సంపాదకీయం

బీటలు వారిన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జైలు నుంచి ఎనిమిది మంది జిహాదీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోవడం కేవలం ఈ జైలులోని భద్రతా రాహిత్యానికి సంబంధించిన వ్యవహారం. దేశ భద్రతా కుడ్యంలో నానాటికీ పెరుగుతున్న ‘రంధ్రాల’కు ఇది ఒక నిదర్శనం మాత్రమే. తప్పించుకొని పారిపోయిన దుండగులు జైలు కాపలాదారులలో ఒకడైన రామ్‌శంకర్ అనే హవల్‌దార్‌ను గొంతుకోసి చంపడం భద్రత భంగపడిందనడానికి మరో నిదర్శనం. ఒక హడ్ కానిస్టేబుల్‌ను హత్య చేస్తున్న సమయంలో మిగిలిన భద్రతాదళం మొద్దు నిద్దర పోయిందనడానికి ఇది మరో నిదర్శనం. ఎనిమిది మంది ‘సిమి’ ఉగ్రవాదులను ఒంటరిగా రామ్‌శంకర్ నిరోధించలేక పోవడం ఆశ్చర్యం కాదు. ఆయన వద్ద తుపాకీ ఉన్నదా? లేదా? అన్న వ్యవహారం తేలలేదు! ఎత్తయిన జైలురోడ్‌ను ఎనిమిది మంది దుండగులు బట్టలతోను కర్రలతోను చేసిన నిచ్చెన సహాయంతో ఎక్కడానికి ఎంత సమయం పట్టింది? వారు నిర్భయంగా నిచ్చెనను తయారు చేస్తున్న సమయంలో కారాగృ హం కాపలాదారులు ఎవ్వరూ కూడా గమనించక పోవడం విచిత్రమైన భద్రతాలోపం. త ప్పించుకుని పోగలిగిన ఎనిమిది మందిలో న లుగురు 2013లో ఖాం డ్వాలోని జైలు నుంచి ఇదే పద్ధతిలో కాపలాదారులను ఏమరచి తప్పించుకున్నారు. వా రిలో ఒకడు ఆ తరువాత పట్టుబడ్డాడు. ముగ్గురు దాదాపు మూడేళ్ల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టుబడ్డారు. అందువల్ల కారాగృహం గోడలను ఎక్కి దూకగల నైపుణ్యం ఉన్న ఈ నలుగురూ జైలులో ఉన్నందువల్ల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండి ఉండాలి. ఘోరమైన ప్రమత్తత మాత్రమే అధికార యంత్రాంగాన్ని ఆవహించినట్టు స్పష్టమైంది. తప్పించుకున్న ఎనిమిది మంది ఉగ్రవాదులూ కొన్ని గంటల సమయంలోనే భోపాల్ నగర శివారులలో పోలీసులతో తలపడి హతం కావడం వేరు కథ. పోలీసుల అప్రమత్తతకు ఇది నిదర్శనం కావచ్చు! జైలు సిబ్బందిలో నలుగురిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి తొలగించిదట! కానీ ఉగ్రవాదులు తప్పించుకొనడానికి సహకరింన వారు ఈ నలుగురిలో ఉన్నారా? లేక నేరస్థులు పట్టుబడలేదా? పట్టుబడని దేశద్రోహులు జైలు సిబ్బందిగా చెలామణి కావడం మరింత ప్రమాదకరం! దేశంలోను విదేశాలలోను జిహాదీ బీభత్స ఘటనలు వేటికవి విడివిడి పరిణామాలు కాదు. ఈ ఘటనలన్నింటి వెనుక అంతర్జాతీయ అనుసంధాన వ్యవస్థ ఉంది! అలాగే సిమి, ఇండియన్ ముజాహిదీన్, హిజ్‌బుల్, హక్యాని, లష్కర్ ఏ తోయిబా, జమాత్ ఉద్ దావా, జాయిష్ ఏ మహమ్మద్, ఐఎస్‌ఐఎస్, బోకోహరామ్, హిజ్‌బొల్లా,్ఫతా వంటి పేర్లతో చెలామణి అవుతున్న బీభత్స ముఠాల వారు పరస్పరం అనుసంధానమై ఉన్నారు. ఈ అనుసంధాన సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఐఎస్‌ఐ’.. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్!
అందువల్ల భోపాల్ జైలు నుంచి ‘సిమి’ ఉగ్రవాదులు పారిపోవడం మిగిలిన బీభత్స ఘటనలతో సంబంధం లేని ‘విడి’ నేరం కాదు. దేశాన్ని బద్దలు కొట్టడానికి దేశవిదేశాలలో అమలు జరిగిపోతున్న ‘కుట్ర’లో ఇది భాగం! 2013లో ‘సిమి’- స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా- భారత ఇస్లాం మత విద్యార్థి ఉద్యమం-ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పదమూడేళ్లు గడిచిన తరువాత కూడా జిహాదీ ఉగ్రవాద సంస్థ అణగారి పోలేదు. ఇందుకు కారణం ఈ సంస్థ విస్తృత భారత వ్యతిరేక జిహాదీ బీభత్స ప్రణాళికతో అనుసంధానమై ఉండడం. కొన్నాళ్లు నిద్రాణంగా ఉన్నట్టు అభినయించడం, మరికొన్నాళ్లు బహిరంగ బీభత్సకాండకు తెగబడడం జిహాదీ ఉగ్రవాదుల వ్యూహం మాత్రమే కాదు, అన్ని రకాల ఉగ్రవాద ముఠాల పనితీరు ఇదే. పాకిస్తాన్ ప్రేరిత జిహాదీలు, చైనా పురికొల్పుతున్న మావోయిస్టులు, ఐరోపా ప్రభుత్వేతర సంస్థల మద్దతుతో ఈశాన్య ప్రాంతంలో దేశ వ్యతిరేక కలాపాలను సాగిస్తున్న విద్రోహపు తండాలు- వీరందరిదీ ఇదే పద్ధతి. ఉగ్రవాదంపై సైనిక దళాలు, కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సమరం ఉద్ధృతవౌతున్న కొద్దీ ఈ బీభత్స బృందాల కలాపాలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ‘అధీనరేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- పొడవునా పాకిస్తాన్ ప్రభుత్వ దళాలవారు కాల్పులు జరుపతున్నారు. నిరాయుధులైన ప్రజలను హత్య చేస్తున్నారు, ‘దృష్టి’ ఈ కాల్పులపై మళ్లి ఉన్న సమయంలో పాకిస్తాన్ వైపునుంచి జిహాదీలు ‘రేఖ’ దాటి మనవైపు చొరబడుతున్నారు. దేశం దృష్టి కాశ్మీర్, పంజాబ్‌లపై కేంద్రీకృతమై ఉన్న సమయంలోనే ఒరిస్సాలో మావోయిస్టులు కలాపాలు ఉద్ధృతమయ్యాయి. భోపాల్ నుంచి ‘సిమి’కి చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులు జైలు భద్రతను బద్దలు చేశారు. హైదరాబాద్‌లో నైజీరియా ‘మాదకం’ పదార్థాల అక్రమరవాణాదారులు పట్టుబడుతున్నారు. బెంగళూరులో చైనాకు చెందిన ఎర్రచందనం అక్రమ విక్రేతలు విహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా దేశ విద్రోహులు కొందరు బహిరంగంగా, కొందరు ప్రచ్ఛన్నంగా విశృంఖలంగా కలాపాలను కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు భోపాల్ జైలు నుంచి తప్పించుకుపోయి, పోలీసులతో తలపడి హతమైనవారు మధ్యప్రదేశ్‌కో, మన దేశానికో పరిమితమైన వారు కాదు. అంతర్జాతీయ ముఠాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. ‘అల్ ఖాయిదా’ ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నాయన్న ప్రచారం కొత్తది కాదు. అన్ని జిహాదీ ముఠాలనూ పాకిస్తాన్ ప్రభుత్వం సమన్వయం చేస్తోందన్నది బహిరంగ రహస్యం. మావోయిస్టులను, శ్రీలంక ‘తమిళ ఈలం లిబరేషన్ టైగర్’ల- ఎల్‌టిటిఇ-ను కూడా జిహాదీలతో అనుసంధానం చేయడానికి ప్రయత్నించిన సమాచారం దశాబ్ది క్రితమే ప్రచారమైంది. ఆశ్చర్యం ఇది కాదు! ఇంతటి ఘరానా నేరస్థులున్న జైలు గోడల భద్రతను సిబ్బంది పట్టించుకోకపోవడం విస్మయకరం. తమిళనాడులో 2014లో బెంగళూరు-గువాహతీ ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్లను జరిపించింది ‘సిమి’ ఉగ్రవాదులే. నిందితులలో ఇద్దరు ఈ ‘దుష్టాష్టకమ్’ ముఠాలో సభ్యులట! తెలంగాణలో జరిగిన మూడు ఘోర బీభత్స ఘటనల జరిపించిన వారు సైతం ‘్భపాల్ దుష్టాష్టకం’లో సభ్యులు! 2014లో చొప్పదండిలో బ్యాంకు దోపిడీ చేసినవారు, నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లోను, జానకీపూర్‌లోను పోలీసులపై కాల్పులు జరిపిన వారు సోమవారం జైలు నుంచి పారిపోయిన ముఠాలో సభ్యులు..
జైలు నుంచి సొరంగాలు తవ్వడం, జైలుగోడలెక్కి దూరిపారిపోవడం, ముంబయిలో కోర్టు ఆవరణ నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం వంటి దుస్సాహస కృత్యాలను బీభత్సకారులు అనేక ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ‘సిసిటివి’ నిఘా నేత్రాల తీగెలను ధ్వంసం చేసి భోపాల్ జైలు నుంచి దుండగులు పారిపోగలిగారు. సిబ్బంది సహకారం ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. జుమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగంలో దేశద్రోహులు చొరబడి ఉండడం 1947లో ధ్రువపడింది. ఇప్పుడు మళ్లీ ధ్రువపడింది. నిరంతరం ధ్రువపడుతోంది. ఈ విద్రోహ ప్రవృత్తి ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది.. ‘్భపాల్’ పాఠం ఇదీ!!