సంపాదకీయం

చెలిమికి బలిమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్ ప్రధానమంత్రి షింజో అబే మన దేశంలో జరిపిన మూడు రోజుల పర్యటన తూర్పు ఆసియా దేశాల సమష్టి భద్రతలను పెంపొందించడానికి దోహదం చేసిన వ్యూహాత్మక పరిణామం, ఉభయ దేశాల సమాన సాంస్కృతిక వారసత్వాన్ని మరోసారి ప్రతిబింబింపచేసిన అద్దం... ముంబయినుండి అహమ్మదాబాద్ వరకు బుల్లెట్ రైలును నిర్మించడానికి జపాన్ సహకారం, ఉభయ దేశాల మధ్య ‘శాంతి ప్రయోజనాల అణుసహకారం’ వంటి అనేక ఒప్పందాలు అబే పర్యటన సందర్భంగా కుదరడానికి వాణిజ్యపరమైన ప్రయోజనాలకంటె ఉభయ దేశాల సంబంధాలలో నిహితమై ఉన్న సహస్రాబ్దుల చారిత్రక మైత్రి ప్రధాన నేపథ్యం! రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దశాబ్దుల తరబడి అమెరికా, సోవియట్ యూనియన్ కూటముల మధ్య కొనసాగిన ‘ప్రచ్ఛన్న యుద్ధ’-కోల్డ్ వార్- సమయంలో ఈ చారిత్రక మైత్రి కొడికట్టింది! సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత, ‘ప్రచ్ఛన్న యుద్ధం’ సమసిపోయిన తరువాత, చైనా అగ్రరాజ్యంగా ఏర్పడిన తరువాత తూర్పు ఆసియా దేశాల భద్రతకు వ్యూహాత్మక దురాక్రమణ ప్రమాదం ఏర్పడిపోయింది! కొడికట్టి ఉండిన భారత, జపాన్ మైత్రి మళ్లీ ఉజ్వలం అవుతుండడానికి ఈ ‘ప్రమాదం’ నేపథ్యం! తమ దేశానికి దక్షిణంగాను వియత్నాంకు తూర్పుగాను విస్తరించి ఉన్న సముద్ర జలాలపై చైనా ప్రభుత్వం ఆధిపత్యం చెలాయిస్తుండడం తూర్పు ఆసియా భద్రతను దెబ్బ తీసిన విపరిణామం! తమ దేశానికి తూర్పుగాను జపాన్ కొరియాలకు దక్షిణంగా ఉన్న సముద్ర జలాలను ‘జాతీయం’ చేసుకోనడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం తూర్పు ఆసియా భద్రతతో ముడివడి ఉన్న మరో విపరిణామం. ఈ సముద్ర ప్రాంతంలోని గగనంలో చైనా ప్రభుత్వం 2013లో ఏకపక్షంగా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి ఈ ప్రాంతాంలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ఆకాశంలోకి తమ అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ప్రవేశించరాదన్న చైనా ఆంక్షలను దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలు అతిక్రమించాయి. అంతర్జాతీయ జలమార్గాలున్న ఈ సముద్ర ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోవాలన్న చైనా లక్ష్యం తీవ్ర వైరుధ్యాలను సృష్టించింది! జపాన్‌తో మాత్రమే కాక అనేక తూర్పు ఆసియా దేశాలతో ఈ సముద్ర ప్రాంతాల ‘దీవుల‘ గురించి చైనా విభేదాలు తీవ్రతరవౌతున్నాయి! మన దేశాన్ని కూడ మూడు వైపులనుంచి నౌకా దళాలతో దిగ్బంధం చేయడానికి చైనా యత్నిస్తుండడం నడుస్తున్న కథ! ‘్భరత జపాన్’ స్నేహ బంధాన్ని చైనా వ్యతిరేకించడానికి, వెక్కిరించడానికి ఇదంతా ప్రాతిపదిక! గత ఏడాది సెప్టెంబర్‌లో మన ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌ను సందర్శించాడు. ఆ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబేను చైనా ప్రభుత్వం పరుషమైన పద జాలాలతో నిందించింది!
ప్రస్తుతం షింజో అబే మన దేశంలో పర్యటించిన సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు! చైనా ప్రభుత్వం వ్యూహం మార్చి ఉండవచ్చు! జపాన్ ప్రధాని మన దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా జరిగిన సమాంతర అంతర్జాతీయ పరిణామం పారిస్‌లో కుదిరిన ‘పర్యావరణ పరిరక్షణ ఒప్పందం’! కాలుష్యాన్ని పెంచడంలో అగ్రస్థానంలో ఉన్న చైనా, అమెరికా తదితర దేశాల దృష్టి ప్రస్తుతం ఈ ఒప్పందంపై కేంద్రీకృతమై ఉంది! అందువల్ల షింజో అబే మన దేశంలో జరుపుతున్న పర్యటన గురించి పట్టించుకునే తీరిక చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేదేమో! ఏమయినప్పటికీ చైనా ‘విస్తరణ’ వాదానికి గురి అవుతున్న అన్ని ఆసియా దేశాలతోను కలిసి ప్రతిఘటన యుతమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న తహ తహ జపాన్‌కు ఏర్పడి ఉంది! అందువల్లనే ‘మలబార్’ నౌకాదళ విన్యాస కార్యక్రమంలో జపాన్ చేరింది. ఇంతవరకకు భారత, అమెరికా నౌకాదళాల ఉమ్మడి విన్యాసాలు మాత్రమే జరుగుతున్నాయి. జపాన్ చేరికతో ఈ ద్వైపాక్షిక రక్షణ విన్యాసాలు త్రైపాక్షిక విన్యాసాలుగా మారాయి. ఇలా సమష్టి సైనిక విన్యాసాలు జరపడం వల్ల సమష్టి భద్రతా వ్యవస్థ ఏర్పడినట్టు కాదు. మన దేశం, చైనాతో కలిసి ఇలాంటి ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుపుతోంది కూడ! కానీ జపాన్ కూడ మనతో కలిసి ఇలాంటి విన్యాసాలకు సిద్ధపడడానికి కారణం ఉభయ దేశాల చారిత్రక సంబంధాలలో నిహితమై ఉన్న మైత్రి. అబే పర్యటనలో ఈ మైత్రి మరింతగా దృఢపడింది!
ఇలా ద్వైపాక్షిక మైత్రి దృఢతరం కావడం ఉభయ దేశాల, తూర్పు ఆసియా దేశాల సమష్టి భద్రతకు ప్రేరకం కాగలదు! వాస్తవానికి ఈ చారిత్రక మైత్రి కారణంగానే ఉభయ దేశాల మధ్య ‘పౌర అణు సహకారానికి’ ఇప్పుడు సూత్రప్రాయంగా ఇద్దరు ప్రభుత్వాధి నేతలు అంగీకరించారు! ఈ సూత్రప్రాయమైన అంగీకారం ఆచరణాత్మకమైన సమగ్ర అంగీకారంగా మారడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. ఏళ్లు పట్టవచ్చు! కానీ ‘మన దేశం భవిష్యత్తులో అణుపాటవ పరీక్షలను జరపరాదన్న’ నిబంధనను జపాన్ ప్రభుత్వం పట్టించుకొనడం లేదు. ఒకవేళ మన దేశం మళ్లీ ‘అణుపాటవ పరీక్షలు’ జరిపినట్టయితే సహకార ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అమెరికా బెదిరించింది, బెదిరిస్తూనే ఉంది. కానీ జపాన్ ప్రభుత్వం ఈ నిబంధనను ప్రస్తావించకపోవడానికి ప్రధాన కారణం ఉభయ దేశాల మధ్య మైత్రీభావం పెరుగుతూ ఉండడం! మళ్లీ అణుపాటవ పరీక్షలు జరపడం లేదని మన ప్రభుత్వం స్వచ్ఛందంగా ఇదివరకే ప్రకటించి ఉండడం వేరే సంగతి! కానీ అమెరికా వలె జపాన్ ఈ నిబంధన గురించి ఒత్తడి చేయడంలేదు! ఎందుకంటె తూర్పు ఆసియాలోని దాదాపు అన్ని దేశాలకూ ఆందోళనను కలిగిస్తున్న చైనా వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి వీలుగా మన దేశంతో రక్షణ సహకారాన్ని జపాన్ కోరుతోంది! ‘అమెరికా, ఐరోపా’ ఒక కూటమిగా, ‘చైనా, రష్యా’ మరో కూటమిగా ప్రస్తుతం అంతర్జాతీయ స మాజంపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి మరోవైపు ‘జిహాదీ’ ఉగ్రవాదం అంతర్జాతీయ సమాజాన్ని హడలెత్తిస్తూ ఉంది. అందువల్ల ‘్భరత్, జపాన్’ దేశాలు మరో ‘జట్టు’గా ఏర్పడడం అనివార్యమైన అంతర్జాతీయ పరిణామం...్భరత్ జపాన్ దక్షిణ కొరియాలు, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి-ఆసియాన్- కలిసి బలమైన ఆర్థిక, రక్షణ, వ్యూహాత్మక సమాఖ్యగా ఏర్పడినట్టయితే చైనా విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చు! ఈ చైనా ‘ఆధిపత్య విస్తరణ’ ప్రమాదం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో నరేంద్రమోదీ ప్రస్తావించాడు కూడ!
ఉభయ దేశాల మధ్య గల సాంస్కృతిక సమానత్వం ద్వైపాక్షిక మైత్రికి వారధి! వారణాసిలో ఉభయ దేశాల ప్రధానులు పవిత్ర గంగా నదీ మాతకు ‘హారతి’ ఇవ్వడం ఈ సాంస్కృతిక సమానత్వానికి ఒక ఉదాహరణ మాత్రమే! బుల్లెట్ రైలు, అణు ఇంధనం వంటి సమకాలీన వాణిజ్య ప్రయోజనాలకంటె దీర్ఘకాల సాంస్కృతిక సంబంధాలు ఉన్నతమైన వని ఉభయ దేశాల ప్రధానమంత్రులు తమ ప్రసంగంలో ధ్వనింపచేయడం చరిత్రకు అనుగుణం...జపాన్ సహా వివిధ ‘పూర్వ’ దేశాలలో అనాదిగా వేద విజ్ఞాన జీవనం వికసించడం ఈ చరిత్ర! తూర్పు ఆసియాలోనిదేశాలను పండిస్తున్న ‘మెకాంగ్’ నది నిజానికి ‘మాతృగంగ’... బౌద్ధ విజ్ఞానం జపాన్‌ను తూర్పు ఆసియాను ముంచెత్తడం కూడ ఈ సమాన సాంస్కృతిక వారసత్వంలో భాగం.. జపాన్ ప్రధాని మరోసారి వచ్చిన సాంస్కృతిక రాయబారి!