ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పర్యావరణకు ‘ప్లాస్టిక్’ చికిత్స!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరిమేఘం- అన్నది ఒక వన్యమృగం. ఈ కరిమేఘాన్ని ‘ముళ్లపంది’ అని ‘ఏడుపంది’ అని ‘ఒంటరికాడు’అని కూడ అంటున్నారు. సాధు జంతువైన ఈ కరిమేఘం ‘ఆత్మరక్షణ’ విషయంలో మా త్రం అమిత జాగరూకతతో మెలగుతోంది. అప్పుడప్పుడప్పుడు ‘పంటల’ను భోంచేసి పోతుంది కనుక కరిమేఘానికి ‘పంది’అన్న అపవాదు ఏర్పడి ఉంది! రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ తన సుప్రసిద్ధ ‘మాల్‌గుడికి పులి’- ఏ టైగర్ ఫర్ మాల్‌గుడి- ఆంగ్ల ‘నవల’లో ‘కరిమేఘం’గొప్పతనాన్ని వివరించాడు. ఈ ‘నవల’ పెద్దపులి ఆత్మకథ..... ఒకసారి ఈ పెద్దపులి కరిమేఘాన్ని కబళించడానికై దానిపైకి లంఘించింది! వెంటనే ‘ఆత్మరక్షణ’కోసం కరిమేఘం తన శరీరంనుండి కత్తుల వంటి బాణాల వంటి ‘ఈకె’లను వదిలిపెట్టింది. కరిమేఘానికి సాధ్యమైన అసంకల్పిత ప్రతీకార చర్య ఇది, శరీరమే ‘విల్లు’గామారి ‘ఈకెలు’ బాణాలవలె ‘శత్రువు’ వైపునకు దూసుకొనిపోతాయి. అలా ‘కరిమేఘం’ శరీరంనుండి దూసుకొని వచ్చిన ‘ఈకె’లు ముక్కువద్ద, ముఖం మీద, దవడల వద్ద, పంజాలలోకి దిగబడిపోయాయి. పెద్దపులి తీవ్రంగా గాయపడి కూలబడింది. కరిమేఘం- పోర్క్‌పైన్- సురక్షితంగా తప్పించుకొని పారిపోయింది.
కూలబడిన పులి శరీరంలో దిగబడి ఉండిన బాణాల వంటి ‘ఈకెలు’ ఊడిరావు. విపరీతమైన బాధతో పులి మూలుగుతూ అనేక రోజులపాటు పడి ఉంది. ‘‘నేను త్వరలో మరణిస్తానని భయపడినాను....’’అని ‘పులి’ ఆ తరువాత తన ఆత్మఘోషను వెళ్లబోసుకుంది! ఆ ‘ముళ్లు’ ఊడిరావు. శరీరం వాచిపోయింది. కళ్లవద్ద గుచ్చుకున్న ‘బాణాలు’ కళ్లు తెరవనీయడం లేదు. ఆ ‘ఈకెల’ను లాగివేసుకొనే సామర్థ్యం పులికి లేదు. చెట్టుమీది నుంచి ‘కోతి’ పులిని పలుకరించింది! ‘‘రోగం కుదిరిందా? బుద్ధి ఉన్నవాడెవ్వడూ ‘కరిమేఘం’ జోలికి వెళ్లడు. అజ్ఞానివి, మూర్ఖుడవు. మాంసంకోసం ఉరుకులాడెదవు. నీవు అజేయుడవని విర్రవీగావు....’’ అని పులిని కోతి చీవాట్లుపెట్టింది. ‘‘నోరు మూసుకో’’అని పులి అరచింది! ‘‘చెప్పదలచినది చెప్పిన తరువాత, మూసుకుంటాను... నిరంకుశుడా! విను! ఈ చిన్న నీటి వాగునకు ఆవలివైపున ఒక పచ్చని పూల పొద ఉంది! ఆ పొదలోకివెళ్లి ఆకుల మీద అదే పనిగా పొర్లు, దొర్లు... ఆకులనుంచి వచ్చే ‘పాలు’ ఈకెలున్నచోటు తగిలితేనీ శరీరంనుండి అవి ఊడి వస్తాయి.’’అని కోతి హితవు చెప్పింది! పెద్దపులి అలా ఆ ‘పొద’ ఆకులనుండి కారిన ‘పాల’చికిత్సతో ‘కరిమేఘం’ బాణాలను వదిలించుకొంది. అందుకే కరిమేఘాన్ని పొలంనుంచి అడవిలోకి పారద్రోలే సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉంటారు. పర్యావరణంలో నిహితమై ఉన్న చికిత్సా పద్ధతులకు పులిని బతికించిన పొద నిదర్శనం. కానీ పెద్దపులి వంటి మానవుడు ‘కరిమేఘం’వంటి ప్రకృతిని దిగమింగడానికి యత్నిస్తుండడం అసలు కథ! ‘కరిమేఘం’వంటి ప్రకృతి కాలుష్య బాణాలతో మానవాళిని ముంచెత్తింది ముంచెత్తుతోంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో డిసెంబర్ 11వ తేదీన ముగిసిన పర్యావరణ సదస్సునకు ఈ ‘కాలుష్యం’ నేపధ్యం...
సంపన్న దేశాలు సంకుచిత ఆర్థిక ప్రయోజన పరిరక్షణకోసం, ప్రయోజనాలను అక్రమంగా పెంపొందించుకొనడంకోసం ‘అంతర్జాతీయ సమాజాన్ని’ కాలుష్యగ్రస్తం చేయడం శతాబ్దికి పైగా నడచిన చరిత్ర! ఇప్పుడు, కాలుతున్న బొగ్గు, ఇంధన తైలాలు, ఇతరేతర పదార్థాలనుండి వెలువడుతున్న కాలుష్యం నేలతల్లిని ‘నిప్పులకొలిమి’గా మార్చివేసింది! ‘కరిమేఘం’ ఈకెలను వదల్చుకొనడానికి మార్గం తెలియని ఆర్.కె.నారాయణ్ ‘పులి’ వలె ప్రపంచ సమాజం అలమటిస్తోంది. పారిస్‌లో జరిగిన సదస్సులో కుదిరిన ‘‘చారిత్రక అంగీకారం’’ లక్ష్యనిర్దేశకం మాత్రమేనన్నది అధికాధిక శాస్తవ్రేత్తలు, ఇతర ప్రముఖులు వినిపిస్తున్న ఆందోళనాగీతం! కానీ ఈ ‘కర్బన’ కాలుష్యాన్ని కడిగివేయడానికి వలసిన హేతుబద్ధమైన మార్గాలు మాత్రం ‘పారిస్’ ఒప్పందంలో ప్రస్ఫుటించడం లేదు! వాయుకాలుష్యం జలకాలుష్యం ముంచెత్తుతుండడానికి ప్రధాన కారణం ‘మానవుడు’ ప్రకృతిపై దాడిచేయడం అన్నది అందరూ అంగీకరించిన మాట! కానీ సంపన్న దేశాలు ఈ ‘దాడి’కి ప్రతిరూపాలున్న శతాబ్ది కాలుష్య వాస్తవాన్ని ఆ దేశాలు అంగీకరించడం లేదు. హిమాలయ పర్వతాలు ‘కరిగి’నీరు సముద్రంలోకి పోతోంది. హిమాలయాలు ‘శిలాలయాలు’గా రూపును మార్చుకుంటున్నాయి. ఇలా ఓషధీ నిలయమైన ప్రాకృతిక భాండాగారం పాడుపడుతుండడానికి ప్రధాన కారణం చైనా టిబెట్‌ను ఇచ్చవచ్చినట్టు కొల్లగొట్టడం! ఈ కొల్లగొట్టడం కారణంగా మంచు శకలాలు మాయం కావడానికి దారితీసిన ‘వేడిమి’పెరిగింది! చైనా అంగీకరించడం లేదు! ఈ ‘కొల్లగొట్టడం’ వల్లనే మన ‘ఉత్తరఖండ్’, ‘హిమాచల్‌ప్రదేశ్’ ప్రాంతాలను అనూహ్యరీతిలో ‘వరదలు’ ముంచెత్తుతున్నాయి! ఈ కొల్లగొట్టడంవల్లనే బ్రహ్మపుత్ర నీరు మనకు దక్కని స్థితి ఏర్పడిపోతోంది!
పాశ్చాత్య దేశాలవారు, చైనావారు విష రసాయన వ్యర్థపదార్థాలను పాతపడిన పనికిరాని ఓడలకు నింపి ఆ ఓడలను తమ దేశాలకు దూరంగా ఉన్న సముద్ర జలలో ముంచేస్తున్నాయి. పాత ఓడను పగులగొట్టడం - డీ కమిషనింగ్- కాలుష్యవ్యర్థాలను వదిలించుకోవడం- ఈ రెండు ఫలితాలనూ ఒకే చర్యద్వారా- ఏకక్రియాద్వర్తకరీ- సాధించడం సంపన్న దేశాలుచేస్తున్న ‘కాలుష్య ప్రసరణం’లో భాగం! తమ దేశాలకు దూరంగాఉన్న సముద్ర జలాలు మాత్రం కాలుష్యంలో నిండిపోవాలన్నది ‘సంపన్న’ ప్రభుత్వాల దుస్తత్రం! కానీ కాలుష్య వాయు మండలం, జల మండలం భూమండలాన్ని మొత్తం అలముకుంటున్నాయి, కాలుష్యం పెంచిన దేశాలకు, కాలుష్యం కాటుకు బలిఅవుతున్న దేశాలకూ మధ్య ప్రాకృతికమైన అభేదం- అద్వైతం- ఏర్పడిపోయింది!! ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి ‘చెత్త’తో నిండిన పాత ఓడను మన దేశానికి సమీపంలోని జలాలలో ముంచివేయడానికి ఫ్రాన్స్ ప్రయత్నించింది! మన ‘నిఘా’కు పట్టుబడింది. ఫ్రాన్స్ ఆ పాత ఓడను వెనక్కి పిలిపించడం వేరు కథ! కానీ పట్టుబడని ఓడలు ఎన్ని ఇలా సముద్ర జలాలలో మునిగిపోతున్నాయో??- కాలుష్యం కారణంగా సముద్ర జలాల మట్టం పెరిగి కొన్ని చిన్న దేశాలు పూర్తిగా జలమయం అయ్యేందుకు పెరుగుతున్న ‘్భతాపం’ దోహదం చేస్తోంది. ఉష్ణోగ్రతను అదుపుచేయడానికి ‘పారిస్’ సదస్సులో అంతర్జాతీయ సమాజం ప్రతిజ్ఞ చేసినప్పటికీ, క్రీస్తుశకం 2100నాటికి భూగోళం ఉష్ణోగ్రత మరో ఎనిమిది డిగ్రీలు- సెల్సియస్- మేర పెరగనున్నదని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది! తమ దేశం మొత్తం నీటిపాలయ్యే ప్రమాదంనుంచి రక్షించవలసిందిగా ‘కిరివటి’ అన్న చిన్న దేశం ప్రభుత్వంవారు ‘పారిస్’ సమావేశ నిర్వాహకులకు విజ్ఞప్తిచేయడానికి ఇది నేపథ్యం. ప్రశాంత మహాసాగరం మధ్యలో ఒదిగి ఉన్న ‘కిరివటి’ ముప్పైరెండు ద్వీపాల సమూహం. లక్షమంది ప్రజలున్న ఈ దేశం. ఉష్ణోగ్రత ఇలాగే పెరిగినట్టయితే 2050నాటికి ఈ దేశం సముద్రంలో మునిగిపోతుందట! ఈ దేశంలోని సముద్రతీర ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయట! ఫిజీ దేశంలోని ఆరువేల ఎకరాల భూమిని కొని ‘కిరివటి’ వాసులు వ్యవసాయం చేస్తున్నారట! 2050నాటికి 2100 నాటికి కాలుష్య ప్రసరణాన్ని సున్న శాతానికి దించాలన్న ‘ప్రతిజ్ఞ’లకు, ప్రపంచీకరణకూ పొంతన లేదు. ‘ప్రపంచీకరణ’లో భాగంగా అడవులను, ఆవులను చంపివేస్తున్న మన దేశం కూడ ‘కాలుష్య విస్తరణకు కారణమని కేంద్రమంత్రి మేనకాగాంధీ ఇటీవల ‘‘కుండను బద్దకొట్టడం’’ కృత్రిమ ప్రగతిని కోరుతున్నవారికి తీవ్రమైన అభిశంసన!
శతాబ్దికి పైగా సంపన్న దేశాలు ప్రధానంగా పాశ్చాత్య దేశాలు ‘పరిశ్రమ’ల కాలుష్యాన్ని పంచిన కారణంగా ఉష్ణోగ్రత పెరిగి ప్రాకృతికమైన ఉత్పాతాలు జరిగిపోతున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ‘పారిస్’ సమావేశం సందర్భంగా ప్రకటించారు. ఇటీవల మదరాసు మహానగరం మొత్తం ఉప్పునీటి మడుగుగా మారడానికి దారితీసిన భయంకర వర్షపాతం ఈ వందేళ్ల కాలుష్య ఫలితమన్నది కూడ మన మంత్రి చేసిన నిర్ధారణ! పది శాతం జనాభాఉన్న సంపన్న దేశాలు యాబయి శాతం పర్యావరణ కాలుష్యాన్ని విస్తరింపచేస్తున్నాయన్న వాస్తవం జవదేకర్ ప్రకటనకు ఆధారం! కానీ ‘ప్రపంచీకరణ’ విధానాలు హరిత శోభలను హరించి వేస్తుండడం మన దేశంలో కొనసాగుతున్న వైపరీత్యం! సంపన్న దేశాల మాట ఎలా ఉన్నప్పటికీ మన దేశంలో ‘ప్రత్యేక ఆర్థిక మండలాల’ పేరుతో అడవులను, ఆవులను, పంట పొలాలను, భూగర్భ జలాలను విధ్వంసంచేస్తున్న విధానాలు పదిహేను ఏళ్లకుపైగా కొనసాగుతున్నాయి! ఆకుపచ్చనితనంలో నిహితమై ఉన్న పర్యావరణ ఆరోగ్యం, మానవ జీవన భద్రత దశాబ్దులుగా దశలవారీగా ధ్వంసమైపోయింది! కాలుష్యం ఉష్ణోగ్రత పెరగడానికి ఇదీ కారణం! ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఒక గంట రెండుగంటలు సంచరించి వచ్చినట్టయితే అనేక రకాల రోగాలు నయమయ్యేవట! ఈ అడవులనుంచి ప్రవహించిన ముచికుందా నది నీరు అనేక ఓషధుల భరితమై అమృతప్రాయంగా ఉండేదట! ‘హరితహారం’ కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా చాటిన చారిత్రక సత్యాలివి! కానీ ‘ముచికుందా’నది ‘మూసీ’ మురుగుకాలువగా మారడానికి దారితీసిన కాలుష్యం ఎలా విస్తరించింది?? ఎవరు విస్తరింపచేశారు?? శ్రీశైలం అడవులలో రక్త గాయాలను గంటలలో మాన్పి చికిత్స చేయగల ఆకులు, తీగెలు, పొదలు, చెట్లు ఇప్పటికీ ఉన్నాయి! అడవులలోని అద్భుతమైన ఓషధుల ప్రభావంతో నమ్మశక్యంకాని రీతిలో రోగాలు నయమయిన ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి! కానీ పర్యావరణలో నిహితమైన ఈ అద్భుతాలను గ్రహించలేని ‘అనభిజ్ఞత’ హేతుబద్ధమైన శాస్త్రంగా చెలామణి అవుతుండడం భావ కాలుష్యానికి పరాకాష్ఠ! గోమయం, గోమూత్రంతో తయారయ్యే ఎరువులు కనుమరుగయ్యాయి. ‘ఎండోసల్ఫాన్’ వచ్చిపడింది. కృత్రిమమైన రసాయనాలు ఎరువుల రూపంలో భూమిని వాతావరణాన్ని కాలుష్యంతో నింపాయి!! ‘ప్లాస్టిక్’ భూతం నగరాలను విహార స్థలాలను చివరికి సమున్నత హిమాలయ శృంగాలను కాలుష్యగ్రస్తంచేసి ‘వేడి’ని పెంచుతోంది! ‘ప్లాస్టిక్’పై నిషేధాలు ప్రకటనలకు పరిమితమయ్యా యి! జనజీవనం మాత్రం ‘ప్లాస్టిక్’ మ యం!! మేనకాగాంధీ కుండబద్దలు కొట్టడానికి ఇదీ కారణం!
హిమాలయ పర్వతశ్రేణిలోని ఎనబయి ఏడు శాతం ‘హిమ శకలాలు’ సురక్షితంగా ఉన్నట్టు పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభకు చెప్పారు. పదమూడు శాతం ‘హిమ శకలాలు’ కరగిపోయాయి, కరగిపోతున్నాయి!! పదమూడు శాతం కరగిపోయి ‘రాళ్లు’ తేలడానికి రెండు దశాబ్దులు పట్టింది.... ఈ ప్రాతిపదికన మొత్తం మంచు ఎప్పుడో అప్పుడు కరిగిపోతుందా?? నిరోధించేదెలా??

- హెబ్బార్ నాగేశ్వరరావు