మెయన్ ఫీచర్

యూపీలో ఎన్నికల రాజకీయాలు షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల అలహాబాద్‌లో భాజపా జాతీ య కార్యవర్గ సమావేశం ఆర్భాటంగా జరిగింది. అంటే 2017లో రాబోయే యుపి ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలహాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ కొన్ని అంశాలను ప్రతిపాదించారు. 1. సేవ, 2. సంతులనం, 3.సంయమనం, 4.సమన్వయం, 5. సకారాత్మకత, 6. సంవాదం. వీటి తాత్పర్యం ఏమంటే సామాజిక సమరతలో ముందుకు సాగాలేకాని అయోధ్య వంటి వివాదాస్పద అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చవద్దని. ప్రజలు కూడు గుడ్డ కోరతారు, యువతకు ఉద్యోగాలు కావాలి. వివిధ వర్గాల మధ్య ఘర్ష ణ ఉండకూడదు. ఇదే అలహాబాదు తీర్మానాల సారాంశం. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో భాజపా ప్రధానంగా ఎదుర్కోవలసింది సమాజ్‌వాది పార్టీని. అంటే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని. సంయమనం, సంతులనం, సకారాత్మకత వంటి మంత్రాలు ములాయం సింగ్ యాదవ్, అజాంఖాన్‌ల ముందు పనిచేయవు.
ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలున్నాయి. మొదటిది సమాజ్‌వాది పార్టీ, రెండవది భారతీయ జనతాపార్టీ, మూడవది బహుజన సమాజ్‌వాది పార్టీ, నాల్గవది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ హయాంలో యుపిలో కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉండేది. ఆయన ఫూల్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో దేశమంతా తిరిగి ఆ నియోజకవర్గానికి వెళ్లకపోయినా అక్కడ ఆయన అఖండ విజయం సాధించారు. రాయ్‌బరేలీ ఇందిరాగాంధీకి పర్యాయపదం. అమేథీ అంటే నెహ్రూ కుటుంబానికి స్వంత ఆస్తి వంటిది. ఇలా కొన్ని దశాబ్దాలు గడిచాయి. అమేథీలో నేటికీ ధూళి, ధూసరితమైన పల్లెలు, డొంకలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఐనా గాంధీ-నెహ్రూ కుటుంబం మీద ప్రజలకున్న వ్యామోహం అటువంటిది. ఇవాళ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రజలు కులాలవారీగా చీలిపోయారు. ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీని నమ్ముకొని ఉంటే, క్రైస్తవులు,దళితులు మాయావతి వెంట ఉన్నారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు బిజెపిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు దాదాపు అస్తిత్వం లేదు. నాల్గవ స్థానానికి దిగజారిపోయింది.
ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఒక ప్రభంజనం సృష్టించారు. కులాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు భాజపాకు ఓటు చేశారు. 1977 ఫిబ్రవరిలో సరీగ్గా ఇలాంటి ప్రభంజనమే వచ్చింది. మొత్తం 75 లోక్‌సభ స్థానాల్లో ఒక్కదాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. రాయ్‌బరేలీలో రాజ్ నారాయణ్ చేతిలో ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత కూడా రాజీవ్ గాంధీ కూడా సరీగ్గా ఇలాంటి ప్రభజనంతోనే అధికారంలోకి వచ్చారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలవాలంటే 2017లో యుపి లో విజయం సాధించడం తప్పనిసరి. అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను యుపిలో ‘నేతాజీ’ అని పిలుస్తారు. ఈయన రూపొందించిన పొలిటికల్ కెమిస్ట్రీ పేరు ‘మై కాంబినేషన్’. అంటే ముస్లిం-యాదవ్ జుగల్ బందీ. అజంఖాన్ తాను పాకిస్తాన్ అభిమానినని బహిరంగంగానే చెప్పుకుంటాడు. ఇతని మద్దతు ములాయంకు ఉంది. మధుర అంటే యాదవుల కంచుకోట. కొద్దిరోజుల క్రితం మధురలో అల్లర్లు జరిగాయి. అందులో రామకృష్ణ యాదవ్ అనే ఒక ఆథ్యాత్మిక నాయకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఇతను దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో ఆయుధాల ఫ్యాక్టరీ పెట్టాడు. ఈ అక్రమ ఆయుధాలు ఏమిటి? అని అడిగే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. సరికదా వారు పోలీసులపై ఎదురుదాడికి దిగి కాల్చి చంపారు. ఇలాంటిదే ఆశారాం బాపు మరొక ఆశ్రమం. ఈయనకు లక్షల సంఖ్యలో భక్తులున్నారు. ఆయన ఆశ్రమంలో కోట్లకొలది ధనం, ఆయుధాలు, మానవ కంకాళాలు దొరికాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటివే మరికొన్ని ఆయుధాలున్నాయి. రాధేమా అనే ఒకామె త్రిశూలం పుచ్చుకొని డాన్సు చేయడం మొదలుపెట్టింది. ఆమెకు ఎందరో సినీనటులు భక్తులు. ఇటీవల ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
అఖిలేశ్ యాదవ్ పాలనాకాలంలో లక్ష అత్యాచార కేసులు నమోదయ్యాయని అనధికార అంచనా. బిహార్ తర్వాత ఆటవిక రాజ్యం నడుస్తున్నది ఉత్తర ప్రదేశ్‌లోనే. బిహార్‌లో వలెనే ఇక్కడ కూడా ప్రైవేటు సైన్యాలున్నాయి. కిరాయి హంతకులూ ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్ జన్మదినం వేడుకలకు దావూద్ ఇబ్రహీం నుండి నిధులు వచ్చాయని ఆపార్టీ వారే చెప్పుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో కమ్యూనిస్టుల బలం కొన్ని ప్రాంతాలకే పరిమితం. తమకున్న కొద్దిపాటి ఓట్లను బిజెపికి వ్యతిరేకంగా వేయవలసిందిగా ఏచూరి సీతారామ్ కోరారు. అంటే ములాయంసింగ్ యాదవ్ గెలుపునకు మార్గం సగమం అవుతుంది. ఈ దశలో ములాయం పాలనకు చరమగీతం పాడి భాజపా అధికారం చేజిక్కించుకోగలదా? చూడాలి. భాజపా అంటే ప్రధానంగా అగ్రకులాల వారు అభిమానిస్తారనేది పాక్షిక సత్యమే. మాయావతి నిలబెట్టిన అభ్యర్థుల్లో బ్రాహ్మణులు ఉండటం గమనార్హం. అయతే ఉత్తరప్రదేశ్‌లో గంగా ప్రక్షాళన కార్యక్రమం కేంద్ర మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఊపందుకున్నది. వారణాసి సత్వరంగా అభివృద్ధి చెందుతున్నది. ఇవి రెండూ మోదీకి కలిసివచ్చే అంశాలే.
యుపిలో కాంగ్రెస్ అవసానదశలో ఉంది. ఈ శూన్యాన్ని పూరించాలని భాజపా విశ్వప్రయత్నం చేస్తున్నది. హిందూత్వ నినాదంతో ఎన్నికలకు వెళితే గెలవడం కష్టం కాబట్టి అభివృద్ధి మంత్రమే మంచిదని మోదీకి ఆంతరంగికులు సలహా చెబుతున్నారు. హిందూత్వ మంత్రమంటే రామమందిర నిర్మాణం చేపట్టడం. దానివల్ల మళ్లీ హిందూముస్లిం ఉద్రిక్తతలు పెరుగుతాయి. కానీ సాధ్వీ ప్రాచీ, సాక్షి మహరాజ్, ప్రవీణ్ తొగాడియా వంటివారు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. ఒకవేళ ఈ రాజనీతి వికటిస్తే ‘బూమరాంగ్’ అవుతుంది. ముజఫర్‌నగర్ అల్లర్లు గోద్రా మచ్చ ఇంకా మాయలేదు. అట్లాని రామమందిర నిర్మాణాన్ని బిజెపి హయాంలో నిర్మించకపోతే ఇక భారతదేశ చరిత్ర ఎన్నడూ నిర్మించబడదు. ఒకవేళ భాజపా రామమందిర నిర్మాణాన్ని భాజపా ఎన్నికల అంశంగా తీసుకుంటే మాయావతితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.
ఇక రెండవ ప్రత్యామ్నాయం పాకిస్తాన్‌ను శిక్షించడం. దీనివల్ల దేశవ్యాప్తంగా ఒక చైతన్యం వస్తుందనేది మరొక సూచన. కాని నరేంద్ర మోదీ గుజరాత్ వ్యాపార దృక్పథం కలిగిన మనిషి. ఇలాంటివారు యుద్ధానికి ముందుకు రారు. కాబట్టి కష్టమో సుఖమో అభివృద్ధి మాత్రమే జపిస్తూ ముందుకు పోవాలనేది మోదీ-షాల వ్యూహంగా కనిపిస్తున్నది. ఎల్‌ఓసి వద్ద ఆక్రమిత కాశ్మీర్‌లో యుద్ధం చేయకపోయినా ‘‘బెలూచిస్తాన్ స్వతం త్ర దేశ’’ ఉద్యమానికి బహిరంగ మద్దతు ఇవ్వడం ద్వారా మోదీ ఘనవిజయం సాధించవచ్చు. జూన్ 13న అమెరికాలోని ఒర్లాండ్ నైట్‌క్లబ్‌పై ఒమర్ మతీన్ అనే ఐసిస్ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 50 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మతీన్ ఇస్లామాబాద్ నుంచి వచ్చిన ముస్లిం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్‌లలోని ఉగ్రవాద చర్యలను నిర్మూలించడంలో ఇప్పుడు అమెరికా మనస్ఫూర్తిగా సహకరిస్తుంది. నరేంద్ర మోదీ వ్యూహం ఏమిటో కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఉత్తరప్రదేశ్ పీఠం పై వరుణ్ గాంధీని కూర్చోబెట్టాలని మేనకా గాంధీ ఆలోచిస్తున్నది. అందుకు భాజపా అంగీకరించడం సందేహమే. ఎందు కంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేటి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను దించాలని భాజపా యోచిస్తున్నది.
ప్రియాంక గాంధీకి రాజకీయాల అరంగేట్రం చేయించాలని కాంగ్రెస్ వారు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ శీలాదీక్షిత్ పేరును ప్రతిపాదించాలని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకుంటున్నది. దీనివల్ల మహిళల ఓట్లు, బ్రాహ్మణుల ఓట్లు ఆకర్షిస్తుందని కాంగ్రెస్ వ్యూహం. మరి ఢిల్లీలో ఆప్ విజయానికి శీలాదీక్షిత్ అవినీతి కూడా కారణం. ఆమె నివాసంలో 30 ఎయిర్‌కండిషనర్లు ఉండేవి. రూ.400కోట్ల విలువైన వాటర్ ట్యాంకర్ల కుంభకోణానికి సంబంధించిన పత్రాలను యాంటీ కరప్షన్ బ్యూరో నేత ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. యుపి ఎన్నికల పూర్వరంగంలో ఈ పత్రాలు శీలాదీక్షిత్ ప్రతిష్ఠకు భంగం కలిగించేవిగా ఉన్నాయి. ఇదిలా వుండగా మతంమార్పిడులను ప్రోత్సహించడంకోసం విదేశాలనుంచి వచ్చే నిధులను ఎన్‌డిఎ ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ‘‘సబ్‌రంగ్’’ సంస్థ ఒకటి. తీస్తా సెతల్వాడ్, కుమారి మాయావతి ఈ సమస్యను ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం మొదలుపెట్టారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఖైరానా అనే ప్రాంతం ఉంది. అక్కడి నుండి 346 కుటుంబాలు తమ ప్రాణాలను అరచేత పట్టుకొని వేరే ప్రాంతాలకు పారిపోయారు. భారీ సంఖ్యలో హిందువులు హత్యలకు గురయ్యారు. ఈ సంఘటనపై స్థానిక భాజపా నాయకుడు బహుజన్ సింగ్ వ్యాఖ్యానిస్తూ, ‘‘1931 నాటి మోప్లా మత కల్లోలాలను గుర్తుకు తెస్తున్నాయి’’ అన్నారు. ఐతే దీన్ని ఎస్‌పి నేత ములాయంసింగ్ యాదవ్ ఒప్పుకోవడం లేదు. ఉద్యోగాలకోసం వారంతా వేరే ప్రాంతాలకు వలసపోయారని అంటున్నారు. నరేంద్ర మోదీ ‘‘సబ్‌కా భలా-సబ్‌కా వికాస్’’ అనే మంత్రి పఠించినంతమాత్రాన ములాయం సింగ్ పాకిస్తాన్ ఏజెంటుగా వ్యవహరించడం మానుకుంటాడనుకోవడం పొరపాటే. యుపి ఎన్నికల్లో ములాయం గెలిస్తే పాకిస్తాన్‌లో పండుగ చేసుకుంటారు. మాయావతి గెలిస్తే బీఫ్ ఫెస్టివల్స్ జరుగుతాయి. సోనియా గెలిస్తే రోమన్ క్యాథలిక్కులు ఆనందిస్తారు. వాస్తవాలను దాచిపెట్టి ‘సెక్యులరిజం’, ‘సౌషలిజం’, ‘సబ్‌కాభలా’ వంటి అందమైన రోల్డ్ గోల్డ్ పదజాలంతో ఓటర్లను మభ్యపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి?
ఉత్తర ప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లో కూడా 2017లోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అక్కడ కూడా ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఇది భాజపాకు అనుకోకుండా కలిసివచ్చిన అవకాశం. మరి 1984లో సిక్కుల ఊచకోత కేసులో జగదీశ్ టైట్లర్‌తో పాటు, కమలనాథ్ పేరుకూడా ఉంది. ఇది భాజపాకు కలిసివచ్చే ఆంశం. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేక ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో, తన ఇన్‌చార్జ్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాపాడాలని యత్నించాడు. ఇక ఇక్కడ హిందూ ఓట్లను భారీగా చీల్చి భాజపాను ఓడించాలని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఇది ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. గుజరాత్ ఎన్నికలకు ముందే ఆనందీబెన్ పటేల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని వత్తిడి వస్తున్నది. ఆమె నేతృత్వంలో పార్టీ గెలవడం కష్టమని పార్టీ కార్యకర్తల అభిప్రాయం.

- ముదిగొండ శివప్రసాద్