైన దాడులు మొదలైపోయాయట. ఆఫ్రికాలో రెం డు కాంగో దేశాలున్నాయి. ఉబాంగ్ నదికి పశ్చిమంగా కాంగో గణతంత్ర రాజ్యం. -కాంగో రిపబ్లిక్- ఏర్పడివుంది. ఈ నదికి తూర్పుగా ఉన్న ‘జాయియర్’- కాంగో ప్రజాస్వామ్య గణరాజ్యం-కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్-గా అవతరించింది. ఢిల్లీలో హతుడైన యువకుడు ఈ రెండవ కాంగో పౌరుడు. ఈ కాంగో రాజధాని కిన్ షానా నగరంలోని భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయట. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు ఆయన భార్య గాయపడ్డారట. ఇరవై ఆరవతేదీన మన ప్రభుత్వం జరిపిన ఆఫ్రికా దినోత్సవానికి ఇదంతా వైరుధ్య నేపథ్యం. ఈ దినోత్సవాన్ని బహిష్కరించగలమని న్యూఢిల్లీలోని ఆఫ్రికా దేశాల రాయబారులు మన ప్రభుత్వాన్ని రెండు రోజులపాటు హెచ్చరించారు కూడ. మన ప్రభుత్వం పదేపదే నచ్చజెప్పిన తరువాత గురువారం నాటి ఉత్సవానికి ఈ రాయబారులు హాజరయ్యారు. కానీ బుధవారం తమ రాయబార కార్యాలయాల్లో జరుపవలసి ఉండిన ఆఫ్రికా ఉత్సవాలను రద్దుచేయడం ద్వారా ఈ ప్రతినిధులు మన ప్రభుత్వానికి పనిగట్టి నిరసన తెలిపారు.
కాంగో ‘జాతీయుని హత్య’కు నిరసనగా ఇలా ఆఫ్రికా కూటమి దేశాల ప్రతినిధులంతా మన ప్రభుత్వంపై విరుచుకొని పడడం వారి ఐక్యభావానికి జాతీయ ప్రయోజనాల నిష్ఠకు తార్కాణం. మనదేశంలో చదువుకొనడానికై ఇకపై తమ దేశాలనుండి విద్యార్థులు రాబోరని కూడా ఇరవై ఐదవ తేదీన ఈ ఆఫ్రికా దేశాల రాయబారులు హెచ్చరించారు. ఆఫ్రికాతో స్నేహ సంబంధాలను పెంచుకొనడం ద్వారా వర్థమాన దేశాల పరస్పర సహకార వ్యవస్థను సాకారం చేయడానికి మన ప్రభుత్వం యత్నిస్తోంది. ఆఫ్రికా దేశాలనుండి ఏనుగు దంతాలు, భారీగా చైనాకు దొంగరవాణా అవుతున్నాయి. చైనా ప్రభుత్వమే ఈ దొంగరవాణాను ప్రోత్సహిస్తోందన్న వాస్తవాలను ఆఫ్రికా దేశాల వారు గుర్తించారు. ఏనుగులను వన్యమృగాలను అడవులను హరిత శోభలను పరిరక్షించాలన్న తమ నిష్ఠను పునరుద్ఘాటించడానికై పట్టుబడిన ఏనుగు దంతాలను రాసులుగా పోసి తగులబెట్టడం ఇటీవలి పరిణామం. దంతాలను అమ్మబోమని ఏనుగుల వధను నిరోధిస్తామని ఈ ఆఫ్రికా దేశాలు ప్రకటించాయి. ఈ దొంగరవాణా నేపథ్యంలో చైనాపట్ల వైముఖ్యం పెంచుకుంటున్న ఆఫ్రికా దేశాలు మనదేశంతో సాన్నిహిత్యాన్ని కోరుతున్నాయి. అయినప్పటికీ తమ ఖండానికి చెందిన ఒక యువకుడి మృతి పట్ల ఆఫ్రికా దేశాలు ఇంతగా ప్రతిక్రియకు పూనుకొనడం మన ప్రభుత్వానికి గుణపాఠం...విదేశాలలోని మన వారిపై దాడులు జరిగినప్పుడల్లా మన ప్రభుత్వం కూడ ఇదే రీతిలో ప్రతిక్రియకు పూనుకోవాలన్నది ఈ గుణపాఠం. ఆ దేశాల వారిపై మనదేశంలో దాడులు చేయరాదు, కానీ మనవారిపై దాడులను నిరోధించడానికి వీలుగా మన ప్రభుత్వం ఆయా దేశాల ప్రభుత్వాలను నిలదీయాలి...కానీ సౌదీ అరేబియాను మన ప్రభుత్వం ఎందుకని నిలదీయడంలేదు? ఎందుకు నిరసనలు తెలుపడంలేదు?
సౌదీ అరేబియాలో మాత్రమే కాదు, అరబ్ దేశాలన్నింటిలోను ప్రవాస భారతీయులు పశువులకంటె హీనమైన బతుకులు గడుపుతున్నారు. భారతీయులను చంపేయడం, చిత్రహింసలకు గురిచేయడం, నిర్బంధించి, తిండి నీరు ఇవ్వకుండా మలమల మాడ్చడం జిహాదీ పైశాచిక ప్రవృత్తి ముదిరిన సౌదీ అరేబియా సంపన్నులకు పరిపాటి అయిపోయింది. మానవుల వలె కాక భయంకర క్రూర మృగాల వలె, నరరూప పిశాచుల వలె ప్రవర్తించడం ఈ జిహాదీల శతాబ్దుల సహజ స్వభావం. అందువల్ల చంపేయడం వారికి సహజం. కానీ ఇలా హత్యలు జరిగినప్పుడు న్యూఢిల్లీలోని సౌదీ అరేబియా రాయబారిని పిలిచి మన ప్రభుత్వం ఎందుకని అభిశంసించడంలేదు? హైదరాబాద్‌కు చెందిన ముప్పయి నాలుగేళ్ల అసీమా ఖాటూన్ అనే మహిళ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు గత డిసెంబర్‌లో వెళ్లిందట. గృహ సహాయికగా ఒ సంపన్నుని ఇంట్లో పనిచేసిన ఈ మహిళను ఆ ఇంటివారు చిత్రహింసలు పెట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన అసీమా వైద్యశాల పాలై ఆ తరువాత మరణించింది. తమను తమ యాజమానులు రియాద్‌లో చిత్రహింసలు పెడుతున్నట్లు మరో ముగ్గురు భారతీయ యువతులు కూడా వెల్లడించడం సౌదీలోని భారతీయుల దుస్థితికి ఒక సాక్ష్యం మాత్రమే. ఏళ్ల తరబడి అసంఖ్యాక సాక్ష్యాలు వెలువడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మరో ముప్పయి ఏళ్ల మహిళ సౌదీ అరేబియాలోని ఒక సంపన్నుని ఇంట బందీగా ఉన్నట్టు ఇరవై నాలుగవ తేదీన వెల్లడైంది. తమిళనాడుకు చెందిన వారు ఇతర ప్రాంతాలలో సౌదీ అరేబియాలో జీవచ్ఛవాలై పడివున్న వాస్తవాల గురించి కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని సౌదీ అరేబియా రాయబారి కార్యాలయంలో దౌత్యవేత్తగా చెలామణి అయిన ఒక బీభత్సకారుడు ఇద్దరు నేపాలీ మహిళలను తమ ఇంటిలో నిర్బంధించిన సంగతి చెరగని భయంకర స్మృతి. అనేక నెలలపాటు వీరిద్దరినీ ఆ ద్యౌవేత్త ఇంటిలో అనేకమంది సామూహిక అత్యాచారానికి గురిచేశారు..
సౌదీ అరేబియా మనకు గొప్పమిత్ర దేశంగా చెలామణి అవుతోంది. మన ప్రధానమంత్రి సౌదీ అరేబియాకు గతనెలలో వెళ్లిన సందర్భంగా వెల్లివిరిసిన సౌహార్దం అంతాఇంతా కాదు. అలాంటప్పుడు ఇలాంటి దాడులను మన ప్రభుత్వం ఎందుకని ఆపించలేకపోతున్నది? ఆపించడం వీలు కాకపోతే మనదేశస్థులు ఆ దేశానికి వెళ్లకుండా నిరోధించాలి..