ఉత్తరాయణం

తెలుగు మహాసభలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు మహాసభల ఊసే లేదు. నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్న చందంగా తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏం లాభం. ఎప్పుడు నిర్వహించే తెలుగు మహాసభల ఊసే లేదు. అదే పార్టీ సభలైతే ఘనంగా మండుటెండలో గాని హోరుమని జడివానలో గాని నిర్వహిస్తారు. పార్టీ సభలు ఆయా పార్టీల వారికే వారిని వీరు వీరిని వారు డప్పుకొట్టుకోవడమే. అదే తెలుగు మహాసభలైతే అందరికీ సంబంధించినవి. ఎంతో లాభదాయకం కూడా. అయినప్పటికీ మన పాలకులు తెలుగు మహాసభలు ఊసెత్తడం లేదు. తెలుగు భాష తెలుగు చరిత్ర, తెలుగు జాతిగా గొప్పదనం తెలుగు నాయకుల ఘన చరిత్ర. తెలుగు కవులు, రచయితలు, తెలుగు నాటక రంగం మొదలైన పెక్కు విషయాలు ఎప్పటికప్పుడు నలుదిక్కులా తెలియజేయాలి. అందుకుగాను తెలుగు మహాసభలు నిర్వహించాలి. అదీ తెలుగు ప్రభుత్వాల కనీస బాధ్యత.
- మిస్సుల గాయత్రీదేవి, శివరామకృష్ణ, హైదరాబాదు
మహిళా రైతులకు ప్రాధాన్యమివ్వాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారు రాష్ట్రంలోని మహిళా రైతు యజమానులకు ప్రత్యేకంగా శిక్షణ, చైతన్య కార్యక్రమాలు అధిక దిగుబడులపై అవగాహన సదస్సులను నిర్వహించాలి. 33% రిజర్వేషన్ ప్రకారం వ్యవసాయశాఖ వ్యవసాయ పరికరాల పంపిణీలో మహిళా రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్యాంకు రుణాలు అందించాలి. మహిళా రైతుల సంఘా న్ని ఏర్పాటుచేయాలి. పాడి గేదెల కొనుగోలు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకంలో ప్రత్యేక శిక్షణఇవ్వాలని మనవి. రెవెన్యూ రికార్డుల్లోని మహిళా రైతు యజమానులకు సబ్సిడీపై ఎరువులను అందించాలి. పాడి పరిశ్రమపై అవగాహన కల్పించి మహిళా రైతులకు న్యాయంచేయాలని మనవి.
- ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ
కాంగ్రెస్ కొత్త పద్ధతి
తమ సభ్యులు ఇతర పార్టీల్లోకి జంప్ చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలనుకుంటోంది. తమ పార్టీ సభ్యులు వంద రూపాయల బాండ్ పేపరు మీద రాహుల్, సోనియాలకు విధేయులమై ఉంటామని, పార్టీని వీడమని ప్రామిసరీ నోట్ రాయాలట. దశాబ్దాల క్రితం రాజీవ్‌గాంధీ ఫిరాయింపు నిరోధ చట్టం తెచ్చినప్పుడు ప్రతిపక్షాలు దానిలోని లోపాలు చెప్పగా ఖాతరు చేయకుండా ఆ చట్టాన్ని ఆకాశానికి ఎత్తేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఆ లోపాలు తెలిసి వచ్చాయి. తనదాకా వచ్చేసరికి ఇప్పుడు ప్రామిసరీ నోటు అంటున్నది. తనకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే స్పందించడం ఎంతవరకు సమంజసం? రాజకీయం వేరు, చట్టం వేరు. చట్టానికి లోబడే రాజకీయం ఉండాలి. మరటువం టప్పుడు పార్టీ విధానాలకు కాక వ్యక్తులకు విధేయత ప్రకటిస్తే అది చట్టసమ్మతం అవుతుందో లేదో వేచి చూడాలి. కానీ కాంగ్రెస్ అంతా వ్యక్తి ఆరాధన పార్టీయే కదా.
- సోనాలి, సూర్యారావుపేట
హోర్డింగులతో పొంచివున్న ప్రమాదం
జంట నగరాల్లో తరచూ భయంకరమైన గాలివానలు రావడం, పెద్దఎత్తున మహావృక్షాలు, హోర్డింగులు కుప్పకూలి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించడం జరుగుతున్నాయి. నాణ్యతాప్రమాణాలు పాటించని హోర్డింగులవల్ల దినదిన గండంగా మారుతోంది. ఇటువంటి వాటిని తొలగించాల్సిన అవసరం వుంది. అసలే వృక్షాల నరికివేతతో భూతాపం పెరుగుతుంటే గాలివానకు మరిన్ని వృక్షాలు నేలకొరగడం శోచనీయం. మొక్కలను నాటినప్పుడు వాటి వేళ్ళు భూమిలోకి బలంగా నాటుకునేలా ప్రత్యేక ఏర్పాట్లుచేయాలి. తద్వారా వృక్ష సంపదను కాపాడవచ్చు. గాలివానల సమయాల్లో నష్టాలను నివారించవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఈ సమస్యపై దృష్టిపెట్టినట్టులేదు. ఇటీవలి అనుభవంతోనైనా కళ్లు తెరచి, బలహీనంగా ఉన్న హోర్డింగులను గుర్తించి వాటిని మరింత దృఢంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్