సబ్ ఫీచర్

సంయమనమే సముచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మన దేశ రాజకీయాలు అన్నీ ఆవు చుట్టూరా తిరుగుతున్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని ఒక ముస్లిం కుటుంబంవారు ఇంట్లో ఆవు మాంసం ఉంది అనే ఆరోపణతో కొందరు దుండగులు దాడి చేశారు. ఈ సంఘటనకు అసలు కారణం మాత్రం ఇంతవరకు తెలియలేదు.దేశంలో ఎన్నో ప్రధాన ముఖ్యమైన సమస్యలు ఉండే ఇలాంటి అతి సామాన్య విషయాలకు ప్రాధాన్యత కల్పిస్తూ చిలవలు పలవులుగా చేసి దేశ సమగ్రతను, శాంతి సామరస్యాలను భంగపరిచే రీతిలో ప్రచారం జరుగుతున్నది. దీనికి మూల కారణం అధికార దాహానికి అలవాటుపడిన రాజకీయ నాయకులు మరియు మన దేశంలో తిష్ఠవేసిన విదేశీ ప్రభుత్వ ఏజెంట్లు.నరేంద్రమోదీ నాయకత్వంలో అభివృద్ధిపధంలో ముందుకు సాగిపోతున్న మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చెయ్యాలి అని పన్నాగాలు పన్నుతున్నారు.
మన వేదాలలో ఆవు యొక్క ప్రాముఖ్యం, గొప్పదనం, ఉపయోగాన్ని సవిస్తరంగా ఎప్పుడో విశదీకరించారు. ఇక్కడ నివసించే అన్ని వర్గాల ప్రజలు మన సంస్కృతి సంప్రదాయాలకు విలువలు ఇచ్చి గౌరవిస్తూ ప్రజాజీవనం సాగిస్తున్నారు.మన దేశంలో ఉన్న మైనారిటీ కులాల వారందరూ ఒకనాటి హిందువులే. ఇది జగమెరిగిన సత్యం. వారి మూలాలు హిందూ సంస్కృతి నుంచి వచ్చినవే. మధ్యయుగంలో వచ్చిన విదేశీయుల పరిపాలనా కాలంలో నయాన భయాన వీరిని మతాంతీకరణ చేశారు.ప్రపంచంలో ఏ దేశమైనా అక్కడి ప్రజలు వారు నివసించే ప్రదేశము యొక్క భౌగోళిక పరిస్థితులనుబట్టి అలవాట్లు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకొని జీవనం సాగిస్తూ ఉంటారు.మన దేశంలో ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. దీనికి మూలం ఎద్దులు, ఆవులు. ఎద్దులు (పశువులు) పొలం దున్ని వ్యవసాయానికి సహాయపడి ఆహార పదార్థాలు పండిస్తే, ఆవులు మనకు మన పిల్లలకు కావలసిన పాలు సమృద్ధిగా అందించి మానవ జీవనానికి తోడ్పడతాయి. ఈ పశువులు విసర్జించిన వ్యర్థ పదార్థాలతో భూమిని సారవంతంగా చేసి సస్యశ్యామలం చేస్తాయి. అందుకే మన దేశంలో ఆవుని దైవసమానంగా కొలుస్తాము.
నాకు తెలిసిన స్నేహితుడు ఒకతను ఉన్నాడు. అతని పేరు జోసఫ్. అతను అన్ని రకాల శాఖాహార, మాంసాహార (బీఫ్) ఆహార పదార్థాలను తింటాడు. అతనివద్ద 10 ఆవులు, 5 లేగ దూడలు ఉన్నాయి. వాటి మీదనే అతని జీవనాధారం. ఈమధ్య అతనితో ఈ ఆవు మాంసం గందరగోళం గురించి చర్చ ప్రస్తావనకు వచ్చిం ది.అతను చెప్పిన మాటలు ఏమంటే ‘‘చూడమ్మా! నేను ఒక రోజు ఈ ఆవు మాంసం తింటే ఆ రోజే కడుపునిండుతుంది. మరుసటిరోజు యథావిధిగా ఆకలి అవుతుంది. అదే ఆవును. జాగ్రత్తగా శ్రద్ధగా పెంచితే దాని జీవితాంతం నా కుటుంబానికి అండగా ఉండి పోషిస్తుంది. అల్పమైన ఒక్క రోజు సుఖంకోసం నా కుటుంబాన్ని నాశనం చేసుకోలేను అని అన్నాడు.
మన దేశంలో అన్నిరకాల ఆహార పదార్థాలను తినే వారు ఉన్నారు. శాఖాహారులు, మాంసాహారులు తమ ఇష్ఠాలను అనుసరించి, తమ ఆర్థిక స్థోమతను బట్టి తింటున్నారు. బీఫ్ తింటే మంచి ఆరోగ్యము ఉత్తేజము వస్తుంది అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు. జరాసంధుని కాలంలో మానవ శరీర అంగాలను ఆహారంగా తీసుకొనే అఘోరాలు ఉండేవారట. ముందు రాబోయే ప్రమాదాన్ని గమనించి శ్రీకృష్ణుడు భీమ అర్జునుల సహాయంతో జరాసంధుడిని చంపి ఇలాంటి దురాచారాలను రూపుమార్చాడట. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగి ఉంటే మన దేశంలో మానవజాతి బ్రతికి బట్టకట్టేదా ఒక్కసారి ఆలోచించండి? బలవర్ధకమైన ఆహారం అని ఏది పడితే అది తినకూడదు. మనకు ఆలోచించే విచక్షణా జ్ఞానాన్ని, తెలివిని ప్రకృతి ప్రసాదించింది. దానిని మానవాళి అభివృద్ధికి మంచికి ఉపయోగించాలే గానీ నాశనానికి మాత్రం కాదు. మన దేశ రాజ్యాంగం సెక్యులర్ విధానాలపై ఏర్పడింది. ఇక్కడ నివసించే ప్రజలందరూ సమభావం, సమానత్వం, పరమత సహనం కలిగి ఉండాలి. అందరూ కలిసి మెలసి సుహృద్భావ వాతావరణంలో నివసిస్తూ దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తూ ఇతర ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉండాలి.

- జన్నాభట్ల లక్ష్మీకామేశ్వరి