సంపాదకీయం

సహనం ‘తెగిన’ సింధువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింధూ నదీ జల నిర్వహణ మండలి సమావేశాలను జరపడం తాత్కాలికంగా నిలిపివేయాలని మన ప్రభుత్వ నిర్ణయం బీభత్స పాకిస్తాన్ ప్రభుత్వ దుశ్చర్యలను నిరోధించడానికి దోహదం చేయగలదు. పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోని జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పడం పూర్తిగా మానుకోనంత వరకూ ‘సింధూ జల నిర్వహణ మండలి’- ఇండస్ వాటర్ కమిషన్- ఐడబ్ల్యుసి- చర్చలు రద్దు చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయ పరిణామం. నిజానికి ఈ నిర్ణయాన్ని దశాబ్దాల క్రితమే మన ప్రభుత్వం ప్రకటించి ఉండాలి. ‘జలమండలి’ సమావేశాలను మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స వాదనను విడనాడని పక్షంలో సింధూ జలాల పంపిణీ ఒప్పందాన్ని సైతం రద్దు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోని ఉగ్రవాదపు తోడేళ్లను ఉసికొల్పడం మానుకునేవరకూ ఆ దేశంతో సకలవిధ దౌత్య, వాణిజ్య, ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలన్నది మన దేశ ప్రజల అభీష్టం. ఈ జనాదేశ నిర్వహణలో మొదటి చర్య ‘సింధూ జలమండలి’ సమావేశాల నిర్వహణను రద్దు చేయడం. 1960 సెప్టెంబర్ 1న మన దేశానికి, పాకిస్తాన్‌కు మధ్య కుదిరిన ఈ ‘సింధూ నదీజలాల ఒప్పందం’- ఇండస్ వాటర్ ట్రీటీ- ఐడబ్ల్యూటి- ఆరు నెలల ముందు నుంచే 1960 ఏప్రిల్ 1వ తేదీన అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం అమలు జరిగే తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షించడానికై శాశ్వత ప్రాతిపదికన ఉభయ దేశాలూ ఉమ్మడిగా ఈ ‘మండలి’- కమిషన్-ను ఏర్పాటు చేశాయి. ఇంతవరకూ ఈ ‘జలమండలి’ 112 సార్లు సమావేశమైంది. సింధూ నది టిబెట్‌లోని మానస సరోవర ప్రాంతంలో ప్రభవించి జమ్మూ కాశ్మీర్ ఆగ్నేయ దిశ నుండి వాయవ్య దిశగా ప్రవహిస్తోంది. కాశ్మీర్ ఉత్తరపు సరిహద్దు ముగిసే చోట నైరుతి దిశకు మలుపు తిరిగి పంజాబ్ సింధు రాష్ట్రాల గుండా దక్షిణంగా ప్రవహించి పడమటి సముద్రంలో కలుస్తోంది. సింధూ నది కలుస్తున్న సముద్రం సింధూ సాగరంగా ప్రసిద్ధికెక్కడం అనాది చరిత్ర. సింధూ సాగరం అరేబియా సముద్రంగా మారడం తరువాతి కథ. సింధూ నది ప్రవహిస్తున్న దేశం కాబట్టి మన దేశానికి సింధూ స్థానమని. హిందూ స్థానమని పేరు వచ్చింది. ఈ నదీమాత ప్రాధాన్యానికి ఇదంతా నేపథ్యం. అఖండ భారత్‌లో అతి పొడవైన నది సింధూ. 1947 ఆగస్టు 15న ‘అఖండ భారత్’ ముక్కలైపోయి పాకిస్తాన్ ఏర్పడడంతో అవశేష భారత్‌కు, పాకిస్తాన్‌కు మధ్య సింధూ నదీజలాల వివాదం ఏర్పడింది. ఈ వివాదం పరిష్కరించడంలో 1960 నాటి ఒప్పందం భాగం...
సింధూ నదీజలాలంటే ఆరు ప్రధాన నదులు, వాటి ఉపనదుల నీరు. ఈ ఆరు ప్రధాన నదులలో సింధూ మరీ ప్రధానమైనది. మిగిలిన సట్లజ్, బియాస్, రావి, చెనాబ్, జీలం నదులు ‘సింధూ’లో కలసిపోతున్నాయి. బియాస్ మొదటి సట్లజ్‌లో కలుస్తోంది. ప్రాచీన కాలంలో ‘సట్లజ్’ శతద్రూ నది గాను,జీలం ‘వితస్తా’ నదిగాను ప్రసిద్ధికెక్కాయి. శతద్రూ నది చరిత్ర వశిష్ఠ మహర్షి కథతో ముడిపడి ఉంది. జీలం-వితస్తా- నది కశ్మీర్‌ను పండించిన సాంస్కృతిక స్రోతస్విని. ఇలా ఈ ఆరు నదులూ కేవలం భౌతిక జల స్వరూపాలు మాత్రమే కాక భారత జాతీయ సాంస్కృతిక ప్రవాహరూపాలు కూడా! దేశ విభజన జరిగిన ఫలితంగా గంగ, బ్రహ్మపుత్ర వంటి మహానదులతో పాటు సింధూ నదీ సమూహం కూడా విభజనకు గురి అయ్యాయి. మన ప్రభుత్వం మొదటి నుంచి కూడా అటు పాకిస్తాన్‌కు, ఇటు బంగ్లాదేశ్‌గా అవతరించిన తూర్పు పాకిస్తాన్‌కు ధారాళంగా నీటిని వదలి పెడుతోంది. ఈ ఔదార్యానికి ఫలితమే 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం. చిన్న దేశమైన పాకిస్తాన్ పట్ల ఔధత్యంతో కాక ఔదార్యంతో వ్యవహరించాలన్న మన ప్రభుత్వాల మంచితనానికి సాక్ష్యం ఈ జలాల ఒప్పందం. చైనా ప్రభుత్వం బ్రహ్మపుత్ర జలాల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్న రీతిలో మన ప్రభుత్వం కూడా 1947 నుంచి పాకిస్తాన్‌తో వ్యవహరించి ఉండవచ్చు! మన దేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ జలాలలో 90 శాతం మళ్లించుకుని ఉపయోగించుకోవడానికై చైనా నదిపై టిబెట్‌లో అనేక ఆనకట్టలను నిర్మిస్తోంది. చర్చలు జరపడం లేదు, మనదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ‘మాతృగంగ’- మెకాంగ్- నదీ జలాలను సైతం థాయిలాండ్ తదితర తూర్పు ఆసియా దేశాలకు దక్కనివ్వని చైనా ఎగువ దేశాల దురాక్రమణ స్వభావానికి చిహ్నం. మన దేశం ఎగువ దేశాల సౌహార్ధ్రమునకు పతాకం. అందువల్లనే పాకిస్తాన్‌కు, బంగ్లాదేశ్‌కు తమ న్యాయమైన వాటా కంటే అధికంగా నీరు లభిస్తోంది.
కానీ ఈ మన ఔదార్యానికి ప్రతిఫలం పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశ ప్రజలను దశాబ్దాల తరబడి హత్య చేయించడం. 1947లో పాకిస్తాన్ ప్రభుత్వం ‘జిహాదీ’లను జమ్మూ కాశ్మీర్‌లోకి ఉసి కొల్పిన నాటి నుంచి ఈ రక్తపాతం కొనసాగుతోంది. మనం పేచీ పెట్టకుండా వదిలి పెడుతున్న నదుల మధుర జలాలతో దప్పికతీరని పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స పిశాచం మన ప్రజల రక్తాన్ని కూడా తాగుతోంది. మంచినీరు, మానవరక్తం కలిసి ప్రవహించ జాలవని మన ప్రభుత్వం సోమవారం పాకిస్తాన్‌కు స్పష్టం చేయడానికి ఇదీ నేపథ్యం! ‘శామ్యేత్ ప్రతి అపకారేణ న ఉపకారేణ దుర్జనః’- దుర్జనునికి ఉపకారం చేసినందువల్ల వాడు శాంతించడు. వాడు చేసే అపకారాలకు బదులుగా వాడికి అపకారం జరిగినపుడు మాత్రమే దుర్జనుడు అణగిపోతాడు- అన్న మహాకవి మాటలలోని సగాన్ని మాత్రమే మన ప్రభుత్వం ఇప్పుడు అమలుజరుపుతోంది. పాకిస్తాన్‌కు తన ‘వాటా’కు మించిన సింధూ జలాలను వదిలిపెట్టరాదన్నది ఈ సగం. ప్రతిగా మనం కూడా పాకిస్తాన్‌కు అపకారం చేసినపుడు మిగిలిన సగం పూర్తవుతుంది! కానీ అపకారం చేయడం భారత దేశం స్వభావం కాదు. అనాదిగా హైందవ జాతీయ జీవనతత్వం కాదు. ఇదీ పాకిస్తాన్ ప్రభుత్వం ధీమా! లేనట్టయితే మనం కూడా చైనా బ్రహ్మపుత్రను మళ్లిస్తున్న రీతిగా మనం కూడా మన వాటాకు మించి సింధూ జలాలను మళ్లించుకోవచ్చు... అవేవీ మనం చేయలేము!
సింధూ జలాల ఒప్పందం ప్రకారం సట్లజ్, బియాస్, రావి నదుల జలాల పూర్తిగా మన దేశానికి లభించాయి. చెనాబ్, జీలం, సింధూ నదుల నీటిలో 80 శాతం పాకిస్తాన్‌కు, ఇరవై శాతం మనకూ దక్కాయి. అక్కడే మన దేశానికి అన్యాయం జరిగింది. ఎందుకంటే సింధూ నది నీటి పరిమాణం కంటే మిగిలిన అయిదు నదుల మొత్తం నీటి పరిమాణం చాలా తక్కువ. అలా సింధూ నీటిని 80 శాతం పాకిస్తాన్‌కు ఇచ్చేయడం అర్థం లేని ఔదార్యం. ఈ 20 శాతం నీటిని కూడా మనం ఇప్పటివరకూ వాడుకోలేదు. ఇప్పుడు వాడుకోవాలన్నది మన ప్రభుత్వ విధానం. జీలం నది జల మార్గంగా ఉపయోగించుకోవడం కూడా మన హక్కు. 1987లో ఈ హక్కును తాత్కాలికంగా వదులుకోవడం మన తప్పిదం. ఈ తప్పిదాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం తొలగించుకొంది! కృష్ణగంగ నదిపై మనం నిర్మిస్తున్న జలవిద్యుత్ కేంద్రం గురించి పాకిస్తాన్ గతంలో అనవసరంగా పేచీ పెట్టింది! ‘పాకిస్తాన్ దురాక్రమిత కాశ్మీర్’ విముక్తి లభించక ముందే నదీ జలాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం 1960లో మన ప్రభుత్వం చేసిన వౌలికమైన తప్పిదం.