ఉత్తరాయణం

ఎస్‌సిల వర్గీకరణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌సిల వర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్ సముచితమైంది. హిందూ షెడ్యూల్డుకులాల్లో మొత్తం 54 ఉప-కులాలు ఉండగా వీటిల్లో మాదిగ ఉప- కులానికి చెందిన ప్రజల జనాభా అధికం. వెనుకబడిన వర్గాల్లో ఇప్పటికే ఎ, బి,సి,డి వర్గాలున్నాయ. ఇదే సూత్రా న్ని షెడ్యూల్డు కులాలకు కూడా వర్తింపజేయడం న్యాయం.
- డాక్టర్ హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
కరవు భత్యం మంజూరు చేయాలి
ఎప్పుడో మంజూరు చేయాల్సిన కరువు భత్యాన్ని తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు నేటికీ వాయదాల మీద వాయదాలు వేసుకుంటూ ఇప్పటికీ తమ ఉద్యగులకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ఉద్యోగుల సహనానికీ హద్దుంటుంది. వారి సహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వా లు పిఆర్‌సి బకాయలను తక్షణమే చెల్లించాలి. తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన వారంలోపు జి.ఒ. జారీ చేస్తుంది. ఆర్థికంగా లోటులేదని ప్రకటించే తెలంగాణ ప్రభుత్వమైనా త్వరగా ఇస్తే మంచిపేరు తెచ్చుకున్నవారు అవుతారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం లోపుగానైనా ఈ బకాయలను చెల్లించాలి.
- చామర్తి వెంకట రామకృష్ణ, హైదరాబాద్
సహజహక్కును కాలరాయొద్దు
రాజ్యసభలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం లో కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడి కబాలి సినిమాని టికెట్ లేకుండా చూపించింది. కాంగ్రెస్ చేసిన యాగీ అద్భుతమైనా ఫలితం తెల్లారినట్లే ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల న్యాయమైన హక్కు. అన్ని పార్టీలు ముక్తకంఠంతో కోరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ తనకున్న అవకాశం మేరకు, అందివచ్చిన వేదికల ద్వారా ఈ విషయమై ప్రయత్నించడంలో ఏ మాత్రం తప్పన్నదే లేదు.
అయతే విభజన విషయంలో తొందరపాటుతో సమస్యను సృష్టించిందే కాంగ్రెస్. చక్కగా, పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని నైపుణ్యంతో విభజించడం మాని, కబేళాకి పంపి ఇప్పుడు కబాలి స్థాయలో శివాలెత్తడమే వింత. పైగా ఆ విషయమై రాజ్యసభని నడవనివ్వకుండా చెయ్యడం మరో వింత. అయతే అధికార పక్షం చేస్తున్న రాజకీయం కూడా తక్కువేం కాదు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడి సంబంధిత బిల్లు చర్చకి రాకుండా అద్భుత విన్యాసాలే చేసింది. రాష్ట్రానికి చెందిన తెదేపా, వైకా పాలకు మొత్తం ఎపిసోడ్‌లో అతిథిపాత్రలే మిగిలాయ. ఏమైనా రాష్ట్రానికి సహజ హక్కుని రాజకీయ విన్యాసా లకు బలి చెయ్యడం తీరని ద్రోహం. ప్రజలందరికీ మేలు చేసే నిర్ణయాల పట్ల చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు అన్ని పక్షాలు చెయ్యాల్సిందే తప్ప లాభమెవరికి, క్రెడిట్ ఎవరికి అంటూ లెక్కలు వేయరాదు. వేస్తే లెక్కలు తప్పి బోర్లా పడటం తథ్యం. నిజానికి ఇప్పుడు పార్టీలు వేసుకుంటున్నది ఈ లెక్కలే.
- డా. జివిజి శంకరరావు, పార్వతీపురం
నీటి సరఫరా అధ్వాన్నం
నీరే సకల జీవ కోటికి ప్రాణాధారం అన్నది నిర్వివాదాంశం. భూగర్భ జలాలు అడుగంటడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత నెల రోజులుగా శ్రీకాకుళం పట్టణంలో నీటి సరఫరా అధ్వాహ్నంగా మారింది. మున్సిపాలిటీ కొళాయిలు ఎప్పుడొస్తాయో ఎవ్వరికీ తెలీని పరిస్థితి. రక్షిత నీటి పథకం కొళాయిల నుండి నల్ల రంగు, బురద రంగులో నీరు వస్తోంది. అదీ గృహావసరాలకు సరిపడనంత సరఫరా కావడం లేదు. మరికొన్నిసార్లు పురుగులు, మట్టీ, చెత్తాచెదారంతో కూడిన నీరు వస్తోంది. అసలే సురక్షిత నీటి సమస్య కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ అపరిశుభ్ర నీరు గోరుచుట్టుపై రోకలి పోటుగా మారింది. గతంలో లక్షలాది రూపాయల వ్యయంతో ఖరీదుచేసిన నీటి నాణ్యతా పరిశీలన కిట్లు అసలు ఉపయోగంలో లేవు. శివారు ప్రాంతాలలో నీటి ట్యాంకర్ల జాడే లేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం