వీరాజీయం

బతకడానికి భాగ్యనగరమే హాయి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బోనాల్ పండగకొస్తానని రాకపోతివి
లబ్బర్ గాజులు తెస్తానంటివి......’
ఏడనుందో రాములమ్మ- బోనాల్ పండగలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చేశాయ్! దొడ్డదొర కె.సి.ఆర్.గారు శెలవులు మస్తుగా ప్రకటించేస్తాడు. రంజాన్‌కి అటు చేరి, యిటు చేరి నాలుగు రోజులు శలవులు దొరికేసరికి ‘పండగ జేసుకున్నారు భాగ్యనగర వాసులు!’
‘‘అదృష్టమేగానీ ముప్పుకొంచెంలో తప్పిపోయింది. ప్రమాదం దాటిపోయింది. లేకపోతే బ్రతుకు ‘్ఛట్ భం డార్’ అయిపోను!’’ అంటున్నది ఒక కాలేజీ పాప.
ఆ విధంగా వానలు పడుతున్నాయ్ ఆంధ్రా, తెలంగాణా ఉమ్మడి రాజధానిలో యిప్పుడు. భాగ్యనగరం గు రించి అంగ్రేజీ పేపర్లు చదివితే కేవలం హలీమ్, బిర్యానీ, స్టార్‌బార్‌లే తెలుస్తాయి గానీ, మిగతా మీడియాని చూస్తే ట్రాఫిక్ జామ్‌లు, పొంగిపొర్లే నాలాలు (డ్రయినేజ్) టిఫిన్ సెంటర్లు, పేటపేటకీ ‘బాగ్’లు -అంటే ‘పార్కులూ’ వగైరా తెలుస్తాయి’’ బాగ్‌ల నగరమా యిది? భాగ్యనగరమా, యిది?’’ అంటే- ‘‘ఉన్నోడికి ఉన్నంత భాగ్యం, లేనోడికి చాలినంత ‘బువ్వ’నిచ్చే జంట నగరాలివి’’- అంటారు అంతా.
‘హై’బాద్’ కల్చర్ దానిదే- సికింద్రాబాద్ సివిలిజేషనూ దానిదే! కాకపోతే దీన్ని ‘విశ్వమహానగరం చేయాలన్న ‘కల’మాత్రం తెల్లారేపాటికి. తీరేలాగ కనబడ్డం లేదు. ఈ నగరంలో రాదార్లు, పోదార్లు అన్ని ప్రాంతాలకీ ఏదో ఒకరకంగా వుండాలి. గానీ, అలాలేవు. రైలో, బస్సో, ట్రాములో, ఆటోలో, మెట్రోలో- ఏవో ఒకటి బస్తీలనీ- పేటల్నీ యింకా దగ్గర చేయాలి. జనాలు మొబైల్స్ మీదా, వాట్సప్‌ల మీదా మాత్రం కలిసి మెలిసి వుండగలుగుతున్నారు- అన్నంత మాత్రాన ఒక సిటీ గ్లోబల్ సిటీ అయిపోదు. ఊరంతా వై.ఫై. వుంటే మనుషులు ఓచోటునుంచి మరో చోటుకి సుళువుగా- ‘కాన్ట్ ఫ్లై’- అంటే చేరుకోలేరు. ఉమ్మడి నగరంగా వున్నప్పటి అడ్వాంటేజ్- ఉమ్మడి రాజధాని అయిన తర్వాతేనే పోయింది. కారణాలు అనేకం.
‘‘పోనీ ఆ ‘ఉమ్మడి రా.్ధ.’అన్న మాటనీ, అవసరాన్నీ ఐనా దక్కనిచ్చాడా నాయుడుగారు?’’అంటూ ఓ దుకాణదారు ఆవేదన పడ్డాడు.
‘‘తనకేమో చెట్టు క్రింద వున్నట్లుందిట. మరి యిన్నాళ్లూ ఆ చెట్టు పండ్లేగా మహా రుచిగా వున్నాయ్!’’అంటూ మరో ఆటో అన్న- తను చదువుతున్న పేపరు ప్రక్కనబెట్టి, బేరాలకోసం గల్లీమొగదాకా ఎదురుచూస్తూ బాధపడ్డాడు.
‘‘ఉమ్మడి రాజధాని హోదా పదేళ్లుంటే, అదీ పోయి, మిగిలింది ‘ఉమ్మడి గవర్నర్’ మాత్రమే! రైల్వేమంత్రి సురేష్ ప్రభూని ఇన్‌ఫ్లూయన్స్ చేసి- హై.బా.నుంచి గుం టూరు మీదుగా బెజవాడకీ, కాకినాడకీ నాన్‌స్టాప్ స్పెషల్స్ వేయించి మరీ జనాల్ని పట్టుకుపోయి నదీ తీరస్థ మైదానంలో వదిలేశారండోయ్- ఆంధ్రా సి.ఎమ్.గారు’’అంటూ, ఓ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ వాపోయాడు. ‘‘నేను లాంగ్‌లీవ్ పడేశాలెండి’’అన్నాడు. తలో చెరుూ్య, తలోకాలూ కదిపితేనే ఏ నగర భాగ్యమయినా పెరిగేది. మెట్రో రైలు పట్టాలు- ఇతర గ్రహాలనుంచి దిగిన భూతంలాగా నగరమంతా బెదిరిస్తూ కనబడితేనే- ‘డెవలప్‌మెంట్’ పరవళ్లు త్రొక్కదు కదా? అంటున్నాడు- నాచారంనుంచి తార్నాకా మీదుగా ఉ.యూ- అనగా ఉస్మానియా యూనివర్సిటీకి లాంగ్ మార్నింగ్ వాక్ చేస్తూ ఓ పెద్దమనిషి! తార్నాక ఒక పోష్ ఏరియాట!! గార్డెన్ హవుసులే అన్నీ! వేరే వనమహోత్సవాలక్కరలేదిక్కడ. కానీ, సిటీ-బస్సులు కావాలి. ఈ ప్రాంతం పిల్లకాయలకి సిటీ బస్సులు అంటే తెలీవు. స్కూలు బస్సులే తెలుసు- అదీ కొందరికే. ఇక మ్యునిసిపాలిటీకి సిటీ బస్సులు యిచ్చేస్తే- ‘్ఫనిష్’!’’- అన్నదో యిల్లాలు.
కేవలం ‘మోటారు కార్ల ‘్భ’- ‘కుక్క్భా’- అనగా కార్ల సంఖ్య, ఊరకుక్కల సంఖ్య తెగ పెరిగిపోతే, సరా?
పోయినె్నల మార్నింగ్ వాకర్స్‌కి- పేట- పేటల్లో, గల్లీగల్లీల్లో తిరిగే వాళ్లకి- ‘టు లెట్’బోర్డులు తెగ దర్శనం యిచ్చేవి. ఇప్పుడు ‘టులెట్’లు పోయి ‘్ఫర్ సేల్’అన్న బోర్డులు వెలిశాయి. ప్చ్!
అయినా మన నగరం ఇండియా మొత్తంమీద ముంబాయి, కలకత్తా, న్యూఢిల్లీ, బంగలూరు, చెన్నైల కన్నా ‘వాస యోగ్యం, సుఖప్రదం’- అన్న కితాబు సంపాదించుకుంది.
ఇలా పండుగ చేసుకునే సందర్భాన్ని తెచ్చుకుంది- అసలు ఆ సందర్భం ఏమిటో వివరించనిండు- అవధరింపుడు- ‘హ్యూమన్ రిసోర్సస్ కన్‌సల్టింగ్ ఫర్- ‘మెర్సెర్’-అని ఒకటి వుంది. అది పొల్యూషన్, అంతర్జాతీయ స్కూళ్లూ (ఇంటర్ నేషనల్ స్కూల్స్) యితర విదేశీ ప్రమాణాలు- ఆసుపత్రులు వగైరాలను తరచి చూసి, ప్రపంచం మొత్తంమీద 230 నగరాల మీద పరిశీలక నివేదికల్ని ప్రకటించింది. అందులో మన జంట నగరాలకి 139వ ర్యాంకు దొరికింది. ‘‘ఓస్!’’అనకండి. ఇండియాలో చెన్నైకి 150; ముంబయికి 152, బంగలూరుకి 145; ఢిల్లీకి 154 ర్యాంకులు రాగా- పూణేకి 144; హై.బాద్‌కి 139 ర్యాంకులు వచ్చాయి. అంటే ‘గ్రేట్’కాదా? కాకపోతే మన సిటీకి పోయినసారి 138వ ర్యాంకు వుండేది అనుకోండి. కాకపోతే భాగ్యనగరానికి రుూ ర్యాంకు- హైటెక్కుల్లాంటి రకరకాల ‘టెక్కు’ల వల్లరాలేదు. హైదరాబాద్‌కి వున్న క్లయిమేట్ అంటామే ఆ, సదరు- పర్యావరణ సమతుల్యతవల్ల వచ్చింది. గాడ్ రుూజ్ గ్రేట్! అంటున్నాడో పెద్దాయన. అవును. ‘‘లేదురా యిటువంటి పీఠభూమి యింకెందూ’-అని పాడుకోవచ్చును. నీటి కొరత వున్నా, వూరంతా చక్కని పచ్చదనం విరిసి వుంటుంది.
గాలి వానలా? అదేంది సామీ? వరదలా? ఉప్పెనలా? మనకి తెలియవ్! చలికి మిగతా సిటీలకన్నా వెచ్చగా- ఎండకి బెజవాడ, ఢిల్లీకన్నా చల్లగా- సకల కాల సర్వావస్థల యందూ సమతూకంగల పరిస్థితులు ప్రకృతి సిద్ధంగా వచ్చాయ్. ఇక హెరిటేజ్ భవనాలు, పార్కులూ, ఉద్యానవనాలూ మిగతా సిటీస్ మీద మనది పైచెయ్యే! లగ్జరీకీ, ఇండస్ట్రీకీ యిక్కడ సమ ఉజ్జీవుంది. పేదోడికి బువ్వ దొరికే చిల్లర ‘కామ్-కాజ్’లు హమేషా వుంటాయి. అంచేత హైదరాబాద్- ఉగ్ర ప్రమాదం పొంచివున్నప్పటికీ- ‘సదాబహార్ దిల్‌ఖుష్‌నగర్’- అంటారు జనం-
ఇదే, ‘‘క్లయిమేటు బెజవాడకుంటేనా?’’అంటాడు ఆం ధ్రుడు- ‘‘తాత్కాలిక రాజధాని’’ అయిన విజయవాడ వాస్తవ్యుడు. కాకపోతే రుూ సంవత్సరం ఎండలు మండిపోయాయి. వాన లాలశ్యమైనాయి. భూగర్భ జలాలు యింకిపోయాయి కనుక 2015కన్నా 2016కి సిటీ ర్యాంకు పడిపోయింది. బై ది బై ప్రపంచంలో ఫస్ట్ ర్యాంకు వియన్నా (ఆస్ట్రియా)ది అని చెప్పాలిగా.
ఇండియాలో మొదటి వంద ర్యాంకుల్లో దరిదాపుల్లోకి కూడా ఏ సిటీ రాలేదు. స్విట్జర్లాండు ‘‘జూరిక్’’ నెంబర్ 2కాగా నెం.3 న్యూజిల్యాండ్‌లోని అక్లాండ్. మరో గుడ్‌న్యూజ్ ఏమిటీ అంటే ఇస్లామాబాద్ ర్యాంకు 193; కరాచీ 199, ఢాకా 216 ర్యాంకుల్లో వున్నాయి. అదీ మన సంతోషం.
సో, లెటజ్, సే కంగ్రాట్స్ టు హైద్రాబాద్!