సబ్ ఫీచర్

వికసించాల్సిన ఆలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది విద్యా కార్యక్రమాలలో ముగ్గురు ముఖ్యమైన పాత్రధారులు. తల్లిదండ్రులు, ప్రభుత్వం, యాజమాన్యం ఈ ముగ్గురూ ఒకే విషయంపై ఎందుకు కేంద్రీకరిస్తున్నారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో చదువు చెబుతున్నప్పుడు పిల్లలకు అర్థమయ్యే విధంగా భావాల వ్యక్తీకరణ జరగాలి. అది తల్లిదండ్రుల కోరిక. అదే యాజమాన్యమైతే ‘‘ఉపాధ్యాయుడు సరైన సమయంలో తరగతి గదికి వెళ్లాలి. తరగతి గదిని క్రమంగా క్రమశిక్షణతో నడిపించాలి. అదే ప్రభుత్వమైతే ఇచ్చిన సిలబస్‌ను ఉపాధ్యాయుడు పూర్తిచేయాలి. కొత్త పద్ధతులు అవలంభించే భావనలు వ్యక్తీకరణ జరగాలి. ఈ మూడు విషయాలలో కూడా ఉపాధ్యాయునిపైననే కేంద్రీకరణ ఉంటుంది. పిల్లలు కూడా చదువు చెప్పడమంటే ఉపాధ్యాయుని భావ వ్యక్తీకరణే ప్రధానమైపోతుంది. పిల్లలు కూడా టీచర్ చెప్పిందే చదువు అనుకుంటున్నారు. విద్యార్థి ఇంటికి వెళ్లి టీచర్ చెప్పిన చదువునే రిపీట్ చేస్తాడు. పాఠశాల నిర్వహణలో కూడా ఉపాధ్యాయుడే ప్రధాన కేంద్రమైపోయాడు కానీ లెర్నర్ (నేర్చుకునేవాడు) సెకండ్ గ్రేడ్ అవుతున్నాడు. వాస్తవంగా విద్యా సముపార్జనలో ఉపాధ్యాయుని కన్నా విద్యార్థే ప్రధానం. సిలబస్ ప్రధానం కాదు. ఉన్న సిలబస్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కానె్సప్ట్స్‌ను ఉపాధ్యాయుడు అధ్యయనం చేసుకుని పిల్లలను సులభమైన శైలికి మార్చాలి. సిలబస్‌ను పూర్తిచేయటం ప్రధానం కాదు. అందులో ప్రధానమైన విషయాలను యథాతథంగా చెప్పటం ప్రధానం కాదు. విద్యార్థికి అవగాహన అయ్యేరీతిలో దాన్ని మార్చాలి. దానికై తన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఉపాధ్యాయ శిక్షణలో నేర్చుకున్న మెళకువలను ఉపయోగించుకోవచ్చును. తనలో దాగివున్న ప్రజ్ఞను ఉపయోగించుకుని తన బోధన ద్వారా విషయాలను అర్థమయ్యే విధంగా సులభతరం చేయాలి. విద్యార్థికి ఆ కానె్సప్ట్స్‌ను సులభతరం చేయటమంటే దానిపై వారిని ఆలోచించే స్థాయి తీసుకురావాలి. పిల్లలచేత విషయాన్ని కంఠస్థం చేయించటం కాదు. ఆ కానె్సప్ట్స్‌ను విభిన్న కోణాలలో పిల్లలు ఆలోచించే విధంగా బోధన జరగాలి. తరగతి గదిలో ఫలితాలపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు. గడువులోపల సిలబస్ పూర్తిచేశామా? పుస్తకంలో వున్న విషయాలనే బోధించటమా? భావ వ్యక్తీకరణ అంటే బోధన అంటే ఉన్నది ఉన్నట్లు యథాతధంగా చెప్పటం కాదు కదా? దానిలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను ఆలోచించే స్థాయికి తీసుకురావటం చేయాలి. ఆ ఆలోచనలతో పిల్లలు కొత్త కోణంలో పరిశీలించే స్థాయికి తీసుకురావాలి. కోర్ కానె్సప్ట్ అర్థమైతే పిల్లలు తమ నేపథ్యంలోంచి చూస్తారు. పిల్లలు చూసిన కోణాలే అసలు చదువు అవుతుంది కానీ ఉపాధ్యాయులు చెప్పిందే చదువుకాదు అని కొందరు విద్యాధికులు వాదిస్తున్నారు. ఉపాధ్యాయుడు చదువులో భాగస్వామి కానీ సర్వస్వంకాదు. తరగతి గదిలో విద్యార్థి పెళ్లికొడుకులాంటి వాడు కానీ ఉపాధ్యాయుడు పెళ్లికొడుకు కాదు. కానీ పాలకులు అందుకు భిన్నంగా ఉపాధ్యాయులు తరగతికి పోయారా? లేదా? అని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ బాహ్య కార్యక్రమాలు అవుతాయి. ప్రధానమైన అంశం ఏమిటంటే జరిగిన బోధననుంచి పిల్లలు ఆలోచించారా? అన్నది చూడాలి. విద్యార్థి ఆలోచనను చర్చకు పెట్టాలి. పుస్తకాన్ని పునశ్చరణ చేయించటం లాంటి పనులు బోధనలో కొనసాగిస్తూనే ఉండాలి. దానితోపాటు పాఠంలోకి పిల్లలను గర్జీకృతం చేయగలగాలి.
పిల్లలు చెప్పిన పాఠంతో ఆలోచించి స్వతంత్రంగా ఎంత దూరం ప్రయాణం చేశారు. మార్గదర్శనం అంటే పిల్లల చేయి పట్టుకుని నడిపించటం కాదు. పిల్లలు స్వతంత్రంగా నడిచి ముందుకు సాగేటట్లు చేయటం జరగాలి. పిల్లలకు బోధన ఒక సహాయకారి మాత్రమే. అది ఆలోచనలకు బీజం కావాలి.

- చుక్కా రామయ్య