సబ్ ఫీచర్

తరగతి గధి ఒక తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదికి ఆది, అంతం ఉండదు. ఎస్సెస్‌మెంటుకు కూడా వివిధ సోపానాలుంటాయి. మొదటి సోపానంలో సామాన్య విద్యార్థికి కావాల్సిన కనీస జ్ఞానం అందించామా? లేదా? అన్నది తరగతి గది చూసుకుంటుంది. విద్యార్థి జిజ్ఞాస అక్కడితో ఆగిపోతున్నదా? లేక రెండో సోపానానికి అడుగుపెట్టడానికి అడుగులు లేపుతున్నాడా? అన్నది గుర్తించటమే ఉపాధ్యాయుడి పనితనానికి గీటురాయి. అది కనుక్కోగలిగినప్పుడే అడ్వాన్స్‌డ్ అస్సెస్‌మెంట్ మొదలుపెడతాడు ఉపాధ్యాయుడు. అడ్వాన్స్‌డ్ అస్సెస్‌మెంటు అన్నది ఒక మెట్టు. సమత్వం సాధిస్తేనే అడ్వాన్స్‌డ్ అస్సెస్‌మెంటుకు అర్హుడవుతాడు. పై మెట్టుకు అందరిలో ఒకేసారి జిజ్ఞాస కలుగుతుందనే ఆలోచనలు రాకపోవచ్చు. అది ఆ విద్యార్థి జ్ఞాన జీర్ణశక్తినిబట్టి ఆధారపడి ఉంటుంది. అది విద్యార్థి శక్తితో వచ్చిందే కానీ ఉపాధ్యాయుడి ప్రోద్బలంతో వచ్చింది కాదు.
అడ్వాన్స్‌డ్ అస్సెస్‌మెంటును అందరిపై రుద్దటం విద్యార్థులను ప్రేరేపించడానికి బదులుగా ప్లెస్టేషన్ (నిష్ఫలమై పోవటం)కు కారణభూతమవుతుంది. ఎప్పుడు అడ్వాన్స్ పరీక్ష పెట్టాలో ఉపాధ్యాయుడే ఆలోచించుకోవాలి. అడ్వాన్స్ అనేది ఈక్విటీకి కంటిన్యూయేషనే కానీ, విద్యార్థిని పైకి తోయటం కాదు. సాధించిన జ్ఞానాన్ని కొత్త దృక్కోణంతో చూడటం జరగాలి. అది విద్యార్థి దృష్టిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఉపాధ్యాయుడికి కూడా కనపడని విషయాలు విద్యార్థికి కనపడతాయి. విద్యార్థులకొచ్చిన ఈ నూతన దృక్కోణాన్ని ఉపాధ్యాయులు హర్షించాలే కానీ దాన్ని మార్కెట్ చేయకూడదు. ఆ ప్రజ్ఞ, ఆ దృక్కోణం బాహ్యశక్తులవల్ల వస్తే అది మార్కెట్ చేయబడుతుంది. తన ప్రజ్ఞను బాహ్యశక్తులు వేలం వేస్తున్నారని ఆ విద్యార్థులు బాధపడతారు. అడ్వాన్స్ అస్సెస్‌మెంట్‌తో అందరు విద్యార్థులు ఆ స్థాయికి రాలేకపోవచ్చు. ఆ స్థాయికొచ్చిన వారిని ప్రోత్సహించాలి. మనం వూహించిన దానికన్నా ఎక్కువ ప్రజ్ఞ పిల్లల నుంచి పెల్లుబుకి వస్తుంది. విద్యార్థి ఒక్కొక్క మెట్టుఎక్కుకుంటూపోతాడు. కానీ సమత్వంతో సాధించిన పునాదే నూతన ఆలోచనలకు, పైమెట్లు ఎక్కేందుకు పునాది అవుతుంది.
సమత్వం, ప్రతిభ మధ్య అవినాభావ సంబంధం ఉంది. సమత్వం లేకుండా ప్రతిభ కోసం ప్రయత్నంచేస్తే ఆ జ్ఞానం గాలిలో వేలాడుతుంటుంది. ఆ గాలిలో ఉండే జ్ఞానం - పై మెట్టుకు పోవటానికి ఉపయోగపడదు. ఆ విద్యార్థుల ప్రతిభను చూసి తరగతి గది మురిసిపోతుంది. కానీ అహంకరించుకోదు. అందుకే తరగతి గది ఒక తల్లిలాంటిదని అంటారు. తల్లిలో ఉండే శీలమే పిల్లల ఎదుగుదలకు ప్రేరణ.

-చుక్కా రామయ్య