మెయన్ ఫీచర్

వాణిజ్య విఘటనకు నేపథ్యం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వరూప ఏకత్వం అంతర్గత వైరుధ్యాలను తొలగించలేదనడానికి ఇటీవల బ్రిటన్ ప్రజలు చెప్పిన తీర్పు నిదర్శనం. ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమించాలని జూన్ 23వ తేదీన బ్రిటన్ ప్రజలు నిర్ణయించడం చారిత్రక పునరావృత్తికి మరో ఆరంభం. ఐరోపాలోని వివిధ దేశాలవారు శతాబ్దులపాటు పరస్పరం కలహించడం చరిత్ర. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక ఆధిపత్యంకోసం ఐరోపా దేశాలవారు పోటీ పడడం ఈ చరిత్రకు ప్రాతిపదిక. ఈ ఆధిపత్య సమరం ఐరోపా వెలుపలి దేశాలకు విస్తరించడం కూడ అనేక శతాబ్దుల చరిత్ర...ఐరోపా హితం ప్రపంచ హితంగాను, ఐరోపా దుఃఖం ప్రపంచ దుఃఖంగాను ప్రచారం కావడం అంతర్జాతీయ వైపరీత్యం. క్రీస్తుశకం ఇరవయ్యవ శతాబ్దిలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు నిజానికి ఐరోపా దేశాల మధ్య జరిగిన ఆధిపత్య సమరాలు. అందుకుపూర్వం నాలుగు శతాబ్దులకు పైగా ఐరోపావారు ఇతర దేశాల వాణిజ్య నౌకలను సముద్రాలలో కొల్లగొట్టారు. ఓడదొంగలకు చారిత్రక జన్మస్థానం ఐరోపా (ఈ దొంగతనాలను ఆ తరువాత జిహాదీ మతోన్మాదులు నేర్చుకున్నారు). ఆ నాలుగు శతాబ్దులలో ఐరోపా దేశాలవారు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ‘కనిపెట్టారు’. ఇలా ‘కనిపెట్టడం దురహంకార స్వభావం నిహితమైన స్వార్థం. ‘‘తమకు కనబడని సూర్యుడు లేడని గుడ్లగూబలు భావించడం’’ ప్రాకృతిక ధర్మం. తాము కనిపెట్టక పూర్వం ప్రపంచంలోని వివిధ దేశాలు, ఖండాలు, జాతులు, సంస్కృతులు లేవని భావించడం ఐరోపావారి నాగరికం...అందువల్లనే అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలకు వందల ఏళ్లకంటె ఎక్కువ చరిత్ర లేదని ఐరోపావారు నిర్ణయించారు. ఎందుకంటె ఐరోపావారు వందల ఏళ్ల క్రితం ఈ ఖండాలను గుర్తించారు. వీరు గుర్తించక పూర్వం అమెరికా, ఆస్ట్రేలియాలలోని మనుషులు మనుషులు కాలే దు. వారి నాగరికత నాగరికత కాలేదు, వారి సంస్కృతి సంస్కృతి కాదు, చరిత్ర, చరిత్ర కాదు. తాము కనిపెట్టడానికి పూర్వం ఉన్నదంతా ఐరోపా వారి దృష్టిలో లేనట్టు లెక్క. వేటగాడు చూసే వరకు అడివిలో కాచిన వెనె్నల కాయనట్టే లెక్క. ఇదీ ఐరోపావారి నాగరికం, వారికి నాగరికం-సివిలిజేషన్- గురించి తెలుసు, సంస్కృతి- కల్చర్-గురించి తెలీదు. జాతి- నేషన్-గురించి తెలీదు. అందువల్ల ప్రాచీన కాలంలోని తమ ఖండంలో వలె భారత ఖండంలో కూడ నగర రాజ్యాలు-సిటీస్టేట్స్-మాత్రమే ఉండినట్టు బ్రిటన్ మేధావులు కనిపెట్టారు. అందుకే యుగయుగాలుగా పరిఢవిల్లిన భారత జాతీయ సంస్కృతిని బ్రిటన్ వారు మొహంజోదారో నాగరికం శిథిలాలలో నిక్షిప్తం చేయయత్నించారు. త్రేతాయుగంలో సింహిక అనే రాక్షసికి హనుమంతుడు మింగుడు పడలేదు. కలియుగంలో బ్రిటన్, ఫ్రాన్స్, పోర్జుగల్, పోలెండ్ వంటి వాటికి భారతఖండం మింగుడుపడలేదు. అయినా బ్రిటన్ వారు, పోర్చుగల్ వారు, ఫ్రాన్స్‌వారు భారత ఖండాన్ని దొం గలు ఊళ్లు పంచుకున్నట్టు, పంచుకొనడం క్రీస్తుశకం 1947నకు పూర్వం జరిగిన శతాబ్దుల చరిత్ర. ఈ మూడుదేశాల దొంగలూ డచ్చి దొంగలను తరిమివేశారు. ఓడ దొంగలైన ఐరోపావారు దేశాల దొంగలుగా రూపుదిద్దుకొనడం ఇలా చారిత్రక విపరిణామక్రమం. బ్రిటన్ ఐరోపా సమాఖ్యనుండి పొందిన ఆర్థిక వాణిజ్య స్వాతంత్య్రానికి ఈ చారిత్ర స్వభావం నేపథ్యం...
ఉమ్మడి శత్రువు దాపురించినప్పుడు పరస్పరం విరోధించే వారు మిత్రులుగా మారిపోతారట. మహాకవి కాళిదాసు క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో చెప్పాడు. గ్రీష్మఋతువులో సూర్యుడు అలా పాములకు, నెమళ్లకు, ఇతర వన్యమృగాలకు ఉమ్మడి శత్రువని ఋతుసంహారం కావ్యంలో ఆ మహాకవి వివరించాడు. ఎండకు తట్టుకోలేని కప్పలు పాము శరీరాన్ని ఆనుకొని చల్లదనం పొందాయట. నెమలిపింఛాల నీడలో పాములు పడుకున్నాయట. శత్రుత్వం లేదు. సూర్యుడు పడమటికి వెళ్లిపోగానే వన్యమృగాలకు పరస్పర విద్వేషాలు గుర్తుకువస్తున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొట్టుకోవడం చరిత్ర. క్రీస్తుశకం 1798వ, 1821వ సంవత్సరాల మధ్య ఫ్రాన్స్ అధినేత నెపోలియన్ బ్రిటన్‌కు సింహస్వప్నం...చివరికి ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ తరువాత రాజీపడింది. భారతదేశంలోని పుదుచ్చేరిని పుచ్చుకున్న ఫ్రాన్స్, కెనడాలోని క్యూబెక్‌ను బ్రిటన్‌కు అప్పగించింది. ఇరవయ్యవ శతాబ్ది ఆరంభంలో జర్మనీ ఉమ్మడి శత్రువుగా విజృంభించగానే కొట్టుకున్న ఫ్రాన్స్, బ్రిటన్‌లు జట్టు కట్టాయి. రెండు ఐరోపా యుద్ధాలలోను బ్రిటన్, ఫ్రాన్స్‌లు మిత్రదేశాలు. జర్మనీకి శత్రుదేశాలు ఐరోపా యుద్ధాలు రెండు ప్రపంచ యుద్ధాలుగా నమోదు కావడం శే్వతవర్ణ దురహంకారం. ‘ఐరోపా ఏడుపు ప్రపంచం ఏడుపు..’ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ రష్యావారి కమ్యూనిస్ట్ సామ్రాజ్యం ఐరోపా దేశాలకు ఉమ్మడి శత్రువైంది. అందువల్ల పశ్చిమ ఐరోపా దేశాల మధ్య మళ్లీ ఏకత్వం మొదలైంది. ఐరోపా సమాఖ్యకు సమైక్య వాణిజ్య వ్యవస్థకు దారితీసిన నేపథ్యం ఇదీ. సోవియట్ రష్యా వారి కమ్యూనిస్టు సామ్రాజ్యం కుప్పకూలిన తరువాత ఐరోపాలో మళ్లీ పూర్వపు వైరుధ్యాలు ప్రస్ఫుటిస్తున్నాయి. ఇప్పుడు ఐరోపా సమాఖ్య నుండి బ్రిటన్ విడిపోతుండడానికి ఈ అంతర్గత వైరుధ్యాలు కారణం.. మతం ఐరోపాను సమైక్యపరచలేకపోయింది. భాషలు ఐరోపాను భిన్న జాతులుగా విడగొట్టాయి. భాష మాత్రమే ప్రాతిపదికగా జాతి ఏర్పడడం ఐరోపా చరిత్ర. అందువల్లనే ఐరోపా ఒకే జాతిగా రూపొందలేకపోయింది.
మాతృభూమి ప్రాతిపదికగా, మాతృభూమిపై వికసించిన సంస్కృతి ప్రాతిపదికగా జాతి ఏర్పడడం యుగాలుగా భారతీయ చరిత్ర. ఇలాంటి సంస్కృతిలో, జాతిలో మ తాలు, భాషలు, ఆచారాలు, సంప్రదాయా లు, ఆహార ఆహార్య పద్ధతులు, విద్యలు, విజ్ఞానాలు, రాజ్యాలు, రాజ్యాంగాలు, త త్వాలు, సిద్ధాంతాలు, వాణిజ్య వ్యవసాయాలు, ఇంకా అనేకానేక వైవిధ్యాలు భాగమయ్యాయి. ఎన్నిరకాల భాషా వైవిధ్యాలున్నప్పటికీ మత వైవిధ్యాలున్నప్పటికీ ఇతరేతర వైవిధ్యాలున్నప్పటికీ భారతదేశం అనాదిగా, ఒకే జాతి-నేషన్-గా పరిఢవిల్లడానికి మాతృభూమి ప్రాతిపదిక. వైవిధ్యవంతమైన స్వరూపాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ జాతీయ స్వభావం మాత్రం ఒకే సంస్కృతి. భువి తల్లి, దివి తండ్రి- ద్వౌర్యఃపితా పృథివీ మాతా - అన్న వైదిక వాస్తవం సృష్టిగత స త్యం. ఇది మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకు అన్ని జనసముదాయాలకు వర్తించిన జీవన సత్యం. ఏ జాతికైనా అందువల్ల మాత నేలతల్లి, సమస్తం ప్రసాదిస్తున్న మాతృభూమి, జాతి పిత ఆకాశం...అనాదిగా వర్షధారలతో భూమిని పండిస్తున్న ఆకాశం ప్రతి జాతి తండ్రి. కానీ భారతీయులు మాత్రమే ఈ సత్యాన్ని అనాదిగా గుర్తించారు. భారతదేశం నుండి వివిధ కాలాలలో వివిధ కారణాలతో నిరంతరం బయటకి వెళ్లినవారు ఈ సహజమైన వాస్తవాన్ని క్రమంగా మరచిపోయారు. కొత్తకొత్త జనసముదాయాలుగా ఏర్పడినారు. మాతృభూమి గురించి, జాతి గురించి, సంస్కృతి గురించి మరచిపోయిన జనసముదాయాలు, ఐరోపాలోను, ఇతరచోట్ల వేల ఏళ్లు కేవలం ప్రాణులుగా జీవించడం చరిత్ర..ఆ దశలోనే భారతదేశం ఆయా జంతు జన సముదాయాలకు మానవీయ సంస్కారాలను పంచిపెట్టింది. విశ్వగురువు అయింది. విశ్వవిజేత కావాలన్న దురహంకారపు ఆకాంక్ష భారతదేశంలో ఎన్నడూ మొలకెత్తలేదు. అలాంటి ఆధిపత్య భావ విషబీజం ఐపాలో మొలకెత్తింది. అంతర్గత ఆధిపత్యంకోసం కొట్టుకొని తిట్టుకొని రాజ్యాలను కూలదోసుకున్న ఐరోపా భాషా సముదాయాలు ఆ తరువాత ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీపడటం చరిత్ర. ఈ చరిత్ర గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దిలో విశ్వవిజేత కావాలని కలలుకన్ననాటిది. ఈ ఆధిపత్య వాంఛ ఇప్పుడు బ్రిటన్‌కు ఇతర ఐరోపా దేశాలకు మధ్య వాణిజ్య విభజనకు నేపథ్యం. ‘గ్రీకు వీరుడు’ అన్ని భావదాస్యపు పలవరింతలను ప్రకటిస్తున్న విచిత్ర భారతీయులు గుర్తించదగిన చరిత్ర ఇదంతా.
జాతీయత గురించి మరచిన ఐరోపావారు ఆ తరువాత నాగరికము-సివిలిజేషన్-గురించి కనిపెట్టారు. భారతీయులను చూసి మాతృభూమికి బదులు పితృభూమి-్ఫదర్ ల్యాండ్-ను కనిపెట్టారు. సోవియట్ రష్యా ప్రపంచంలోని కమ్యూనిస్టులందరికీ ఏకైక ‘్ఫదర్ ల్యాండ్’ కావడం, ఆ తరువాతి కథ. ఇలా వికృత వక్రీకృత భావజాలం ఐరోపాలో పుట్టలుగా పెరగడం అంతర్గత వైరుధ్యాలకు కారణం. కేవలం భాష ప్రాతిపదికగా జాతి ఏర్పడడం, ఒక జాతికి ఒకే భాష ఉంటుందని భ్రమించడం ఐరోపాలో విఘటన వ్యవస్థీకృతం కావడానికి కారణం. ఇందుకు విరుద్ధంగా భారతజాతికి అనాదిగా అనేక భాషలున్నాయి. ఇందుకు కారణం ‘‘స్వరూప వైవిధ్యాల మధ్య స్వభావ ఏకత్వం’’ అన్న సృష్టిగత సత్యం భారతీయ జీవనం కావడమే. ఇక్కడ భాష పేరుతో కాని మతం పేరుతో కాని జాతి ఏర్పడలేదు. తెలుగువారి జాతి భారతజాతి, కన్నడ భాషా సముదాయం జాతి భారత జాతి, కశ్మీరీ జనసముదాయం భారత జాతి, అస్సామీ ప్రాంతీయులు భారతజాతి. ఈ స్వభావ ఏకత్వాన్ని జీవనంగాను మలచుకోలేకపోవడం వల్లనే ఐరోపాలోని భిన్న భాషల వారు విభిన్న జాతులుగా చెలామణి అవుతున్నారు. ఐరోపా సమాఖ్య-ఇయు-నుండి బ్రిటన్ విడిపోతుండడానికి నేపథ్యం ఇదీ...
రష్యాలోని కమ్యూనిస్టులు పదునాలుగు భిన్న భాషల వారిని బలవంతంగా తమ దేశంలో కలుపుకున్నారు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్’-యుఎస్‌ఎస్‌ఆర్-ను ఏర్పాటు చేశారు. 1991లో యుఎస్‌ఎస్‌ఆర్‌లో కమ్యూనిస్టు నియంతృత్వం అంతరించిన వెంటనే అది పదిహేను దేశాలుగా మళ్లీ విడిపోయింది. అలా విడిపోయిన దేశాలలో ఉక్రెయిన్ ఒకటి. ఈ దేశంలో ప్రధాన భాష ఉక్రేనియా..ఈ దేశంలోని క్రీమియా ఇటీవల విడిపోయింది. ఎందుకంటె క్రీమియా ప్రజలు రష్యా భాషీయులు. కెనడా నుండి క్యూబెక్ ప్రాంతం విడిపోవాలన్న ఉద్యమానికి బ్రిటన్ నుంచి స్కాట్‌లాండ్ వేరన్న ఉద్యమానికి భాషల పేరుతో జాతులన్న కృతక సిద్ధాంతం కారణం. వేల్స్, ఇం గ్లాండు, స్కాట్‌లాండ్ కలిసి బ్రిటన్ ఏర్పడింది. బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్ కలిసి యునైటెడ్ కింగ్‌డమ్ అయింది. ఒకప్పటి బ్రిటన్ సామ్రాజ్యం ఇప్పుడు కేవలం రాజ్యం! ‘‘విధాత అక్కటా ఎవ్వరినెట్లు సేయడు??’’ అన్నాడు ఒక మహాకవి!

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com