సబ్ ఫీచర్

ఉత్తేజ పరచేవాడే ఉత్తమ గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఉత్తమోత్తమ గురువులకే శిష్యుండనైతి
గురువునయ్యెద సచ్ఛిష్యకోటికెల్ల’’ అంటారు కవికోకిల దువ్వూరు రామిరెడ్డిగారు తన ‘‘పానశాలలో ఒక వ్యక్తి ఉత్తమమైన గురువులవద్ద విద్యనేర్చి ఉత్తమశిష్యుడై, ఆ తదుపరి తాను ఉపాధ్యాయుడై ఉత్తమ శిష్యులను తయారుచేస్తే అతడు సమాజాన్ని ప్రగతిపధంలో నడిపించిన వాడౌతాడు.
‘‘గురువు, అనే పదంలో ‘‘గు. శబ్దస్త్వంధకారః- రు, శబ్దస్తన్ని వృత్తకః’’ అంటారు దేవభాషలో. ఒక వ్యక్తిలోని అజ్ఞానమనే అంధకారమును పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువు అని అర్ధం.’’ తల్లీతండ్రీ గురువూ దైవం, అని ‘‘గురువు శబ్దానికి గురుస్థానాన్ని ఇచ్చారు మన పెద్దలు శిష్యుడు’’ అంటే సేవించేవాడు అని అర్ధం. గురువు పట్ల మాతృపితృ భావను కలిగి యుండి సేవించి మెప్పును పొంది విజ్ఞానాన్ని సాధించేవాడే శిష్యుడు. మన భారతీయ సంప్రదాయంలో గురుశిష్య సంబంధం చాలా గొప్పది. ప్రాచీన కాలపు గురుకులాలన్నీ ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉండి ఎటువంటి భేదభావము లేక గురువువద్ద ఆయన పుత్ర సమానులై విద్యనభ్యసించి జ్ఞాన సముపార్జనగావించేవారు.
సాందీపుడు, ద్రోణుడు విశ్వామిత్రుడు, శుక్రాచార్యుడు, వరతంతు మహాముని మొదలైన గురువులంతా తమ శిష్యులకు కావలసిన జ్ఞానాన్ని అందించినవారే. ఆ తరువాతి కాలంలో ‘గురువు అనే పదానికి పర్యాయపదం’గా ఉపాధ్యాయుడు పంతులుగారు, అయ్యవారు, మాష్టారు, మొదలైనవి శిష్యునిగా పర్యాయపదంగా విద్యార్థి లాంటి పదాలు వచ్చాయి.
విద్యార్థులకు పుస్తకస్థ విషయంతోపాటుగా మిగిలిన అన్ని విషయాలను నేర్చి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దినవాడే నిజమైన గురువు.
‘‘జ్ఞానదీప్తి పెంచి, సహనంబు నేర్పించి
సకల సద్గుణాల సారమిచ్చి
చదువు విలువ యెంతొ సహనంబు విలువెంతొ
సరసరీతి దెల్పు గురుడు సురుడు’
అంటూ గురువుకు దైవత్వాన్ని ఆపాదించాడు ఒక కవి.
‘‘పరమ ప్రీతినహర్నిశలు త్రిదశోపాధ్యాయ
వర్యుడు తానె బోధనల్ నేర్పి, చింతనల్
గావించి... .... పల్మరు నీ యర్ధంబేమిటని
ప్రశ్నింపన్..... గురువై చెల్లు నీధరాతలిన్,
అంటూ ఒక మహాకవి గురువు చేయవలసిన ముచ్చటైన మూడు విధులను దశలను నిర్దేశించాడు. మొదటి దశలో పాఠ్యాంశాన్ని విశే్లషణాత్మకంగా వివరించాలి. తనదైన శైలిలో విద్యార్థి స్థాయిని అనుసరించి హృదయానికి హత్తుకునేలా పాఠ్యాంశాన్ని బోధించాలి. ఆ తరువాత తాను బోధించిన విషయాన్ని ఒకటికి పదిసార్లు చింతన చేయించాలి. దానే్న ‘అభ్యాసము’ అంటారు. ‘‘అభ్యాసము కూసువిద్య’ అని ఆర్యోక్తి. ఆ తరువాత ఆ అంశముపై ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టాలి. ఇటువంటి బోధనగావించిన వాడే నిజమైన గురువు. ‘‘ఒక దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్ణయింపబడుతుంది. అన్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి మాట నూటికి నూరుపాళ్ళు నిజం. పుస్తకంలో ఉన్న నాలుగు మాటల్ని మక్కికి మక్కి చదివి అర్ధంచెప్పి ఇంతటితో తన బాధ్యత పూర్తయింది అనుకునేవాడు ఉపాధ్యాయుడు కాలేడు. విద్యార్థుల్ని ఆలోచింపజేసి, ఆనందింపజేసి తన పాటవంతో ప్రగతిపధం వైపు నడిపించే వాడే నిజమైన గురువు. విద్యార్థులను తన బోధనతో ఉత్తేజ పరచేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు. గురువాక్కులను బ్రహ్మవాక్కుగా భావించి, వాటినే బుక్కులుగా తలచి మంత్రంలా భావించి ఆచరించి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నవాడే నిజమైన విద్యార్థి. నాటి మహాభారత, రామాయణ కాలం నుండి మన మాజీ రాష్టప్రతి దివంగత డా.అబ్దుల్ కలాంవరకు గురుస్థానానికి గురుస్థానాన్ని కల్పించి వారిని స్మరించుకున్నవారే జీవితంలో అత్యున్నత స్థాయిని చేరిన ప్రతి వ్యక్తీ తన జీవితంలో తనను ఉత్తేజపరచిన వారిని గుర్తుంచుకున్నవారే.
అలాగే దివంగత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే మన మాజీ రాష్టప్రతి, ఉత్తమ తత్త్వవేత్త అత్యుత్తమ అధ్యాపకుని జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా ప్రకటించుకొని ఘనంగా జరుపుకుంటున్నామంటే ఉత్తమ గురువులకు మనమిచ్చే స్థానం ఏమిటో అర్ధవౌతూనే ఉంది. ఈ సందర్భంగా బమ్మెరపోతనామాత్యుని ఈ పద్యాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే బావుంటుందేమో. చండామార్కులవారి వద్ద గురుకులంలో విద్యనభ్యసించి వచ్చిన ప్రహ్లాదకుమారుని అతని తండ్రి హిరణ్యకశిపుడు తన ఒడిలో కూర్చుండబెట్టుకొని
‘‘చోద్యంబయ్యెడి నింతకాలమరిగెన్; శోధించి యేయేమిసం
వేద్యాంశంబులు నెప్పిరి, గురువులే వెంటనే పఠింపించిరి, నీ
విద్యాసారయెరుంగ గోరెద, భవద్విజ్ఞాన శాస్త్రంబులో
పద్యం బొక్కటి చెప్పి, సార్ధముగ తాత్పర్యంబు భాషింపుమా?
అని అడుగుతాడు. ఈ ప్రపంచంలో తాను మేధావి కావచ్చు. రాజకీయ నాయకుడు కావచ్చు. రక్షక భటుడు కావచ్చు. దొంగ కావచ్చు. రోజువారీ కూలీ కావచ్చు. తన కొడుకు మాత్రం బాగా విద్యనేర్చి సమున్నత స్థాయిని అందుకోవాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. ఇది నిజం. అందుకే రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తన కుమారుని విద్యావిషయక ప్రశ్నలు వేసి, చివరలో ఒక్క పద్యం చెప్పి, తాత్పర్యాన్ని చెప్పమంటాడు. ఏ విద్యార్థియైనా ఒక్క పద్యాన్ని అప్పగించి, విశే్లషిస్తే అతని యొక్క విద్యాసామర్థ్యం తెలిసిపోతుందనేది వాస్తవం. ఈనాటి విద్యార్థులలో అటువంటి సామర్థ్యం ఎంతమందికి ఉందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మార్కులను, ర్యాంకులను కొలబద్దలుగా చేసికొని ఆ తరువాత ప్రతి ఉద్యోగానికి కోచింగులిప్పించే మన విద్యావ్యవస్థలు, మన తల్లిదండ్రులు ఆలోచించవలసి ఉంది. దానికి ప్రతిగా ప్రహ్లాదుడు
‘‘చదివించిరి నను గురువులు
చదివితి సకల లోక శాస్తమ్రులెల్లన్
చదివించి’’ రన్ని దిశలను
చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రీ!
అంటాడు. ఈ పద్యంలో ‘‘చదివించిరి, అన్ని దిశలను అనే పదాలను గమనించాలి. అంటే విద్యా సముపార్జన కాలమునందే చదువుతోపాటు విద్యార్థికి అన్ని విషయాలలో తగినంత జ్ఞానాన్నిచ్చి పంపేవారు అని అర్ధవౌతుంది. దానినే ‘‘సమగ్రాభివృద్ధి.. లేదా’’ ఆల్‌రౌండ్ డెవలవప్‌మెంట్ అంటారు. పోతనగారి కాలం నాటికే విద్య నేర్పించే గురువులు, నేర్చే శిష్యులు వారి నుండి ఆశించే సమాజం ఎలా ఉండేదో అర్ధవౌతుంది. ఉద్యోగం వచ్చా క, తనకు నచ్చిన చోటునే పనిచేస్తూ తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తూ, తనకు ఇచ్చిన జీతాన్ని తీసుకుంటూ ‘బెల్ అండ్ బిల్’ పాలసీగా పనిచేసే ఉపాధ్యాయులు ఒక వర్గం. వీరు నిమిత్తమాతృలుగా ఉంటారు.

- బచ్చు రాంబాబు సెల్ : 08977312510