మెయన్ ఫీచర్

సమర పథంలో ‘బలూచీ’ స్వాతంత్య్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలూచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతుండడం సహ జ చారిత్రక పరిణామం. క్రీస్తుశకం 1947 నాటి అఖండ భారత విభజన సందర్భంగా బలూచీప్రాంతం, బలూచీ ప్రాం తంలోని సంస్థానాలు పాకిస్తాన్‌లో కలిసిపోవడం కృత్రిమ పరిణామం. ఈ కృత్రిమ పరిణామం కారణంగానే బలూచిస్థాన్ పాకిస్తాన్ దమన కాండకు ఏడు దశాబ్దాలుగా గురి అవుతోంది. చైనా ప్రభుత్వం క్రీస్తుశకం 1949 నుంచి టిబెట్‌ను కొల్లగొడుతోంది. సువిశాలమైన టిబెట్‌లోని ప్రాకృతిక సహజ సంపదను దోచుకుంటోంది. పాకిస్తాన్‌కు బలూచిస్థాన్, చైనాకు టిబెట్ వంటిది. పాకిస్తాన్‌లో మొత్తం భూభాగంలో నలబయినాలుగుశాతం బలవంతంగా పాకిస్తాన్ కలుపుకున్న బలూచిస్థాన్‌లోనే ఉంది. ఈ బలవంతపు‘విలీనం’ బ్రిటన్ పాలకులు, పాకిస్తాన్ నిర్మాత మహమ్మదాలీ జిన్నా కలసికట్టుగా జరిపిన కుట్ర..
బ్రిటన్ దురాక్రమణ అఖండ భారత్‌లో కొనసాగుతున్న సమయంలో క్రీస్తుశకం 1920వ దశకం చివరి నుంచి మహమ్మదాలీ జిన్నా దేశాన్ని ఇస్లాం మత ప్రాతిపదికపై విభజించాలన్న విద్రోహ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాడు. ఇస్లాం మతస్థులు అనాది హిందూ జాతిలో భాగం కాదని, ఇస్లాం మతస్థులు ప్రత్యేక జాతి అని వారు అధికసంఖ్యలో ఉన్న ప్రాంతం ప్రత్యేక దేశంగా ఏర్పడాలని జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ చేసిన వాదం. హైందవ జాతిలో అనాదిగా అనేక మతాలు ఉన్నాయి. ఏ ఒక్క మతంవారు కూడ తమది హైందవ జాతి కంటె భిన్నమైన జాతి అని భావించలేదు. తమ మతం ప్రత్యేక జాతి అని భావించలేదు. తమ మతంకోసం ప్రత్యేక దేశాన్ని కోరలేదు. శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాందవంటి సనాతన మతాలవారు, బౌద్ధ, జైన వంటి వైదికేతర మతాలవారు, సిక్కు, ఆర్య సమాజం వంటి ఆధునిక మతాలవారు అఖండ భారత్‌ను తమ మాతృభూమిగా భావించడం చరిత్ర. విదేశాలనుంచి వచ్చి స్థిరపడిన పారశీక, క్రైస్తవ మతాలవారు సైతం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దినాటికి అఖండ భారత్‌లో అనాదిగా వికసించిన హైందవజాతిలో తామూ అవిభాద్యమన్న వాస్తవ నిబద్ధులయ్యారు. కాని స్వతంత్ర భారతదేశం ఒక్కటిగా ఉన్నట్టయితే అచిరకాలంలో అగ్రరాజ్యం కాగలదని బ్రిటన్‌వారు గుర్తించారు. అందువల్ల అఖండ భారత్‌ను ముక్కలు చేశారు. ఇలా ముక్కలు చేయడం బ్రిటన్ పాలకులకు జిహాదీలు సహకరించారు. ఈ జిహాదీలు ఇస్లాం మతస్థులకు ప్రత్యేక దేశాన్ని, ప్రత్యేక జాతిని కోరిన మహమ్మదాలీ జిన్నా నాయకత్వంలోని ముస్లీంలీగ్ ముష్కరులు..
బలూచిస్థాన్ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనప్పటికీ బలూచీ ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటు సమర్థించలేదు. వాయువ్య సరిహద్దు ప్రాంతంలోని ముస్లింలు- అత్యధికులు-పాకిస్తాన్‌ను కోరలేదు. అందువల్ల తరతరాల అఖండ భారత్ సమగ్రత్వం యథాతథంగా కొనసాగాలని బలూచిస్థాన్, వాయువ్య సరిహద్దు ప్రాంతాలవారు అభిలషించారు. బలూచిస్థాన్ కొత్తగా ఏర్పడనున్న పాకిస్థాన్‌లో భాగం కానక్కరలేదని బ్రిటన్ ప్రభుత్వానికి 1928లో మహమ్మదాలీ జిన్నా స్పష్టం చేసి ఉన్నాడు. బలూచిస్థాన్, వాయువ్య సరిహద్దు ప్రాంతం లేకుండానే సింధు, పశ్చిమ పంజాబ్, తూర్పు బెంగాల్ కలిసిన ప్రాంతాన్ని మాత్రమే పాకిస్తాన్‌గా ఏర్పాటు చేసుకోవడానికి మహమ్మదాలీ జిన్నా సిద్ధపడి ఉన్నాడన్నది వాస్తవ చరిత్ర. కానీ పాకిస్తాన్ దుష్ట స్వప్నం వాస్తవం కాగానే జిన్నా ముఠావారు ఈ వాస్తవాన్ని చెరిచారు. బలూచిస్థాన్‌ను తమ మతరాజ్య వ్యవస్థలో కలుపుకున్నారు.
బలూచీ భాషకు పారసీ భాషకు సంబంధించిన ‘ఖరోష్ఠ’ లిపిలో వ్రాస్తున్నారు. ఈ ‘ఖరోష్ఠ’ లిపి అనాదిగా భారతదేశంలో వౌలికమైన ‘బ్రాహ్మీ’లిపికి రూ పాంతరం మాత్రమే. ఇప్పటి ఇరాన్ క్రీస్తుశకం ఏడవ శతాబ్దికి పూర్వం పారశీక దేశం. క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో ఇస్లాం మతం పుట్టినప్పటినుంచి జిహాదీ బీభత్సకారులు పుట్టుకొచ్చారు. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ఏకైక మతంగా ఇస్లాంను ప్రతిష్ఠించడం జిహాదీల లక్ష్యం. అందువల్ల జిహాదీలు ఏడవ శతాబ్దిలోనే పర్షియా లేక పారశీక దేశంలో చొరబడి మొత్తం పారశీకులను ఇస్లాంలోకి మార్చారు, చంపేశారు, తరిమేశారు. పారశీకులు సహస్రాబ్దులకు పూర్వం భారత్ నుంచి వెళ్లిపోయి పర్షియాలో స్థిరపడ్డారు. పర్షియాలోని పారశీక మతం వారు అగ్ని ఆరాధకులు. ఈ అగ్ని ఆరాధన వేద సంస్కృతిలో భాగం. పారశీక భాష. బలూచీ భాషలు సంస్కృత భాషకు రూపాంతరాలు-ఏడవ శతాబ్దిలో జిహాదీలు పర్షియా- నేటి ఇరాన్-లో చొరబడిన నాటికి బలూచిస్థాన్‌లో వేద మతాలు, బౌద్ధమతం పరిఢవిల్లుతున్నాయి. పర్షియా, బలూచిస్థాన్‌కు పశ్చిమంగా వాయువ్యంగాను విస్తరించి ఉంది. అందువల్ల పర్షియాను ధ్వంసం చేసిన జిహాదీలు భారత్‌లోకి చొరబడ్డారు, బలూచిస్థాన్‌లోకి చొరబడ్డారు, బలూచిస్థాన్ అప్పటివరకు ‘గ్రామణీయ’ రాజ్యంగా ఉండేది. ఈ ‘గ్రామణీయ’ రాజ్యం అతి ప్రాచీన భారత ఖండంలో యాబయి రాజ్యాలలో ఒకటి..
ఇలా పారశీక, గ్రామణీయ ప్రాంతాలు ఇరాన్‌గా, బలూచిస్థాన్‌గా మారడానికి ఇలా జిహాదీలు జరిపిన బీభత్సకాండ కార ణం. ప్రజలు ఇస్లాంలోకి మారినప్పటికీ ప్రాచీన పారశీక భాష, గ్రామణీయ భాషలు అలాగే మిగిలి ఉన్నాయి. కానీ గ్రామణీయ భాష ప్రాచీన బ్రాహ్మీ లిపికి రూపాంతరమైన స్థానిక లిపికి దూరమైపోయింది. పారశీక లిపిలో బలూచి భాషగా రూపాంతరం చెందింది. పారశీక భాష కూడ ప్రాచీన బ్రాహ్మీ లిపికి దూరమైపోయి కొత్త లిపికి గురికావడం కూడ మతం మార్పిడుల ఫలితం. క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో అలెగ్జాండర్ అనే గ్రీకు బీభత్సకారుడు మనదేశంలో చొరబడి, ఓడిపోయి, పారిపోయేనాటికి బలూచిస్థాన్- గ్రామణీయ- రాజ్యం గుప్తవంశపు సామ్రాట్టుల సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గ్రామణీయ, గాంధారంలోని దక్షిణ ప్రాంతం కలిసి నేటి బలూచిస్థాన్‌గా మారింది. గాంధారపు ఉత్తర ప్రాంతం నేటి అఫ్ఘానిస్తాన్ ఉత్తర ప్రాంతం లో రామఠ, హార, హూణ, ఉత్తర జ్యోతిష, సింహపుర, కటక, ఉరగ, వంటి రాజ్యాలుగా ఉండేవి. వీటికి ఉత్తరంగా నేటి తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రాంతాలలో ఉత్తర బాహ్లికం ఉండేది. ఉత్తర జ్యోతిష రాజధానిని, ఉరగ రాజ్యానికి తూర్పున అభిసార రాజ్యం, ఉత్తరాన దరద రాజ్యం ఉండేవి. దరద రాజ్యం నేటి దరదస్థాన్.
ఈ రాజ్యాలన్నీ సముద్రగుప్తుని సామ్రాజ్యపు పశ్చిమ వాయువ్య ప్రాంతాలు. నేటి కాస్పియన్ సముద్రం వరకు గుప్త సామ్రా జ్యం విస్తరించి ఉండడం క్రీస్తుకు పూర్వం నాలుగవ శతాబ్ది నాటి మాట. అలెగ్జాండర్ అన్న బీభత్సకారుడు వెనుదిరిగి పోయిన నాటిమాట. బలూచిస్థాన్ నుండి కశ్మీర్ వరకు గల ప్రాం తంలో ఆనాడు ‘బ్రాహ్మీ’ లిపిలో భాషను రాశారు. ఈ చరిత్రను బ్రిటన్ దురాక్రమణ కాలంలో ఆంగ్లేయ మేధావులు చెరచారు. వక్రీకరించారు. అలెగ్జాండర్ మనదేశంలోకి చొరబడినప్పుడు పాలించినవారు గుప్తులన్న వాస్తవాన్ని చెరచారు.. అలెగ్జాండర్ సమకాలంలో వౌర్యు లు పాలించారన్న అబద్ధాన్ని ప్రచారం చేశారు. వౌర్యులు అలెగ్జాండర్ కంటె పనె్నండు వందల ఏళ్లకు పూర్వం వారు. అలెగ్జాండర్ సమకాలికులు గుప్తచక్రవర్తులు. గుప్త చంద్రగుప్తుని, అతని కొడుకు సముద్రగుప్తుని అపార సైన్యం గురించి విని, భయపడి బలూచిస్థాన్ -గ్రా మణీయ రాజ్యం- నుండి అలెగ్జాండర్ పారిపోయాడు. ఇలా అఖండ భారత్‌లో అనాదిగా బలూచిస్థాన్ ముడివడి ఉంది.
బలూచిస్థాన్‌లో ఇలా అనాదిగా వేద సంస్కృతి పరిఢవిల్లింది. క్రీస్తుశకం 654లో జిహాదీలు చొరబడి వేద సంస్కృతిని ధ్వంసం చేశారు. ఆ తరువాత క్రీస్తుశకం పదహారవ శతాబ్ది నుండి పోర్చుగల్ దురాక్రమణ దారులు, తదితర ఐరోపావారు బలూచిస్థాన్‌లో చొరబడ్డారు. ఆంగ్లేయుల కాలం లో మొహంజోదారో చారిత్రక వక్రీకరణకు గురి అయింది. బ్రిటన్ వారి దుస్తంత్రంలో భాగం బలూచిస్థాన్‌లో గ్వాదార్ భూవల యం పర్షియా సింధుశాఖకు దక్షిణంగా ఉన్న ఓమన్ రాజధానికి దక్కిపోయింది. మళ్లీ ఈ గ్వాదార్ ఓడరేవు ప్రాం తాన్ని ఓమన్ ప్రభుత్వం 1958లో పాకిస్తాన్‌కు అమ్మింది. ఈ బదిలీకి కూడ బ్రిటన్ ప్రభు త్వం నడిపిన రాజకీయం కారణం. ప్రస్తుతం ఈ గ్వాదార్ ఓడరేవును చైనా అభివృద్ధి చేస్తోంది. గ్వాదార్ నుంచి సింకియాంగ్‌లోని కష్‌గఢ్ వాణిజ్య పట్టణం వరకు చైనా ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్ పొడవునా ఏర్పడే ఈ వాణిజ్యపు నడవ పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్‌లోని గిల్గిత్ మీదుగా వెడుతోంది. ఈ మన భూభాగం గుండా నడవను నిర్మించే పథకానికి స్వస్తి చెప్పాలని మన ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్ 4న చైనాలోని హాంగ్ ఝోవూలో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌కు చెప్పి వచ్చారు. కానీ చైనా ఇప్పటికే ఈ నడవపై దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిందట. గ్వాదార్ ఓడరేవులో చైనా తిష్ఠవేసి ఉం డడం బలూచిస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి వికృతమైన నేపథ్యం.
లక్షాముప్పయి ఐదువేల చదరపు మైళ్ల-మూడు లక్షల నలబయి ఎనిమిదివేల చదరపు కిలోమీటర్ల- బలూచిస్థాన్ జనాభా కేవలం ఒక కోటి. అందువల్ల సహజ సంపదను పాకిస్తాన్ భారీగా కాజేస్తోంది. 1947 నకు పూర్వం మూడవవంతు బలూచిస్థాన్ మాత్రమే బ్రిటన్ ప్రత్యక్ష పాలనలో ఉం డేది. మిగిలిన భూమి నాలుగు స్వదేశీయ సంస్థానాలుగా విడిపోయి ఉండేది. ఈ నాలుగు సంస్థానాలు పాకిస్తాన్‌లో చేరరాదని మొదట నిర్ణయించాయి. తరువాత కలసిపోవడం వేరే కథ. ఈ కథ దశాబ్దుల బలూచీల వ్యధకు ప్రాతిపదిక. ఐదుసార్లు బలూచిస్థాన్‌లో పెద్ద ఎత్తున స్వాతంత్య్ర సమర జ్వాలలు చెలరేగాయి. 2004లో ప్రజ్వరిల్లిన స్వాతంత్య్ర జ్వాలలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి...బలూచీ విముక్తి సంస్థ స్వాతంత్య్ర ఉద్యమం కొనసాగిస్తోంది.

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com