మెయన్ ఫీచర్

సదా నరుూమ్ సేవలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఒక నరుూమ్. అతనొక గుం డెలు తీసిన బంటు. సాధారణ నక్సలైటు నుంచి దావూద్ ఇబ్రహీం వారసుడు కావాలన్న కోరిక డాన్‌గా మార్చింది. ఆ క్రమంలో ఖాకీలతో చేసిన సహవాసం అతగాడిని వందలకోట్లకు పడగలెత్తేలా చేసింది. ఆ పుణ్య కార్యక్రమంలో పోలీసు అధికారులు, రాజకీయ నాయకులూ పాలుపంచుకుని యధాశక్తిన సంపాదించుకున్నారు. చివరాఖరకు పాపం పండిన నరుూమ్ అదే పోలీసు తూటాలకు బలయ్యాడు. ఇదీ నరుూమ్ అనే కోవర్టు నక్సలైటు వందలకోట్లకు పడగలెత్తిన కథ. దీన్నొక పుణ్య కార్యక్రమంలా, లోకోత్తర దృశ్యకావ్యంలా మీడియా పేజీలకు పేజీలు, చానెళ్లు గంటలకు గంటలు చూపిన నరుూమ్ వీరగాధ చూసే వారికి రోత.
నరుూమ్ అనే సూడో నక్సల్ బ్లాక్‌మెయిలర్‌గా మారి కొనే్నళ్లయింది. నల్లగొండ కేంద్రం గా చేసుకుని అతగాడు విస్తరించిన నేరసామ్రాజ్యానికి కర్త, కర్మ, క్రియ పోలీసులే. అతనికంటే ఘనుడు ఆచంట మలన్న అన్నట్లు పోలీసు బాసు లు నరుూమ్‌ను వారి అవసరాలకు వాడుకుంటే, ఆ మహానుభావుడు తర్వాత మొత్తం పోలీసు వ్యవస్థనే అడ్డంగా వాడేసుకున్నాడు. పోలీసుమెడల్సు అందుకున్న అధికారులు, వృత్తి నిర్వహణలో తులసిమొక్కల వంటి వారమనే భుజకీర్తులు పెట్టుకున్న మాజీ పోలీసు బాసులు లెక్కలేనంతమంది, నరుూము వారి సంస్థానంలో సేదదీరిన వారే. భక్తులు గుడికి వెళ్లి పండ్లు, పూలు సమర్పిస్తారు. కాకపోతే నరుూము పోలీసు బాసులకు భూములు, ఫ్లాట్లు, ప్లాట్లు, నగదు సమర్పించుకుని, తర్వాత దానికి చక్రవడ్డీ స్థాయిలో సంపాదించుకున్నాడు. అదే తేడా!
నరుూమ్ ఎన్‌కౌంటర్ అయిన తర్వాత అతగాడి నేరసామ్రాజ్య కథలను వండి వార్చిన మీడియా, అతగాడు బ్రతికున్నప్పుడు ఫలానా నరుూమ్ అనే నేరసామ్రాజ్య అధిపతి నల్లగొం డ, మహబూబ్‌నగర్ మధ్య నిక్షేపంలా తిరుగుతున్నాడని ఎందుకు కనిపెట్టలేకపోయాయి? మొద్దు శ్రీను తన సూరిబావ కళ్లలో మెరుపు చూడాలని చెబితే, మొద్దు శీనును ఇంటర్వ్యూ చేసిందే తప్ప, నేరగాడి ఆనుపానులేమిటన్నది బాధ్యతగల పౌరుడిగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లలేదు. పైగా మొద్దు శీను మనస్తత్వమేమిటి? కాలేజీ రోజుల్లో ఆయన సాహసకృత్యాలేమిటన్న దానిపై పుంఖానుపుంఖాల కథనాలు మాత్రం వండి వార్చాయి. ఇలాంటి మీడియా మిడిమేళం వల్ల అనామకులు సైతం హీరోలయిపోతున్నారు.
నరుూమ్ ఎలాగూ తిరిగిరాడు. కత్తి చేతిలో పట్టుకున్న వాడు ఆ కత్తికే బలికాకతప్పదు. అది ఫ్యాక్షన్ నీతి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. నరుూమ్ గురించి ఇంకా హీరోచిత కథనాలు వండి వార్చడం సమాజానికి మంచిది కాదు. నరుూమ్ బాధితులెవరైనా ఉంటే వారికి దన్నుగా నిలబడి, ఆయన కబ్జాలో ఉన్న ఆస్తులను విడిపించే బాధ్యత చేపడితే సమాజం సంతోషిస్తుంది. ఈ కథలో చివరకు పోలీసుబాసులు ఏ ప్రాంతానికి చెందిన వారయినా తప్పించుకుంటారు. వారిమీద ఎలాంటి కేసులూ ఉండవు. చివరకు దొరికేది ఎవరంటే ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు. ఇప్పుడు అదే జరుగుతోంది. నరుూమ్‌కు పాలుపోసి పెంచిన పోలీసు పెద్దలంతా వృత్తి నిర్వహణలో భాగంగానే ఆయనతో సావాసం చేశవారట. ఆయన నేరసామ్రాజ్యంతో ఎలాంటి సంబంధం లేనివారేనని ముందస్తు లీకులు కూడా ఇచ్చేశారు. అంటే విచారణలో ప్రాథమికంగానే సత్యం సమాధి అయిందన్నమాట. నరుూమ్‌ను అడ్డుపెట్టుకుని సంపాదించుకున్న వారెవరూ ఇప్పుడు పదవిలో లేరు. అయినా వారిని కాపాడేందుకు పోలీసులు పడుతున్న తపన చూస్తే పోలీసులంతా ఒకటేననిపిస్తుంది.
నరుూమ్ చనిపోయినా అతగాడిని అడ్డుపెట్టుకుని రాజకీయ వేధింపుల కార్యక్రమానికి తెరలేవడం అనైతికం. అతగాడికి తెదేపాకు చెందిన ఒక మాజీ మంత్రితో సంబంధాలున్నాయని ప్రచారం చేయటం, ప్రస్తుతం తెరాస నేతలు కొం దరితోనూ బాంధవ్యం ఉందని లీకులు ఇవ్వడం విచారణను పక్కదారిపట్టించడమే. నేరసామ్రాజ్య విస్తరణ కోసం నరుూమ్ అందరినీ వాడుకున్నాడు. సొంత అవసరాలో, వృత్తినిర్వహణలో భాగంగానో నరుూమ్‌ను పోలీసులు వాడుకున్నారు. మీడియాలో పనిచేసే వందలమంది మహానుభావులు కూడా నరుూమ్ వారి సంస్థానంలో సేవలందించి ముడుపులు మింగినవారేనట. ఈ లెక్కన నరుూమ్ సేవలో తరించనివాడు పాపాత్ముడిలా కనిపిస్తున్నారు. ఆ కోణంలో విచారిస్తే నరుూమ్ ఎదుగుదల ఏమిటన్నది తేలుతుంది. ప్రస్తుతం పోలీసులు విచారించాల్సింది న రుూమ్ బాధితులు ఎందరు? ఏ స్థాయి వ్యక్తు లు? జరిగిన నష్టం ఎంత? ఆ సందర్భంలో ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులెవరు? అన్నది. వారిని విచారణ వరకూ తీసుకురాగలిగితే ఇంకా అనేక వాస్తవాలు వెలుగుచూడవచ్చు. అంతేగానీ నరుూమ్ వెనుక తెదేపా నేతలున్నారని తెరాస నేతలు, తెరాస నేతల అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నాడనే నరుూమ్‌ను తొలగించారని తెదేపా నేతలు ఆరోపణలు చేసుకుంటే, అసలు సత్యం ఎప్పటికీ బయటపడదు.
ఇలాంటి వ్యవహారాల్లో మీడియా అత్యుత్సా హం, సంఘవిద్రదోహశక్తులను కీర్తించే ఉద్యో గం తీసుకోవడం సమాజానికి చెడుచేసినట్లే అవుతుంది. యువత నరుూమ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నట్లుగా మీడియా కథనాలు కనిపిస్తున్నాయి. ఇది జుగుస్పాకరమే కాదు బాధ్యతారాహిత్యం కూడా. ఇలాంటి నరుూములు బతికున్నప్పుడు రాయని కథనాలు, చనిపోయిన తర్వాత వండటం వల్ల ప్రయోజనం ఏమిటిన్నది ప్రశ్న. ఇప్పటికీ ఇలాంటి నయా నరుూములు రకరకాల ముసుగులో మన చుట్టూ చాలామంది ఉన్నారు. వారి గురించి ప్రజలకు చెబితే సమాజానికి గొప్ప మేలు చేసినవారవుతారు.
* * *
కృష్ణా పుష్కరాల ప్రారంభం ఆశించిన మేరకు లేకపోవడడం ముందుగా ఊహించినదే. ఏర్పాట్లు బాగానే ఉన్నా స్పందన ఆ స్థాయిలో లేకపోవడానికి కారణాలు అనేకం. తెలుగు రాష్ట్ర పాలకులు కృష్ణాను గోదావరి పుష్కరాలతో పోల్చుకోవడమే పొరపాటు. గోదావరి విస్తృతి, ఉధృతి, నదీప్రాంత భౌగోళిక పరిస్థితులు వేరు. కృష్ణా నదికి ఆ విస్తృతి లేదు. అందుకే గోదావరి పుష్కరాలంత ఊపు, ఉత్సాహం కనిపించడం లేదు. ఈ విషయాన్ని అధికారులు ముందుగానే ఇద్దరు ముఖ్యమంత్రులకు చెప్పి ఉంటే సమస్యలుండేవి కాదు. అలాకాకుండా ఇద్దరు చంద్రులకు గంతలుకట్టి, గోదావరిని మించి చేస్తామన్న ఉత్తరకుమార ప్రగల్భాలు చివరాఖరకు కృష్ణా పుష్కరాలు పేలవంగా మారడానికి కారణమయ్యాయి. ఇంత పెద్ద ఈవెంటు జరిగినప్పుడు, అందునా దానికి సెంటిమెంటు తోడయినప్పుడు జనంలో కూడా భారీ అంచనాలుంటాయి. వాటిని నెరవేర్చార్చిన బాధ్యత అధికారులదే. పెద్ద కార్యక్రమం అంటే సహజంగానే కొన్ని లోపాలుంటాయి. వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు.
పుష్కరమంటే ఒకరకంగా ధార్మిక కార్యక్రమమే. ఈసారి గోదావరి తొలిరోజు మాదిరిగా ఎక్కడా ఒక్క దుర్ఘటన కూడా చోటుచేసుకోకపోవడం అభినందనీయం. ఈ విషయంలో ప్రభుత్వ ముందుచూపు మెచ్చదగినదే. అలాంటి దుర్ఘటన జరగాలని కోరుకునే రాజకీయ ప్రత్యర్ధులు ఉండవచ్చు. కానీ, పుష్కరుడు వారి ఆశలు నెరవేరనీయలేదు. గోదావరి పుష్కరాల స్థాయి ప్రచారం జరిగినా భక్తులు మాత్రం ఆ స్థాయిలో హాజరుకావడం లేదు. దానికి కారణాలు అనేకం. కానీ చంద్రబాబునాయుడు ఈ పుష్కరాలపై తెలిసో, తెలియకనో భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 కోట్ల మంది భక్తులు వస్తారని బాబుకు అధికారులు సమాచారం ఇచ్చారు. రెండురోజుల్లో వచ్చిన భక్తులు తొమ్మిదిలక్షల మంది మాత్రమే. మరి ఆ ప్రకారంగా బాబు ఆశ నెరవేరాలంటే ఒక్కరోజులో ఎన్నిలక్షల మంది హాజరవ్వాలి?
* * *
అమరావతి రాజధానికి అన్నీ అడ్డంకులే. రాజధాని నిర్మాణం వల్ల రైతులు నష్టపోతున్నారని, పర్యావరణానికి నష్టమంటూ ఏబికె ప్రసాద్ అనే విశ్రాంత జర్నలిస్టు సుప్రీంకోర్టులో వేసిన కేసును ధర్మాసనం కొట్టివేసింది. ఇది బాబుకు ఊరటకాగా, జగన్‌కు చెంపపెట్టు. పిటిషనరు రైతు కానందున, రైతులు వచ్చినప్పుడు చూద్దామని సీజెఐ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. మీ రు రాజధాని నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడం మంచిదే. అమరావతిపై ఈ ఒక్క కేసుతోనే అయిపోలేదు. గ్రీన్‌ట్రైబ్యునల్‌లో మరో కేసు పెండింగ్‌లో ఉంది. సదావర్తిసత్రం కేసులోనూ పిటిషన్ల వాదనలు, ఆరోపణలు నిలవలేదు. పిటిషనరు ఆరోపణలో పసలేదని న్యాయస్థానం తేల్చింది. పట్టిసీమపై వేసిన పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది. ఇవన్నీ ప్రభుత్వం వేస్తున్న అడుగులను అడ్డుకోవడం వంటివే.
బాబు అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, జగన్ అడ్డుపడుతున్నారన్న ప్రచారం ఇప్పటికే విస్తృతంగా ఉంది. అయితే, కోర్టులో వేసిన వారం తా వైసీపీ కార్యకర్తలు కాకపోవచ్చు. కానీ మానసికంగా వారి సానుభూతిపరులేనన్నది నిర్వివాదం. తాజాగా విశ్రాంత పాత్రికేయుడు వేసిన పిటిషన్ కూడా కొట్టివేయడం పాలకులకు భరోసా లాంటిది. సదరు విశ్రాంత పాత్రికేయుడు అమరావతి వల్ల రైతులకు నష్టమని నిరూపించే ఆధారాలు ఎందుకు సమర్పించలేకయారన్నది ప్రశ్న. కేవలం అమరావతి పాలకుడిపై బురదచల్లే లక్ష్యమే అందులో కనిపించింది. అదే ఆధారాలు ఇచ్చి ఉంటే బాబు ప్రభుత్వం ఇబ్బందిపడేది. దీన్నిబట్టి, కోర్టు వ్యాజ్యాలు ప్రచారానికి వేదికవుతున్నాయని మాజీ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య నిజమేనేమో?!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144