ఉత్తరాయణం

బడాయి కాకపోతే మరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లో ఏ వస్తువైనా ధర పెరగటమేగాని తగ్గటం లేదు. పెరుగుతున్న ధరలు, ఫీజులు పన్నులతో కాలం వెళ్ళబుచ్చుతున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు రావల్సిన మూడు డి.ఎ.లకోసం ఎదురుతెన్నులు చూస్తున్న సమయంలో ప్రభుత్వం ఒక డి.ఎ.ని విదిల్చేసి చేతులు దులుపుకున్నది. రాష్ట్రానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చినందుకుగాను ఒక క్రీడాకారిణికి మూడు కోట్లు నజరానా ప్రకటించడం సమంజసమా? ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయం లేదు. భవనాలు శిథిలావస్థలో వున్నాయి. ఇవేమీ నేతలకు కన్పించవా? పొరుగు రాష్ట్రం కెసిఆర్‌తో పోటీ యా? లేదా పేరు చిరస్థాయిగా చరిత్రపుటాల్లోకి ఎక్కాలని ఆరాటమా??
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
పిఆర్‌సి చెల్లింపులో అలసత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి బకాయిలు చెల్లించడంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తోంది. గత ప్రభుత్వా లు ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించాయి. ప్రస్తుత ప్ర భుత్వం మాత్రం పిఆర్‌సి బకాయిలు బాండ్ల రూపంలో చెల్లిస్తామన్నది, కానీ ఉద్యోగ సంఘాలు ఒప్పుకోనందు కు వెనకడుగు వేసింది. నెలలు గడుస్తున్నప్పటికీ బకాయిలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తున్నది. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఈ బకాయిలపై నిర్ణయం తీసుకోవాలి.
- రత్నాకర్‌రావు, హన్మకొండ
జమ్మూకాశ్మీర్ భారత్ భూభాగం
జమ్మూకాశ్మీర్ భారత దేశంలో ఒకానొక రాష్ట్రం. కాని పాకిస్తాన్ తరచూ భారతదేశ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటూనే వుంది. భారత్ ఏనాడు వాళ్ల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోదు. అయినప్పటికీ వాళ్ల దుర్బుద్ధిమానుకోలేదు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను ప్రోత్సహించటం, వారికి మద్దతివ్వటం మానలేదు. ఒక్క జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశమంతటా ఉగ్రవాద దాడులు చేయాలనే ఐ.ఎస్.ఐ.ఎస్‌ని ప్రోత్సహిస్తూనే వుంది. కాశ్మీర్‌లో ప్రజల రెఫరెండం కోరాలనడం సరైనది కాదు. రెఫరెండం కోరితే భారత ప్రజలందరి అభిప్రాయం తీసుకోవాలి. కాశ్మీర్ మనలో వుంచుకోవాలా, వద్దా అనేది దేశ ప్రజల ఇష్టం. కాశ్మీర్ ప్రజలు ఇష్టం లేకపోతే భారత భూభాగాన్ని వదలి పాకిస్తాన్ వెళ్లవచ్చు, భారత ప్రజలు కోరేది కూడా అదే! కాశ్మీర్ భూభాగం మాత్రం భారత్‌కు చెందినదేనన్నది ప్రపంచానికే బాగా తెలుసు. కాశ్మీర్ విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఒక తాటిపై వుండాలి. దేశ రక్షణ, దేశ భద్రత విషయాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వరాదు. ఆర్టికల్ 370ని ఇప్పటికైనా రద్దుచేయాలి. దేశ ప్రజలందరు జమ్మూకాశ్మీర్ భూభాగంలో నివసించేట్లుగాను, అక్కడ ఆస్తులు సంపాదించుకునే హక్కులను పునరుద్ధరించాలి. అలా జరిగిననాడే జమ్మూకాశ్మీర్ క్షేమంగా వుంటుంది. ప్రజలు అక్కడికి వెళ్లి స్థిరపడతారు. కశ్మీర్‌లో వుండే ప్రజలు పాకిస్తాన్ వైపు మొగ్గుచూపితే వారు భారత భూభాగాన్ని వదిలి వెళ్లిపోవచ్చు. జమ్మూకాశ్మీర్ ఎప్పటికి భారతదేశ భూభాగమేనన్నది కాశ్మీర్ వాసులు గ్రహించాలి. భారతదేశం తగు విధంగా స్పందించి పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పాలి. ఇదే ప్రజల కోరిక.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అనేక వార్డులలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతుబజార్ సమీపంలో పారిశుద్ధ్యలేమి విపరీతంగా ఉంది. ప్రధాన రహదారుల్లో తప్ప మిగతా బజార్లలో ఈ పారిశుద్ధ్యపనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సిబ్బంది కొరతనో లేక అధికారుల పర్యవేక్షణ లోపమో తెలియని స్థితి ఉంది. చెత్తబండ్లపై ఇంటింటికి వచ్చి సేకరించేవారు. గతంలో ప్రతిరోజు వచ్చేవీరు నేడు ఎప్పుడో ఒకసారి వచ్చిపోతున్నారు. దీనిపై అధికారులు సంబంధిత కార్పొరేటర్స్ శ్రద్ధవహించి ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని నివారించాలి. కాల్వలు సైతం సరిగా శుభ్రం చేయడం లేదు. అది మా విధికాదని కార్మికులు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నారు. సిబ్బందిని సైతం వార్డులవైజ్‌గా ఏర్పాటుచేస్తే ఈ అసౌకర్యాన్ని తొలగించవచ్చు. ఇప్పటి కైనా కార్పొరేషన్ తగిన శ్రద్ధ తీసుకోవాలి.
- ఎ.ఆర్.ఆర్.ఆర్.గౌడ్, ఖమ్మం
మాంసం అమ్మకాలతో ఇబ్బందులు
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ప్రధాన రోడ్లవెంబడి మాంసం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా కూరల మార్కెట్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా అమ్మకాలను సాగిస్తున్నారు. చేపలు అమ్మేవారు అక్కడే చేపలను శుభ్రంచేసి వృధా అంతా అక్కడే కుప్పలుగా పోసేసి వెళ్లిపోతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది మూడునాలుగు రోజులకు ఒకసారి మాత్రమే శుభ్రం చేస్తుండడంవలన విపరీతమైన దుర్గంధం వెదజల్లుతూ కూరగాయల మార్కెట్‌కు వచ్చేవారికి, ముఖ్యంగా శాఖాహారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఇక కొందరు కోళ్లు, మేకలను రోడ్లపైనే చంపేసి అట్లాగే వదిలేస్తున్నారు. శుభ్రంచేయాలన్న ఇంగితజ్ఞానం కూడా వీరికి వుండదు!
- ఎం.కనకదుర్గ, తెనాలి
తెలుగు విజయం
2008లో తెలుగుభాషతోపాటు మలయాళం, కన్నడ భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీనహోదా యివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఓ తమిళ న్యాయవాది దాఖలుచేసిన పిటీషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం హర్షణీయం. ఇది ఒక్క తెలుగు విజయమేకాదు, కర్నాటక, మలయాళ భాషల విజయం కూడా. ఇటువంటి స్వార్థపూరిత, కుట్రలతో కూడుకున్న అసూయాపరుల పిటిషన్లను కోర్టులు అనుమ తినివ్వకూడదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్