సంపాదకీయం

‘బిటి’ తెగులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్యు పరివర్తక జీవరసాయన సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న వైపరీత్యాల గురించి వ్యవసాయదారులలో ధ్యాస పెరుగుతోంది. జన్యు పరివర్తక- జనరికల్లీ మోడిఫైడ్- జిఎం- సాంకేతిక ప్రక్రియ ద్వారా రూపొందుతున్న బి.టి. ఆవాలను పండించడానికి అనుమతి ఇవ్వరాదని కోరుతూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆరవ తేదీన రైతులు ప్రదర్శనలు జరపడం ఇందుకు ఒక సాక్ష్యం. జన్యు పరివర్తక- జిఎం- ప్రక్రియ ద్వారా రూపొందుతున్న విత్తనాలలో, మొక్కలలో బాసిలస్ తురింజెనిసిస్- బి.టి. అన్న జీవరసాయనం రూపొందుతుంది. ‘జిఎం’ పంటల పట్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత చెలరేగడానికి ఈ బాసిలస్ తురింజెటిస్- బిటి- జీవరసాయనం కారణం! ‘జిఎం’ పంటలను సమర్థిస్తున్న వారు సైతం ‘బిటి’ని ప్రాతిపదికగా చేసుకున్నారు. ‘జిఎం’ విత్తనాలలోను, మొక్కలలోను నిహితమైన ఉన్న ‘బిటి’ రసాయనం ఎలాంటి భూమిలోనైనా మొక్క ఎదగడానికి దోహదం చేస్తుదన్నది ప్రచారం. ‘జిఎం’ పంటల సమర్థకులు చెప్పే మరో మాట పంటల దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి ‘బిటి’ రసాయనం దోహదం చేస్తుందన్నది. ఈ ‘జిఎం పంటల’ను క్రిములు, కీటకాలు, పురుగులు వచ్చి భోంచేయకుండా ‘బిటి’ రసాయనం నిరోధిస్తుందన్నది సమర్థకులు చేసే ఆర్భాట ప్రచారం. కానీ, ఈ ‘మేళ్ల’తోపాటు బిటి రసాయనం కలిగించే ‘కీడు’ కూడా తీవ్రంగా ఉంటుదన్నది సమర్థకులు చెప్పని వాస్తవం! ఈ వాస్తవాన్ని ప్రచారం చేస్తూన్న ‘జిఎం’ పంటల వ్యతిరేకుల వాణి పెద్దగా వినిపించడం లేదు. ‘బిటి’ రసాయన విష ప్రభావం కారణంగా జిఎం పంటలు పండే భూములు క్రమంగా వ్యవసాయానికి పనికిరాని ఊసర క్షేత్రాలుగా మారిపోనున్నాయన్నది వ్యతిరేకుల మాట. బిటి రసాయనం నిండిన పంటలను భోంచేసేవారికి క్రమంగా చిత్రవిచిత్రమైన వ్యాధులు సంక్రమిస్తాయని కూడా ప్రపంచ వ్యాప్తంగా ‘వ్యతిరేకులు’ చేసూన్న ప్రచారం! బిటి పంటలను పండించడం వల్ల ఈ పంట భూముల పరిసరాలలోని ప్రకృతి కాలుష్యగ్రస్తమై నశించి పోతుందని, ‘బిటి’ పంటల ద్వారా లభించే గడ్డిని, ఆవాలను తిన్న పశువులు వ్యాధులకు గురై మరణిస్తాయని కూడా జిఎం పరిజ్ఞాన వ్యతిరేకులు ఏళ్ల తరబడి ప్రచారం చేస్తున్నారు. అనేక దేశాలలో ప్రధానంగా జిఎం విత్తనాలను రూపొందిస్తున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థల మాతృదేశాలలో ఈ పంటలను పండించడాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. కొన్ని సంపన్న దేశాల ప్రభుత్వాలు తాము నిషేధించిన జిఎం విత్తనాలను తమ వాణిజ్య సంస్థలు మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలో అమ్ముకొనడానికి సమర్థిస్తుండడం అంతర్జాతీయ ద్వంద్వ ప్రమాణాలకు ప్రతీక.
మన దేశంలోను, విదేశాలలోను బిటి పంటలను పండించరాదని, జిఎం పరిజ్ఞానాన్ని నిషేధించాలని కోరుతూ దాదాపు రెండు దశాబ్దులుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. భారతీయ వ్యవసాయదారుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ‘జిఎం పంట’లని 2008 నుంచి బ్రిటన్ యువరాజు ఛార్లెస్ ప్రచారం చేస్తున్నాడు. అయినప్పటికీ మన దేశంలోని ప్రభుత్వాలు మాత్రం ఈ వైపరీత్యాన్ని గుర్తించడం లేదు. 2004-2014 సంవత్సరాల మధ్య మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిటి పత్తికి విపరీతమైన ప్రోత్సాహం కల్పించింది. బిటి వంకాయలను, బిటి ఆవాలను కూడా ప్రవేశ పెట్టించడానికి విఫలయత్నం చేసింది. సరైన నిర్ధారణలు జరుపకుండానే ‘జెనరిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ’- జిఇఎసి- జీవ జన్యు సాంకేతిక పరిజ్ఞాన అధ్యయన సంఘం- వారు బిటి వంకాయలకు, బిటి ఆవాలకు అనుకూలంగా స్పందించడం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు అనుకూలమైన పరిణామం! బహుళ జాతీయ సంస్థలు ఏకపక్షంగా క్షేత్రస్థాయి పరిశోధనలు జరిపించి బిటి వంకాయలు సురక్షితమైనవని, వాటిని భుజించడం వల్ల ఎలాంటి హాని జరగదని నిర్ధారించారు. ఈ పరిశోధనలు గొప్ప వంచన అని, నిర్ధారణలు తప్పు అని బిటి వ్యతిరేకులు ఆ తరువాత ప్రచారం చేశారు. రాజకీయ వేత్తలు, శాస్తవ్రేత్తలు బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీలతో కుమ్మక్కయి పోయినట్టు కూడా వారు ఆరోపించారు. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో బిటి వంకాయల బెడద తాత్కాలికంగా తప్పింది! ప్రస్తుతం జిఎం ఆవాలు కూడా న్యాయ పరిశీలనకు గురి అవుతున్నాయి.
ప్రస్తుతం మన దేశంలో బిటి పత్తిని అతి విస్తారంగా పండిస్తున్నారు. అమెరికాకు చెందిన ‘మొన్‌సాంటో’ కంపెనీ వారు వేల కోట్ల రూపాయలు దోచుకుని తమ దేశానికి తరలించడం దీనివల్ల జరిగిన ప్రధానమైన విపరిణామం! విపరీతమైన ధరలకు బిటి పత్తి విత్తనాలను అమ్మిన ఈ సంస్థను మనదేశంలో మాత్రమే కాక అనేక విదేశాలలో కూడా ప్రజలు, ప్రభుత్వాలు నిరసించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రమేయం వల్ల బిటి పత్తి విత్తనాల ధరలను కొంతమేరకు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఈ సంస్థవారు దమ్మిడీ ఖర్చు లేకుండా వందలాది కోట్ల రూపాయలను మూటకట్టుకుని పోతున్నారు. బిటి పరిజ్ఞానం వాడుకున్న విత్తనం ఉత్పత్తిదారులు, విక్రేతలు ఈ సంస్థకు ‘సుంకం’- రాయల్టీ- చెల్లించవలసిన గడువు ముగిసినప్పటికీ ఈ సంస్థ ‘రాయల్టీ’ని వసూలు చేస్తూనే ఉందట! వ్యవసాయదారులను ‘మొన్‌సాంటో’ మో సం చేస్తోందని హైదరాబాద్ హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించడం శుభ పరిణామం! ‘మొన్‌సాంటో’ రైతులను దోచుకోవడం నిజానికి ప్రధాన సమస్య కాదు, బిటి పంటలను వదిలించుకోలేకపోవడం వౌలిక సమస్య! ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా జిఎం పంటలను ప్రవేశపెట్టడానికి ఉవ్విళ్లూరుతుండడం నడిచిపోతున్న వైపరీత్యం. జిఎం పరిజ్ఞానం వల్ల రూపొందుతున్న బిటి పంటలు ఆరోగ్యానికి భంగం కలిగిస్తాయన్న శాస్ర్తియ సాక్ష్యాధారాలు ఏవీ లేవని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 2014 డిసెంబర్‌లో రాజ్యసభలో ప్రకటించడం ఒక ఉదాహరణ మాత్రమే! ఆహార భద్రతను సాధించడానికి జిఎం పరిజ్ఞానం అవశ్యకమని ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ సందర్భంగా గత మే నెలలో జవదేకర్ ప్రకటించడం మరో ఉదాహరణ.
ఇలా ప్రభుత్వాలు ఉత్సాహంగా బిటి పంటలను ప్రచారం చేయడానికి యత్నిస్తున్నప్పటికీ రైతులు, ప్రజలు క్రమంగా బిటి పంటల వల్ల జరుగుతున్న హానిని గుర్తిస్తున్నారు. భోపాల్‌లో గురువారం జరిగిన బిఎం ఆవాల వ్యతిరేక ప్రదర్శన ఈ గుర్తింపునకు చిహ్నం. పంజాబ్‌లో గత ఏడాది ఎనిమిది లక్షల ఎకరాలలోని బిటి పత్తిపంటను విచిత్రమైన తెల్లపురుగులు ధ్వంసం చేయడంతో జిఎం ప్రమాదం పట్ల దేశవ్యాప్తంగా చలనం కలిగింది. ఈ విధ్వంసం తరువాత పదిహేనుమంది రైతులు ఆత్మహత్య చేసుకొనడం ఘోరమైన పరిణామం. జిఎం ఆవాలను నిరోధించడం మాత్రమే సరిపోదు, బిటి పత్తిని తొలగించడం కూడా అనివార్యం కావాలి!