మెయన్ ఫీచర్

అవసరానికి మించిన ప్రాజెక్టులతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీఘ్రగతిన మార్పునకు గురౌతున్న భూగోళ పరిస్థితిపై ఒక నివేదికను తయారు చేయాలని కోరుతూ, 1983లో ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణంపై ప్రపం చ స్థాయి కమిటి’ని నార్వే మాజీ ప్రధానమంత్రిణి అయిన గ్రొహార్‌లెమ్ బ్రుంట్‌లాండ్ అధ్యక్షతన నియమించింది. 22 దేశాలనుంచి ప్రాతినిధ్యంగల ఈ కమిటీలో అధిక దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలే. బ్రుంట్ లాండ్ కమిటీగా పిలువమడే ఈ కమిటీ ధ్వంసమైపోతున్న భూగోళానికి సంబంధించిన అనేక నగ్న సత్యాలతో కూడిన నివేదికను 1987లో సమర్పించింది.
‘సుస్థిర అభివృద్ధి’ అనే నినాదంతో ఈ కమిటీ మూడు ప్రధానమైన సూచనల్ని చేసింది. అభివృద్ధి మాత్రమే దారిద్య్రాన్ని తొలగిస్తుందనేది మొదటిది కాగా, పర్యావరణ సమైక్యత లేకుండా సాంఘిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యంకాదనేది రెండోది. ఈ రెండు శాస్ర్తియంగా జరుగుతేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమనే మూడో సూచన చేస్తూ, ప్రకృతి వనరులను కనీసస్థాయిలోనే వినియోగించాలని, అడవుల్ని పునరుద్ధరించాలని, పునరుద్ధరించబడే ఇంధనాల ఉత్పత్తులపై దృష్టి సారించాలని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని తెలిపింది.
అమెరికా సైన్సు, ఇంజినీరింగ్, మెడిసిన్‌కు చెందిన జాతీయ అకాడమీల అధ్యక్షులైన ఫ్రాంక్ ప్రెస్, రాబర్ట్ ఎం. వైట్, శామ్యూల్ ఒథైర్ ఈ సందర్భంగా 1988లో, నాటి అమెరికా అధ్యక్షుడైన జార్జ్‌బుష్‌కు ఒక లేఖ రాస్తూ, భూమండలానికి వ్యతిరేకంగా జరుగుతున్న విధ్వంసాన్ని అమెరికానే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ లేఖను రాసిన మరుసటి సంవత్సరం మే నెలలో, ‘్భగోళిక మార్పులు-ఒకే భవిష్యత్తు’ అనే అంశంపై వాషింగ్టన్ డిసిలో ఓ సదస్సు జరిగింది. పై అకాడమీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో భూగోళాన్ని రక్షించడానికి అనేక సూచనల్ని చేసింది. కాని మనదేశంలో ఇలాంటి సూచనల్ని ఇచ్చే వ్యవస్థలు, అందునా ప్రభుత్వస్థాయి సంస్థలు వెదికినా కానరావు. ప్రభుత్వ గొంతుకే ప్రతిధ్వనించడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతన్నదీ అదే.
సాధారణంగా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను వివిధ నిరసన పద్ధతుల ద్వారా ప్రజలు తెలియజేస్తారు. ఈ సమస్యల్ని గుర్తించిన ప్రతిపక్షాలు, మీడియా, ప్రజా గొంతుతో జతకడుతాయి. ఈ ఉద్యమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు. తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు నిండకముందే, ప్రాజెక్టుల పేరున జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడం బాధాకరం. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించిన పాలకపార్టీ ప్రజల్ని సమీకరించి కౌంటర్ ఉద్యమాన్ని చేయించడం గమనార్హం. ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమాలు ప్రతిపక్షాల దిష్టి బొమ్మల్ని తగులబెట్టడం ప్రభుత్వ దుస్సాహస చర్యనే. ఉద్యమాలు రాకుండా చూస్తూ, నిలువరించాల్సిన ప్రభుత్వమే ప్రజల్ని రెచ్చగొట్టి, రెండుగా చీల్చడం జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా లబ్దిపొందే వర్గాలు అభివృద్ధి కాముకులుగా, నష్టాల్ని ఎదుర్కొనే వారిని, నిర్వాసితుల్ని, నిరసనకారుల్ని, అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేసింది. కాని, ఈ ప్రజలంతా నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఎన్నికల్లో తెరాసను గెలిపించి, తెరాస చేతనే ‘శభాష్’ అనిపించుకున్నారనేది తెరాసకు పట్టడంలేదు. అంటే, ఎల్లవేళలా పాలకులకు అనుకూలంగా ఉండాలన్నదే ప్రజాస్వామిక సిద్ధాంతంగా మారింది.
ఈ ప్రాజెక్టుల తతంగం వైఎస్‌ఆర్ కాలంలోనే రచించబడిందనేది తెలిసిందే. ప్రాణహిత-చేవెళ్ల పథకం, రాజకీయ కాంట్రాక్టర్లకేనని నాడు అందరితో పాటు తెరాస నిందించింది. నాడు మంచి పథకమని కితాబు ఇవ్వని తెరాస, మార్పులు చేర్పులతో అదే పథకాన్ని అభివృద్ధికర ప్రాజెక్టుగా అభివర్ణించడం గమనార్హం. నదీ గర్భంగా, నీటి లభ్యతను బట్టి నీటిని పొందే హక్కును బట్టి ఎన్ని ప్రాజెక్టులనైనా కట్టుకోవచ్చు. అదీ అన్ని రకాల షరతులకు లోబడి జరగాలి. కాని, ఓ మైదాన ప్రాంతంలో, ఆ నది పరివాహక ప్రారంభ ప్రాంతంలో, వర్షాధార, మెట్ట పంటల్ని పండించుకొని హాయిగా ఉంటున్న ప్రజల కడుపుపై కొట్టి, మరొకరి కడుపు నింపేందుకై కట్టే విధానమే ఆక్షేపణీయం.
ప్రాణహిత, కాళేశ్వరం, ఎల్లంపల్లిలు సముద్ర మట్టానికి 130-140 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాలు. మల్లన్నసాగర్ నిర్మిత ప్రాంతం రమారమి 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పైగా ఈ ప్రాంతంలో పడిన వర్షం రెండు పాయలుగా తూర్పు, పడమరలుగా ప్రవహిస్తుంది. పడమరగా ప్రవహించిన పాయ మంజీరానదిలో కలిసి నిజాంసాగర్ గుండా, కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. మరోపాయ నేరుగా ఎగువ మానేరు చేరి, మానేరు నదిగా కాళేశ్వరం వద్ద గోదావరిని చేరుతుంది. ఇలా ఈ ప్రాతంలో పడిన వర్షపునీరు ఓ వృత్తాకారంలో ప్రయాణించి గోదావరిని చేరడం ప్రకృతి సహజం. ఈ విధంగా పడిన నీటిని చెరువులు, కుంటలు, మత్తళ్లు నిర్మించి వాడుకోవడం కాకతీయుల కాలం నుంచి నైజాం కాలం దాకా సాగింది. రన్ ఆఫ్ ది రివర్ సూత్రీకరణతో నిర్మించిన గొలుసుకట్టు నీటి నిర్మాణ వ్యవస్థ దక్కన్ పీఠభూమిపై నైజాం కాలంలో మరింతగా అభివృద్ధి చెందింది. కాకతీయ మిషన్ పథకం ద్వారా తిరిగి ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామంటూ మట్లాడుతున్న తెరాస ప్రభుత్వం ఈ భారీ నీటి ప్రాజెక్టును అవసరంలేని, అనువుగానిచోట ఎందుకు నిర్మించ తలపెడుతున్నారో రాజకీయాలు తెలిసిన వారికి అర్థవౌతూనే ఉంది.
గోదావరి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో నది మట్టం నుంచి రమారమి, 450 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకొని రావాలన్న ఆలోచనే ప్రకృతి విరుద్ధమైంది. సాంకేతికంగా ఇవన్నీ సాధ్యంగా తోచినా, అనేక సమస్యలతో కూడుకునే ప్రాజెక్టులు దీర్ఘకాలికంగా పూర్తికాకపోగా, అత్యధిక వ్యయ ప్రయాసలతో ఉంటాయి. నిర్మితమైన తర్వాత కూడా నీటి నిర్వహణ తలనొప్పిగా ఉంటుంది. దేవాదులనే దీనికి చక్కని ఉదాహరణ. పైగా తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఈ సంకల్పంతో ఉండకపోవచ్చు. అతి తక్కువ నిర్వహణతో నడిచే గొలుసుకట్టు చెరువుల్నే గత 50 ఏళ్లుగా ప్రభుత్వాలు పట్టించుకోని విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమానికి దీన్ని ఓ ప్రధాన సమస్యగా చూపింది తెలిసిందే.
భూమి సహజసిద్ధంగా ఓ నైసర్గిక స్వరూపంతో ఉంటుంది. పర్వతాలు, గుట్టలు, పీఠభూములు, లోయలు, వాగులు, వంకలు, నదులు, మైదానాలు దీని ప్రతిరూపాలు. వేటికవే సాటి. ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వీటికి అనుగుణంగానే సాగుతాయి. వ్యవసాయం కూడా వీటికి అనుగుణంగానే అభివృద్ధి చెందింది. తరి, మెట్ట, మాగాణి, ఖుష్కి అంటూ నీటి తీరువాను బట్టి పంటల్ని పండించి భూసారాన్ని కాపాడటం జరిగింది. తదనుగుణంగా తృణధాన్యాలు, అపరాలు పండించి బంగారంతో తులతూగించారు. కాని ఇప్పుడంతా నీటి పంటల ఆలోచనే. భూమిని నిస్సారం చేసే పథకాలే. అధిక నీటితో డెల్టా లవణీయంగా మారి, పంటలు పండని స్థితికి చేరిన విషయం హెచ్చరించబడుతూనే ఉంది. ఆంధ్రా లాంటి నీటి వ్యవస్థల్ని ఏర్పరచుకోవడం, భూమిని భూమిగా కాకుండా చూడడమే.
పడిన వర్షంలో పదిశాతం భూపొరలలో నిల్వగా, తొమ్మిది శాతం భూగర్భజలంగా మారుతుంది. 41 శాతం ఆవిరిగా వాతావరణంలో చేరగా, 40 శాతం తిరిగి ప్రవాహంగా సముద్రాన్ని చేరాల్సిందే. లేకపోతే సముద్రాలు కూడా వట్టిపోతాయి. ఈ కాలచక్రాన్ని పట్టించుకోకుండా, అవసరానికి మించిన నీటిని భారీ ప్రాజెక్టుల పేరున నిర్మించడం భవిష్యత్తులో రాబో యే ఆగ్రోబిజినెస్ వ్యవసాయానికేనన్న బాలగోపాల్ మాటలు ఈ సందర్భంగా అక్షర సత్యాలు.పల్లమెరిగే నీటిని తిరిగి మెట్టనెరిగేలా చేయడమే అసలు రాజకీయం కాదా?

దేవాదుల ప్రాజెక్టు (ఫైల్ ఫోటో)

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162