ఉత్తరాయణం

తిరుపతివరకు పొడిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ప్రభు నంద్యా ల నుండి కడపకు నేరుగా రైలు సౌకర్యాన్ని ప్రవేశపెట్టనునన్నట్లు ప్రకటించారు. ఆంధ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. ఆయన మన రాష్ట్రంనుండి రాజ్యసభకు ఎన్నుకోబడినందున రాష్ట్రానికి అదనంగా రైల్వే సదుపాయాలు ప్రకటించడం అవసరమే. ఈ రైలుబండి ప్రస్తుతం కడపవరకు వెల్లి మళ్లీ నంద్యాల చేరుతుంది. దీనివల్ల కర్నూలు, కడప జిల్లాల ప్రజలు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. ఈవరకే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ అనంతపురం, చిత్తూరు జిల్లాలతో సహా రాయలసీమ ద్వారా ప్రయాణిస్తున్నది. కొత్తగా ప్రవేశపెట్టనున్న రైలును తిరుపతి వరకు పొడిగిస్తే ఈ రైలు చిత్తూరు జిల్లావారికి కూడా అందుబాటులో ఉండేందుకు జమ్మలమడుగు, బనకానపల్లి మొదలగు ప్రాంతాల్లోని భక్తులు తిరుపతి వెళ్లడానికి సౌకర్యం ఏర్పడుతుంది. ఇప్పుడు వారు కడపలో దిగి మరో రైలును అందుకొని తిరుపతి చేరవలసి వస్తున్నది. ఈ కారణంగానైనా ఇది వెంటనే సాధ్యం కాకపోతే కడప-తిరుపతి మ ధ్య ఒక లింక్ బండి ప్రవేశపెట్టవచ్చు. కడపలో చేరినప్పు డు తిరుపతి వైపు బయలుదేరి, కడప నుండి బయలుదేరేలోగా తిరుపతి నుండి వచ్చి చేరితే రెండు వైపుల అనుకూలం. దీనిని ఫాస్ట్ పాసింజర్‌గా చేస్తే బొంబాయి- మద్రాసు మధ్య రైళ్లు ఆగని స్టేషన్ల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, చెన్నై
ఉగ్రవాదాన్ని అణచివేయాలి
దేశంలో ప్రతి రాజకీయ పార్టీ అధికారం కొరకు, ఆ తర్వాత తగినంత సంపాదన కొరకు తాపత్రయ పడుతున్నాయే తప్ప, దేశ ప్రజల గురించి, దేశ రక్షణ గురించి ఆలోచించకపోవటం విచారకరం. ఒక ప్రక్క ఐ.సి.ఎస్, ఐ.ఎస్.ఐ.ఎస్, ఆల్ ఖైదా, ఇండియన్ మొజాహిద్దీన్ తదితర ఉగ్రావాద సంస్థలు దేశ ప్రజలపై దాడులు చేసి, విధ్వంసాలు సృష్టించాలని పన్నాగాలు పన్నుతున్నట్లు తే టతెల్లమైంది. ఐ.సి.యస్. తెలుగు రాష్ట్రాల్లో సంచరించినట్లు తేలింది. తెలుగు రాష్ట్రాలలో ఐ.సి.యస్. ఉగ్రవాదం ప్రవేశించటానికి ఎవరు కారకులు? హైదరాబాద్, అనంతపురంలలో ఎవరు సహకరిస్తున్నారు? ఇండియాలో ఎవరి సహకారము లేకుండా ఏ ఉగ్రవాదం మనలేదు. వీటిని బయటపెట్టే తాహతు తెలుగు రాష్ట్రాలకు లేదా? ఒక ప్రక్క కాశ్మీరులో ప్రత్యేకవాదులు చేసే అల్లర్లు దేశాన్ని కుదిపేస్తున్నాయి. పాకిస్తాన్ హస్తమున్నట్లు పూర్తిగా నిర్ధారించారు. ఇండియాలో కొన్ని రాజకీయ పార్టీలు పరోక్షంగా పాకిస్తాన్‌ను సమర్ధించినట్లు వార్తల్లో వెలువడింది. అదే నిజమైతే ఆ రాజకీయ పార్టీలను నిషేధించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
క్రీడలను ప్రోత్సహించాలి
రియోడిజనీరో ఒలింపిక్స్‌లో సాక్షిమాలిక్, పి.వి. సింధులు కాంస్య, రజత పతకాలు సాధించడంతో యావ త్తు జాతి ఆనందంతో ఉప్పొంగిపోయింది. వారిద్దరినీ ప్రతీ పౌరుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా అభినందనలతో ముంచెత్తడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హ ర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభు త్వం, బ్యాడ్మింటన్ సంఘం, భారత ఒలింపిక్ సంఘం, రైల్వేలు... తదితర సంస్థలు విజేతలకు నగదు నజరానాలతో కనక వర్షం కురిపించాయి. మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఇవన్నీ వాంఛనీయమే. అయితే క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే రీతిలో ధన సహాయం చేయటంలోనున్న ఔచిత్యాన్ని తర్కించుకోవాలి. ఈ ఇద్దరు క్రీడాకారులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో లేరు. సహాయం చేయదలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా క్రీడలను ప్రోత్సహించే రీతిలో అకాడమీలకు స్థలం కేటాయించి, ముందుముందు వీరిని శిక్షకులుగా నియమించి యువతను క్రీడోన్ముఖులు గావించాలి. ఈ విధంగా క్రీడ ల్లో శిక్షణ ఇచ్చి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేయాలి. భవిష్యత్ ఒలింపిక్స్‌లో ఆయా క్రీడల్లో మరిన్ని పతకాలను మన దేశం కైవసం చేసుకోవడానికి తోడ్పడాలి.
- గోదూరు అశోక్, కరీంనగర్
అన్ని పట్టణాలకు విస్తరించాలి
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణాలో 5 పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలుగా గుర్తించడం హర్షణీయం. తెలుగు రాష్ట్రాలలో అన్ని పట్టణాలూ ఈ బాటలో నడవాలి. బహిరంగ మల విసర్జనం, మూత్ర విసర్జనం అంతటా నిషేధించాలి. ఈ నిషేధాన్ని అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలి. అన్ని పట్టణాలను, గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడానికి అంతా కృషిచేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం