సబ్ ఫీచర్

ప్రశ్న ఆలోచనల పరికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాడు విద్యారంగానికి సవాలు ఏమిటంటే పిల్లల ఆలోచనా విధానాన్ని బహిర్గతం చేయటం. అంటే అవగాహన అనే దాన్ని పరిశీలించటానికి ఒక కిటికీని తయారుచేయాలి. పిల్లల అవగాహనాశక్తిని పరిశీలించడానికి ఒక ద్వారాన్ని చూపించాలి. విద్యార్థి పాఠాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నాడు? తాను చూసిన విషయాలను ఎలా పరిశీలించ గలుగుతున్నాడు? దీన్ని పరిశీలించగలిగితే విద్యార్థి భావనలను ఉపాధ్యాయుడు చూడగలిగితే దానికి అనుగుణమైన అవకాశాలు కూడా కలిగిస్తాడు. దాని తర్వాత మరో అడుగుముందుకు వేసేందుకు, పిల్లలు మరో స్టెప్ వేసేందుకు ఉపాధ్యాయుడు దోహదపడతాడు. భావనలు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి? అంటే ఈ తరం పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? దానిని ముందుకు ఎలా తీసుకుపోవాలి? వాళ్ల ఆలోచనలు, భావనలను ఏ విధంగా జోడించాలి? అలాగే వాటిని విస్తరింపచేయాలి? ఏది చేయగలిగితే విద్యార్థులలో అవగాహనాశక్తి పటిష్టవౌతుంది? ఈ విధంగా చేసినప్పుడే లెర్నింగ్‌కు టీచింగ్ సహాయపడుతుంది. ఇదివరకు మనిషి పరికరాన్ని సృష్టించలేకపోయాడు కాబట్టి ఆలోచనా విధానాన్ని త్రవ్వేందుకు, భావనలను విస్తరింపచేసేందుకు కావల్సిన పరికరాలను ఉపాధ్యాయుడే సృష్టించుకుంటాడు. తాను బోధించిన విషయం విద్యార్థిలో ఏ భావనలు ఉత్పత్తిచేశాయో తెలుసుకునేందుకు తన బోధనలో చెప్పిన విషయాలపై పిల్లలతో చర్చించటం, ప్రశ్నించటం చేస్తారు. ఉపాధ్యాయులకు ప్రశ్నించటమనేది ఒక పరికరం. ఆ ప్రశ్న ఉపరితలమైన జ్ఞానాన్ని రాబట్టడానికై ఉపాధ్యాయుడు ప్రయత్నంచేస్తాడు. కానీ మన బోధనతో విద్యార్థిలో జరిగిన భావాలను రాబట్టడం లేదు. అనగా మన బోధనే చదువైపోయింది. విద్యార్థి ఆలోచనలో ఉపాధ్యాయులు భాగస్వాములు కాకపోతే కొత్త భావనలు పట్టవు. తరగతి గదుల్లో లెర్నింగ్ జరగకపోతే ఫలితాలు ఉండవు. ప్రశ్నను రూపొందించేటప్పుడే ఉపాధ్యాయుడు సాధన చేయాలి. తానువేసే ప్రశ్నతో విద్యార్థుల మేధస్సు తలుపులను తెరిపించగలగాలి. ప్రశ్న అనేది విద్యార్థి ఆలోచనా విధానాన్ని పరిశీలించే ఒక అవకాశం. తరగతి గదిలో ఆ విద్యార్థుల ప్రతిస్పందన వినేందుకు అవకాశం కల్పించాలి. దానినే సమస్య పరిష్కారం అంటున్నారు. మనం చెప్పిన వాక్యం విద్యార్థులకు సమస్యలు సృష్టించాలి. దానికి పిల్లలే పరిష్కారం కనుగొనాలి. అనగా తరగతి గదిలోపల ప్రతి అడుగున బోధన, ప్రశ్నించటం, ఆ ప్రశ్నతో ఆలోచనల భావనలు ఉత్పత్తికావటం, తిరిగి ఉత్పత్తి అయిన భావనలను ఉపాధ్యాయుడు వినటం ఈ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా జరిగితే టీచింగ్‌కు, లెర్నింగ్‌కు అంత సమన్వయం జరుగుతుంది.
ఈ అవకాశం కల్పించక పోవటంవలన ఉపాధ్యాయుల భావవ్యక్తీకరణ పిల్లల ఆలోచనా విధానానికి తాకటం లేదు. విద్యార్థి భాగస్వామికాక ఉపాధ్యాయుని మన్ననలను పొందటానికై తాను విన్నది మాత్రమే రిపీట్ చేస్తున్నాడు. అందుకే మన విద్యావిధానంలో టీచర్ ప్రధానమైపోయాడు. తరగతి గది టీచర్‌పైన కేంద్రీకరిస్తున్నారు కానీ విద్యార్థి ఆలోచనను సమన్వయపరచటం లేదు. విద్యార్థి ఆలోచనను బైటకు తీసుకురావాలంటే ప్రశ్న ఎన్నో సమాధానాలకు అవకాశం కల్పించాలి. వేసిన ప్రశ్న తను చెప్పిన విషయానికే సమాధానంగా ఉంటే, ఒకే భావనను ఆశిస్తుంటే పిల్లల్లో ప్రతిభ వెలగదు. విద్యార్థి ప్రతిభను ఉపాధ్యాయుని యొక్క బోధనతో అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల్లో పిల్లల ఆలోచన బైటకు రాబట్టడానికి వివిధ పరికరాలను ఉపాధ్యాయుని ఆలోచనల మేరకు ఉపయోగిస్తున్నారు. అంటే లైబ్రరీ, ప్రయోగాలు చేయించే ల్యాబ్‌లు, మ్యూజియంలకు తీసుకుపోవటం, విద్యావిజ్ఞాన పర్యటనలకు తీసుకుపోవటంవల్ల పిల్లల్లో ఎన్నో భావనలు ఉత్పత్తి అవుతాయి. మనం చెప్పే చదువుకు అందరు కూడా ఒకే ఆన్సర్ ఇవ్వటం, ఉపాధ్యాయుడు ఒకే ఆన్సర్‌ను ఆశించటం చిలకపలుకుల చదువు అవుతుంది. ఉపాధ్యాయుడు ప్రశ్నలు రూపొందించేటప్పుడు ఎన్నో సమాధానాలకు అవకాశం ఉండాలి. అదే ఉపాధ్యాయులకు గొప్ప పరికరం. ప్రశ్న ఆలోచనలను బహిర్గతం చేసే పరికరం.

- చుక్కా రామయ్య