సబ్ ఫీచర్

తెలుగు నేర్పేందుకు తీరిక లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవనాగరిక యుగంలో కుటుంబాల్లో బం ధాలు, బాంధవ్యాలూ తగ్గిపోతున్నాయన్నది మన కళ్లకు కనబడుతున్న కఠోర వాస్తవమే. ఆధునిక కాలంలో క్షీణిస్తున్న మానవ సంబంధాలకీ- ‘మమీ డాడీ’ కల్చర్‌కీ- చదువులకీ సంబంధం ఉందా? అని ప్రశ్నించుకుంటే ‘అవును’ అనే అనాల్సివస్తుంది. అందుకే ఈ సమస్యలకు మూలాలు వెతుకుదాం! కుటుంబంతోనూ, మాతృభాషతోనూ అనుబంధం పెరగాల్సిన పసి వయసు సరిగా చెప్పాలంటే - అది రెండునుంచి ఐదు ఏళ్ళ లోపు ప్రాయం. ఆ వయసు పిల్లవాడికి ఇంట్లో రామాయణ, మహాభారతాల్లోని పద్యాలు, తెలుగు సామెతలు, దేశభక్తి గేయాలు, జానపద గీతాలు నేర్పడానికి చక్కటి సమయం. కానీ, ఇపుడు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు, పెద్దలు ఏం చేస్తున్నారు..? చిన్న పిల్లవాడిని సైతం తీసుకెళ్లి (ఇంట్లో గోల అనో.. ఉద్యోగాలకు వెళ్లే దంపతులకు ఆటంకం అనో) కానె్వంటు (బడి అనం కదా..)లో పడేస్తున్నాం. అక్కడ వాడు- ‘రైన్ రైన్ గో ఎవే.. ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్’ అని పలికితే చప్పట్లు కొడుతున్నాం. ‘శ్రీరాముని దయచేతను..’ వంటి పద్యాలు ఇంట్లో చెప్పడం లేదు. పిల్లవాడు ‘డాగ్’ అని పలికితే ‘అవునురా కన్నా.. డాగ్ అంటే కుక్క’ అని చెబుతాము.
ఘఔఔళ.. అని వాడు స్పెల్లింగ్ చెబితే మురిసిపోయి ముద్దు పెట్టుకుని, ‘ఆ.. కరెక్టే.. యాపిల్.. యాపిల్’ అంటాం. తెలుగు భాష నేర్పకనే- ఇంగ్లీష్ పదాలు, అంకెలు నేర్పి అటు తరువాత మనకు ఇష్టం ఉంటే తెలుగు పదాలు, అంకెలు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాం. కానె్వంట్‌లో పిల్లల్ని వేస్తాం. అక్కడ వన్, టూ, త్రీ అని చెబుతారే కానీ.. ఒకటి, రెండు,మూడు అని దిద్దించారు. ఇంట్లో వాడు నేర్చుకొస్తున్న వన్, టూ, త్రీకి సపోర్టుగా తెలుగు అంకెలు నేర్పకపోవడం మనం చేస్తున్న తప్పు కాదా?
ఆ లేత వయసులో ‘సరస్వతీ నమస్త్భ్యుం..’ పద్యం నేర్పితే సులువుగా నేర్చుకోగలరు. ఐదేళ్ల వయసు పిల్లలు సైతం ‘అటజని కాంచె..’ వంటి కష్టమైన పద్యం ఒక్క రోజులో నేర్చుకొని అప్పచెప్పగలరు. ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ‘చిన్నారి చిట్టిగీతాలు’ సిడిని చూపిస్తున్నారు. ఇది కొంత సంతోషించాల్సిన విషయమే. వేమన, సుమతి శతక పద్యాలు నేర్పితే పిల్లలు చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది.
మనం ‘ప్లే స్కూలు’లో తెలుగే మొదట నేర్పాలి అని నిబంధన పెట్టుకోవచ్చు. కానీ- ప్రభుత్వం పెట్టదు. ప్రజలకు కానె్వంట్ల వెర్రిని అలవాటు చేశారు. పిల్లవాడికి రెండున్నర ఏళ్ళు రాగానే తల్లిదండ్రులకు ఈ కానె్వంట్లలో, టాలెంట్ స్కూళ్లలో ఇంటర్వ్యూలు పెడతారు. తల్లిదండ్రుల తెలివితేటలను చూసి పిల్లలకు ప్రవేశం కల్పిస్తారు. సంతానం కలగగానే ‘మావాడు ఇంజనీరు కావాలి. అమెరికాకి వెళ్లాలి’ అనే తాపత్రయం శ్రుతిమించిపోయి.. టాలెంట్ స్కూలు, టెక్నో స్కూలులో చేర్పించేసి, ఈ మాట్, ఆ మాట్.. నిట్‌లూ, సెట్‌లూ రాయించాలని ర్యాంకులు రావాలనే ఆకాంక్ష తల్లిదండ్రుల్లో వెర్రితలలు వేస్తోంది. పిల్లలకు మంచి ర్యాంకులు రాకుంటే ఇంట్లో ఒకటే గగ్గోలు. పిల్లల్ని ఆయాసపెడుతూ వారి శక్తి సామర్థ్యాలు సరిగా అంచనా వేసుకోలేక ఇబ్బందులు పడుతూ.. వారిని ఒత్తిడికి గురిచేస్తున్నామా లేదా? అని ఆలోచించడం లేదు. పిల్లలు మంచి చదువులే చదవాలి. కానీ, ఎలాంటి ఒత్తిళ్లు, ఆరళ్లు లేకుండా.. అని పేరెంట్స్ భావించాలి.
మరోవైపు పిల్లలకి స్కూలు బ్యాగులు రోజురోజుకీ బరువు అవుతున్నాయి. వాళ్ళ నడుములు విరుగుతున్నాయి. పిల్లలు మోయలేకున్నారు.. అంటూ వైద్య నిపుణులు వ్యాసాలు రాస్తారు, హెచ్చరికలు చేస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు బ్యాగుల బరువు తగ్గించాలంటూ స్కూలు ఎదుట ధర్నాలు చేశారు? ఎంతసేపూ- స్కూలు.. చదువు.. పిల్లవాడి బుర్రలో ఎక్కించి.. ర్యాంకులు లక్ష్యంగా తయారుచేసి.. అనుబంధం, ప్రేమ, ఆట, పాట, వివేచన వంటివి నేర్పకపోతున్నాం. పిల్లలు బాగా చదవాలని అదనపు జాగ్రత్తలు తీసుకొని వారికి మానసిక వికాసం లేకుండా చేయడం మరీ ఘోరం. ఆటపాటలు, శారీరక శ్రమ లేనందున నేటి యువత ఊబకాయం పాలై అల్లాడిపోతోంది. కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు పిన్నవయసు నుండే మోస్తున్నారు.
ఈ తరంలో పట్టుమని పదిహేనేళ్లు నిండని పిల్లలు నిత్యం డాక్టర్ల చుట్టూ తిరగడం బాధాకరం. ముప్ఫై దాటినా వాళ్ళలో ముప్పాతికమంది మానసిక, శారీరక వ్యాధులకు రోజూ రకరకాల మాత్రలు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు సంపాదనే లక్ష్యం అయితే ఇక బాంధవ్యం ఎక్కడిది? చాలామంది యువతకు ఇపుడు ఫేస్‌బుక్‌లో స్నేహితులే ముఖ్యం తప్ప , మేనమామలూ, మేనత్తలూ, బాబాయ్‌లూ- వారి పిల్లలతో సమీప బాంధవ్యాలు నెరపటం లేదనేది అంతటా జరుగుతున్నదే. సంప్రదాయం, పండుగలూ, వాటి ప్రాముఖ్యతలూ నేడు పిల్లలు తెలుసుకోవటం లేదు. వారికి పెద్దలు వివరించటం లేదు. ఉద్యోగం ఒక్కటే జీవితం అన్నట్లు వుంటున్నారు. చదువుతోపాటూ, ఆటా పాటా, మానవ సంబంధాలూ, సంస్కృతి వంటివి నేర్పాలని తల్లిదండ్రులు మరచిపోకూడదు. ఇక పెళ్లి.. మరో అధ్యాయం. అది ఆలస్యం కావటంతో కొత్త సమస్యలు కుటుంబాల్లో కనపడుతున్నాయి. ఒకరితో మరొకరు ఇమడలేకపోవడం.. నాలుగు రోజులకే నచ్చలేదని విడాకులు కోరడం కూడా కద్దు. ఇటీవల ఓ అమ్మాయి ‘నువ్వు ఓకే, కానీ- మీ అమ్మే మరీ ముసలిదానిలా వుంది, నేను అడ్జెస్ట్ కాలేనంటూ’ విడాకులు కోరిందట! కుటుంబాల్లో ఇలాంటి విచిత్ర మనస్తత్వాలు, విపరీత ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి కొత్త కొత్త సమస్యలు మనకు ఎందుకు ఎదురవుతున్నాయి? చిన్నపుడు ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు డిగ్రీ చదివాక కూడా ఇంగ్లీష్‌లో ఎందుకు సరిగా మాట్లాడలేక మళ్లీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు? తెలుగు పద్యం రాకపోతే పోయె.. ఎందుకు తెలుగు సరిగా చదవలేరు? తెలుగు అంకెలు ఎందుకు రావు వారికి? తెలుగు భాషలో పది వాక్యాలు రాయమంటే రాయలేని స్థితి ఎందుకు వుంది?
ఇప్పటితరం పిల్లలకి తెలుగు నెలల పేర్లు ఎందుకు తెలియవు? ఇంగ్లీషుతోపాటు తెలుగు నేర్చుకొంటున్నామే కానీ- తెలుగు నేర్పి, ఆ మీదట ఇంగ్లీష్ బాగా ఎందుకు నేర్పలేము. అందుకే- ఇంట్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే మొదట తెలుగు నేర్పాలి. అయిదేళ్లు నిండకుండా పిల్లలను స్కూలులో వేయరాదు. 5 నుంచి 7 ఏళ్ళ వయసు వరకూ బడిలో తెలుగే చెప్పాలి. అయిదేళ్ల లోపు వయసు పిల్లలను బడికి పంపినా అక్కడ వారికి విధిగా తెలుగు నేర్పాలి. ఆరో ఏడు నిండిన పిల్లలకి, ప్రాథమికంగా తెలుగు నేర్పిన తర్వాత ఇంగ్లీషు నేర్పించవచ్చు. మామూలు బడుల్లో చదివిన పిల్లలు ఇంట్లో ‘మమీ.. డాడీ’ అనరు. అమ్మా నాన్నా అనే పిలుస్తారు. భాషతో ఏర్పడే బంధం పేగుబంధం లాంటిది. భావమే కదా బంధాన్ని బలపరుస్తుంది.
మాతృభాషను అమ్మ ఒడిలోనే నేర్చుకోవాలి. అపుడే మాతృభాషకు, మన సంస్కృతికి మనుగడ ఉంటుంది. చదువుల్లో తెలుగుదనం కనపడకపోవడమే నేడు మన తెలుగు జాతి మోస్తున్న బరువు.

-బివిఎస్ ప్రసాద్