ఉత్తరాయణం

విద్వేషాలు రెచ్చగొట్టొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఒక పీఠాధిపతి షిర్డీసాయిబాబాపై వ్యా ఖ్యలు చేసి వివాదాస్పదంగా మారారు. కోర్టు సైతం తక్షణమే స్పందించి అటువంటి వ్యాఖ్యలు చేయరాదని పీఠాధిపతిని కోరింది. షిర్డీసాయి అన్ని కులాలకు, మతాలకు దేవుడు. భిన్నత్వంలో ఏకత్వం గల దేవుడు. పీఠాధిపతులు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. మనుషుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉంటాయి. మనిషి ఏ దేవుడికైనా భయపడతాడు. తద్వారా తప్పులు చేయకుండా పూజిస్తుంటాడు. తనకు నచ్చిన దేవుళ్ళను పూజిస్తుంటాడు. ఏ మతం వారైనా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సబబుకాదు.
- అయినం రఘురామారావు, ఖమ్మం
బీచ్ ఫెస్టివల్ వద్దు
పర్యాటక రంగం అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో నిర్వహించ తలపెట్టిన బీచ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం విరమించుకోవాలి. ఎపి ప్రభుత్వం దీన్ని ఓ ప్రైవేటు కార్యక్రమంగా పేర్కొంటూ 9వేల జంటలను దేశ,విదేశాల నుంచి రప్పించి అందాల పోటీలు, క్యాట్‌వాక్‌లు, డాన్సులు, పార్టీలతో హోరెత్తించేందుకు ప్రయత్నిస్తోంది. గోవా తరహాలో విశాఖ నగరాన్ని విదేశీ సంస్కృతిలో ముంచెత్తే ఈ అనైతిక కార్యక్రమాన్ని ఏ ఒక్కరూ హర్షించరు. ఇప్పటికే సమాజంలో నైతిక విలువలు ఘోరంగా పతనమవుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహించడం ఎంత మాత్రం తగదు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
ఆటవిడుపు లేదా?
చాలా పాఠశాలల్లో క్రీడలు, వ్యాయామానికి ఇపుడు ప్రాధాన్యత శూన్యమైపోయింది. పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి సాయంత్రం వరకూ బోధన, స్టడీ అవర్లే తప్ప క్రీడలు కరవైనాయి. ఒత్తిడి లేకుండా పిల్లలు ఆడుతూపాడుతూ మానసిక వికాసం పొందాలని క్రీడలను ప్రవేశపెట్టారు. మార్కులు, ర్యాంకుల పేరిట పిల్లలకు ఆటవిడుపు శూన్యమైంది. తప్పనిసరిగా అన్ని పాఠశాలల్లో రోజూ ఒక పీరియడ్‌ను క్రీడలు, వ్యాయామానికి కేటాయించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ?
దేశమంతటా నేడు ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోతున్నది. పాలిథిన్ సంచులు, ఐస్‌క్రీమ్ కప్స్, గ్లాసులు.. ఇలా అనేకమైన ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. మురుగు కాలువలు, చెరువులు వీటితో నిండిపోవడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడి పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారు. ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలి.
-పులిపాకల సురేష్, బరిగలపల్లి
విదేశీ సంస్థలే గతి!
అభివృద్ధి పేరిట విదేశీయులు పలు సంస్థలను, పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. భారీగా రాయితీలు కురిపిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా విదేశీయులపైనే ఆధారపడాలా? ఎపిలో పరిశ్రమల స్థాపనకు, రాజధాని నిర్మాణానికి సాంకేతిక సహకారాన్ని కోరడమే కాకుండా ఇక్కడికి రమ్మని విదేశీయులను బతిమాలుతున్నాం. ఈ పరిస్థితులు మంచికైతే ఫరవాలేదు. గత చేదు అనుభవాల్ని గుర్తుచేసుకుంటూ రాజకీయ పార్టీలు, నాయకులు, మేధావులు జాగ్రత్తగా వ్యవహరించాలి. రాబోయే పరిణామాలను మనం చూడలేకపోయినా, తర్వాతి తరాలవారు చూడగలిగి అనుభవిస్తారు. విదేశీ పెట్టుబడుల విషయంలో విజ్ఞతతో వ్యవహరిస్తే బాగుంటుంది.
-పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి