సబ్ ఫీచర్

ఆంగ్ల మాధ్యమం అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి 3కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది2అన్న చందాన మారింది. ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అంపశయ్యమీద వున్నాయి. ఇందుకు కారణాలను విశే్లషించడం వృధా ప్రయాస తప్ప ఎటువం టి ప్రయోజనం ఉండదు. 3తిలా పాపం తలా కొంచెం అన్న చందాన ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితికి చేరడానికి అటు ప్రభుత్వ విధానాలు ఎంత కారణమో, ఉపాధ్యాయ వర్గం కూడా అంతే కారణమనడంలో సందేహం లేదు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నమోదు చేయడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు సత్యదూరం.
ప్రాథమిక పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం వలన విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోతోంది. దీనికి కారణం ఎవరో కాదు, సదరు విద్యార్థుల తల్లిదండ్రులే. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు వచ్చే పిల్లలు నిరుపేద, పేద వర్గాలకు చెందిన వారే. వీరు ఉదయానే్న పొట్ట కూటికోసం కూలీ పనులకు వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తారు. పిల్లలు బడికి వెళ్తున్నా రా లేదా అన్న అంశం పరిశీలించే అవకాశం వీరికి ఉండదు. పాఠశాల ప్రారం భం అయిన తరువాత ఉపాధ్యాయులు బడికి రాని పిల్లలను పిలిపించుకొంటారు. ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఉదయం 9.30 గంటలనుంచి 9.45 గంటలు పడుతుంది. ఈ విధంగా ఉపాధ్యాయులు పిల్లల్ని బడికి రప్పించడానికి ప్రయత్నిస్తూంటేనే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. రేషనలైజేషన్ పేరిట ప్రాథమిక పాఠశాలలను మూసివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇక బయోమెట్రిక్ పద్ధతిలో విద్యార్థుల హాజరు నమోదు చేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు అయ్యే ప్రమాదం వుంది. బయోమెట్రిక్ విధానంలో ఉదయం 9 గంటల వరకు మాత్రమే విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. తరువాత విద్యార్థులు పాఠశాలకు వచ్చినప్పటికీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ రోజు వారు గైర్హాజరు అయినట్లే. వచ్చే సంవత్సరంనుంచి జరిగే రేషనలైజేషన్‌కు ప్రభుత్వం ఈ బయోమెట్రిక్ గణాంకాలను తీసుకొంటుంది. దీంతో పలు ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయి. దీనివలన ప్రైవేటు పాఠశాలలకు డిమాండ్ పెరుగుతుంది.
బయోమెట్రిక్ విధానంనుంచి విద్యార్థులను మినహాయించి, ఉపాధ్యాయులకు వర్తింపచేయాలి. దీనివలన వారందరూ సమయపాలన పాటించే అవకాశం వుంది. దీనితోపాటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాథ్యమాన్ని ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు అందరూ ఆంగ్ల మాథ్యమం మోజులో ఉన్నారు. దీనివలన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే అటు ప్రైవేటు ఇటు కార్పొరేటు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలో కొన్ని ప్రాథమిక పాఠశాలలుగా మోడల్ స్కూల్స్‌గా ఎంపిక చేసింది. ఈ మోడల్ స్కూల్స్‌లో ఆంగ్ల మాథ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, నేటివరకు అందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలు శూన్యం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం తొలగాలంటే, ప్రాథమిక స్థాయినుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాల్సిందే. అయితే, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొండంత అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏ మేరకు ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుందో వేచి చూద్దాం.

-పి.మస్తాన్‌రావు