ఉత్తరాయణం

‘మైనారిటీ’ పదం వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రజలంతా ఒక్కటే, అందరికీ చట్టాలు ఒక్కటే. అయితే, నేడు మన పాలకులు ‘మైనారిటీ’లంటూ కొంతమందిపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ విధానం జాతి సమైక్యతను దెబ్బతీస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకై ‘మైనారిటీ’ అన్న పదాన్ని తరచూ వాడుతూ దేశానికి కీడు తలపెడుతున్నారు. ఈ పదమే అఖండ భారత్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లుగా విడదీసింది. ఇప్పుడు కాశ్మీర్ సమస్యను రావణకాష్ఠంలా రగిలిస్తున్నారు. మైనారిటీ అనే పదం తొలగించి, భారతీయులందరూ ఒకటే, అందరికీ ఒకే చట్టం అని చాటిచెప్పాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి దేశ ప్రజలకు రక్షణ కల్పించాలి. దేశ విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదం వల్లే ఈనాడు దేశం విలవిలలాడుతోంది. మన దేశానికి బయటివాళ్లే కాదు, అంతర్గత శత్రువులు వున్నారు. ఈ అంతర్గత శత్రువులే పాకిస్తాన్‌తో, తీవ్రవాదులతో చేతులు కలుపుతున్నారనేది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. దీనికంతటికీ మైనారిటీ పదమే కారణం. ఎంత త్వరగా రాజ్యాంగాన్ని సవరించి భారతీయులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేసి తీరాలి. అలాకాకపోతే దేశం నిరంతరం చిక్కుల్లోపడుతూనే వుంటుంది.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
నిషేధం సహజమే
ఊరీ ఘటన తర్వాత పాక్ సినీకళాకారులు భారత్‌ను విడిచిపోవాలంటూ శివసేన లాంటి పార్టీలు డిమాండ్ చేయగా, ‘సినిమా పరిశ్రమ సృజనాత్మక రంగం.. మా మానాన మమ్మల్ని వదిలేయండి.. పాక్ కళాకారులను బయటకు పొమ్మనడం తగదు..’ అంటూ బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ అనడం సరికాదు. మన చిత్రాల్లో , పాక్ సినిమాల్లో సృజనాత్మకత ఎంతో ప్రజలకు తెలియదా? పాక్ కళాకారుల కంటే మనవాళ్లు తక్కువా? సినిమాలకు ఇక్కడివారు పనికిరారా? దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలను ఖండించడానికి బదులు సృజనాత్మకత అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో దౌత్య, వ్యాపార, కళారంగాల్లో ఇలాంటి నిషేధాలు కొనసాగడం సహజమే.
- అభిలాష, కాకినాడ
వారి త్యాగాలు వెలకట్టలేం..
సరిహద్దుల్లో శత్రుదేశం జరిపిన దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం ఎంత? చట్టప్రకారం ముట్టేదే తప్ప ఇతరత్రా ఏమీరాదనేది రిటైరయిన సైనికులు చెబుతున్నారు. కాగా, ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించినవారికి కోటాను కోట్ల నజరానాలను ప్రభుత్వం ఇస్తోంది. వీరు సైనికుల కన్నా గొప్పవారా? ప్రాణాలకు తెగించి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ శత్రువులతో పోరాడి ప్రాణాలను కోల్పోయిన సైనికుల త్యాగాలను తక్కువగా అంచనా వేయరాదు. వీరి స్మత్యర్థం పైలాన్‌లు కట్టించినా, వారి సేవలను పొగిడినా కుటుంబ సభ్యుల జీవనానికి ఉపయోగపడేవికావు. పదవీ విరమణ చేసిన, ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు భూములకు బదులు నగదును అందజేయాలి. ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేసి సైన్యం నుంచి బయటకొచ్చిన వారందరికీ ఉద్యోగాలు రావు. పెన్షను సరిపోదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
వన్యప్రాణులు విలవిల
దేశంలో వన్యప్రాణుల సంరక్షణకు వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చిస్తున్నా కొందరి అధికారుల అవినీతి, నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల జోక్యంతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అరణ్యాలను, వన్యప్రాణులను స్మగ్లర్లకు, వేటగాళ్లకు వదిలి కొందరు అధికారులు హాయిగా కాలం గడుపుతున్నారు. కాకులు దూరని కీకారణ్యాలుగా పేరొందిన అనేక దట్టమైన అడవులు కూడా ఇపుడు మైదానాలుగా మారిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 74 పులులు మరణించినట్లు స్వచ్ఛంద సంస్థలు సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఇక జింకలు, కుందేళ్లలాంటి వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు. అడవి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని కొన్ని ప్రాంతాల్లోనూ బాహాటంగానే అమ్ముతున్నారు. చట్టాలు పటిష్టంగా ఉన్నా వాటిని అమలు చేయటంలో చిత్తశుద్ధి లేకపోవటంతో వన్యప్రాణులకు రక్షణ కరవైంది. దేశంలో పదిహేను రాష్ట్రాల్లో వన్యప్రాణుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
పనిదినాలు తగ్గించొద్దు
విద్యాసంస్థలు వారానికి ఐదురోజులే పనిచేయాలన్న కొందరి వాదన విడ్డూరంగా వుంది. ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసం కోసం శనివారాల్ని కూడా సెలవులుగా ప్రకటించాలని కోరడం వింతగా అనిపిస్తోంది. ఇంధన పొదుపుకోసం శని, ఆదివారాల్ని సెలవులుగా కోరడం హాస్యస్పదంగా వుంది. ప్రస్తుతం పాఠశాలలు నెలకి సగటున 20 రోజులు కూడా నడవడం లేదు. ఇప్పటికే అధిక సెలవుల కారణంగా పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్ని ప్రక్షాళన చేసి విద్యాప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- పసునూరి శ్రీనివాస్, మెట్‌పల్లి