సబ్ ఫీచర్

శునకాలపై అంత ప్రేమెందుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీంజీ కుక్కలపై మీ ప్రేమ తగ్గిస్తే పౌరులకు సేవ చేసినవారౌతారు. కుక్కల్ని చంపకండి. వాటి సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయమని మీరు సలహా ఇచ్చారు. కుక్కల్ని పట్టుకోవటమే కష్టం. పట్టిన కుక్కలకి ఆపరేషన్ ఎలా చేస్తారు. ఆలోచించండి. కుక్కల కారణంగా నేడు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కుక్క కాటు వ్యాక్సిన్‌లు ఎక్కువగా దొరకటంలేదు. ఏమి చేయలేని స్థితిలో ఉన్నామని ప్రభుత్వ డాక్టర్లు వాపోతున్నారు. సందు దొరికితే దోచే విధంగా ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ హాస్పటల్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్ళి చంపేస్తున్నాయి కుక్కలు. గొర్రెలు, మేకలు, పందులు లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా మన ఆహారానికి తనువుచాలిస్తున్నాయి. కుక్క మాంసం మానవులు తినటం లేదు. వీటిని చంపితే జీవహింసని మీ ఉద్దేశం. పురపాలికలు మీ ఆజ్ఞప్రకారం కుక్కల్ని చంపటం లేదు. కుక్కల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. పౌరులు కుక్కల బారిన పడుతున్నారు. సుప్రీంగారు మీ నిర్ణయం మార్చుకోండి. కుక్కలపై మీకున్న ప్రేమ పౌరులపై చూపండి. మీ నిర్ణయం మారితే పౌరులు సంతోషిస్తారు.
దేశవ్యాప్తంగా కుక్క కాటుకి బలైన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కుక్కల్ని చంపవద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు కారణంగా కుక్కల సంఖ్య గణనీయంగా వృద్ధి అవుతోంది. ఇంతకు మునుపు కాలనీలో పదుల సంఖ్యలో కుక్కలు సంచరించేవి. ఈ సంఖ్య నేడు వందకు పెరిగింది. బాధితుల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తోంది. కుక్క కరిచిన వారు హాస్పటల్‌కి వెళ్తే వ్యాక్సిన్ మందు లేవంటున్నారు. ప్రభుత్వాలు సరఫరా చేసే మందుల కంటే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. గ్రామాల్లో అయితే వ్యాక్సిన్ మందు హాస్పటల్‌కి జిల్లా కేంద్రాల వారు అందించలేకపోతున్నారు. దీనికి కారణం వ్యాక్సిన్ కొరత. కుక్క కరిచిన బాధితులు జిల్లా ఆరోగ్య కేంద్రాలకు రోజురోజుకి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. బాధితులందరికి న్యాయం చేయలేకపోతున్నామని హాస్పటల్ వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ హాస్పటల్‌లో కుక్కల సంచారం పెరుగుతోంది. అప్పుడే పుట్టిన శిశువుల్ని ఎత్తుకుపోయి, చంపి తినేస్తున్నాయి. బాధితుల రోదన వినేదెవరు. నవ మాసాలు మోసి బిడ్డను కంటే వారిలో ఆనందానికి అవధులు లేవు. అదే బిడ్డ కుక్క కారణంగా బలైపోతే వారి ఆవేదన వర్ణనాతీతం. చనిపోయిన బిడ్డ తల్లిదండ్రుల బంధువులు స్నేహితులు ఆరోగ్య అధికారులపై అలజడి చేస్తున్నారు. ప్రతిరోజు పత్రికల్లో ఎక్కడో ఒకచోట ఈ వార్తలు వస్తున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వారి పిల్లలు ఆనందంతో రోడ్లమీద ఆడుతూ ఉంటారు. ఇటువంటి పిల్లల్ని కూడా కుక్కలు ఎత్తుకుపోయి చంపేస్తున్నాయి. పిల్లలు పెద్దలు అనే బేధం లేదు. చాలామంది కుక్క కాటుకి బలవుతున్నారు. రాత్రివేళ ఈ కుక్కల సంచారం పెరుగుతోంది. అర్ధరాత్రి ఉద్యోగాలు ముగించి ఇంటికి వచ్చేవారు కుక్కలు ఎక్కడ వెంటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. ద్విచక్ర వాహనదారుల్ని ఈ కుక్కలు బెంబేలెత్తిసుతన్నాయ.
ఇంటి యజమాని పెంచుకున్నవి పెంపుడు కుక్కలు. వీధుల వెంట తిరిగేవి వీధి కుక్కలు. కుక్క ఉన్నది జాగ్రత్త.. ఓ ఇంటి యజమాని బోర్డుపెడితే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి కొందరు భయపడతారు. బయట తిరిగే వీధి కుక్కల్లో కొన్ని పిచ్చి కుక్కలు ఉంటున్నాయి. ఈ కుక్కలు కాలనీవాసులనే గాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని భయపెడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి మార్గం ఏది. ఈరోజు కుక్కల బారినుంచి గండం తప్పిందనే రోజులొస్తున్నాయి. పరిస్థితిని సుప్రీంకోర్టు అర్థంచేసుకొని అవగాహన వహించే వరకు ఈ విషయం మరింత వికృతవౌతుంది.

- ఎం.అప్పారావు