ఉత్తరాయణం

అందరికీ ఒకే చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కొందరిని మైనారిటీలంటూ మతం ప్రాతిపదికపై విడదీసి చూడడం చాలా ప్రమాదకర సంకేతం. ఈ ధోరణి ఏదో ఒకనాటికి మరలా దేశ విభజనకు దారితీయవచ్చు. ఒకప్పటి భారత్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్‌గా విడగొట్టారు. ఇప్పుడు కాశ్మీర్‌ను ప్రత్యేకించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇదంతా మైనారిటీ అనే పదం వల్లే జరుగుతోంది. దేశ ప్రజలందరూ సమానమని, అందరికీ ఒకే చట్టం అమలుచేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలి. ఆనాడు కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పిదం వల్లే భారతావని మూడు ముక్కలైంది. మన పొరుగున ఉన్న ముస్లిం దేశాలు నిరంతరం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే వున్నాయి. బయటివాళ్లే కాదు, దేశంలో అంతర్గత శత్రువులున్నారు. ఈ శత్రువులే తీవ్రవాదులతో చేతులు కలుపుతున్నారని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. మైనారిటీలంటూ పాలకులు ఎక్కడలేని ప్రేమ చూపుతున్నందున జాతి ఐక్యత దెబ్బతింటోంది. ప్రజలు కూడా పాలకుల విధానాలను ప్రశ్నిస్తూ అంతా ఒక్కటే అన్న భావనను పెంచుకోవాలి.
-జి.శ్రీనివాసులు,అనంతపురం
బీదతనం ఎందుకో..?
ప్రపంచ ఐశ్వర్య దేశాల పట్టికలో మన దేశం 5,600 బిలియన్ డాలర్లు కలిగి ఏడవ స్థానాన్ని చేరిందని ఓ నివేదిక తెలిపింది. మనకన్నా తక్కువ ఐశ్వర్యవంతమైన దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ దేశాలు అభివృద్ధి చెందినవి. మరి మనం ఆ స్థాయికి ఎందుకు చేరట్లేదు? మనకన్నా ఎక్కువ జనాభా కలిగిన పెద్ద దేశం చైనా ఐశ్వర్యవంతుల జాబితాలో అమెరికా తరువాత రెండవ స్థానంలో ఉంది. ఆర్థిక, జల, ఖనిజ, మానవ వనరులు అధికంగా ఉన్నా భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణింపబడుతున్నది. అవినీతి, అధిక జనాభా, లంచగొండితనం, నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడం, కఠిన నిర్ణయాలు తీసుకోకపోడం ఈ దుస్థితికి మూల ముఖ్య కారణాలనిపిస్తోంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
పాడైన వంతెనతో అవస్థలు
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేట దగ్గర సాయన్నగెడ్డపై వంతెన శిథిలమైంది. దీంతో రామారాయపురం, హొంజరాం, చిత్తారపురం తదితర గ్రామాల ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. సంబంధిత శాఖ అధికారులు ఇకనైనా స్పందించి, శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణం పనులను చేపట్టాలని పరిసర గ్రామ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు.
- ఎం.శ్రీనివాసరావు, మల్లయ్యపేట
పాక్‌కు బుద్ధి చెప్పాల్సిందే..
భారత్ ఎంతగా ఓర్పును, సహనాన్ని చూపుతున్నా దాన్ని చేతగానితనంగా భావిస్తూ పాకిస్తాన్ చిరకాలంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మన సైనికులు జరిపిన మెరుపుదాడితోనైనా ఆ దేశం గుణపాఠం నేర్చుకోవాలి. ఉగ్రవాదులను ఉసిగొల్పడం, అక్రమ చొరబాట్లను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ మనతో ఇప్పటికీ కయ్యానికి కాలు దువ్వుతోంది. సైనికచర్యతో బుద్ధి చెప్పడమే కాదు, పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలి. పాక్ ఎలాంటి దురాగతాలకు పాల్పడినా మన సైనికులు దీటుగా జవాబు చెబుతారనే నమ్మకం దేశ ప్రజల్లో కలిగింది. ప్రాణాలు అర్పించిన మన వీరజవాన్ల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్
ఉగ్రవాదంతో సాధించేదేమిటి?
ఉగ్రవాదాన్ని నమ్ముకున్న పాకిస్తాన్ అన్ని రంగాల్లోనూ వెనుకబడింది. కాశ్మీర్‌లో చిచ్చును రాజేసి, మతోన్మాద ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ భారత్‌లో అశాంతిని రగిల్చేందుకు దశాబ్దాల తరబడి పాక్ ప్రయత్నిస్తోంది. గతంలో జరిగిన యుద్ధాల్లో ఓటమిని చవిచూసినప్పటికీ ఇంకా భారత్‌పై విషం చిమ్ముతోంది. ఉగ్రవాదం వల్ల అభివృద్ధి సాధ్యం కాదని పాక్ ఇప్పటికైనా తెలుసుకుని భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవాలి. అనేక దేశాలు పాక్ వైఖరిని నేడు తప్పుపడుతున్నాయి. ఊరీలో నిద్రిస్తున్న భారత సైనికులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరపడాన్ని పొరుగు దేశాలు సైతం ఖండించాయి. ఊరీ ఘటనకు దీటుగా భారత సైన్యం మెరుపుదాడి జరపడాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రశంసించాయి. యుద్ధం వస్తే దారుణ ఓటమి తప్పదని ఇకనైనా పాక్ గ్రహించాలి. ఉగ్రవాద శిబిరాల కోసం, సైనిక సంపత్తి కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్న పాకిస్తాన్ బీద దేశంగా మారిపోతూ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొనక తప్పదు. ఆ దేశ ప్రజలు కూడా అక్కడి పాలకుల విధానాలను నిరసించాలి.
-కె.నారాయణ, నంద్యాల