ఉత్తరాయణం

దిగుబడుల విప్లవం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా మొజాంబిక్‌తో భారత ప్రభుత్వం పప్పు ధాన్యాల దిగుమతి రెట్టింపు జరిపేలా ఒప్పందం కుదుర్చుకోవడం ముదావహం. దేశంలో పప్పుల కొరతను కొంతమేరకైనా తీర్చే మంచి ఒప్పందమిది. అయితే ఇలా పప్పులకోసం ఆఫ్రికావైపు, అప్పులకోసం అమెరికావైపు చూసే దుస్థితి నుండి ఇండియా బయటపడాలి. అందుకు స్వావలంబన దిశగా కృషి చేయడం ఒక్కటే మార్గం. దిగుమతుల మీద, విదేశీ పెట్టుబడుల మీద మన ఆహార భద్రత, ఆర్థిక భద్రత ఆధారపడినంతకాలం దీర్ఘకాలిక నష్టం వైపు నడకే తప్ప అభివృద్ధి చెందడం ఒట్టి మాటే అవుతుంది. అందుకనే సత్వర ఉపశమన చర్యలుగానే దిగుమతుల్ని భావించాలి తప్ప వాటినే శాశ్వత విజయాలుగా భావించరాదు. ముఖ్యంగా పప్పుల్ని ‘పేదల మాంసాహారం’గా అభివర్ణిస్తారు. శారీరక ఎదుగుదలకు, ఆరోగ్యానికి నిత్యం ఎంతో అవసరమైన మాంసకృతులు అధికమొత్తంలో అవి కలిగివుంటాయి. మనదేశంలో పేద, ధనిక భేదం లేకుండా రోజువారీ ఆహారంలో భాగమిది. అయితే దేశంలో పప్పు ధరలు ఏటికేడు విపరీతంగా పెరుగుతున్న కారణంగా వాటి రోజువారీ వినియోగం తగ్గుతూ వస్తున్నది. నేడు పౌష్టికాహార లోపం పెరగడానికి ఇదీ ఒక కారణమే.
వినియోగదారునికి భారమైన పప్పుదినుసులు, సాగుచేసే రైతుకి కూడా భారంగానే ఉన్నాయి. కనీస మద్దతు ధర లేకపోవడం, మార్కెట్ నియంత్రణ, మధ్యవర్తులపై అదుపులేకపోవడం వంటి వివిధ కారణాలతో వాటి సాగు నష్టదాయకమై పంట తగ్గుతూ వస్తున్నది. కాబట్టి ప్రభుత్వం పప్పు్ధన్యాల సాగు పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. హరిత విప్లవం ద్వారా వరి, గోధుమల ఉత్పత్తిని పెంచుకొని ఎలాగైతే పరాధీనత నుండి దేశం బయటపడిదో, అదే స్ఫూర్తి, చిత్తశుద్ధితో పప్పు్ధన్యాల విప్లవం సాధించే దిశగా ప్రయత్నాలు జరగాలి. అప్పుడే నిజమైన ఆహార భద్రత సాధించినట్టు. దిగుబడి పెంచి స్వావలంబన సాధించినప్పుడే అభివృద్ది దిశగా అడుగులు పడతాయి తప్ప, దిగుమతి పెంచినప్పుడు మాత్రం కాదు. ఎప్పటికైనా మనకాళ్లపై మనం నిలబడటమే ఉత్తమం. దిగుమతులు తాత్కాలిక పరిష్కారం మాత్రమే.
డా.డివిజి శంకరరావు, మాజీ ఎంపి, పార్వతీపురం
టీచర్ పోస్టులు భర్తీ చేయండి
గతంలో పనిచేసినవారనే వలంటీర్లుగా పనిచేయించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నదన్న వార్తలు నిజంగా బాధాకరం. ఎన్నో వేలమంది టీచర్ పోస్టుకు కావలసిన అర్హతలుండి, పోటీ పరీక్ష పాసై, ఉద్యోగానికై నిత్యం వేయి కన్నులతో ఎదురుచూసే వారిని పక్కనబెట్టి, ఎటువంటి అర్హత లేనివారిని నియమించి స్కూలు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడటం దారుణం. ఇప్పటికైనా అర్హులను టీచర్లుగా నియమించేందుకు చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ అభం శుభం తెలియని బడి పిల్లలకు మేలు చేస్తారని తలంచవచ్చా.
-చామర్తి వెంకట రామకృష్ణ, హైదరాబాద్
స్థానికతపై స్పష్టత అవసరం
371డి, స్థానికత వర్తించే టి.ఎస్. ఎంసెట్ ర్యాంకర్ల సర్ట్ఫికెట్ల పరిశీలన సమయంలో ఆయా సెంటర్లలోని వెరిఫికేషన్ అధికార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాలను తిరస్కరించి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించి, ‘నో’ అని ధ్రువీకరించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదువుకున్న వారికి ఈవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ తిరస్కరించడానికి ప్రధాన కారణం వారివద్ద ఈమధ్య ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండటమే. ఇతర దేశాల్లో విద్యాభ్యాం చేసే వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తున్న రోజులివి. అట్లాంటిది బతుకుతెరువుకోసం వచ్చి ఒక ప్రాంతంలో జీవిస్తూ తగిన సర్ట్ఫికెట్లు పొందినప్పడు వాటిని తిరస్కరించడం అన్యాయం. ఈ విషయంలో తెలుగు ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు అనుసరించాలి.
- 371 లోకల్ స్టేటస్ విద్యార్థులు, హైదరాబాద్
గొలుసు దొంగల స్వైరవిహారం
ఈమధ్య మళ్లీ గొలుసు దొంగలు విజృంభిస్తున్నారు. ఆడవారికి రక్షణ రానురాను కరవైపోతున్నది. మార్నింగ్ వాకింగ్ పది మందితో కలసి చేస్తున్నా టక్కున బైక్ మీదొచ్చి, చైన్‌లను గుంజుకుపోతున్నారు. ః ఉదయానే్న ఇంటి గుమ్మం ముందర ముగ్గువేసే సమయంలో కూడా కాపుకాచిన దొంగలు బలవంతంగా తెంపుకు పోతున్నారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్