ఉత్తరాయణం

చట్టాలను అతిక్రమించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాటా కార్ల పరిశ్రమకై బెంగాల్ ప్రభుత్వం గతంలో సే కరించిన 997ఎకరాల భూమిని తిరిగి రైతులకు అప్ప గించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అసాధారణం, ఆ హ్వానించదగ్గ విషయం. ఈ వ్యవహారంలో తొలి రాజకీయ లబ్దిదారు మమత కాగా, తొలిదెబ్బతిన్న నిర్వా సితులు మాత్రం నాడు అధికారంలో ఉన్న వామపక్షాలు కావడం విచిత్రం. భూపంపిథీలో ఆదర్శంగా వ్యవ హరించే వాపమక్ష ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియలో అభాసుపాలు కావడం సింగూరు వ్యవహారంలో ప్రత్యేకం. ఏది ఏమైనా దశాబ్దం అనంతరం వెలువడ్డ ఈ తీర్పు ఎన్నో విధాల స్ఫూర్తిదాయకం. పరిశ్రమల స్థా పనకు భూమి లభ్యత అవసరం. అందుకు ప్రభుత్వ సహ కారం కావాలి. అయతే అవసరమైనంత మేరకు నిర్వా సితుల్ని తొలి లబ్దిదారులుగా గుర్తిస్తూ చట్టానికి లోబడి భూసేకరణ అయతే ఎవరికీ అభ్యంతరం ఉండ నక్కరలేదు. కాని వాస్తవంలో భూసేకరణ వ్యవహారమే స్థిరాస్థి వ్యాపారంగా తయారైంది. అటు పరిశ్రమ వర్గానికి, ఇటు భూమి, వసతి, వనరు కోల్పోతున్న ప్రజలకి మధ్య నిలిచి, అవసరమైతే ప్రజలపట్ల నిలవాల్సిన ప్రభుత్వాలు, వీలైనంత తక్కువ నష్టం దీర్ఘకాలిక లాభం దిశగా ఆలోచించాల్సిన విషయాన్ని మరచి, పారిశ్రామిక వర్గాలకే అనధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయ. అభివృద్ధి నిర్వచనంలో నిర్వాసితుల లబ్ది వూసే లేనప్పుడు అభివృదిధ యజ్ఞానికి ఫేదలే బలిపశువులు. ఈ ధోరణి మారేందుకు సింగూరు తీర్పు నాంది కావాలి. భూసేకరణ ప్రక్రియల్లో ప్రజానీకానికి జరిగే మేలు కీలకాంశం కావాలి. ప్రభు త్వాలు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని అతిక్రమించకుండా ఉం టే చాలు. ప్రజలకెంతో మేలు చేసినట్లే.
-డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
అన్ని క్రీడలనూ ప్రోత్సహించాలి
ప్రతి ఒలింపిక్స్‌లోనూ అనేక క్రీడా విభాగాల్లో భారతీయులు ఓటమి పాలవుతూ క్రీడాభిమానులను నిరాశపర్చడం మామూలైపోయింది. భారతదేశంలో క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత మరే క్రీడకూ ఇవ్వడం లేదు. అన్ని క్రీడలకూ సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, షూటింగ్, బాడ్మింటన్ ఒకటేమిటి? ప్రతి ఒక్క క్రీడనూ బాగా ప్రోత్సహించాలి. నిరంతరం క్రీడాకారులకు శిక్షణనిస్తూ, క్రమం తప్పకుండా పోటీల నిర్వహిస్తూ అన్ని క్రీడలకూ అంతర్జాతీయ స్థాయిలో విజయాలే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా క్రీడాధికారులు కృషిచేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
అయోమయం సృష్టించవద్దు
నేడు తెలుగునాట పలు టీ.వి ఛానెల్స్‌లో భక్తిప్రవచనాలను ఏర్పాటుచేయడం మంచి విషయం. పూర్వకాలంలో పురాణ ప్రవచనాలు ప్రజల జీవితంలో అంతర్భాగమై నిలిచినందున వారు అందులోని మంచిచెడ్డలు, ప్రబోధాలు, సూక్తులు, మహాత్ముల జీవన విధానం మొదలైన వాటిని ఆకళింపుచేసుకొని తదనుగుణంగా ధార్మికమైన జీవితం నడిపేవారు. నేడు డిజిటల్ టెక్నాలజీ ధర్మమా అని ఇటువంటి ప్రవచనాలు నేరుగా ప్రజల ముంగిటలోనే లభిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కొందరు ప్రవచనకర్తలు పరస్పరం విమర్శలు చేసుకోవడం, వేదశాస్త్రానికి సంబంధించి విరుద్ధమైన భాష్యం చెప్పడం, ఇతర ప్రవచనకర్తల వ్యాఖ్యలను ఖండించడం చేస్తున్నారు. ఇందువలన భక్తుల అయోమయానికి గురికావడమేకాకుండా ప్రవచనకర్తల శాస్తప్రాండిత్యం పట్ల అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అసలే అన్యమతస్తుల విమర్శల దాడికి గురవుతున్న హిందూ మతాన్ని సదరు ప్రవచనకర్తలు మరింత గందరగోళ పరిచే, వ్యతిరేక శక్తులకు ఊతం ఇచ్చే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
సమన్వయం అవసరం
సామాన్య మానవుని దృష్టిలో పాలనపరంగా కేంద్రం, రాష్ట్రం ఒక్కటే. అందుచే, కేంద్రం రాష్ట్రాలు సఖ్యతతో వ్యవహిరించాలి. ఒకరినొకరు విమర్శించుకుంటే చీటికీ మాటికీ విభేదాలతో సతమతమవుతూ వార్తాపత్రికలో ప్రకటనలను చేస్తుంటే ప్రజలకు పాలకులపై గౌరవం తగ్గుతుంది. స్వప్రయోజనాలకోసం పోరాటాలు తగదు.
- ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం