సంపాదకీయం

శరణార్థికి ‘నీడ’నివ్వరాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అఫ్ఘానిస్తాన్ నుంచి నిర్వాసితులైన హిందూ, క్రైస్తవ శరణార్థులకు మనదేశపు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడం వారి అమానవీయ ప్రవృత్తికి నిదర్శనం. దశాబ్దులపాటు ఈ దేశాలలో రాక్షసకాండకు మతోన్మాదుల అణచివేతకు బలైపోతున్న హిందువుల పట్ల ఈ మన ప్రతిపక్షాల వారికి జాలి కలుగకపోవడం పాషాణ హృదయ ప్రవృత్తికి నిదర్శనం. ఈ శరణార్థులకు మనదేశపు పౌరసత్వం కల్పించడానికి వీలుగా 1955వ సంవత్సరం నాటి పౌరసత్వం చట్టానికి, 1920 నాటి పాస్‌పోర్ట్ చట్టానికి, 1946 వీదేశీయుల వ్యవహారాల చట్టానికి తగిన సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం మానవత్వ దృక్పథానికి నిదర్శనం. దశాబ్దుల క్రితం జరుగవలసిన ఈ సవరణలు, ఇప్పటి వరకు జరుగకపోవడం మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల క్రూరమైన నిర్లక్ష్య భావానికి నిదర్శనం. ఇప్పటికైనా ఈ సవరణబిల్లును మన ప్రభుత్వం ప్రతిపాదించడం మతోన్మాద జిహాదీ బీభత్సకాండకు, మత రాజ్యాగ వ్యవస్థకు బలైపోయిన పాకిస్తానీ, బంగ్లాదేశీ, అప్ఘానీ అల్పసంఖ్యాక ప్రజలకు దావాగ్నిశిఖల మధ్య కురిసిన ‘జల్లు’..! కానీ ప్రతిపక్షాలు కొన్ని ఈ సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించాయి. మరికొందరు విపక్ష సభ్యులు ఈ బిల్లును పార్లమెంటు సంయుక్త అధ్యయన సంఘానికి నివేదించాలని లోక్‌సభలో ఆగస్టు పదకొండవ తేదీన పట్టుపట్టారట. అందువల్ల ఈ బిల్లును విస్తృత అధ్యయనం చేయడానికి కూలంకషంగా పరిశీలించడానికి వీలుగా ‘ఉమ్మడి సంఘానికి’ నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటు ఉభయసభల సంయుక్త అధ్యయన సంఘం- జాయింట్ సెలక్ట్ కమిటీ-వారు ఎన్నినెలల పాటు ఎన్ని ఏళ్లపాటు పరిశీలిస్తారో మరి. దేశ విభజన 1947, ఆగస్టు 14వ, 15వ తేదీల మధ్య రాత్రి జరిగిన నాటి నుంచి పాకిస్తాన్ హిందువుల జీవితాలలో చీకట్లు కమ్ముకోవడం భయంకరమైన చారిత్రక వాస్తవం. విభజనకు పూర్వం అనాదిగా అఖండ భారతదేశంలో సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లింది. ఇస్లాం మతస్థులకు ప్రత్యేక దేశం కావాలన్న మతోన్మాదం ప్రాతిపదికగా, జిహాదీ ప్రవృత్తి ప్రాతిపదికగా బ్రిటన్ సామ్రాజ్యవాదులు మనదేశాన్ని విడగొట్టి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశారు. అంతవరకు సర్వమత సమభావ సమాజం వెల్లివిరిసిన ప్రాంతం పాకిస్తాన్‌గా రూపొందగానే అక్కడ సర్వమత సమభావం అంతరించింది, ఇస్లాం మతరాజ్యంగా పాకిస్తాన్ ఏర్పడింది. పాకిస్తాన్‌లో అల్పసంఖ్యాకులుగా మారిన హిందువులను జిహాదీలు, మతోన్మాద ప్రభుత్వ దళాలు చంపివేయడం, తరిమివేయడం, లైంగిక అత్యాచారాలకు గురిచేయడం, మతం మార్చడం 1947 ఆగస్టు 15 నుంచి కొనసాగుతున్న వ్యథ..
మన ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిన సవరణ బిల్లునకు ఇదంతా నేపథ్యం. తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్‌గా అవతరించిన తరువాత కూడ హిందువుల వ్యథ సమసిపోలేదు. ఇటీవల బంగ్లాదేశ్‌లోని జిహాదీలు పాకిస్తాన్ కంటె ఘోరంగా హిందువులపై దాడులను జరుపుతుండడం అంతర్జాతీయ సమాజం విస్మయవదనంతో వీక్షిస్తున్న విషాద దృశ్యం. సిక్కులు, బౌద్ధులు, జైనులు, వైదిక మతాలకు చెందినవారు- ఈ హిందువులందరూ ఉభయ పాకిస్తాన్‌ల నుండి 1947 నుంచి పారిపోయి అవశేష భారత్‌లోకి వస్తూనే ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో భాగంగా ఉండిన అఫ్ఘానిస్తాన్ కూడ జిహాదీల దాడుల కారణంగా శతాబ్దుల క్రితమే సర్వమత సమభావ స్వభావాన్ని కోల్పోయింది. ఇస్లాం మత రాజ్యంగా ఏర్పడింది. అందువల్ల ఈ మూడు దేశాలనుంచి నిర్వాసితులవుతున్న హిందువులు మాత్రమే కాదు పారశీక, క్రైస్తవ మతస్థులు కూడా అవశేష భారత్‌లోకి వలస వస్తుండడం దశాబ్దుల చరిత్ర. ఎందుకంటె అనాదిగా అఖండ భారత్‌లో వలెనే 1947, ఆగస్టు 15వ తేదీ తరువాత ఆవశేష భారత్‌లో సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లుతోంది. అందువల్ల భారత్‌లో క్రైస్తవ, ఇస్లాం, పారశీక, యూదు వంటి అల్పసంఖ్యాక మతాలవారు అధిక సంఖ్యాకులైన హిందువులతో సమానంగా హాయిగా జీవిస్తున్నారు. భారత సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థకు పాకిస్తాన్ భయంకర ఇస్లాం మతోన్మాద జిహాదీ వ్యవస్థకు ప్రతీకలు కావడం నడుస్తున్న చరిత్ర...అందువల్లనే మనదేశం నుండి అల్పసంఖ్యాకులు పాకిస్తాన్‌కు గాని, బంగ్లాదేశ్‌కు గాని, అఫ్ఘానిస్తాన్‌కు కాని వలసపోవడం లేదు. ఈ మూడు దేశాలనుండి అల్ప సంఖ్యాకులు శరణార్థులుగా మనదేశానికి వస్తున్నారు.
తాలిబన్లు ముదిరిన తరువాత పాకిస్తాన్‌లోని హిందువులనుంచి జుట్టుపన్ను వసూలు చేయడం ఆరంభమైంది. ఈ పన్ను కట్టలేని హిందువులను ప్రధానంగా సిక్కులను పాకిస్తానీ తాలిబన్లు, ఇతర జిహాదీలు అపహరించడం, హత్యచేయడం పరిపాటి అయింది. దేశ విభజన జరిగిన వెంటనే పాకిస్తాన్‌లోని జనాభాలో ఇరవై మూడు శాతం ఉండిన హిందువులు అత్యధికులు నిర్మూలనకు గురయ్యారు. హత్యకాకుండా తప్పించుకున్న వారికి మనదేశంలో ఆశ్రయం లభించింది. పౌరసత్వం లభించింది. కానీ పాకిస్తాన్‌లోనే మొండిగా ఉండిపోయిన అత్యల్ప సంఖ్యాలైన హిందువులు సైతం గత పదేళ్లుగా నిర్మూలకు గురవుతున్నారు. తమదేశ జనాభాలో ఒకశాతం కంటె తక్కువ ఉన్న ఈ అవశేష హిందువులను సైతం నిశే్శషం చేయాలన్నది పాకిస్తానీ జిహాదీల లక్ష్యం. ఫలితంగా హిందువులు జనాభా లెక్కలలో నమోదు కాకుండా అజ్ఞాత జీవనం గడుపవలసిన స్థితి దాపురించింది. 2010 నుంచి తీర్థయాత్రల కొరకు, విహార యాత్రల కొరకు, ఇతర పనులకోసం మనదేశానికి వస్తున్న హిందువులు వీసా గడువు ముగిసిన తరువాత కూడా పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లడం లేదు. హిందువుల అపహరణలు, హత్యలు ఇందుకు కారణం. బలూచిస్తాన్‌లోని ఒక దుర్గామందిరం అర్చకుడు ఎనబయి రెండేళ్ల లక్ష్మీచంద్ర గాడ్జీని 2010లో జిహాదీలు అపహరించుకొని వెళ్లారు. ఆ తరువాత ఆ వృద్ధ ధర్మాచార్యుని ఆచూకీ తెలియరాలేదు..సింధు ప్రాంతంలోని ఓమర్‌కోటలో ఆరేళ్ల హిందూ బాలికను హాషీమ్ మాగిరో అనే జిహాదీ దుండగుడు లైంగిక బీభత్సకాండకు గురి చేసిన ఘటన విస్మయ ప్రకంపనలను సృష్టించింది. ముగ్గురు హిందూ యువతులను బలవంతంగా మతం మార్చి జిహాదీలు పెళ్లి చేసుకోవడాన్ని పాకిస్తాన్ సుప్రీంకోర్టు సమర్థించడం పైశాచిక వ్యవస్థకు పరాకాష్ఠ.
పాకిస్తాన్ నుంచి ప్రతి ఏటా సగటున ఐదువేలమంది హిందువులు పారిపోయి మనదేశానికి వస్తుండడం గురించి 2014 మేలో ప్రముఖంగా ప్రచారమైంది. బంగ్లాదేశ్‌లో ఇటీవల తాలిబన్లు, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు దాదాపు ప్రతిరోజు ఎక్కడో అక్కడ హిందువులను హత్య చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో 1947లో-అప్పుడు తూర్పు పాకిస్తాన్- ముప్పయి ఒక్క శాతం ఉండిన హిందువుల జనాభా ప్రస్తుతం ఏడుశాతం కంటె తక్కువకు పడిపోయింది. మిగిలిన హిందువులు హత్యకు గురయ్యారు. మతాంతీకరణకు బలయ్యారు. పారిపోయి భారత్ వచ్చేశారు. దేశ విభజన తరువాత 1955 వరకు ఈ అభాగ్యులందరికీ మనదేశం పౌరసత్వం లభించింది. 1955లో రూపొందిన పౌరసత్వపు చట్టం ఈ సహజ పౌరసత్వానికి పరిమితి విధించింది. పాకిస్తాన్‌లో జిహాదీలు ఉండనివ్వరు, మనదేశం రానివ్వకపోతే ఈ అభాగ్య శరణార్థులు ఎక్కడికి పోవాలి? విపక్షాలు విజ్ఞతతో వ్యవహరించాలి.