మెయన్ ఫీచర్

బయటపడ్డ మరో కుంభకోణం ‘ఎంబ్రేర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సీజరు భార్య తప్పు చేయదు’ ఈ ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది. భారతదేశం లో కొందరు తప్పు చేయరు అని అంతా విశ్వసించారు. అలాంటివారిలో ఆంటోనీ ఒకరు. షేక్స్‌పియర్ నాటకం ఆంటోనీ క్లియోపాత్రకు ఈ ఆంటోనీకి ఎట్టి సంబంధం లేదు. చరిత్రలో ఆంటోనీ రాజు. విలాసపురుషుడు. కాని భారత మాజీ రక్షణమంత్రి ఎకె ఆంటోనీ మాత్రం సెయింట్ ఆంటోనీ లాంటివాడే. 2014 ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రక్షణమంత్రిగా మనోహర్ పారేకర్ బాధ్యతలు స్వీకరించారు. అక్కడినుండి కొత్త అధ్యాయం మొదలైంది. నీరక్షీర వివేచనతో ఇప్పటివరకు మనం పాలు అనుకున్నవి పాలుకాదు నీళ్లు అని తేలింది. తెల్లటి బట్టలు వేసుకొని మృదువుగా మాట్లాడే పళనియప్పన్ చిదంబరం పీకలలోతు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. అంటోనీగారి రక్షణ కొనుగోళ్ల పుట్టలోనుండి పాములు బయటకు వచ్చినట్టు ఒక్కొక్క అవినీతి వెలుగులోకి వస్తున్నది. బోఫోర్సు, ట్రైనీ విమానాలు ఛాపర్స్, అగస్తా, యుద్ధనౌకలు ఇలా ఎక్కడ చేయిపెడితే అక్కడ మట్టి అంటుకుంటున్నది. ఇవన్నీ ఆంటోనీ హయాంలో జరిగిన రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలే. రక్షణశాఖ అంటే సీక్రెసీ. అంటే అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలుపవలసిన అవసరం లేదు. ఈ కారణంచేత ఎవరెవరు కొనుగోళ్ల సమయంలో భోక్తలుగా మారా రో తెలుసుకునేందుకు ఎట్టి ఆధారాలు ఉండవు. ఇటీవల ఇటలీలోని మిలన్ కోర్టు తమదేశ పౌరులను శిక్షించింది. కారణం వారు ఇండియాలో జరిపిన ఆయుధాల అమ్మకం వ్యాపారంలో కొందరు భారీ రీతిలో ప్రముఖులకు ముడుపులు చెల్లించారని. ఆ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమంటే ముడుపులు ఇచ్చినవారిని ఇటలీ (మిలన్) కోర్టు శిక్షించింది. కాని పుచ్చుకున్నవారిపై భారత ప్రభుత్వం ఎట్టి చర్యలు తీసుకోలే దు. ఎందుకని? అసలు దోషులు వేరే ఉన్నా రు. డబ్బు వారి అకౌంట్లలోకి పోయాయి. అది ని రూపించడానికి ఎవరివద్ద కూడా ఎట్టి ఆధారాలు ఉండవు. ఎందుకంటే డబ్బు అసలు ఇండియా కు రాలేదు. మారిషస్, వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాలలోని ఏవేవో బినామీ పేర్లున్న అకౌంట్లలోకి వెళ్లాయి. ఇక ఎవరిని పట్టుకుంటారు?
ఇప్పుడు మరో కొత్త కుంభకోణం వెలుగుచూసింది. దీని పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఇటలీలోని మిలన్‌కోర్టు తమ పౌరుల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపినట్టే అమెరికాలోని కోర్టు తన పౌరులు సాగించిన అక్రమ వ్యాపారంపై విచారణ జరిపంది. దీనికే ‘ఎం బ్రేర్’ జెట్ విమానాల అమ్మకం కేసు అంటున్నా రు. ఒక వస్తువు ఖరీదు లక్ష రూపాలు ఉంటే దాన్ని పదిలక్షలకు అమ్మవచ్చు. మరి కొనేవాడికి తెలివిలేదా? అంటే కొనుక్కునేవాడికి లంచం ఇస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి తన జేబులోని డ బ్బుతో ఆ విమానాలు కొనుక్కోవడం జరగదు. ఇది ఒక దేశానికి సంబంధించిన ఆస్తి. అంటే ఈ విస్తరించిన నష్టం కొనుగోలు చేసిన దేశానికే చెందుతుంది. అర్థమయ్యే భాషలో చెప్పాలటంటే ఎంబ్రేర్ విమానాలకు అధిక ధర ఇచ్చి భారత రక్షణ అధికారులు కొనుగోలు చేశారు. ఈ అధికనష్టం భారత్‌లోని సగటు అమాయక ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే ఈ ప్రజ లు ట్యాక్సు పేయర్స్ కాబట్టి. ఈ ప్రజలు అలా అధిక ధర ఇచ్చి గొనుగోలు చేసినందుకు రక్షణ విభాగంలోని కొందరికి ముడుపులు అందాయి. ఆ డబ్బు ఇచ్చింది ఎవరో అమెరికన్ కోర్టు విచారిస్తున్నది. కాని పుచ్చుకున్నది ఎవరో భారతీయ కోర్టు విచారించడం లేదు. ఇదీ అసలు కథ. విచారణ ప్రారంభం కావడానికి ముందే కాం గ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి మాట్లాడుతూ,‘‘విచారణ జరుపుకొని నిజానిజాలు తేల్చుకోండి. అప్పటివరకు ఆరోపణలు చేయవ ద్దు’’ అన్నారు. ‘ఏ ధైర్యంతో ఆయన ఇలా అ న్నారు?’ అంటే ఆ డబ్బు సోనియా, రాహుల్, ఎకె ఆంటోనీ ఇలా ఎవరి అకౌంట్లలో లేదు కా బట్టి. మరి మధ్య దళారి ఈ డబ్బును ఎవరికి ఇచ్చారు? ఇస్తే- దానిని ఎవరి అకౌంట్‌లో జమచేశాడు?
బ్రెజిల్‌కు చెందిన విమాన తయారీ సంస్థపేరు ఎంబ్రేర్. ఈ సంస్థ నుండి భారత రక్షణ శా ఖ మూడు అత్యాధునిక జెట్ విమానాలు కొనుగోలు చేసింది. అలా విమానాలు ఇండియాకు అమ్మిన సందర్భంగా భారీగా ముడుపులు భారత ప్రముఖులకు ముట్టినట్టు బ్రెజిల్‌లోని స్థానిక దినపత్రిక ‘‘షోలాడి సానోపాలో’’ వెల్లడించింది. ఈ విమానాలు శత్రువులు జరుపబో యే దాడులను ముందుగానే పసికట్టగలవు. భారతదేశానికి చెందిన రక్షణ పరిశోధనా సంస్థపేరు డిఆర్‌డిఓ. ఈ సంస్థ బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రేర్ విమానాల తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఢిల్లీలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నకాలంలో 2008లో జరిగింది. ఈ మొత్తం కొనుగోలు విలువ 208 మిలియన్ల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 2250 కోట్ల ధనరాశి. ఇంత డబ్బు ఎంబ్రేర్ కంపెనీకి ఇండియాలో ముట్టింది. ఇలాంటి డీల్స్‌లో మూలధనం మీద మూడు నుండి ఎనిమిది శాతం వరకు కమిషన్లు ఉంటాయని వినికిడి. దీన్ని నిర్ధారించడానికి ఆధారాలు దొరకవు. కాని ఒకసారి అటల్ బిహారీ వాజ్‌పే యి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంగతి వెల్లడించారు. కాబట్టి మనం నమ్మాలి.
ఐతే తిరకాసు ఎక్కడ జరిగిందంటే డొమినికన్ రిపబ్లిక్‌లో ఎంబ్రేర్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందంలో ఏవో లొసుగులు ఉన్నాయని అమెరికన్ నిఘా విభాగం ఇంటలిజెన్స్ వారికి రిపోర్టులుఅందాయి. వెంటనే 2010లో ఎంబ్రేర్ కంపెనీపై అమెరికన్ జస్టిస్ విభాగం దర్యాప్తు ప్రారంభమైంది. ఇలా తీగ లాగితే డొంక కదిలింది. డొమినిక్ రిపబ్లిక్‌తో పాటు ఇండియా సౌదీ అరేబియాలతో కూడ ఈ ఎంబ్రేర్ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకుంది. సరుకును డెలివరీ చేసింది. అంటే సమర్ధవంతంగా పనిచేసే జెట్ విమానాలు మూడు ఇండియాకు చేరాయి. ఇవి తమ పనిని ప్రారంభించాయి కూడ. ఐతే ఇక్కడ తేలవలసిన అంశం ఏమంటే ఈ విమానాల కొ నుగోలు సమయంలో బ్రెజిల్‌కు చెందిన ఎం బ్రేర్ సంస్థ నుండి భారత ఎయిర్‌ఫోర్స్ విభాగాధిపతులకు లేక భారత దేశాధిపతులకు ఎవరికి ఎంతెంత కమిషన్లు ముట్టాయి? అనేది ఈ అంశంపై ప్రస్తుతం అమెరికన్ న్యాయ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది.
ఈ దర్యాప్తునకు సంబంధించి ‘‘మమ్మల్ని ఇప్పటివరకు ఎవరూ అమెరికా నుండి సంప్రదించలేదు,’’ అంటూ ఇండియానుండి డిఆర్‌డి ఒ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. సౌదీ అరేబియాలోని ఆర్మాకో అనే సంస్థలో 170 ఎగ్జిక్యూటివ్ విమానాలు అందించే ఈ డీల్ కూడా ఈ ఎంబ్రేర్ సంస్థ కుదుర్చుకుంది. అప్పుడే డెలివరీ ప్రారంభమైంది కూడ. ఇది 2010 నాటి ఒ ప్పందం. ఈ సందర్భంలో ఎంబ్రేర్ సంస్థ ఆ ర్మాకో సంస్థకు ముడుపులిచ్చిందా? అనే అం శంపై కూడ దర్యాప్తు జరుగుతున్నది. ఈ మొ త్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఒక దళారీ పే రు తెరపైకి వచ్చింది. అతన్ని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇదిలావుండగా డిఆర్‌డిఒ చీఫ్ ఎన్‌క్రిప్టర్‌ను దర్యాప్తు బృం దం ఫోనుచేసి విచారించడానికి యత్నించింది. ఐతే ఎటువంటి స్పందన లేదు.
ఎన్‌ఫోర్స్ మెకానికా కంపెనీకి సంబంధించిన విచారణలో ఇటలీలోని మిలన్ కోర్టు లోగ డ వెలువరించిన తీర్పులో కొందరిపేర్లు సూచించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన దళారి ‘్భరత రాజకీయాల్లో కీలక వ్యక్తి సిగ్నోరా గాంధీ’ అన్నారు. ఈ విషయాన్ని న్యూఢిల్లీలో విలేకరులు ఆమెను ప్రశ్నించినప్పుడు ఇదంతా ‘బహనా’ అన్నారు. బహనా అంటే కట్టుకథ, పిట్టకథ అని అర్థం. ఇప్పుడీ బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రేర్ సంస్థ ఒప్పందంలో ముడుపుల అంశం కూడ బహనాయే అనుకోవాలి. యదార్థం ఎమిటంటే ఒక్క డాలరు కూడా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఎకె ఆంటోనీల పేర్లతో ఉన్న ఏ అకౌంట్‌లోనూ ఎవరూ జమచేయలేదు. మరి బోఫోర్స్ ఫార్స్ నుండి ఎంబ్రేర్ వరకు ఈ మూడు దశాబ్దాల కుంభకోణాల్లో అందిన లక్షలకోట్ల డాలర్ల మొత్తం ఎవరి అకౌంట్లలోకి వెళ్లాయి? దీన్ని ఛేదించవలసిన బాధ్యత మనోహర్ పారేకర్ మీద ఉంది. ఇప్పుడాయన కర్తవ్యంనుండి తప్పించుకునే వీలు లేదు. మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. లండన్‌లోని విలాసవంతమైన గృహం రాహుల్ గాంధీకి గిఫ్టుగా ఇవ్వబడింది. ఐతే ఆ ఇల్లు ఆయన పేర్కొనలేదు. ఇది ఇటీవలి సంగతే. రాహుల్ బాబును దోషి అని ఎవరైనా అంటే అది బహనా అవుతుంది.
2008 అగస్తా డీల్ జరిగినప్పటినుండి రకరకాల నేరాలు వెలుగు చూస్తున్నాయి. 1. రక్షణ అవసరాన్ని ఉల్లంఘించి, హెలీకాప్టర్ ఎగురవలసిన ఎత్తును తగ్గించి కొత్త టెండర్లు జారీ చేయడం. 2. మేలురకం శతఘు్నలు లభిస్తున్న ఒక కంపెనీకి లాభం చేకూర్చడంకోసం నాసిరకం సరుకుకు ఆర్డర్ ఇవ్వడం. 3. ధరను పెంచి కొనుగోలు చేయడం, 4. అందుకు ప్రతిఫలంగా దళారీ నుండి ముడుపులు తీసుకోవడం, 5. వాటిని కొందరు అధికారంలో ఉన్న నాయకులకు జర్నలిస్టులకు, డిఫెన్స్ అధికారులకు పంచడం. ఇవన్నీ వరుసగా జరుగుతూ వచ్చా యి. ఎంబ్రేయర్ విషయంలో అధిక విలువను జమకట్టడం జరిగింది. ఇంకా ముడుపులూ అందాయి. ఈ విషయం యుఎస్ కోర్టు వెల్లడించేవరకు భారత నిఘావిభాగం వారు ఆగవలసిందేనా? ‘డబ్బు గురించి పట్టించుకోవద్దు. ముందు జెట్ విమానాలు అమోఘంగా పనిచేస్తున్నాయి కదా’ అంటున్నారు పార్టీ ప్రవక్తలు. ఇదెక్కడి తర్కం? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఇన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తే ఎందుకు నిస్తేజంగా ఉంది? దోషులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నది? మిలన్ (ఇటలీ) కోర్టు తన దేశ పౌరులను శిక్షించింది. బ్రెజిల్ తన ఎంబ్రేర్ కంపెనీపై చర్యలు మొదలుపెట్టింది. ఐనా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు?
అగస్తా, ఎంబ్రేర్ ఒప్పందాల్లో కొన్ని సమ్యాలున్నాయి. అవి..1. ఈ రెండు ఒప్పందాలు 2008లోయుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా కుదిరినవే. 2. రెండింటికి దళారీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఉన్నాడు. 3. నిపుణుల నివేదిక రెండు ఒప్పందాల సందర్భంలోను ఎయిర్ మార్షల్ త్యాగి తిరస్కరించారు. 4. ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేశారు. 5. కావలసిన వారికి కొనుగోళ్లు ఇప్పించడం కోసం టెండర్ల నియమాలు సరళీకృతం చేశారు. 6. భారతదేశంలో కొనుగోలు చేసినవారికి ముడుపులు ముట్టిన సంగతి అమెరికా, బ్రెజిల్ నిఘా విభాగాలే గుర్తించాయి, 7. ‘దర్యాపు జరుపుకోని నిజానిజాలు తేల్చుకోండి అంటూ నాటి రక్షణ మంత్రి అంటోనీ చిరునవ్వుతో సవాలు విసిరారు. 8. దేశ రక్షణ విభాగానికి అవసరమైన కొనుగోళ్లు 85 శాతం ఇలా విదేశాలలోనే జరిగాయి.
డిఆర్‌డిఒలో ఎస్ క్రిస్ట్ఫర్ నేతృత్వంలో 2006 డిసెంబరు 6 నుండి, డిసెంబరు 19 వరకు జరిపిన రహస్య సమావేశాల నివేదిక (మినిట్స్) ఉంది. ఎంబ్రేర్ కొనుగోళ్లను ఈ నివేదిక తిరస్కరించింది. ఈ నివేదికను త్యాగి తిరస్కరించారు ఎందుకు? ఎవరి అదృశ్యహస్తం త్యాగిపై ఒత్తిడి తెచ్చింది అనే అంశాన్ని విచారణలో తేల్చాలి. అయితే వదంతుల మీద కాక ప్రత్యక్ష సాక్ష్యాధారాలుంటేనే చర్యలు తీసుకుంటామని రక్షణమంత్రి మనోహర్ పారేకర్ స్పష్టం చేశారు. ఈ దిశగా డిఆర్‌డిఒ నుండి బ్రెజిల్‌లోని ఎంబ్రేర్ కంపెనీకి ఒక లేఖ వెళ్లింది. సందర్భోచితంగా సిబిఐ దర్యాప్తు జరుగవచ్చునని పారేకర్ సూచించారు. దళారీల పాత్రపై విచారించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.

- ముదిగొండ శివప్రసాద్