సంపాదకీయం

ఝకీర్ మిత్రులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రచ్ఛన్న జిహాదీ ఉగ్రవాది ఝకీర్ నాయక్ అనే వాడికి ‘‘సహాయం చేసిన’’ నలుగురు ఉన్నత అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో అధికార యంత్రాంగాన్ని ఆవహించిన ఘోరమైన నిర్లక్ష్య ధోరణులు మరోసారి రచ్చకెక్కాయి. ఈ నలుగురు అధికారులు దుర్భుద్ధి పూర్వకంగానే ఝకీర్ నాయక్‌కు సంబంధించిన ‘స్వచ్ఛంద సంస్థ’-ఎన్‌జిఒ-కు సహకరించారని దేశ వ్యవహారాల మం త్రిత్వశాఖ వారు భావిస్తున్నారట. ఝకీర్ నాయక్ ముస్లిం యువజనులను ‘ఇరాక్ సిరియా మతరాజ్యం’-ఐఎస్‌ఐఎస్-జిహాదీ ముఠాలో చేర్పిస్తున్నట్టు ధ్రువపడిన తరువాత అతగాడి గురించి పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఝకీర్ నాయకత్వంలో ముంబయి కేంద్రంగా వెలసిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ -ఐఆర్‌ఎఫ్-అన్న ముఠా స్వచ్ఛంద సంస్థ ముసుగు వేసుకున్న దేశ వ్యతిరేక ముఠా అన్నది కూడ ధ్రువపడిన వాస్తవం. ముస్లింలందరూ టెర్రరిస్టులు కావాలని ఝకీర్ నాయక్ బహిరంగంగా పిలుపులు ఇచ్చినట్టు కూడ ధ్రువపడింది. బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా భయంకర హత్యాకాండ కొనసాగిస్తున్న ఐఎస్‌ఐఎస్ బీభత్సకారులను పురికొల్పిన వాడు ఝకీర్ నాయక్ అన్నది బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన నిర్ధారణ. సౌదీ అరేబియాకు జారుకున్న ఝకీర్ నాయక్ అక్కడ నుండి కూడ జిహాదీ కార్యకలాపాలను సాగిస్తున్నాడు. దేశానికి తిరిగి వచ్చినట్లయితే న్యాయ నిర్బంధానికి గురికావలసి వస్తుందన్న భయంతో అతగాడు అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. వచ్చే సంవత్సరం మాత్రమే తాను దేశానికి తిరిగి వస్తానని కూడ ఝకీర్ నాయక్ సౌదీ అరేబియాలో ప్రకటించాడు. ఝకీర్ నాయక్ తమ దేశంలోకి రావడానికి వీలులేదని బ్రిటన్ తదితర దేశాలు ఆదేశాలు జారీచేశాయి కూడ. ఇవన్నీ ఝకీర్ నాయక్ జిహాదీ బీభత్సకారుడన్న వాస్తవానికి సాక్ష్యాలు. ప్రపంచమంతటికీ తెలిసిన ఈ వాస్తవం దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులకు తెలియకపోవడం విచిత్ర వ్యవహారం. తెలిసినప్పటికీ ఝకీర్ నాయక్ ముఠాకు లైసెన్స్‌ను కొనసాగిస్తూ ఈ ఉత్తర్వులు రూపొందించడం దేశ వ్యతిరేక చర్య. ఈ నలుగురినీ సస్పెండ్ చేయడం దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టిన సముచిత చర్య. కాని ఝకీర్ నాయక్‌ను సౌదీ అరేబియానుంచి మనదేశానికి తరలించుకొని రావడానికి మన ప్రభుత్వం ఇంతవరకు పూనుకోకపోవడం అంతుపట్టని వ్యవహారం..
జూలైనెల మొదటి వారంలో ఝకీర్ నాయక్ సాగిస్తున్న విద్రోహం బట్టబయలైంది. అప్పటినుంచి అతగాడు సౌదీ అరేబియాలోనే సురక్షితంగా నక్కి ఉన్నాడు. ఇదంతా ప్రచారం అవుతున్న సమయంలోనే దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ విదేశీయ వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి జికె ద్వివేది, ఆయన పర్యవేక్షణలో పనిచేసే మరో ముగ్గురు అధికారుల కలసికట్టుగా ఝకీర్ నాయక్ సంస్థకు యధావిధిగా విదేశీయ నిధులు లభించడానికి మార్గం సుగమం చేశారు. ఈ ‘ఐఆర్‌ఎఫ్’ గతంలో విదేశీయ విరాళాల నియంత్రణ చట్టం-ఎఫ్‌సిఆర్‌ఏ- కింద విదేశీయ విరాళాలను పొందడానికి అనుమతిని పొందింది. ఝకీర్‌నాయక్ చేసిన మతోన్మాద, బీభత్స ప్రసంగాల సంగతి ప్రముఖంగా ప్రచారమవుతున్న సమయంలోనే ఈ అనుమతి కాలవ్యవధి ముగిసింది. ద్వివేది బృందం అధికారులు ఈ ప్రచారాన్ని పట్టించుకోకుండా యధావిధిగా ఈ విదేశీయ విరాళాల స్వీకరణ అనుమతి కాలవ్యవధిని పొడిగించేశారు. ఝకీర్ నాయక్ సంస్థవారు తమకు లభిస్తున్న నిధులను అధ్యయనానికి, పరిశోధనకు వెచ్చించడంలేదు. మతం మార్పిడుల కోసం, బీభత్స కారులను తయారు చేయడం కోసం ఖర్చు చేస్తున్నట్టు కూడ వెల్లడైంది. అయినప్పటికీ దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ఈ ద్వివేదీ బృందం వారు అతగాడి సంస్థకు లైసెన్స్‌ను పొడిగించారు..
గత మూడు సంవత్సరాలలో ఝకీర్ నాయక్ బ్యాంకు ఖాతాలలోని, అతగాడి బంధువుల ఖాతాలలోకి అరవైకోట్ల రూపాయల విదేశీయ నిధులు జమ అయినట్టు ఆగస్టు 10న వెల్లడైంది. మూడు విదేశాలనుంచి ఝకీర్ నాయక్ ఖాతాలలోకి బదిలీ అయిన నిధులను అతగాడు ఈ ఎన్‌జిఓతో సంబంధం లేని బంధువుల ఖాతాలలోకి మళ్లించాడు. ఝకీర్ పేరుతో ఉన్న ఖాతాకు కూడ ఎన్‌జిఒకు సంబంధం లేదని అది అతని వ్యక్తిగత ఖాతా అని కూడ వెల్లడైందట. ఝకీర్ నాయక్ ప్రధాన నిర్వాహకుడు-ట్రస్టీ-గా బ్రిటన్‌లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అన్న మరో సంస్థ నమోదయి ఉంది. ఈ ఐఆర్‌ఎఫ్‌ఇకి 2009వ 2014వ సంవత్సరాల మధ్య దాదాపు అరవైమూడు కోట్ల రూపాయల నిధులు లభించాయట. ఈ బ్రిటన్ సంస్థ నిధుల గురించి, మనదేశంలో ఝకీర్ బృందం ఖాతాలలోకి జమ అయిన అక్రమ నిధుల గురించి దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ఇలా దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఈ నిర్వాకం జరిగిపోయింది. ఝకీర్ నాయక్ గురించి ‘‘ఊరందరికీ తెలిసిన రహస్యం ఊలప్పకు ఎరుకలేనట్టు..’’గా ఈ ఉన్నత అధికారులకు తెలియకపోవడం విచిత్రమైన వైపరీత్యం. ఝకీర్ నాయక్‌ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నేరస్థుడిగా ప్రకటించడానికి అతని సంస్థను నిషేధించడానికి దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేసిందట. ఆగస్టు 26న ఈ సంగతి ప్రచారమైంది. నిఘా మండలి సమర్పించిన సాక్ష్యాధారాల ప్రాతిపదికగా వ్యూహాన్ని సిద్ధం చేసిన దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు తదుపరి దర్యాప్తు జరుపవలసిందిగా ఎన్‌ఐఎను కోరిందట. దాదాపు యాబయి మంది జిహాదీ హంతకులను ఝకీర్ బీభత్సకాండ జరుపడానికి పురికొల్పాడన్నది నిఘా నిర్ధారించిన ప్రధాన అంశం.
ఇలా ఇదంతా దేశ వ్యహారాల మంత్రిత్వశాఖలో జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఝకీర్‌కు మేలు చేసే వ్యవహారం కూడా అదే మంత్రిత్వశాఖలో జరగడం వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపానికి నిదర్శనం. అనుమతిని ‘రెన్యూ’ చేసిన అధికారులు దుర్బుద్ధి పూర్వకంగా ఈ పనికి ఒడిగట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటె ఇలా నిషేధానికి గురికానున్న సంస్థకు సహాయం చేయడం నేరమని పట్టుబడితే ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లవలసి వస్తుందని లైసెన్స్‌ను ‘రెన్యూ’ చేసిన వారికి తెలియకుండా ఉండదు. అందువల్ల ఘోరమైన నిర్లక్ష్యంతోనే ఈ అధికారులు ఝకీర్ సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించి ఉండవచ్చు. కానీ మనదేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండకు పూనుకున్న ఝకీర్ సౌదీ అరేబియాలో సురక్షితంగా ఉండడమే విడ్డూరం. సౌదీ అరేబియా మన ‘మిత్ర’దేశం. అలాంటప్పు డు బ్రిటన్ వలెనే సౌదీ అరేబియా ప్రభుత్వం కూడ ఝకీర్ ప్రవేశాన్ని నిషేధించి ఉండాలి. లేదా అతగాడిని నిర్బంధించి ఉండాలి. రెండూ జరగలేదు. ఝకీర్‌ను పట్టుకొని మనదేశానికి అప్పగించవలసిందిగా మన ప్రభుత్వం సౌదీ అరేబియాను కోరకపోవడం మరింత విస్మయకరం..