సంపాదకీయం

‘గ్వాడార్’ గూడుపుఠాణీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ బలూచిస్థాన్‌లోని గ్వాడార్ ఓడరేవు అత్యాధునిక రూపు సంతరించుకొనడం చైనా వారి ఆర్థిక, భౌతిక, వ్యూహాత్మక దు రాక్రమణలో భాగం. చైనా ప్రభుత్వం పునర్ నిర్మించిన ఈ ఓడరేవులో రాకపోకల సందడి పెరగడం మన ప్రధాన మంత్రి జపాన్ పర్యటనకు సమాంతర పరిణామం! చైనా నిరంతరం ప్రత్యక్ష, ప్రచ్ఛన్న వ్యూహాత్మక దురాక్రమణను కొనసాగిస్తోందన్న వాస్తవానికి గ్వాడార్ పునఃప్రారంభం సరికొత్త సాక్ష్యం. సరకు నిండిన నౌకలు శ్రీలంకకు, పర్షియా సింధుశాఖ దేశాలకు, ఐరోపాకు, బంగ్లాదేశ్‌కు బయలుదేరి వెళ్లినట్టు ఆధికారికంగా ఆదివారం సమాచారం వెలువడింది. ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవు అభివృద్ధికి మన దేశానికి, ఇరాన్‌కు మధ్య కుదిరిన ఒప్పందం చైనా విస్తరణ వ్యూహానికి ప్రతివ్యూహం! అయితే కథ ఇంతటితో పరిసమాప్తి కాలేదు. గ్వాడార్ నుంచి సింకియాంగ్-ఝింఝియాంగ్‌లోని కష్‌గఢ్ వరకు పాకిస్తాన్ పొడవునా చైనా పారిశ్రామిక ప్రాంగణాన్ని-ఎకనిమక్ కారిడార్-ను నిర్మించాలని తలపెట్టింది. దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలను ఈ పారిశ్రామిక వాటిక అభివృద్ధికి చైనా ఖర్చుపెడుతోంది. ఈ పారిశ్రామిక వాటిక మన భద్రతకు, సరిహద్దులకు మరింత ప్ర మాదకరంగా మారింది. ఈ ప్రమాదం రెండు పద్ధతులలో ఏర్పడింది. ఈ గ్వాడార్-కష్‌గఢ్ వాటిక పాకిస్తాన్ దురాక్రమిత జమ్ము- కశ్మీర్ గుండా ఏర్పడుతోంది. ఇది మొదటి ప్రమాదం. ఝింఝియాంగ్‌కు చైనా సముద్ర తీరాలలోని ఓడరేవుల కంటే బలూచిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవు సమీపంలో ఉంది. టిబెట్‌కు సైతం గ్వాడార్ ఓడరేవు చైనాలోని ఓడరేవుల కంటే దగ్గరలోనే ఉంది. అందువల్ల ఆర్థిక కలాపాల మాటున పాకిస్తాన్ పొడవునా తన సైనిక కలాపాలను సాగించడానికి గ్వాడార్ చైనాకు ఈ పారిశ్రామిక ప్రాంగణం ద్వారా మరింత అందుబాటులోకి వచ్చింది! చైనా తన స్థల దళాలను, వాయు సేనలను గ్వాడార్ వైపున దించి గ్వాడార్‌లో తిష్ఠ వేసి ఉన్న తన నౌకాదళంతో అనుసంధానం చేయడానికి ఈ బలూచిస్థాన్-ఝింఝియాంగ్ పారిశ్రామిక వాటిక దోహదం చేయగలదు. ఇది రెండవ ప్రమాదం! గ్వాడార్-కష్‌గఢ్ అనుసంధానం వల్ల పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌ను మళ్లీ మనం స్వాధీనం చేసుకునే ప్రక్రియ మరింత జటిలం కాగలదు. ఎందుకంటే పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పిఓకె-పొడవునా చైనా పారిశ్రామిక, సైనిక స్థావరాలు వ్యవస్థీకృతం అయిపోతున్నాయి. ద్వైపాక్షిక చర్చల ద్వారా పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌ను మనం పొందలేకపోయినట్టయితే చర్యలు అనివార్యం! కానీ, పాకిస్తాన్ నుంచి మాత్రమే కాక చైనా కబంధం నుండి కూడా పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌ను విడిపించడం మనకు మరింత కష్టం.. పాకిస్తాన్ 1947-48 మధ్యకాలంలో జరిపిన దురాక్రమణ ఫలితంగా మూడవవంతు కశ్మీర్ పాకిస్తాన్ అక్రమ అధీనంలో మిగిలిపోయింది. దీనివల్లనే పాకిస్తాన్‌కు చైనాకు మధ్య సరిహద్దు ఏర్పడింది.. నిజానికి చైనా, పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దు లేదు!!
గ్వాడార్‌లో చైనా తిష్ఠ వేసిన ఫలితంగా మన పడమటి సముద్ర తీరానికి చైనా దురాక్రమణ ప్రమాదం పొంచి ఉంది. సముద్రపు దొంగలను అరికట్టే నెపంతో గ్వాడార్‌లో మాత్రమే కాక కరాచీ ఓడరేవులో సైతం చైనా నౌకాదళ విన్యాసాలు జరుగుతున్నాయి. ఓడదొంగలు అరేబియా సముద్ర ప్రాంతంలో తమ కలాపాలను మానుకున్నప్పటికీ చైనా నౌకాదళం మాత్రం ఈ ప్రాంతంలో పచార్లు చేయడం ఆపడం లేదు. సోమాలియా తీరంలో స్థావరాలను ఏర్పాటు చేసుకుని వాణిజ్య నౌకలను గతంలో కొల్లగొట్టిన ఓడదొంగలు జిహాదీలుగా, ఉగ్రవాదులుగా రూపాంతరం చెందడం పాకిస్తాన్ పన్నాగంలో భాగం! ఈ ఓడదొంగలకు ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ అల్‌ఖాయిదా తండాలకు మధ్య పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ అనుసంధానాన్ని ఏర్పాటు చేయగలిగింది! అందువల్ల జిహాదీ బీభత్సకారులుగా మారిన ఓడదొంగలకు ఇస్లాం మత రాజ్య వ్యవస్థలున్న దేశాల నుండి భారీగా నిధులు అందుతున్నాయి. ఈ జిహాదీలు క్రమంగా మాల్‌దీవులకు వ్యాపించారు. చైనా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా మూడేళ్ల క్రితం మాల్‌దీవులలో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మన దేశానికి వ్యతిరేకంగా సంభవించిన సమాంతర పరిణామం. మాల్‌దీవులు చైనాకు మరో సైనిక స్థావరంగా మారుతోంది! ఈ విపరిణామ క్రమాన్ని ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా తిలకించిన మన ప్రభుత్వం ఇటీవల ప్రతిఘటన వ్యూహాన్ని అమలు జరుపుతోంది. ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవులో మన ప్రవేశం ఈ ప్రతిఘటన వ్యూహంలో భాగం!!
చైనా వారి వ్యూహాత్మక దురాక్రమణ ముం దు చతికిలపడి ఉండిన మన విధానం మారుతుండడానికి చౌబహార్ ఒక నిదర్శనం మాత్రమే! మన ప్రభుత్వం ఆరంభించిన ప్రతిఘటన వ్యూహం బలపడుతున్న కొద్దీ చైనా మరింతగా తన దురాక్రమణ వ్యూహానికి పదునుపెడుతోంది.. ఈశాన్య ప్రాంతంలో విద్రోహకాండను, బీభత్సకాండను కొనసాగిస్తున్న చైనా ప్రేరిత ఉగ్రవాదులకు బర్మాలోని, మన సరిహద్దుకు సమీప ప్రాంతాలు స్థావరాలుగా మారి ఉన్నాయి. దశాబ్దుల తరబడి ఉపేక్షించిన మన ప్రభుత్వం గత ఏడాది బర్మాలోకి చొచ్చుకొనిపోయి బీభత్సకారుల స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిక్రియగా చైనా ప్రభుత్వం అరుణాచల్ పై తన వివాదాన్ని ఉద్ధృతం చేస్తోంది. టిబెట్ మాజీ అధినేత, ధార్మిక నేత దలైలామా అరుణాచల్‌లో పర్యటించరాదని చైనా ప్రభుత్వం నిర్దేశించడం ఈ ఉద్ధృతిలో భాగం! చౌబహార్ ఓడరేవును అభివృద్ధి చేయడంలో మనదేశంతో భాగస్వామ్యం వహించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించడం విస్తరిస్తున్న ప్రతిఘటనకు నిదర్శనం! ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవుబలూచిస్థాన్‌లోని గ్వాడార్‌కు సమీపంలోనే ఉంది. రెండు కూడా అరేబియా సముద్రాన్ని అనుసంధానం చేస్తున్న ఒమన్ సింధుశాఖ ముఖద్వారంలోనే నెలకొని ఉన్నాయి. అందువల్ల గ్వాడార్‌లో తిష్ఠవేసిన తమ నౌకాదళానికి పోటీగా భారత్, జపాన్ చౌబహార్‌లో తమ నౌకాదళాలను నెలకొల్పగలవన్న అనుమానం చైనాకు కలుగుతోంది! గ్వాడార్ ఓడరేవు ఆధునాతనంగా రూపొందిన తరువాత పునఃప్రారంభమైందన్న పాకిస్తాన్ ప్రచారానికి ఇదీ నేపథ్యం! మనదేశం పట్ల మరింత వ్యతిరేకతను పెంపొందించడంలో భాగం..
గ్వాడార్ నుంచి బయలుదేరిన మొదటి ఓడ ఆదివారం చైనాకు చేరిందట! గ్వాడార్ ఓడరేవు పునఃప్రారంభం వల్ల భారత్ భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లబోదని, భయాందోళనలు అనవసరమని చైనా నిపుణులు ఈ సందర్భంగా ప్రకటించారట! చైనా గ్వాడార్‌లో ప్రవేశించడం పట్ల మన ప్రభుత్వం ఆధికారికంగా నిరసన తెలిపిన జాడ దశాబ్దికి పైగా లేదు! అయినప్పటికీ చైనా భుజాలను తడుముకుంటోంది! గ్వాడార్ అభివృద్ధి పట్ల బలూచిస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమకారులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తుండడం మరో సమాంతర పరిణామం! గ్వాడార్ ఓడరేవు బ్రిటన్ దురాక్రమణ సమయంలో ఓమన్ అధీనంలో ఉండేది. ఆ తరువాత పాక్ కొనుగోలు చేసింది! బలూచిస్థాన్ లేని పాకిస్తాన్ ఏర్పడాలన్నది 1947కు పూర్వం నాటి బ్రిటన్ ప్రణాళిక! ఈ కథ ఇప్పుడు పునరావృత్తం అవుతుందా? బలూచిస్థాన్ ఉద్యమకారులు చెప్పగలగాలి..