సంపాదకీయం

మారిన రష్యా ‘నడత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా మాత్రమే ‘అపవాదం’... పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్స వికృత స్వరూపాన్ని ప్రపంచ దేశాలు నిరసిస్తున్న సమయంలో రష్యా ప్రభుత్వం మాత్రమే పాకిస్తాన్‌కు చెలిమి చేతులను అందిస్తోంది. పాకిస్తాన్ 1947లో ఏర్పడిన నాటి నుంచి రెండేళ్ల క్రితం వరకూ రష్యా ప్రభుత్వాలు పాకిస్తాన్‌ను దూరంగా ఉంచాయి. ఈ దశాబ్దుల కాలఖండంలో రష్యా మనకు అత్యంత సన్నిహిత మిత్రదేశం! 2014లో రష్యా ప్రభుత్వం పాకిస్తాన్‌తో రక్షణ వ్యవహరాల ఒప్పందం కుదుర్చుకొనడం ఈ చరిత్రను తల్లకిందులు చేసిన విచిత్రమైన వ్యవహారం. ఇపుడు పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులకు శిక్షణ స్థావరంగా, స్ఫూర్తి కేంద్రంగా మారి ఉన్న సమయంలో రష్యా ప్రభుత్వం పాకిస్తాన్‌ను చంకనెత్తుకొనడానికి ప్రయత్నిస్తోంది! పాకిస్తాన్ ప్రభుత్వ దళాలతో కలసి ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించడం మన దేశానికి వ్యతిరేకం! ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీన రష్యావారి సైనిక పటాలం పాకిస్తాన్‌లో నడచిన దృశ్యాలు ప్రముఖంగా ప్రచారమయ్యాయి. మారిన ‘రష్యా నడత’కు ఇది నిదర్శనం. మన దేశంతో మైత్రి కంటె చైనాతో చెలిమికి రష్యా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండడం గత దశాబ్దికి పైగా అంతర్జాతీయ సమాజంలో ప్రచారవౌతోంది! ఈ ‘రష్యా-చైనా’ కూటమికి మొదటి కారణం అమెరికా పట్ల వ్యతిరేకత. చైనా అమెరికాకు ప్రధాన అంతర్జాతీయ ప్రత్యర్థిగా అవతరించడమూ కారణం! రష్యా ప్రభుత్వం దశాబ్దికి పైగా చైనాకు ‘తోక’గా మారిపోతూ ఉంది. చైనా ప్రభుత్వం పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలోని నియంతృత్వ మతోన్మాద ప్రభుత్వాలకు మద్దతును ప్రకటించింది. ఐదేళ్ల క్రితం ‘అరబ్ స్ప్రింగ్’- అరబ్ ఉప్పెనగా- ప్రచారమైన ప్రజాఉద్యమాలను చైనా వ్యతిరేకించింది. ఈ ఉద్యమాల ఫలితంగా ఈజిఫ్ట్, లిబియా తదితర దేశాలలో నియంతృత్వ వ్యవస్థలు కూలిపోయాయి. కానీ సిరియాలో నియంతృత్వ ప్రభుత్వం మనుగడ సాగించడానికి కారణం చైనా మద్దతే. సూడాన్ అంతర్గత యుద్ధంలో సైతం చైనా పదేళ్లపాటు జిహాదీ మతోన్మాద ప్రభుత్వాన్ని సమర్ధించింది. ఈ యుద్ధానికి పరాకాష్ఠ సూడాన్ రెండుగా చీలిపోవడం. చైనా అనుసరించిన ఈ విధానాన్ని వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలోని రష్యా ప్రభుత్వం యథాతథంగా సమర్థించింది. రష్యా చైనా ‘తోక’గా మారిందనడానికి ఇవన్నీ నిదర్శనాలు, సిరియా అంతర్యుద్ధం- ప్రభుత్వానికి తిరుగుబాటుదారులకు మధ్య- అతి దీర్ఘకాలం కొనసాగడం వల్లనే మూడవ వర్గంగా ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’- ఐఎఫ్‌ఐఎస్- ఆ దేశంలోకి చొరబడగలిగింది. ఇలా చైనా పరోక్షంగా అంతర్జాతీయ జిహాదీలను ప్రోత్సహిస్తోంది. ఈ చైనా విధానాన్ని రష్యా కూడా సమర్థించడానికి కారణం అమెరికా పట్ల వ్యతిరేకత..
దీర్ఘకాలం పాటు వ్యూహాత్మంగాను, దౌత్యపరంగాను ప్రబల శత్రువైన పాకిస్తాన్‌తో రష్యా ఇపుడు జట్టుకట్టడానికి కారణం కూడా చైనాను అనుకరించడం. పాకిస్తాన్ చైనాకు అత్యంత సన్నిహిత దేశం కాబట్టి రష్యా పాకిస్తాన్‌తో- గత చరిత్రకు పూర్తి విరుద్ధమైన రీతిలో మైత్రిని నెలకొల్పుకొంటోంది! మన దేశంతో పాటించిన తరతరాల మైత్రిని విస్మరించి మనకు వ్యతిరేకమైన పాకిస్తాన్‌తో ఇలా మైత్రిని రష్యా నెరపుతోంది. చైనా ప్రభుత్వపు ఊబిలో రష్యా ఇంత లోతుగా కూరుకునిపోయి ఉందన్నమాట! చైనాతో పదేళ్లకు పైగా అత్యంత సన్నిహితంగా ఉంటున్నప్పటికీ రష్యా ప్రభుత్వం దీనితో నిమిత్తం లేకుండా మన దేశంతో కూడా గతంలో వలె సన్నిహితంగా ఉండగలదన్న భావం రెండేళ్ల క్రితం వరకూ మన ప్రభుత్వానికి కలిగింది. అందువల్లనే పాతబడిన ‘విక్రమాదిత్య’ విమాన వాహక యుద్ధనౌకను మనం రష్యా నుంచి కొనుగోలు చేశాము. మన యుద్ధ విమానాలలోను, ఇతర తీర యుద్ధ సామగ్రిలోను అత్యధికం రష్యా నుంచి, 1991వ సంవత్సరానికి ముందు సోవియట్ రష్యా నుంచి దిగుమతి అయినవే! 1965, 1970-1971 నాటి యుద్ధాలలోను, తరువాత కూడా పాకిస్తాన్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా సోవియట్ రష్యా మనకు బాసటగా నిలబడింది. రెండేళ్ల క్రితం నుంచి రష్యా వైఖరిలో మన దేశం పట్ల వ్యతిరేకత గోచరిస్తోంది. అది ఇపుడు మరింతగా స్పష్టమైంది. రష్యాకు అమెరికా పట్ల పెరుగుతున్న వ్యతిరేకత భారత-రష్యా మైత్రిని ఇలా దిగమింగుతోంది!
అమెరికా 2006 నుంచి మనకు సన్నిహితం అవుతున్నప్పటికీ పాకిస్తాన్‌కు- తను ఆసియాలో అత్యంత సన్నిహిత దేశమని రెండేళ్ల క్రితం అమెరికా ప్రకటించింది. ‘అల్ ఖాయిదా’ ముఠాలోని మొదటి జిహాదీ హంతకుడు ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఏళ్ల తరబడి ఆశ్రయం కల్పించింది. పాకిస్తాన్‌లోనే లాడెన్‌ను అమెరికా దళాలు వధించిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా పట్ల వ్యతిరేకతను వెళ్లగక్కడం మొదలైంది. చైనాకు మరింత చేరువయింది. రష్యా పాకిస్తాన్‌కు చేరువకావడం మొదలైంది. ఈ విపరిణామ క్రమంలో తమకు మన దేశంతో కల మైత్రికి భంగం వాటిల్లగలదన్న చారిత్రక వాస్తవాన్ని పుతిన్ నాయకత్వంలోని రష్యా ప్రభుత్వం విస్మరించడమే విస్మయకరం. పాకిస్తాన్ ప్రభుత్వానికి లభించే ఆయుధాలలోను, ఇతర సహాయంలోను అత్యధికం భారత వ్యతిరేక బీభత్సకాండను కొనసాగించడానికి ఉపయోగపడుతున్నాయన్న వాస్తవాన్ని గతంలో రష్యా ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ ఆయుధాలు అమెరికా నుంచి, చైనా నుంచి పాకిస్తాన్‌కు దిగుమతి అయ్యాయి. రష్యా ప్రభుత్వం కాని, గతంలో సోవియట్ రష్యా కాని పాకిస్తాన్‌కు ఆయుధాలను అమ్మకపోవడం చరిత్ర! గత రెండేళ్లుగా రష్యా ఈ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టింది! పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను అమ్మాలన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ అడ్డుకట్టవేసింది. విమానాలను కొనడానికి వీలుగా పాకిస్తాన్‌కు రుణం ఇవ్వాలన్న ఒబామా ప్రతిపాదనను కాంగ్రెస్- అమెరికా పార్లమెంటు- నిరాకరించింది. అందువల్ల ఎఫ్-16 విమానాలను కొనుగోలు చేయరాదని పాకిస్తాన్ నిర్ణయించింది. రష్యా-పాకిస్తాన్ ఉమ్మడి సైనిక విన్యాస ప్రదర్శనలకు ఇవి అత్యంత సమీపం నేపథ్యం..
‘ఊరి’ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదులు మన పదిహేడుగురు జవానులను దొంగచాటుగా దెబ్బతీసి హత్య చేసిన తరువాత అనేక దేశాలు పాకిస్తాన్ దుశ్చర్యను దుయ్యబట్టాయి. రష్యా ప్రభుత్వం పాకిస్తాన్‌తో కలిసి తలపెట్టిన ఉమ్మడి సైనిక విన్యాసాలను రద్దు చేసుకుని మన పట్ల కల మైత్రిని మరోసారి స్పష్టం చేయగలదని ప్రచారమైంది! కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మనతో సంబంధాల కంటే చైనాతో మైత్రికి, అమెరికా పట్ల వ్యతిరేకతకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టమైంది. 24వ తేదీని పాకిస్తాన్‌లో ఉమ్మడి సైనిక విన్యాసాలు మొదలైపోయాయి. మన సైనిక దళాలు 29వ తేదీన పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోని జిహాదీ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన సమయంలో కూడా ఈ ‘పాకిస్తాన్ రష్యా’ ఉమ్మడి విన్యాసం సమాంతర పరిణామం.. రష్యా ‘నడత’ మారింది, మారుతోంది!