ఉత్తరాయణం

వనం-మనం మొక్కుబడి కాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం రాష్ట్రంలో ‘వనం-మనం’ కార్యక్రమం జోరుగా సందడిగా రాజకీయ నాయకులు జరిపిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, భూమి కనపడితే, ఇళ్ళు, దుకాణాల ముందు మొక్కలు నాటి ఫొటోలు, వీడియోలు తీసి మీడియా ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్నారు. మరి నాటటం వరకేనా, ప్రతిరోజూ మొక్క పెరగటానికి నీళ్ళు పోయటం లాంటి జాగ్రత్తలు, చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అన్నది అంతుచిక్కని ప్రశే్న.
కోట్లు ఖర్చుపెట్టి నాటుతున్న మొక్కలు ఎంతవరకు ఎన్ని బతుకుతున్నాయి? చిత్తశుద్ధి లేని కార్యక్రమాలవలన కోట్లు వృధా అయినా పరవాలేదు ప్రభుత్వానికి! నాటటం ముఖ్యం కాదు మొక్క ఎదిగి బలపడేవరకు శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించాలి. నాటిన మొక్క మూడు రోజులు దాటితే అక్కడ కనబడదు.
అదృష్టవశాత్తు వర్షం రెండు మూడు రోజులు పడితే అదనుగా నాటిన మొక్క బతికి అక్కడక్కడ కొన్ని కనబడుతున్నాయి. కనుక వనం-మనం మొక్కల కార్యక్రమంలో ఉపయోగంలేని చెట్లకన్నా అందరికీ ఉపయోగపడే పండ్ల చెట్లను నాటండి, కాపాడండి. అందంగా ఉండటమే కాకుండా పర్యావరణ పరంగా బాగుంటాయి. నాయకులు, మంత్రులు మొక్కలు నాటే వారు ఆలోచించి అడుగు ముందుకు వేయండి.
-పొట్టి వెంకట శివప్రసాదరావు
అద్దంకి, ప్రకాశం జిల్లా
పాకిస్తాన్ పనిపట్టాల్సిందే
యూరీ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్ పట్ల ఉదాసీన వైఖరితో ఉంటే వచ్చే పరిణామాలకు మచ్చుతునక మాత్రమే. ఇంకా పాకిస్తాన్ పట్ల మెతక వైఖరితో ఉంటే మునుముందు మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ పీచమణచడంలో భారత సైన్యం గొప్ప విజయం సాధించినప్పటికీ అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అసమర్థ విధానాల వలన కాశ్మీర్ ఇప్పటికే రావణకాష్ఠంలాగా రగులుతూనే వుంది.
నిజానికి భారతదేశ చిత్రపటం మన తృప్తికోసం మొత్తం చూపించుకుంటున్నాం. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ చైనాకు ధారాదత్తం చేసిన ప్రాంతం మన అధీనంలో ఎప్పుడూ లేవు. ఈ ప్రాంతాలలోనే పాక్ ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి ఉగ్రవాదులను భారత్‌పైకి పంపుతోంది. పాకిస్తాన్ ఆట కట్టించే చర్యలకు తక్షణం పూనుకోకపోతే మరిన్ని దాడులు జరిగి అమూల్యమైన సిపాయిల ప్రాణాలు, అమాయక ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఎదురౌతుంది.
-కొవ్వూరి జగా శ్రీనివాసరెడ్డి
కొంకుదురు, తూ.గో.జిల్లా
కండక్టర్ పోస్టులు అవసరం
పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగార్హత కల్పించే కండక్టర్ పోస్టులను ఇకపై భర్తీ చేయరని, డ్రైవర్లే కండక్టర్లుగా వ్యవహరిస్తూ ద్విపాత్రాభినయం చేయనున్నారన్న చేదు నిజాన్ని తెలుసుకున్న ప్రతి నిరుద్యోగి తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నాడు. పై చదువులకు వెళ్లాలంటే కుటుంబ పరిస్థితులు సహకరించక, పిండికొద్దీ రొట్టె అన్న చందాన కండక్టర్ వంటి చిరుద్యోగంపై కోటి ఆశలను పెట్టుకున్న ఎందరో అభాగ్యజీవులు మన అమాత్యుల, అధికారుల అనాలోచిత నిర్ణయాలవల్ల కూటికి గతిలేని దయనీయ స్థితికి దిగజారుతున్నారు.
-అల్లాడి వేణుగోపాల్
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు
ఫిరాయింపులపై చర్య అవసరం
పార్టీ ఫిరాయించే ఎంపిలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని న్యాయనిపుణులు రాజకీయ సామాజిక వేత్తలు కోరడాన్ని అభినందనీయం. మున్సిపల్ చైర్మన్, ముఖ్యమంత్రులను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకునే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.
ఆయారాం, గయారాంల సంస్కృతివల్ల రాజకీయం వ్యాపారంగా మారింది. ఈ విషయమై సుప్రీంకోర్టు మాజీ న్యాయవాదులు బి.సుదర్శన్ రెడ్డి, పి.జీవన్ రెడ్డి, పి.లక్ష్మారెడ్డి కోరడం బాగుంది. స్పీకర్ అధికారాలతో సమస్యలు వస్తున్నాయని ఈసి సిఫారసు మేరకు అనర్హత వేటు వేసే అధికారం రాష్టప్రతికి, గవర్నర్‌లకు కల్పించాలని కోరడం అభినందనీయం. ఎంఎల్‌ఏ, ఎంపి ఎన్నికల్లో మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్, మేయర్, చైర్మన్, కౌన్సిలర్, సర్పంచ్, ఎంపిటిసిలకు ఇంటర్‌ను అర్హతగా నిర్ణయిస్తేనే రాజ్యాంగం చదువుకొని పాలన సాగిస్తారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికను డైరెక్టుగా నిర్వహిస్తే అర్హులే చైర్మన్ సీట్లో కూర్చుని పరిపాలన సాగిస్తారు. కౌన్సిలర్లను కొని చైర్మన్ అయితే ఎప్పుడు అవిశ్వాసం పెడతారో ఏమో అని జంకుతూ పాలన కొనసాగడంవల్ల ప్రజలకు ఏ మాత్రం పనులు కావు.