మెయన్ ఫీచర్

కదనానికి ముందు కొన్ని కర్తవ్యాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలు నేడు ప్రధాని నరేంద్ర మోదీకి అండగా ఉంటే, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పాకిస్తాన్ ‘పే రోల్స్’లో ఉన్నారు. లోగడ 1962, 1965, 1971 సంవత్సరాల్లో పాక్‌తో యుద్ధాలు వచ్చాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ముందుజాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. దేశంలోని ధర్మాధికారులంతా ప్రజల మధ్యకు వచ్చి జాతికి ధైర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందించాలి. ఒకప్పుడు పూరీ గోవర్ధన పీఠాధిపతి పెజావర్ స్వామి వంటివారు ఈ పనిచేశారు. ప్రజలు కూడా విలాస జీవితాలకు స్వస్తిపలికి సైనికుల కోసం ధనాన్ని, రక్తాన్ని అందించాలి.
1962లో యుద్ధం వచ్చినపుడు హైదరాబాదు వీధుల్లో ఊరేగింపులు జరిపి దేశరక్షణ నిధికి ఎంతోమంది విరాళాలు అందజేశారు. చలనచిత్ర రంగ ప్రముఖులు సైతం ఉదారంగా ముందుకొచ్చారు. విశాఖ హార్బర్, ఇస్రో, మిథాని, డిఆర్‌డిఎల్ వంటి కీలక ప్రాంతాల రక్షణ బాధ్యతను సైన్యం తీసుకోవాలి. ఇత్తెహాదుల్ మజ్లీస్, సిమి, ముస్లిం లీగ్ వంటి మతోన్మాద సంస్థల కార్యకలాపాలపై నిషేధం విధించాలి. నేపాల్‌లో భట్టారాయ్ పాత్రను ఇక్కడ కేరళలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పోషిస్తున్నాడు. యుద్ధం గనుక వస్తే అది ముగిసేవరకు కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన విధించాలి. అన్ని పనులూ సైన్యమే చేయలేదు. కాబట్టి ప్రజలు రక్షణ బృందాలుగా ఏర్పడి భద్రతా బలగాలకు సహకరించాలి. అన్ని ప్రసార మాధ్యమాల్లోను దేశభక్తిని ప్రేరేపించే కార్యక్రమాలను ప్రసారం చేయాలి. 1962లో హైదరాబాదు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు మావోకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేశాయి. అప్పుడు టీవీ, సెల్‌ఫోన్లు లేవు. ఇప్పుడీ ప్రసార మాధ్యమాలను ఉపయోగించాలి. మత విద్వేషాలను, ప్రజల్లో భేద భావాలను సృష్టించేవారిని ముందుగానే అదుపులోకి తీసుకోవాలి. అల్లర్లు చెలరేగకుండా ‘సున్నిత ప్రాంతాల్లో’ని విశ్వవిద్యాలయాలకు యుద్ధ సమయంలో సెలవులు ప్రకటించాలి. హైదరాబాద్ వంటి నగరాల రక్షణ బాధ్యతను సైన్యానికి అప్పగించాలి.
1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీకి మహానటి సావిత్రి వంటి ప్రముఖ సినీతారలు శరీరం మీద బంగారం మొత్తం తీసి దేశరక్షణ నిధికి ఇచ్చారు. ఇవాళ బాలీవుడ్, టాలీవుడ్ తారలు తమ త్యాగాన్ని ప్రదర్శించుకోవలసిన సమయం వచ్చింది.
పాక్ ఆక్రమిత కాశ్మీరు సాంకేతికంగా భారత భూభాగమే కాబట్టి మొన్నటి ‘సర్జికల్ స్ట్రైక్స్’ వంటివి మరికొన్ని జరిపి అక్కడి ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించే హక్కు భారత్‌కు ఉంది. యుద్ధం వస్తే గనుక భారత్‌కు చమురు సంక్షోభం వస్తుంది. అందుకని ప్రజలు స్వచ్ఛందంగా కార్ల వాడకం ఆపటమో, తగ్గించటమో చేయాలి. పాకిస్తాన్ లోగడ తమ పార్లమెంటులో ఇండియాపై అణుబాంబు ప్రయోగించే తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మాత్రం నాటినుండి నేటివరకు శాంతి తీర్మానాలే ఆమోదించింది. పాకిస్తాన్ సైన్యం దిల్లీ, ముంబయిలపై అణుబాంబులు ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని మన నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లోని ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. ఈ విషయం మాజీ జనరల్ ముషారఫ్ మాటల్లో తెలుస్తున్నది.
నేపాల్‌లో సివిల్ వార్ వచ్చినప్పుడు చైనా తన అనుకూల వర్గాల ద్వారా ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకొన్నది. సరిగ్గా ఇండియాలో అలాంటి వ్యూహానే్న అనుసరించబోతున్నది. దీనికి పరిష్కారం ఏమిటి? ఐరాస రంగంలోకి దిగి పాక్ అణుస్థావరాలను ధ్వంసం చేయాలి. అలా జరుగకపోతే ఐరాస అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది. ఇండియా, అమెరికా కలిసి పాక్ అణ్వాయుధ స్థావరాలను వెంటనే నిర్మూలించాలి. 1981లో ఇజ్రాయిల్ ఇరాక్‌లోని అణ్వస్త్ర పరిశోధనా కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఇప్పటివరకు భారత ప్రభుత్వం కాశ్మీరులో 10 లక్షల కోట్లు వ్యయం చేసింది. ఆ డబ్బునంతా దిగమింగడమే కాదు, ఐఎస్‌ఐ ఉగ్రవాద నిధులను కూడా కొందరు కాశ్మీరీయులు తమ ఎకౌంట్లలో చేర్చుకుంటున్నారు. అందుకని కాశ్మీరీ పండిట్లు 4 లక్షల మందికి నివాస గృహాలు నిర్మించి బిజెపి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. తద్వారా డెమోగ్రఫీలో కొంత మార్పు వస్తుంది.
పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఇటీవల మాట్లాడుతూ, ‘తమ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిరాదు.. థియేక్రటిక్ స్టేట్‌గా ఇస్లామిక్ ప్రచారం చేయాలంటే సైనిక పాలనే చాలా శ్రేష్టం..’ అన్నాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిమాలినదైతే బ్రిటన్, ఇండియా, అమెరికా వంటి దేశాలు ఆ వ్యవస్థనే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాయనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ముషారఫ్ ముష్కరుడు, నియంత. అతనికి ప్రజాభిప్రాయంతో ఎట్టి సంబంధం లేదు. లోగడ తన పాలనకు అడ్డం వచ్చిందని బేనజిర్ భుట్టోను ముషారఫ్ చంపించాడని ఆరోపించిన వాళ్లున్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని దేశంతో భారత్ చెలిమి చేయలేదు. కానీ- మరొక నియంతృత్వ దేశం చైనా మాత్రం చేయగలదు. అక్కడ ఇపుడు ప్రజాస్వామ్యం లేదు. పెట్టుబడిదారీ వర్గాల వలసవాదం కన్నా, పాక్ జీహాదియత్ ఉగ్రవాదం కన్నా చైనా వర్గ ఉగ్రవాద నియంతృత్వ వలసవాదం ఏ విధంగానూ తక్కువది కాదు. ఇలాంటి భావజాలంతోనే నేడు మన దేశంలో మనీష్ తివారీ, కపిల్ సిబల్ వంటి కాంగ్రెస్ నేతలు విడ్డూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బుద్ధిలేని వారు జాతీయవాదులవుతారని, జాతీయవాదులంతా నియంతలని వీరు కొత్త వాదనలను తెరపైకి తెస్తున్నారు. జనం గుండెల్లో ఇప్పటికీ గొప్ప జాతీయ నాయకులుగా నీరాజనాలు అందుకుంటున్న వారంతా ఈ నేతల దృష్టిలో నియంతలా? ‘ప్రపంచంలో నేడు యాభై ఆరు ఇస్లామిక్ దేశాలున్నాయి. గత వేయి సంవత్సరాలుగా అవి ఇండియాపై సాయుధ పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. ఐనా ఇరవై శాతానికి మించి హిందువులను ముస్లింలుగా మార్చలేకపోయాము.’ అని కూడా ముషారఫ్ అన్నాడు. ఈ మాటలకు అర్థం ఏమిటంటే- పాకిస్తాన్ అవతరణ, కాశ్మీర్ సమస్య, ఉగ్రవాద దాడులు.. ఇవన్నీ వాహిబ్ సామ్రాజ్య విస్తరణలో అంతర్భాగం అని, మరో వెయ్యేళ్లవరకైనా ఇండియాతో యుద్ధం చేస్తూనే ఉంటాం అని. సరిగ్గా 1965లో జుల్‌ఫికర్ అలీ భుట్టో కూడా ఇలాగే అన్నాడు. మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఈ మధ్య -‘పాక్ ఆక్రమిత కాశ్మీరులో సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు భారత సైన్యం చెబుతోంది.. అందుకు ఆధారారేమిటి?’ అని ప్రశ్నించడం మరీ విడ్డూరంగా ఉంది. విదేశీ బ్యాంకుల్లో ఈయన దాచుకున్న అక్రమాస్తుల వివరాలన్నీ ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. భారత రక్షణ విభాగం చెప్పిన మాటలను కూడా ఈయన నమ్మరా?
శత్రుదేశాల నేతలు ఎలా మాట్లాడినా వారు విద్వేషంతో మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కానీ, మన దేశానికి చెందిన చిదంబరం, కేజ్రీవాల్, సంజయ్ నిరుపమ్, సీతారాం ఏచూరి వంటి విపక్ష నాయకులు సైనికుల మనోధైర్యాన్ని శంకించేలా మాట్లాడడం సరికాదు. ఈ నేతల వ్యాఖ్యలను పాక్ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధం చెపుతున్నాడు. అసలు పాకిస్తాన్‌పై ఇండియా సర్జికల్ దాడి చేయనే లేదు.’ అన్న దిల్లీ సిఎం కేజ్రీవాల్ చెప్పిన మాటలు పాక్ పత్రికల్లో పతాక శీర్షికల్లో చోటు చేసుకున్నాయి. బాలీవుడ్ నటుడు ఓం పురి మొదట బాధ్యతారహితంగా మాట్లాడి, ఆ తర్వాత క్షమాపణ కోరడం తెలిసిందే. దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడే సినీ నటులను ప్రజలే బహిష్కరించాలి. వారి సినిమాలకు దూరంగా ఉండాలి. కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్, మనీష్ తివారీలకు ఇండియన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. కానీ, వీరు నవాజ్ షరీఫ్, బుర్హన్ వానీ, జకీర్‌నాయక్‌లతో కలిసి యుగళ గీతాలు పాడుతున్నారు. ఇది తగునా..? చైనాలో, పాకిస్తాన్‌లో ఏ నాయకుడైనా, పౌరుడైనా ఇలా చేస్తున్నాడా? మరి ఈ దరిద్రమంతా మన దేశానికే ఎందుకు?
రచయిత్రి అరుంధతీ రాయ్ అమెరికా వెళ్లి భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ప్రచారం చేసి అదేదో ప్రైజు తెచ్చుకున్నది. జాన్‌దయాళ్ వెళ్లి ఇండియాలో క్రైస్తవులకు రక్షణ లేదంటూ ప్రచారం చేసి వచ్చాడు. అదే నిజమైతే మదర్‌థెరీసాలు, జాయ్ ఛెరిహన్లూ రాత్రింబవళ్లు భారత్‌లో ఇంత ప్రచారం చేసుకోగలిగేవారా? క్రైస్తవుల మీద అర్లాండోలో జీహాదీలు జరిపిన దాడులు వీరికి తెలియదా? ఉగ్రవాద దాడి అంటే మానవత్వంపై దాడి అని అర్థం. భారతదేశంలో హిందూ, ముస్లిం,క్రైస్తవ, పార్సీలకు ఉన్నంత మతస్వేచ్ఛ ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు.
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున జాతి సమైక్యతకు భంగం కలిగించే మాటలకు నేతలు స్వస్తి పలకాలి. యుపి, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాజకీయ స్వార్థానికి స్వస్తి పలికి జాతి ప్రయోజనాల కోసం ఆలోచించాలి. ఇపుడు కేరళలో అక్కడి ప్రభుత్వ విధానాల ఫలితంగా సంక్షోభం రాజుకుంటోంది. తమిళనాడులో పాలన స్తంభించింది. కర్నూలు నుండి మైసూరు వరకు ‘ఉగ్రవాద కారిడార్’ ఏర్పడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఏవో సమస్యలు ఉండనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జాతిని యుద్ధానికి సిద్ధం చేయాలంటే ప్రజలలో ఒకవైపు ఉత్సాహం నింపుతూ, మరొకవైపు దేశంలోని దుర్మార్గపు పాలకులపై, రెచ్చగొట్టే నాయకులపై చర్యలు తీసుకోవాలి. దేశ భద్రత కోసం సైనికులు పోరాడుతున్న వేళ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నేతలు మాట్లాడితే అది ముమ్మాటికీ దేశద్రోహం, బాధ్యతా రాహిత్యం.
యుద్ధ సమయంలో దేశ ప్రజలూ, పార్టీలు కలిసి ఉండకపోతే ఏం జరుగుతుందో రెండువేల సంవత్సరాల భారత చరిత్ర నిరూపిస్తున్నది. ఐనా మన నాయకులు పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోలేదు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించి పత్రికల నోళ్లుమూయించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది ఎవరు? ఈ ప్రశ్నకి కపిల్ సిబల్, దిగ్విజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోళ్లలో కమీషన్ల కోసం కక్కుర్తి పడింది ఎవరు? అన్న విషయంపైనా వారు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇక, తమిళనాడులో రాష్టప్రతి పాలన విధించాలని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. అదే జరిగితే- యుపి, కేరళలోనూ రాష్టప్రతి పాలన విధించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పాకిస్తాన్, చైనాలకు మద్దతు ఇస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

-ముదిగొండ శివప్రసాద్