ఉత్తరాయణం

మాకు భోజనం పెట్టరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆచరణలో ఏమీ కనిపించడం లేదు. పేదవర్గాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా మధ్యాహ్న భోజనం అమలుచేస్తే బాగుంటుంది. ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు నిరుపేద కుటుంబాల్లో జన్మించి ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. పేద విద్యార్థులను దృష్టిలో వుంచుకొని ప్రైవేట్ కళాశాలలకంటే దీటుగా ప్రవేశాలు జరిపించిన అధ్యాపక సేవలు గర్హనీయం. ప్రభుత్వ కళాశాలల్లో మంచి ఫలితాలు రావాలంటే ఇకనైనా భోజన పథకం అమలుచేయాలి.
- కమ్మరి శ్రీనివాసాచారి, దౌల్తాబాద్
ఇంకా చర్చలా..
కాశ్మీర్‌లో ఓ పక్క ఎడతెరిపి లేకుండా ఉగ్రవాదులు కాల్పులతో మోతమోగిస్తూ, నిద్రిస్తున్న సైనికులపై బాంబులతో దాడిచేసి అమానుషంగా హతమారుస్తున్నా- ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ద్వైపాక్షిక చర్చలతో భారత్,పాక్‌లు సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం ఏమాత్రం ఉచితం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తిచెప్పాలని చెప్పకపోవడం ఏమీ బాగాలేదు. ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నా, భారత్‌లో దాడుల పట్ల విచారం వ్యక్తం చేయకపోవడంతో పాకిస్తాన్ తన ఉగ్రచర్యను సమర్ధించుకున్నట్టయింది. యుద్ధం ప్రకటించడానికి ఎంతోసేపు పట్టదు. పర్యవసానం పరాకాష్టకు చేరుతుంది. పాక్‌తో భారత్ అన్నివిధాలా తెగతెంపులు చేసుకుంటేనే మంచిది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనేది వాస్తవం కాబట్టి సరిహద్దు చుట్టూ పటిష్టమైన గోడ కట్టాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఆత్మహత్యలు ఎందుకు?
హెచ్‌సియూలో ఇటీవల మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. మృతుడి డైరీ ప్రకారం ఆత్మన్యూనతే ఈ మరణానికి కారణం అనిపిస్తోంది. ఆత్మన్యూనతకు విఫల ప్రేమ, ఆర్థిక పరిస్థితులు, పరీక్షల భయం కారణాలవుతాయి. పరీక్షల పట్ల భయానికి మన విద్యావిధానమే కారణం. పిల్లలపై వత్తిడి ఉండరాదని పదోక్లాసు వరకు మార్కులతో నిమిత్తం లేకుండా అందర్నీ పాస్ చేస్తున్నారు. కొందరైతే పది, ఇంటర్ పరీక్షల్లో కాపీకొట్టి పాస్ అవుతున్నారు. వర్సిటీ స్థాయిలో కాపీలకు ఆస్కారం తక్కువ. దాంతో భయం ఆవహిస్తుంది. ఆ భయాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్కులొస్తేనే పాస్ అనే పద్ధతి వుంటే చిన్నప్పటినుంచి వత్తిడి తట్టుకునే అలవాటు ఏర్పడి విద్యార్థులు పెద్దయ్యాక ఆత్మహత్యలు చేసుకోరు. విద్యారంగంలో సంస్కరణలకు విద్యావేత్తలు ఆలోచించాలి.
-మరుదకాశి, కరప (తూ.గో)
పేదలకే కాలుష్యం
స్వచ్ఛమైన నీరు, గాలి, వెలుతురు, ఆహారం లభించాలని జనం కోరుకోవటం దురాశ కాదు. రాజకీయవేత్తలు, సినీనటులు, సంపన్నులు ఫాంహౌస్‌లను ఏర్పాటు చేసుకుంటూ మేలైన ఆహారం, నీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఎటొచ్చీ సాధారణ జనానికే కాలుష్యం. హైదరాబాద్‌లోని మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి యిచ్చేముందు- అప్పటికే నడుస్తున్న అక్కడ నడుస్తున్న ఫార్మా కంపెనీలు కాలుష్యం వదులుతున్న సంగతి పాలకులకు తెలియదా? ఉద్యోగులకు లక్షలు యిస్తున్నామనే కంపెనీలు కోట్లుగడిస్తున్నాయి. చిన్న ఉద్యోగులు, బడుగువర్గాల వారు కాలుష్యం బారిన పడుతున్నారు. పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ ఆవలకు తరలిస్తామని అంటున్న తెలంగాణ మంత్రి కెటిఆర్ హామీ ఆచరణలోకి రాకపోతే- తెలంగాణ సర్కారు బడా పారిశ్రామికవేత్తలతో లాలూచీ పడుతోందని జనం అనుమానించక తప్పదు.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
రైలుఛార్జీలు పెంచవద్దు..
రైలు టిక్కెటు ఛార్జీలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలనే నీతి ఆయోగ్ నివేదికను రైల్వేశాఖ ఆమోదించరాదు. గత రెండేళ్ల కాలంలో ఇప్పటికే రెండుసార్లు రైలు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. రైలు, బస్సుఛార్జీలను బేరీజు వేయడం సహేతుకంగా లేదు. మమతాబెనర్జీ, లాలూప్రసాద్ రైల్వే మంత్రులుగా పనిచేసినప్పుడు టిక్కెట్ట్ఛుర్జీలను పెంచలేదు. సూపర్ ఫాస్టు రైళ్లఛార్జీలను 10 శాతం పెంచారు. పాసింజరు సర్వీసుల్లో ఎక్కువగా నష్టాలు వస్తున్నట్టు నీతి ఆయోగ్ గుర్తించిన మాట నిజమే కావచ్చు. పాసింజరు రైళ్ళలో పేదవర్గాల వారు మాత్రమే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. సంక్షేమ రాజ్యంలో పేదలకు కష్టం కలిగేలా ఛార్జీలను పెంచాలని అనుకోవటం అన్యాయం. ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఎక్కువ అయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థలు నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. టిక్కెట్టులేని ప్రయాణికులపై రైల్వే శాఖ కఠినంగా వ్యవహరించాలి, కొరియర్ సర్వీస్ వంటివి అందుబాటులోకి తేవాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు