ఉత్తరాయణం

ఉచితాలతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉచిత వరాలను తెగ గుప్పిస్తున్నారు. వీటివల్ల కోట్లాది రూపాయలు ఖర్చయి, అంతిమంగా ఆ బరువు రాష్ట్ర ప్రజల నెత్తినే పన్నుల రూపంలో పడుతున్నా పట్టించుకునే వారే లేరు. ఉచిత విద్యుత్, ఋణ మాఫీ, సబ్సిడీ బియ్యం, ఉచిత కరెంట్, సబ్సిడీ క్యాంటిన్‌లు, పింఛన్‌లు అంటూ అడగకపోయినా ఉచితంగా అన్నీ ప్రజలకు వడ్డించడంలో ఈ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైయస్‌ఆర్‌లు అమలుచేసిన ప్రజాకర్షక పథకాలు నేడు వికృత రూపం దాలుస్తున్నాయి. పథకాల అమలులో ప్రభుత్వ నిఘా లోపించిన కారణంగా దళారులు, అధికారులు మధ్యలో సగం స్వాహా చేస్తున్నారు. విదేశాలలో, అందునా అభివృద్ధి చెందిన దేశాలలో పరిస్థితి భిన్నంగా వుంది. ఉచితాలవలన ప్రజల్లో కష్టపడే గుణం తగ్గి విలాసాలకు అలవాటు అయ్యే ప్రమాదం వుందని వారు ఎన్నడో గ్రహించారు. ప్రభుత్వోద్యోగాలపై ఆధారపడకుండా తమ నైపుణ్యం, అర్హత ఆధారంగా ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు పొందేలా యువతను అక్క డి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. గల్ఫ్ దేశాలలో అయి తే ఎడారులలో కూడా గోధుమలు పండిస్తున్నారు.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
పైరవీలకు అడ్డుకట్ట
ప్రజాప్రతినిధులకు ఉపాధ్యాయులను పిఎలుగా నియమించకూడదని సుప్రీంకోర్టు తీర్పును చెప్పడం హర్షణీయం. పిఏలుగా ఉండేవారు ఉపాధ్యాయ వృత్తికి న్యా యం చేయకపోగా పైరవిలే పరమావధిగా విధులు నిర్వహిస్తుండేవారు. అసలు వృత్తిని మరచిపోయే దశకు చేరుకున్నారు. ఏఏ శాఖలు మంత్రులు నిర్వహిస్తారో ఆ శాఖలకు చెందిన వారిని పిఎలుగా నియమించుకోవటంలో అర్ధం ఉంటుంది. వారి ఆయా శాఖపై అవగాహన ఉం టుంది. విద్యాశాఖకు డిప్యుటేషన్‌వల్ల కూడా కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుంది.విద్యాబోధనకు కొం తమేర ఆటంకం ఏర్పడుతుంది.
- అయినం రఘురామారావు, ఖమ్మం
ఇబిసిలకు న్యాయం
మన సువిశాల భారతంలో 5 దశాబ్దాలకు పైగా, ఇబిసిలకు సామాజిక ఆర్థిక న్యాయం చేకూర్చమని మొరపెట్టుకొంటుంటే వినిపించుకొన్న నాధుడు లేడు. గత ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ మొదలైన రాష్ట్రాలలో కొం దరు ఎంఇలుగా ఇబిసి దళిత జాతుల నుంచి ఎంపిక కావడం దేశంలోని కొన్ని వర్గాలలో నూతన చైతన్యాన్ని నింపింది. ఇది చూచిన కేంద్ర ప్రభుత్వం ఇబిసిలకు దళితులకు కేంద్రమంత్రి మండలిలో స్థానమివ్వడం హర్షదాయకం. వీరు తమ వారికి విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ప్రయత్నించడం అత్యావశ్యకం. వారి ఆర్థికాభివృద్ధికి అవిశ్రాంతంగా ప్రయత్నించవలసిన బాధ్యత వారిపైన ఉంది. కేంద్రంలో మోదీజీ ప్రభుత్వం తప్పక వారి అభివృద్ధికి సహకరించగలదని ఆశిద్దాం.
- ఎన్.సత్యనారాయణచార్యులు, తెనాలి
నాటిన మొక్కలను సంరక్షించాలి!
తెలంగాణ రాష్టమ్రంతటా హరితహారం పథకం విజయవంతంగా ఇంకా జరుగుతూనే వున్నది. ఐతే నాటిన మొక్కలను పెరిగి పెద్దవయ్యేదాకా సంరక్షించాల్సిన అవసరం వున్నది. గ్రామ పట్టణ ప్రాంతాలతోపాటు పశువులు సంచరించే ప్రాంతాలలో ‘ట్రీగార్డ్స్’ను చౌకగా లభించే వెదురుబద్దలతో తయారుచేసినవి వాడితే మంచిది. గ్రామాలతో పంచాయతీలకు పట్టణాలలో ఆయా ప్రాంతాలలో శానిటరీ పనులు నిర్వహించేవారికి లేక సంరక్షణ కమిటీను ఏర్పాటుచేసి పర్యవేక్షణ సంరక్షణ కార్యక్రమా లు అప్పగించాలి. తదుపరి కరెంటు వైర్లకు అడ్డమని రోడ్ల విస్తరణకు అడ్డమని చెట్లను తొలగించే కార్యక్రమాలు చేపట్టరాదు. గతంలో చేపట్టిన మెక్కలు నాటే కార్యక్రమా లు విజయవంతం కాకపోవడానకి ప్రధాన కారణం కేవ లం నాటిన మొక్కల పరిరక్షణను పట్టించుకోకపోవడమే. అందువల్ల నాటి మొక్కల రక్షణకు ప్రజల్లో చైతన్య కార్య క్రమాలు చేపట్టాలి. ముందుచూపుతో భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొంటే ప్రభుత్వ ఆశ యం నెరవేరుతుంది.
- గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, సికిందరాబాద్
వాహనాలను అనుమతించాలి
గత సంవత్సరం గోదావరి పుష్కరాలు విషాదంతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు అన్ని విధాలా సుఖాంతం కావాలని పుష్కర దేవుణ్ణి ప్రార్ధిద్దాం. గోదావరి పుష్కరాలకు ఒకటి, రెండు మైళ్ళు నడవవలసి వచ్చింది. స్ర్తిలు, వయోవృద్ధులు అంత దూరం కాలినడకన వెళ్ళలేకపోయారు. అందువల్ల స్నాన ఘట్టాలవరకు ద్విచక్ర వాహనాలను, ఆటోలను అనుమతించాలి. అందుకు తగ్గ ప్రదేశాన్ని చదునుచేసి, వాటి పర్యవేక్షణకు తగిన సిబ్బందిని నియమించాలి. ప్రముఖులకు ప్రత్యేక స్నాన ఘట్టాలను నిర్మించాలి.